Vitamin A
-
విటమిన్ ‘ఏ’ లోపిస్తే ...అంత ప్రమాదమా..!
ఆరోగ్యంగా జీవించాలంటే విటమిన్లు, పోషకాలు చాలా అవసరం. శరీరంలోని అనేక ప్రక్రియలకు విటమిన్ ‘ఏ’ చాలా అవసరం. రెటినోల్, రెటీనా రెటినోయిక్ యాసిడ్ సమ్మేళనం ఈ విటమిన్. అందుకే దీన్ని రెటినోల్ అని కూడా పిలుస్తారు. ఇది కొవ్వులో కరిగే పోషకం. మాంసం, చికెన్, చేపలు , పాలు, ఇతర మాంసాహారంలో ఇది లభిస్తుంది. ఏ విటమిన్ తో వచ్చే లాభాలు, లోపిస్తే నష్టాలు గురించి తెలుసుకుందాం. కెరోటినాయిడ్స్, ఆల్ఫా-కెరోటిన్, బీటా-కెరోటిన్ , బీటా-క్రిప్టోక్సంతిన్ విటమిన్ ఏలో పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి, సంతానోత్పత్తి, చక్కటి దృష్టికి ఇవి చాలా కీలకం అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం ఏ మిటమిన్ లోపిస్తే శరీర పనితీరు దెబ్బతినడమే కాదు, అంధత్వం నుండి వంధ్యత్వం వరకు చాలా సమస్యలు పొంచి ఉన్నాయి. ఊపిరితిత్తులు, కణజాలాలు, చర్మం, గుండె, రోగనిరోధక వ్యవస్థ సమస్యలకు కూడా దారితీస్తుంది ఇక కాలేయ రుగ్మతలు, అవసరమైన విటమిన్లను గ్రహించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ‘ఎ’ లోపిస్తే మొటిమలు పొడి చర్మం, కళ్ళు పొడిబారడం వంధ్యత్వం, గర్భ ధారణలో సమస్యలు గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు లాభాలు రేచీకటి, వయసు సంబంధిత సమస్యలనుంచి రక్షిస్తుంది. కొన్ని రకాల కేన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది. మొటిమలు, నల్లటి మచ్చలు రాకుండా చూస్తుంది. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డీతో పాటు, ఎముకల పెరుగుదలకు విటమిన్ ఏ కూడా చాలా అవసరం. ఎముకల బలానికి విటమిన్ఏ కూడా చాలా అవసరం. నోట్: విటమిన్ ఏ ఎక్కువైనా కూడా చాలా ప్రమాదం. విటమిన్ ఏ ఎక్కువైతే హైపర్ విటమినోసిస్ A కి దారి తీస్తుంది. సప్లిమెంట్లతో పోలిస్తే విటమిన్ ఏ సహజంగా లభించే ఆహారాలు (పాలు,గుడ్డు, కేరట్, చేపలు లాంటివి) మేలు. ఏదైనా వైద్యుల పర్యవేక్షణ అవసరం. -
గుడ్లు, ఆకుకూరలు తింటున్నారా? మీ చర్మంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా?
శరీరానికి సరైన ఆహారం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనం ఏం తింటామో అదే మన చర్మంపై రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరైన ఆహారం తీసుకోకపోతే వ్యర్థమే. బ్యాలెన్స్ డైట్లో విటమిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్లలో ముఖ్యంగా విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారం చర్మ సంరక్షణకు కీలకంగా ఉపయోగపడుతుంది. మరి విటమిన్-ఎ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో లభ్యమవుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. క్యారట్లు: విటమిన్-ఎ కి బెస్ట్ ఛాయిస్ క్యారట్లు. రోజూ కప్పు క్యారెట్ ముక్కలు తింటే రోజువారీ శరీరానికి అవసరమైన విటమన్ ‘ఎ’లో దాదాపుగా 334 శాతం అందుతుందని అధ్యయనంలో వెల్లడైంది. చాలామంది క్యారట్స్ని వండుకొని తింటారు. కానీ క్యారట్స్లోని పోషకాలు సంపూర్తిగా అందాలంటే పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్ తీసుకుని తాగచ్చు. చిలగడ దుంప: చిలగడ దుంప లో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు. లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్ కూడా బాగుంటాయి. పాలు: పాలల్లో కాల్షియమే కాదు విటమిన్ ఏ కూడా ఉంటుంది. ప్రతిరోజూ గ్లాసెడు పాలు తాగడం వల్ల మీ స్కిన్‌టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గుడ్లు గుడ్లలో విటమిన్ ‘డి’ తోపాటు అధికమోతాదులో విటమిన్ ‘ఎ’ కూడా ఉంటుంది. ఇవి రెండు చర్మ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగవుతుంది. ఆకుకూరలు: ఆకుకూరల్లో విటమన్ ‘ఎ’ పుష్కలంగా ఉంటుంది. కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది. ప్రతిరోజూ వీటిని మీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి టమాటా: విటమిన్ ‘ఎ’ టమాటాల్లో అధికంగా ఉంటుంది. సహజంగానే మనరోజువారీ వంటకాల్లో టమాటా ఉపయోగిస్తాం! వంటలతోపాటు టమాటా సూప్, టమాటా చట్నీ ఇలా కూడా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరానికి సరిపడా అందుతాయి. విటమిన్ ఏ మాత్రమే కాక టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ: కెరోటినాయిడ్, ఆల్ఫా-కెరోటిన్ లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో సూప్స్, పైస్, స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడి గింజలను ప్రతిరోజూ తినడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్‌కి కూడా సహాయపడుతుంది. -
వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు!
