Summer Drink- Muskmelon Mojito: కర్బూజాలో శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు, పుష్కలంగా నీరు ఉంటాయి. వేసవిలో దీనితో తయారు చేసే మస్క్ మిలాన్ మొజిటో తాగిన వెంటనే పొట్టనిండిన భావన కలిగి దాహం తీరి ఫ్రెష్‌గా అనిపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ, బీటా కెరోటిన్‌లు రోగనిరోధక వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి.
పీచుపదార్థం అధికంగా ఉండడం, గ్లైసిమిక్స్ ఇండెక్స్, కొవ్వులు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా పనిచేస్తుంది. బ్లడ్ సుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుతూ బరువుని అదుపులో ఉంచుతుంది.
మస్క్ మిలాన్ మొజిటో తయారీకి కావలసినవి:
తొక్కతీసిన కర్బూజా ముక్కలు – కప్పు, పుదీనా ఆకులు – ఆరు, నిమ్మరసం – అరచెక్క రసం, పంచదార – టీస్పూను, సోడా, నీళ్లు, ఐస్ ముక్కలు – మోజిటోకు సరిపడా.
మస్క్ మిలాన్ మొజిటో తయారీ విధానం:
►కర్బూజ ముక్కలు, పంచదారను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.
►ఇవి గ్రైండ్ అయ్యాక పుదీనా ఆకులు, నిమ్మరసం వేసి మరోసారి గ్రైండ్ చేయాలి.
►ఇప్పుడు గ్లాస్‌లో ఐస్ ముక్కలు వేయాలి. దీనిలోనే గ్రైండ్ చేసిన మస్క్‌మిలాన్ మిశ్రమం వేయాలి.
►ఈ మిశ్రమంలో సోడా నీళ్లు వేసి సర్వ్ చేసుకోవాలి.
చదవండి👉🏾Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల..
Comments
Please login to add a commentAdd a comment