సహజ నీటి వనరుల్లో పెరిగే 2 అంగుళాల మెత్తళ్లు (ఆంగ్లంలో ‘మోల’ (Amblypharyngodon mola) వంటి చిరు చేపలను తినే అలవాటు ఆసియా దేశాల్లో చిరకాలంగా ఉంది. ఎండబెట్టిన మెత్తళ్లను నిల్వ చేసుకొని ఏడాదంతా తింటూ ఉంటారు. ఈ చిరు చేపల్లో అద్భుతమైన సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉండటంతో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో వీటి పాత్ర విశిష్టమైనది. అయితే, వీటి సైజు వేలెడంతే ఉండటం వల్ల కృత్రిమ విత్తనోత్పత్తి ఇన్నాళ్లూ అసాధ్యంగా మిగిలిపోయింది. అయితే, ఈ పెనుసవాలును శాస్త్రవేత్తలు ఇటీవలే ఛేదించారు. చేపల విత్తనోత్పత్తి రంగంలో ఇది పెద్ద ముందడుగని చెప్పచ్చు. జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ జి.ఐ.జడ్. ఆర్థిక తోడ్పాటుతో ‘వరల్డ్‌ఫిష్’ సంస్థ శాస్త్రవేత్తలు మన దేశంలో మెత్తళ్ల విత్తనోత్పత్తికి సులభమైన సాంకేతిక పద్ధతులను రూపొందించడంలో కొద్ది నెలల క్రితం ఘనవిజయం సాధించారు. దీంతో మెత్తళ్లు, తదితర చిరు చేపలను మంచినీటి చెరువుల్లో సాగు చేసుకునే అవకాశం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. నేచురల్ సూపర్ ఫుడ్స్ భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ప్రజల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని ఆహారం ద్వారా సహజమైన రీతిలో అధిగమించేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు, ఎషెన్షియల్ ఫాటీ ఆసిడ్స్ కలిగి ఉండే మెత్తళ్లు నేచురల్ సూపర్ ఫుడ్స్ అని వరల్డ్‌ఫిష్ అభివర్ణించింది. పౌష్టికాహార లోపంతో మన దేశంలో 36% మంది పిల్లలు వయసుకు తగినంతగా ఎదగటం లేదు. 32% మంది తక్కువ బరువు ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మెత్తళ్లు భేషుగ్గా ఉపయోగపడుతాయని ‘వరల్డ్‌ఫిష్’ చెబుతోంది. విటమిన్ ఎ లోపం వల్ల వచ్చే కంటి జబ్బులు, చర్మ వ్యాధులు మెత్తళ్లు తింటే తగ్గిపోతాయి. ఈ చిరు చేపల్లో ఐరన్, జింక్, కాల్షియం, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్ ఉన్నాయి. పిల్లలు, గర్భిణీ స్త్రీలను పీడించే సూక్ష్మపోషక లోపాలు మెత్తళ్లను తింటే తగ్గిపోతాయి. 70 లక్షల సీడ్ ఉత్పత్తి అధిక పోషకాలున్న మెత్తళ్లు వంటి చిరు చేపల సాగు ప్రోత్సాహానికి ఒడిషా, అస్సాం రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్‌లో వరల్డ్‌ఫిష్ సంస్థ గత దశాబ్దకాలంగా కృషి చేస్తోంది. ఒడిషాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో గల బిశ్వాల్ ఆక్వాటెక్ హేచరీతో కలిసి వరల్డ్‌ఫిష్ చేసిన పరిశోధనలు ఫలించాయి. ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ ద్వారా మెత్తళ్ల సీడ్ ఉత్పత్తిలో అవరోధాలను 2022 జూన్‌లో అధిగమించటం విశేషం. 70 లక్షల మెత్తళ్లు సీడ్‌ను ఉత్పత్తి చేయగలిగారు. ప్రత్యేకంగా నిర్మించిన చిన్న చెరువుల్లో ఆక్సిజన్‌తో కూడిన నీటిని ఎయిరేషన్ టవర్ ద్వారా అందిస్తూ ప్రయోగాలు చేశారు. ఆ నీటిలో గుడ్ల నుంచి వెలువడిన చిరుపిల్లలు చక్కగా బతికాయి. గుడ్డు నుంచి బయటికి వచ్చిన 3–4 రోజుల్లోనే అతిచిన్న పిల్లలు అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. వీటిని కొద్ది రోజులు నర్సరీ చెరువుల్లో పెంచి తర్వాత సాధారణ చేపల చెరువుల్లోకి మార్చాల్సి ఉంటుంది. తొలి విడత మెత్తళ్లు పిల్లలను ఒడిషా రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు అందించారు. మెత్తళ్ల చేప పిల్లలను తెలుగు రాష్ట్రాల్లోనూ చేపల రైతులకు, మహిళా బృందాలకు అందుబాటులోకి తేవాలి. నగరాల్లో/గ్రామాల్లో ఇంటిపంటలు /మిద్దె తోటల సాగుదారులకు కూడా మెత్తళ్లు చేప పిల్లలను అందించాలి. ప్రజలకు పౌష్టికాహార భద్రతను చేకూర్చడంలో చిరు చేపలు ఎంతగానో దోహదపడతాయి. మెత్తళ్ల చేప పిల్లలను ఒక్కసారి వేస్తే చాలు! ‘మోల’ చేపలు చూపుడు వేలంత పొడవుండే అద్భుత పోషకాల గనులు.. వీటిని మనం మెత్తళ్లు /పిత్త పరిగెలు /కొడిపెలు /ఈర్నాలు అని పిలుచుకుంటున్నాం . ► గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని, రక్తహీనతను, రేచీకటిని పారదోలే వజ్రాయుధాలు అ చిరుచేపలు. ► మంచినీటి ఆక్వా చెరువుల్లో బొచ్చె, రాగండి, మోసు, శీలావతి వంటి పెద్ద చేపలతో కలిపి లేదా విడిగానూ ఈ చిరుచేపలను సునాయాసంగా సాగు చేయొచ్చు. ► గ్రామ చెరువులు, కుంటల్లో, పెరటి తోటల్లోని తొట్లలో, మిద్దెల పైన ఫైబర్ టబ్లలోనూ ఎంచక్కా చిరు చేపలను పెంచుకోవచ్చు. ► వానాకాలంలో వాగులు, వంకల్లో కనిపించే సహజ దేశవాళీ చేపలివి. ► మెత్తళ్లు చేప తన సంతతిని తనంతట తానే(సెల్ఫ్ బ్రీడర్) వృద్ధి చేసుకుంటుంది.. ఈ చేప పిల్లలను ఒక్కసారి చెరువులో/తొట్లలో వేసుకుంటే చాలు.. నిరంతరం సంతతి పెరుగుతూనే ఉంటుంది. ► ప్రతి 10–15 రోజులకోసారి వేలెడంత సైజుకు పెరిగిన చేపలను పెరిగినట్లు పట్టుబడి చేసి వండుకు తినొచ్చు. ► వాణిజ్య స్థాయిలో పెంపకం చేపట్టి స్థానిక మార్కెట్లలో అమ్ముకొని ఆదాయం కూడా పొందవచ్చు. ► మగ చేపలు 5.0–5.5 సెం.మీ. (2 అంగుళాలు) పొడవు, ఆడ చేపలు 6.0–6.5 సెం.మీ. పొడవు పెరిగేటప్పటికి పరిపక్వత చెందుతాయి. ఆ దశలో పట్టుబడి చేసి వండుకొని తినొచ్చు. ఎండబెట్టుకొని దాచుకోవచ్చు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ చేపల్లో సంతానోత్పత్తి జరుగుతుందని కేంద్రీయ మత్స్య విద్యా సంస్థ (సి.ఐ.ఎఫ్.ఇ.) ఎమిరిటస్ సైంటిస్ట్ డాక్టర్ అప్పిడి కృష్ణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. నిజానికి, మెత్తళ్ల విత్తనోత్పత్తి ఆవశ్యకత గురించి ఆయన రాసిన వ్యాసాన్ని ‘సాక్షి సాగుబడి’ ఐదేళ్ల క్రితమే ప్రచురించింది. (క్లిక్ చేయండి: నల్ల తామరను జయించిన దుర్గాడ) -
Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? అయితే..
క్యారెట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మొక్కల ఆధారిత ఆహారాలు వాస్తవానికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, నిర్వహించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణుల అధ్యయనాలలో తేలింది. ►క్యారెట్లో సహజంగా ఖనిజాలు, విటమిన్లు, కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ►ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. ►నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యారెట్‌లోని విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్, దీర్ఘకాలిక గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ►వాస్తవానికి, యాంటీ ఆక్సిడెంట్ల ఉనికి కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ►ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ►అందువల్ల క్యారట్ తీసుకోవడం వల్ల చెడు కొలస్ట్రాల్ స్థాయులు తగ్గిపోతాయి. క్యారెట్ సూప్ చేసుకోండిలా! కావల్సినవి: క్యారెట్లు – 3 (శుభ్రపరిచి, ముక్కలు చేయాలి) ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి) చిలగడ దుంప – 1 (తొక్క తీసి, ముక్కలు చేయాలి) వెల్లుల్లి రెబ్బలు – 2 (తరగాలి), కొత్తిమీర – పావు కప్పు నీళ్లు – తగినన్ని, కూరగాయలు ఉడికించిన నీళ్లు – కప్పు టొమాటో గుజ్జు – అర కప్పు, పండుమిర్చి ముద్ద – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, నూనె – టేబుల్ స్పూన్ తయారీ: క్యారెట్లు, ఉల్లిపాయలు, చిలగడదుంప, వెల్లుల్లి, కొత్తిమీర ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. నీళ్లు వడకట్టి కూరగాయల ముక్కలన్నీ మెత్తగా రుబ్బాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగాక టొమాటో గుజ్జు, పండుమిర్చి ముద్ద, ఉప్పు, కారం కలిపి ఉడికించాలి. దీంట్లో కూరగాయలు వడకట్టిన నీళ్లు, రుబ్బిన మిశ్రమం కలిపి, మిరియాల పొడి వేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి వేడి వేడిగా అందించాలి. చదవండి: C- Section Wound Infection: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా? Detoxification: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన.. శరీరంలోని విషాలు తొలగించుకోండిలా! ఇవి తింటే మాత్రం.. -
Health: విటమిన్ ‘ఏ’ లోపిస్తే సంతానలోపం సహా పలు సమస్యలు.. ఇవి తింటే!
Vitamin A Deficiency Symptoms Problems: కొందరిలో ఎన్ని చర్యలు తీసుకున్నా, మొటిమలు తగ్గవు. అలాగే గాయాలు త్వరగా మానవు. కొందరు చిన్నారులలో అయితే ఎదుగుదల సరిగా ఉండదు. విటమిన్ ఏ లోపం ఉన్న వారిలో ఈ సమస్యలన్నీ కనిపిస్తాయి. మీ పిల్లలు సరిగా ఎగకపోతున్నా, మీకు అయిన గాయాలు త్వరగా మానకపోతున్నా విటమిన్ ఎ లోపించినట్లు భావించాలి. విటమిన్ ఎ లోపిస్తే ఇంకా ఏమేం సమస్యలు వస్తాయి, దానిని భర్తీ చేయాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో తెలుసుకుందాం. కొందరిలో నిత్యం గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంటుంది. దీనికి కూడా విటమిన్ ఏ లోపం కారణమై ఉండొచ్చు. చిన్నారుల్లో విటమిన్ లోపం ఉంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి చిన్నారుల ఎదుగుదలలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించకపోతే చిన్నపిల్లల వైద్య నిపుణులు సంప్రదించడం ఉత్తమం. ►విటమిన్ ఏ లోపం ఉన్న వారిలో సంతాన లోపం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా విటమిన్ ఎ తగినంత ఉండాలి. కాబట్టి దీర్ఘకాలంగా సంతాన లోపంతో బాధపడేవారిలో ఈ విటమిన్ లోపం ఉండే అవకాశాలు లేకపోలేవు. ►విటమిన్ ఏ లోపం కారణంగా కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని మనందరికీ తెలుసిందే. మరీ ముఖ్యంగా విటమిన్ ఏ లోపం ఎక్కువైతే రే చీకటి వస్తుంది. రాత్రుళ్లు కంటి చూపు సరిగ్గా లేకుంటే విటమిన్ ఏ లోపం ఉందని గుర్తించాలి. ►కొందరిలో తరుచూ కళ్లు పొడిబారుతుంటాయి. విటమిన్ ఏ లోపం ఉండే వారిలో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఇదీ ఒకటి. కాబట్టి ఇలాంటి సమస్య దీర్ఘకాలంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి. ►విటమిన్ ఏ లోపం కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా చర్మం పొడి బారుతుంటుంది. దీర్ఘ కాలంగా పొడి చర్మం సమస్య వేధిస్తుంటే విటమిన్ ఏ లోపమని గుర్తించాలి. ►పైన చెప్పుకున్న లక్షణాలన్నీ విటమిన్ ఏ లోపం వల్లే వచ్చేవే అయినప్పటికీ.. కొన్ని ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా లక్షణాలు కనిపిస్తుంటాయి. కాబట్టి వీటినే ప్రామాణికంగా తీసుకొని విటమిన్ ఏ లోపమనే నిర్ణయానికి రాకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇప్పుడు విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలేమిటో చూద్దాం! క్యారట్లు: విటమిన్ ఏ కి ఉత్తమ ఆహారం క్యారట్లు. క్యారట్ హల్వా అందరికీ ఇష్టమే కానీ, క్యారట్స్ లో ఉన్న పోషకాలు మనకి అందాలంటే మాత్రం పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్ తీసుకుని తాగచ్చు. చిలగడ దుంప: చిలగడ దుంప లో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు. లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్ కూడా బాగుంటాయి. తక్కువ మోతాదులో పచ్చివి తిన్నా మంచిదే. ఆకు కూరలు: ఒకప్పుడు ఆకుకూరలు లేని భోజనం ఉండేది కాదు. మీకు గుర్తుంటే చిన్నప్పుడు ముందు ఆకు కూరలే తినమనేవాళ్ళు కూడా. అయితే, ఆకు కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది. గుమ్మడికాయ: తియ్య గుమ్మడికాయ పులుసు తినని వారు ఉండరు. తియ్య గుమ్మడి ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యకరం కూడా. ఒక్క పులుసే కాదు, తియ్య గుమ్మడి తో సూప్స్, పైస్, స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. పాలు: మనందరం చిన్న పిల్లలకి రెగ్యులర్ గా ఒక గ్లాస్ పాలు ఇస్తాం. పాలలో కాల్షియమే కాదు విటమిన్ ఏ కూడా ఉంటుంది. పిల్లలతో పాటూ పెద్ద వాళ్ళు కూడా ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎన్నో డిసీజెస్ నించి రక్షింపబడతాం. టొమాటో: టొమాటో మన వంటల్లో నిత్యం ఉండే పదార్ధమే. పప్పు, కూర, రసం, పచ్చడి ఎందులోనైనా అందులో కొంచెం టొమాటో ఉంటే వచ్చే రుచే వేరు. పైగా ఇవన్నీ కేవలం టొమాటో తోనే కూడా చేసుకోవచ్చు. విటమిన్ ఏ మాత్రమే కాక టొమాటో లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలం గా ఉన్నాయి. ఇవి కాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. ►విటమిన్ ఎ ను పొందడం కోసం ట్యాబ్లెట్లు, ఇతర సప్లిమెంట్లపై ఆధార పడటం కన్నా, అది మెండుగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. చదవండి: Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ జరిగేది ఇదే.. ఈ ఆహార పదార్థాలు తింటే మేలు! -
Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే..
Summer Drinks: Apple Blueberry Juice: యాపిల్ నేరేడు జ్యూస్‌లో పీచుపదార్థంతోపాటు విటమిన్ సి, విటమిన్ ఏ ఇంకా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, గ్లూకోజ్, ప్రోటిన్ పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడి సెల్ డ్యామేజ్‌ను నియంత్రిస్తాయి. ఈ జ్యూస్ జీర్ణవ్యవస్థ, గుండె పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు, చర్మం నిగారింపుకు తోడ్పడుతుంది. తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి సైతం వేసవిలో ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యాపిల్ నేరేడు జ్యూస్ తయారీకి కావలసినవి: ►గింజలు తీసేసిన నేరేడు పండ్లు – కప్పు ►యాపిల్ ముక్కలు – కప్పు ►బ్లాక్ సాల్ట్ – పావు టీస్పూను ►అల్లం – చిన్న ముక్క ►చాట్ మసాలా – చిటికెడు ►నిమ్మరసం – టేబుల్ స్పూను ►ఐస్ క్యూబ్స్ – ఐదు ►తేనె – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: ►నేరేడు, యాపిల్ ముక్కలు, అల్లం ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ముక్కలు నలిగాక, కప్పు నీళ్లు, నిమ్మరసం వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ జ్యూస్‌ను వడగట్టకుండా గ్లాసులో పోసి, తేనె, చాట్ మసాలా, ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. ∙ వేసవిలో ట్రై చేయండి: Pomegranate Strawberry Juice: దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్.. పోషకాలెన్నో! Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే! -
Summer Drinks: మ్యాంగో మస్తానీ.. ఇందులోని సెలీనియం వల్ల..
Summer Drinks- Mango Mastani Recipe: మంచి ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక మ్యాంగో మస్తానీ తాగితే దాహం తీరుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మస్తానీ తాగే కొద్ది తాగాలనిపిస్తుంది. ఈ ఒక్క జ్యూస్ తాగడం వల్ల.. విటమిన్ ఎ, బి2, బి6, బి12, సి, డి, క్యాల్షియం, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, పీచుపదార్థం, ఫోలేట్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియంలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్ అయిన సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. మ్యాంగో మస్తానీ తయారీకి కావాల్సినవి: మామిడి పండు ముక్కలు – కప్పు, చల్లటి క్రీమ్ మిల్క్ – కప్పు, జాజికాయ పొడి – చిటికెడు, ఐస్‌క్యూబ్స్ – పావు కప్పు, పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఐస్‌క్రీమ్ – రెండు స్కూపులు, చెర్రీ, పిస్తా, బాదం పప్పు, టూటీప్రూటీ, మామిడి ముక్కలు – గార్నిష్‌కు సరిపడా, ఉప్పు – చిటికెడు. మ్యాంగో మస్తానీ తయారీ విధానం: ►మామిడి పండు ముక్కల్ని బ్లెండర్లో వేయాలి. ►దీనిలో పంచదార, జాజికాయ పొడి, ఉప్పు వేసి ప్యూరీలా గ్రైండ్ చేయాలి. ►ఈ ప్యూరీలో పాలు, ఐస్‌క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంగుళం గ్యాప్ ఉండేలా గ్లాసులో పోయాలి. ►గ్లాసులో గ్యాప్ ఉన్న దగ్గర ఐస్‌క్రీమ్, మామిడి పండు ముక్కలు, డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే.. -
విటమిన్ ‘ఎ’ లోపం.. గోల్డెన్ రైస్ అవసరమా?
ఆహారం ఆరోగ్యదాయకంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండ గలం. ఆగ్నేయాసియా దేశాల్లోని పేద, కింది మధ్యతరగతి ప్రజల్లో విటమిన్ ‘ఎ’ లోపం విస్తారంగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఏటా 20–30 లక్షల మంది చిన్న పిల్లలు కంటి చూపుతోపాటు ప్రాణా లను సైతం కోల్పోతున్నారని ఒక అంచనా. విటమిన్ ‘ఎ’ తెల్ల బియ్యంలో ఉండదు. అందువల్ల విటమిన్ ‘ఎ’ను అందించేలా వరి వంగడానికి జన్యుమార్పిడి చేయటమే ఈ సమస్యకు పరిష్కారమని భావించిన రాక్ఫెల్లర్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్, సింజెంట ఫౌండేషన్ వంటి కొన్ని సంస్థలు గోల్డెన్ రైస్ రూపకల్పనకు 20 ఏళ్ల క్రితమే నడుం బిగించాయి. బీటా కెరొటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను అందిస్తే, తనకు అవసరమైనంత మేరా విటమిన్ ‘ఎ’ను దేహమే తయారు చేసుకుంటుంది. ఇందుకోసం బీటా కెరొటిన్‌తో కూడిన వరి వంగ డాన్ని రూపొందించే ప్రయత్నాలకు శాస్త్రవేత్తలు ఇంగో పోట్రికస్, పీటర్ బేయర్ 1999లో శ్రీకారం చుట్టారు. మట్టిలోని ఒక సూక్ష్మ జీవి, మొక్కజొన్న గింజల నుంచి తీసిన రెండు జన్యువులను వరి వంగడానికి జన్యుమార్పిడి ప్రక్రియ ద్వారా జోడించారు. ఈ జన్యుమార్పిడి బియ్యపు గింజలు లేత నారింజ రంగులో ఉంటాయి కాబట్టి ‘గోల్డెన్ రైస్’ అని పేరు వచ్చింది. ఫిలిప్పీన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ కేంద్రంగా గోల్డెన్ రైస్‌పై పరిశోధనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ‘గోల్డెన్ రైస్’ సాగుకు జూన్ 21న అనుమతినివ్వటం దుమారం రేపుతోంది. జన్యుమార్పిడి వంగడాలు, జన్యుమార్పిడి ఆహారం వల్ల జీవ భద్రతాపరంగా, ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ప్రశ్నలకు సమాధానాలు ఇంకా లభించ కుండానే... వాణిజ్యపరంగా గోల్డెన్ రైస్ సాగుకు ఫిలిప్పీన్స్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వ్యవసాయ శాఖ ఆదరాబాదరాగా అను మతి మంజూరు చేయటం తగదని స్టాప్ గోల్డెన్ రైస్ నెట్వర్క్ విమర్శించింది. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో అనాదిగా సాగవు తున్న విశిష్ట గుణగణాలు కలిగిన లక్షలాది సంప్రదాయ వరి వంగడాల జన్యు స్వచ్ఛతకు, ఎంతో విలువైన వ్యవసాయ జీవవైవి ధ్యానికి గోల్డెన్ రైస్ గొడ్డలి పెట్టని రైతులు, స్వతంత్ర శాస్త్రవేత్తలు, నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ ఆహారంలో గోల్డెన్ రైస్‌ను ఎంత పరిమాణంలో తీసుకుంటే విటమిన్ ‘ఎ’ లోపం తీరుతుంది? విటమిన్ ‘ఎ’ కొవ్వులో కరిగే ఎంజైమ్. దీని లోపం ఉన్న పిల్లలు అతి పేద వర్గాల వారు. వారు కొవ్వును రోజువారీగా తగినంత తీసుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వారికి గోల్డెన్ రైస్ ఎలా ఉపకరిస్తుంది? గోల్డెన్ రైస్ ధాన్యాన్ని మరపట్టి నిల్వ చేసిన బియ్యంలో కాలం గడిచేకొద్దీ బీటా కెరొటిన్ ఎంత మోతాదులో మిగిలి ఉంటుంది? అన్న ప్రశ్నలను వీరు లేవనెత్తుతున్నారు. అయితే, రోజుకు 40 గ్రాముల గోల్డెన్ రైస్‌ను తినిపిస్తే చాలు పిల్లల కంటి చూపును, ప్రాణాలను కాపాడవచ్చని గోల్డెన్ రైస్ ప్రాజెక్టు శాస్త్రవేత్తలు 2015లో పేర్కొన్నప్పటికీ తాజాగా ఎటు వంటి స్పష్టతా ఇవ్వలేదు. రోజువారీగా అవసరమయ్యే విట మిన్ ‘ఎ’ మోతాదులో ఏర్పడిన కొరతను తీర్చితే చాలని, మొత్తాన్నీ బియ్యం ద్వారానే అందించాల్సిన అవసరంలేదని మాత్రం చెబుతున్నారు. సీవీఆర్ ఆవిష్కరణలు కనపడవా? అంతర్జాతీయంగా వివాదాస్పదమైన జన్యుమార్పిడి సాంకేతి కత ద్వారా తయారైన గోల్డెన్ రైస్‌కు సహజ ప్రత్యామ్నాయం లేకపోలేదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రియ మిశ్రమాల పిచికారీ ద్వారా వరి, గోధుమ తదితర పంటల్లో విటమిన్ ‘ఎ’తో పాటు ‘సి’, ‘డి’ విటమిన్లు రాబట్టిన రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పుర స్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి ఆవిష్కరణలు మనకు అందు బాటులో ఉన్నాయి. క్యారెట్, టమాటాల గుజ్జు, మొక్కజొన్న పిండిని మట్టి ద్రావణంలో కలిపి పంటలపై నాలుగు దఫాలు పిచికారీ చేసి విటమిన్లతో కూడిన బియ్యం, గోధుమలను ఉత్పత్తి చేసే సహజ పద్ధతిని సీవీఆర్ కనుగొనటం దేశానికే గర్వకారణం. బీపీటీ తెల్ల బియ్యంలో 100 గ్రాములకు 1,242 ఇంటర్నేషనల్ యూనిట్లు (ఐ.యు.), గోధుమల్లో 1,362 ఐయూల మేర విట మిన్ ‘ఎ’ వచ్చింది. ఈ ఆవిష్కరణలే ఆయనకు పద్మశ్రీని తెచ్చిపె ట్టాయి. ప్రధాని మోదీ ఇటీవల మన్ కీ బాత్‌లో సైతం సీవీఆర్ ఆవిష్కరణల విశిష్టతను కొనియాడారు. అయితే, పురస్కారాలు, పొగడ్తలతోనే సరిపెడుతుండటం అసమంజసం. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సీవీఆర్ ఆవిష్కరణలపై విస్తృత అధ్యయనానికి శ్రీకారం చుట్టాలి. జన్యుమార్పిడి అవసరం లేకుండా ఎక్కడికక్కడే సాధారణ వంగడాలతోనే కోరిన విటమి న్లను బియ్యం, గోధుమల్లో పొందుపర్చుకునే సులువైన అవకాశం ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాయో అర్థం కాదు. విటమిన్ల బియ్యం, గోధుమలను ఆర్గానిక్‌గా పండించి మనం తిని, ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎగుమతి చేసి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. ఫిలిప్పీన్స్‌లో ‘గోల్డెన్‌రైస్’ హడావుడి చూసైనా మన పాలకులు, శాస్త్రవేత్తలు కళ్లు తెరుస్తారని ఆశించవచ్చా? – పంతంగి రాంబాబు -
మహాభాగ్యం మొలకెత్తినట్లే!
మొలకెత్తిన ధాన్యాలు తినడం ఆరోగ్యకరం అని తెలిసిందే. ఇటీవల చాలామంది మొలకెత్తిన ధాన్యాలు తింటున్నారు. ప్రత్యేకించి మొలకెత్తిన పెసలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అవి ఏమిటో చూద్దాం.జుట్టు రాలిపోయి, పలచబడేవారికి మొలకెత్తిన పెసలు స్వాభావిక చికిత్స అనుకోవచ్చు. వాటితో జుట్టు కూడా మళ్లీ మొలకెత్తే అవకాశాలు ఎక్కువ. మొలకెత్తే పెసలలో పుష్కలంగా ఉండే విటమిన్–ఏ రోమాంకురాలను ప్రేరేపించి (హెయిర్ ఫాలికిల్స్ను స్టిమ్యులేట్ చేసి) మళ్లీ జుట్టును మొలిపించే అవకాశం ఉంది. అంతేకాదు... రోమాంకురాలకు సరఫరా అయ్యే రక్తనాళాల (క్యాపిల్లరీస్)ను కూడా ఈ మొలకలు ప్రేరేపిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.పైన చెప్పుకున్నట్లు మొలకెత్తే పెసర్లలో పుష్కలంగా ఉన్న విటమిన్–ఏ వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వయసు పెరగడం వల్ల వచ్చే మాలిక్యులార్ డిజనరేషన్‌తో పాటు ఎన్నో రకాల కంటి వ్యాధులు నివారితమవుతాయి. వయసు పెరుగుతుండటం (ఏజింగ్)తో కనపడే ఎన్నో లక్షణాలను ఈ మొలకలు నివారిస్తాయి. జుట్టు తెల్లబడటం, జుట్టు రాలిపోవడం, చర్మం ముడతలు పడటం వంటి ఏజింగ్ పరిణామాలను అరికట్టి దీర్ఘకాలం యౌవనంగా ఉండేలా చూస్తాయి. పెసర మొలకలు మంచి ప్రోటీన్లకు నెలవు. ఎప్పటికప్పుడు కండరాలను రిపేర్ చేస్తుండటం వల్ల దీర్ఘకాలం పాటు కండరాలు మంచి పటుత్వంతో బలంగా ఉంటాయి. మొలకెత్తే పెసలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇవి రక్తాన్ని భర్తీ చేస్తాయి. జుట్టు పెరుగుదలకు అవసరమైన ఐరన్నూ సమకూర్చడం వల్ల కూడా ఇవి జుట్టును మళ్లీ మొలిపించడానికి దోహదపడతాయి. మహిళల్లో హార్మోన్ల సమతౌల్యతకు పెసర మొలకలు సహాయం చేస్తాయి. చర్మంలోని కొత్త కణాల పుట్టుకను వేగవంతం చేయడం వల్ల పెసర మొలకలతో మేని మెరుపు, మంచి నిగారింపు వస్తుంది. చర్మక్యాన్సర్ వంటి వ్యాధులనూ ఈ మొలకలు నివారిస్తాయి. చర్మంలోని తేమను తగ్గకుండా చేస్తే హైడ్రేటింగ్ ఏజెంట్స్‌గా కూడా పెసర మొలకలు పనిచేస్తాయి. జీవక్రియల కారణంగా ఒంట్లో పేరుకుపోయే ఎన్నో రకాల విషాలను పెసర మొలకలు చాలా వేగంగా బయటకు వెళ్లేలా చూస్తాయి. అందుకే వీటిని మంచి డీ–టాక్సిఫయింగ్ ఏజెంట్లుగా చెప్పవచ్చు. గర్భవతులకు ఇవి చాలా మేలు చేస్తాయి. గర్భధారణ సమయంలో వీటిని ‘ప్రెగ్నెన్సీ ప్రోటీన్ పవర్‌హౌజ్’గా పరిగణిస్తారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. అయితే క్యాలరీలు చాలా తక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఆరోగ్యకరమైన ఆహారం ఈ పెసర మొలకలు. అన్ని రకాల విటమిన్లు, ఖనిజలవణాల కారణంగా ఇవి ఒంటికి మంచి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. -
జిల్లాలో నిండుకున్న విటమిన్ ఏ ద్రావణం
బొబ్బిలి: రేచీకటి, అంధత్వాన్ని నివారించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కలిగించే విటమిన్ ఏ సిరప్ నిల్వల కోసం జిల్లాలోని ఆస్పత్రుల్లో చిన్నారుల తల్లిదండ్రులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎంతో ప్రయోజనకరమైన ఈ ద్రావణం జిల్లాలోని ఆస్పత్రుల్లో నిండుకుని సుమారు రెండు నెలలు గడచింది. పుట్టిన బిడ్డలకు 9వ నెల నుంచి ప్రతీ ఆరు నెలలకూ ఓ సారి తప్పనిసరిగా వేయాల్సిన విటమిన్ ఏ ద్రావణం గతంలో నిత్యం సరఫరా చేసేవారు. అయితే ఇప్పుడా నిల్వలు కానరా వడం లేదు. గతంలో నిల్వలు నిండుకునే పరిస్థితి వచ్చేసరికి సరఫరా చేసేవారు. కానీ రెండు నెలలు అవుతున్నా గానీ అటు జిల్లా యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో ఈ ద్రావణం లేక చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర కలత చెందుతున్నారు. ఇతర వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ ముఖ్యమైన ఈ వ్యాక్సిన్ లేకపోవడంతో తల్లి దండ్రులు తమ చిన్నారుల భవిష్యత్తుపై అల్లాడుతున్నారు. కేవలం బొబ్బిలిలోని సీహెచ్‌సీలోనే ప్రతీ ఆరు నెలలకోసారి సుమారు 200కు పైగానే చిన్నారులకు ఈ ద్రావణం వేసేవారు. ఆ తర్వాత మళ్లీ ఆరు నెలలకు ఈ ద్రావణం వేస్తారు. ఇలా ప్రతీ సారి 9 నెలలు నిండిన ప్రతిబిడ్డకూ ఈ ద్రావణాన్ని వేయడం తప్పనిసరి, చిన్నారుల్లో ఈ ద్రావణం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఈ ద్రావణాన్ని ఇతర మందుల షాపుల్లో కొనుగోలు చేసుకోవాలని కూడా రాయడం లేదు. బయట ఈ ద్రావణం దొరికే అవకాశం లేదు. గతంలో ఈ ద్రావణాన్ని సరఫరా చేసే సంస్థ నాణ్యతలో లోపాలతో పంపిణీ చేయడంతో అధికారులు వీటిని తిప్పి పంపారు. అయితే తిరిగి మరి ఆస్పత్రులకు ద్రావణాన్ని వేయకపోవడం విచారకరం. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ మందుల కొరత వలన చిన్నారుల దృష్టి లోపం, రోగనిరోధక శక్తి, రేచీకటి సమస్యలను ప్రభావితం చేసే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. సర్దుబాటు చేస్తున్నాం.. రెండు నెలలుగా విటమిన్ ఏ ద్రావణం సరఫరా లేకపోయినప్పటికీ తమ వద్ద ఉన్న నిల్వ లతో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాం. నెల రోజుల క్రితం వరకు విటమిన్ ఏ డోసులు అందించాం. ఈ విషయమై డీఐఓ కార్యాలయానికి నివేదించామని, అక్కడ నుంచి హైదరాబాద్‌కు ఇండెంటు పెట్టినట్లు వారు చెప్పారు. – డాక్టర్ విజయ్‌మోహన్, బొబ్బిలి పీపీ యూనిట్ అధికారి. పిల్లలకు ఇతర విటమిన్ ద్రావణాలు వేస్తున్న దృశ్యం -
థైరాయిడ్‌కీ మెడిసినే!
జామలో రుచికి రుచి ఎలాగూ ఉండనే ఉంటుంది. దాంతో పాటు ఎన్నో వ్యాధులను ఎదుర్కొనే వ్యాధి నిరోధకశక్తి పుష్కలంగా ఉంది. జామ పండుతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని. ►జామపండులో విటమిన్–ఏ చాలా ఎక్కువ. ఇది కంటిచూపును చాలాకాలం పాటు పదిలంగా కాపాడుతుంది. క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ వంటి అనేక కంటి వ్యాధులను జామ నివారిస్తుంది. ►జామలో చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. ►జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ, చక్కెర పాళ్లు తక్కువ. అందుకే స్వాభావికంగా బరువు నియంత్రించడానికి ఇదెంతో మంచిది. అందుకే క్రమం తప్పకుండా జామ పండు తినేవారి బరువు చక్కటి నియంత్రణలో ఉంటుంది. ►జామలో విటమిన్–సి పాళ్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది విటమిన్–సి లోపించడం వల్ల వచ్చే స్కర్వీతో పాటు అనేక వ్యాధులనుంచి శరీరాన్ని రక్షించుకుంటుంది. ►జామతో చాలా థైరాయిడ్ సంబంధిత వ్యాధులు నివారితమవుతాయి. ►జామపండు తినేవారి మెదడు చురుగ్గా ఉంటుంది. ఇందులోని విటమిన్–బి6, విటమిన్ బి3 వంటి పోషకాలే దీనికి కారణం. మెదడులోని న్యూరాన్ల సమర్థమైన పనితీరుకు పై విటమిన్లు అవసరం. దాంతో మెదడుకు చురుకుదనం సమకూరడంతో పాటు డిమెన్షియా, అలై్జమర్స్ వంటి వ్యాధులు సైతం నివారితమవుతాయి. ►రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడానికి జామ ఉపకరిస్తుంది. అంతేకాదు... ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. -
అరె.. ఏ మైంది..!
తణుకు అర్బన్: చిన్నారులను కంటి రుగ్మతల నుంచి దూరం చేసే ఔషధం ఏ విటమిన్. పదినెలల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు 9 డోసులుగా దీనిని అందించాలి. అయితే దీని సరఫరాలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. నాలుగునెలల నుంచి ఇదే దుస్థితి నెలకొంది. ఫలితంగా చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని సర్కారు ఆస్పత్రుల్లో ఏ విటమిన్ ద్రవం అందుబాటులో లేదు. దీంతో దానిని పిల్లలకు వేయించేందుకు వెళ్లిన వారిని వైద్యసిబ్బంది తిప్పిపంపిస్తున్నారు. దీంతో ప్రజల వద్దకే వైద్యసేవలు, చిన్నారులకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఏ విటమిన్ సరఫరాలో నిర్లక్ష్యం వహించడంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నవంబర్‌లో వెనక్కి! ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలతోపాటు అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు ఏ విటమిన్ ద్రవాన్ని అందుబాటులో ఉంచాలి. పిల్లలకు 10వ నెల వయసు నుంచి 5 సంవత్సరాల్లోపు 9 డోసులుగా ఈ ద్రవాన్ని పట్టించాలి.. అయితే జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో ఎ–విటమిన్ ద్రవం నాలుగు నెలలుగా అందుబాటులో లేదు. జిల్లాలో ఏ విటమిన్ ద్రవం వంద మిల్లీలీటర్ల బాటిళ్లు నెలకు 120 వరకూ అవసరం ఉంటాయి. గతేడాది నవంబరులో జిల్లాకు ఏ–విటమిన్ ద్రవం సరఫరా అయింది. అయితే అది చిక్కగా ఉండడంతోపాటు నాణ్యత లేనిదిగా గుర్తించి తిప్పిపంపినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ ద్రవం రాష్ట్రానికి పూణే నుంచి రావాలని పేర్కొంటున్నారు. మొక్కుబడిగా పలకరింపు చిన్నారుల కంటిచూపునకు ఊతమిచ్చే ఎ–విటమిన్ ద్రవం లేకుండా వ్యాధినిరోధక టీకాలు వేయించాలంటూ నిర్వహిస్తున్న పలకరింపు కార్యక్రమం నవ్వులపాలవుతోంది. జిల్లా వ్యాప్తంగా 4లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. వీరి ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పలకరింపు కార్యక్రమం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్యులు, సిబ్బంది 3,600 బృందా లుగా విడిపోయి ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను పలకరిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు పలకరింపు కార్యక్రమంలో ఏ విటమిన్ గురించి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఉండే క్లస్టర్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు వ్యాధి నిరోధక టీకాలతోపాటు మాతా, శిశు సంరక్షణపై వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండేది. ప్రతి క్లస్టర్‌కు 6 పీహెచ్‌సీలను అనుసంధానం చేసి ఒక సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ పర్యవేక్షించేవారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తరువాత క్లస్టర్ విధానాన్ని రద్దుచేసింది. దీంతో వైద్యసేవలపై పర్యవేక్షణ తగ్గింది. త్వరలో వస్తుంది ఏ విటమిన్ ద్రవం రావాల్సి ఉంది. గత నవంబరులో వచ్చిన ద్రవం నాణ్యత లేదని తిప్పి పంపించాం. త్వరలోనే కొత్త స్టాకు వస్తుంది. పలకరింపు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. టీకాలపై అవగాహన కల్పిస్తున్నాం. – పి. మోహన కృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, ఏలూరు -
కూర మిరపతో లాభాల మెరుపు
ఖమ్మం వ్యవసాయం: వివిధ కూరగాయ పంటలతో పాటు కూరమిరప అత్యంత ప్రాచుర్యం పొందింది. దీనిలో క్యాప్సికం(కూర మిరప)ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీని సాగు పద్ధతులను ఉద్యానశాఖ సహాయ సంచాలకులు-2 కె.సూర్యనారాయణ (83744 49066) వివరించారు. ఈ క్యాప్సికం కాయలు ఎక్కువ కండ కలిగి గంట ఆకారంలో ఉండటం వలన దీన్ని ‘బెల్ పెప్పర్’ అని కారం లేకపోవడం వలన లేదా తక్కువ కారం ఉండటం వలన ‘స్వీట్ పెప్పర్’ అని అంటారు. ఈ కాప్పికం కాయలలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’లు టమాటాలో కన్నా అధికం. మన జిల్లాలో ఏటేటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పంటకు అనువైన సమయం: క్యాప్సికం సాగు చేయటానికి అక్టోబర్- నవంబర్, జూలై- ఆగస్టు నెలలు అనుకూలం. నేలలు: మురుగు నీరు నిలువ ఉండని నల్లభూములు, ఎర్రభూములు అనుకూలం. ఉదజని సూచిక 6.0 - 6.5 ఉన్న నేలలు బాగా అనుకూలిస్తాయి. చౌడు భూముల్లో ఈ పంట పండించకూడదు. సాధారణ రకాలు: కాలిపోర్నియా వండర్, ఎల్లో వండర్, అర్కమోహిని (సెలక్షన్-13) లర్కగౌరవ్ (సెలక్షన్-16) అర్కబసంత్ (సెలక్షన్-3), నాంధారి-10, నాంధారి-33. సంకర జాతి రకాలు: భారత్, మాస్టర్ మాస్టర్, ఇంద్రా, లారియో, ఎస్.ఎస్-436, ఎస్.ఎస్-625, నాథ్ హీరా, తన్వి, విక్రాంత్, గ్రీన్ గోల్డ్, సన్ 1090, సన్ 1058. విత్తన శుద్ధి: ఎన్నుకున్న రకానికి థైరమ్ లేదా మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేయాలి. నారు పెపంకం: ఎత్తై నారుమళ్లు లేదా ప్రొట్రేల ద్వారా నారు పెంచుకోవచ్చు. ప్రోట్రేల ద్వారా నారు పెంచితే దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. నాటు విధానం: మొక్కకు, సాళ్లకు మధ్య దూరం 2.5ఁ2.5 అడుగులలో నాటాలి. ఇలా నాటితే ఎకరానికి 8 వేల నుంచి 9 వేల మొక్కలు పడతాయి. రబీ పంటగా 2ఁ2 అడుగుల దూరంలో నాటాలి. ఈ విధానంలో ఎకరాకు 11 వేల నుంచి 12 వేల మొక్కలు పడతాయి. ఎరువుల యాజమాన్యం: ఎకరానికి 50 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఎరువులను పంట పెరిగే వివిధ దశల్లో వేసుకోవాలి. నీటి యాజమాన్యం: నేల స్వభావాన్నిబట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరు కట్టాలి. {yిప్ పద్ధతిలో నీరు పెట్టేటట్టయితే 10-20 శాతం దిగుబడిలో వృద్ధి పొందటమేగాక నాణ్యమైన కూరగాయలు పొందవచ్చు. తెగుళ్లు-నివారణ పంట పెరిగే వివిధ దశల్లో కాయ తొలుచు పురుగు, పై ముడత, కింది ముడత, కాయ ఈగ పురుగు, కోనోఫారా కొమ్మ ఎండు తెగులు, బూడిద తెగులు, కాయ కుళ్లు తెగులు, వైరస్ తెగులు, ఆశించి అపార నష్టాన్ని కలిగిస్తాయి. పై ముడత నివారణకు లీటర్ నీటిలో 2 మి.లీ రీజెంట్ లేదా 2 మి.లీ డైమిథోయెట్ లేదా 0.2 గ్రాములు ట్రేసర్ పిచికారీ చేయాలి. కింది ముడత నివారణకు లీటర్ నీటిలో 5 మి.లీ డైకోపాల్ లేదా 3 మి.లీ ట్రైజోఫాస్ మందులను మార్చి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఆకులు కింద, పైనా తడిచేటట్లు పిచికారీ చేయాలి. మొక్కల్లో సూక్ష్మదాతు లోపాలు కనిపిస్తే తొలి దశలో లీటర్ నీటిలో 3 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, పై సల్ఫేట్, 1.5 గ్రాముల బోరాక్స్, 10 గ్రాముల యూరియా పిచికారీ చేయాలి. దిగుబడి: నేల స్వభావం, యాజమాన్య పద్ధతులపై దిగుబడి ఆధార పడి ఉంటుంది. మొక్క నాటిన 50-60 రోజుల నుంచి ఉత్పత్తి వస్తుంది. సగటున ఎకరాకు 40-60 క్వింటాళ్ల మేరకు దిగుబడులు వస్తాయి. పంట సాగులో ఆదాయం మార్కెట్ ధరపై గాకుండా రైతులు పొందే దిగుబడులపైనే ఆధారపడి ఉంటాయి. మార్కెట్లో కనీస దర దొరికినా దిగుబడి ఎక్కువపొందటం వలన రైతుకు నికరాదాయం అధికంగా లభిస్తుంది. -
చూపు తగ్గుతోంది..!
న్యూఢిల్లీ: నగరంలో కంటిచూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్లలోపు ఉన్న వంద మంది చిన్నారులను పరిశీలిస్తే.. సుమారు ఎనిమిది మందికిపైగా పిల్లలు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కొందరిలో కంటిఅద్దాలు సమకూర్చినా చూపు బాగుపడని పరిస్థితి ఉంది. పిల్లల్లో చూపు తగ్గడానికి అనేక కారణాలున్నారుు. ప్రధానంగా కంటిచూపు తగ్గడానికి జన్యుపర సమస్య ఒకటైతే, విటమిన్-ఏ లోపం, తగినంత వెలుతురు లేని గదుల్లో విద్యాభ్యాసం చేయడం, అదేపనిగా వీడియో గేమ్స్, కంప్యూటర్, టీవీ చూడటం వ ంటివి కూడా కారణమవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కంటిచూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరునెలలకో సారి ఏ-విటమిన్ పిల్లలకు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. విటమిన్ ‘ఏ’ ద్రవం అందించే కార్యక్రమం పకడ్బందీగా చేపట్టకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోపణలున్నారు. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కంటిచూపు సమస్యతో బాధపడుతున వారిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు.. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకు ఉంది. వీరిలో నాలుగు శాతం పదేళ్ల వయసులోపు పిల్లలు ఉండగా ... 11 నుంచి 16 సంవత్సరాల లోపు వారు ఎక్కువగా ఉంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, ద్రాక్ష, బొప్పాయి, చిలగడ దుంపలు వంటి తినడంతో కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న ఏదైనా వ స్తువును తదేకంగా చూడాలి. తర్వాత దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా ఐదారుసార్లు చేయడంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూసి తెరుస్తుండడం మరిచిపోవద్దు. పిల్లలు, పెద్దలు ఎలాంటి సమస్యలేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చిన ప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేందుకు పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాలి. చూపు తగ్గడానికి కారణాలు ఇవీ.. పిల్లలకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులు, అసవరం అయినంతమేరకు తీసుకోకపోవడంతో ఏ-విటమిన్, కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపుతోపాటు ఇతర ఆరోగ్యసమస్యలూ వస్తాయి. వెలుతురు, గాలి లేని ఇరుకుగదుల్లో విద్యాభ్యాసం చేయడం. గతంలో బ్లాక్‌బోర్డుపై చాక్‌పీస్‌తో అక్షరాలు రాసేవారు. ఈ అక్షరాలు కళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్దగా కూడా కనిపించేవి. తరగతి గదిలో చివరివరుసలో కూర్చున్నా..అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్‌బోర్డుపై మార్కర్‌తో చిన్న అక్షరాలు రాస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడిపడి నరాలపై ప్రభావం చూపి చూపు తగ్గుతోంది. {పస్తుతం పుస్తకాల్లో అక్షరాలు కూడా మరీ చిన్నవిగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతోంది. టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో ఈ కంటిచూపు సమస్య ఉత్పన్నమవుతోంది.