గుడ్లు, ఆకుకూరలు తింటున్నారా? మీ చర్మంపై ఎలాంటి ఎఫెక్ట్‌ ఉంటుందో తెలుసా? | Vitamin A Diet: These Food Sources For Glowing Skin | Sakshi
Sakshi News home page

గుడ్లు, ఆకుకూరలు తింటున్నారా? మీ చర్మంపై ఎలాంటి ఎఫెక్ట్‌ ఉంటుందో తెలుసా?

Published Wed, Dec 6 2023 11:06 AM | Last Updated on Tue, Dec 12 2023 11:00 AM

Vitamin A Diet: These Food Sources For Glowing Skin - Sakshi

శరీరానికి సరైన ఆహారం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనం ఏం తింటామో అదే మన చర్మంపై రిఫ్లెక్ట్‌ అవుతుంది. ఎన్ని ట్రీట్‌మెంట్లు తీసుకున్నా సరైన ఆహారం తీసుకోకపోతే వ్యర్థమే. బ్యాలెన్స్‌ డైట్‌లో విటమిన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్లలో ముఖ్యంగా విటమిన్‌-ఎ అధికంగా ఉండే ఆహారం చర్మ సంరక్షణకు కీలకంగా ఉపయోగపడుతుంది. మరి విటమిన్‌-ఎ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో లభ్యమవుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 
 

క్యారట్లు:
విటమిన్‌-ఎ కి బెస్ట్‌ ఛాయిస్‌ క్యారట్లు. రోజూ కప్పు క్యారెట్ ముక్కలు తింటే రోజువారీ శరీరానికి అవసరమైన విటమన్‌ ‘ఎ’లో దాదాపుగా 334 శాతం అందుతుందని అధ్యయనంలో వెల్లడైంది. చాలామంది క్యారట్స్‌ని వండుకొని తింటారు. కానీ క్యారట్స్‌లోని పోషకాలు సంపూర్తిగా అందాలంటే పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్‌ తీసుకుని తాగచ్చు.

చిలగడ దుంప: 
చిలగడ దుంప లో కూడా విటమిన్‌ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు. లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్‌ కూడా బాగుంటాయి. 

పాలు: 
పాలల్లో కాల్షియమే కాదు విటమిన్‌ ఏ కూడా ఉంటుంది. ప్రతిరోజూ గ్లాసెడు పాలు తాగడం వల్ల మీ స్కిన్‌టోన్‌ కూడా ఇంప్రూవ్‌ అవుతుంది.

గుడ్లు
గుడ్లలో విటమిన్‌ ‘డి’ తోపాటు అధికమోతాదులో విటమిన్‌ ‘ఎ’ కూడా ఉంటుంది. ఇవి రెండు చర్మ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగవుతుంది.

ఆకుకూరలు:
ఆకుకూరల్లో విటమన్‌ ‘ఎ’ పుష్కలంగా ఉంటుంది. కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది. ప్రతిరోజూ వీటిని  మీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి

టమాటా: 
విటమిన్‌ ‘ఎ’ టమాటాల్లో అధికంగా ఉంటుంది. సహజంగానే మనరోజువారీ వంటకాల్లో టమాటా ఉపయోగిస్తాం! వంటలతోపాటు టమాటా సూప్‌, టమాటా చట్నీ ఇలా కూడా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరానికి సరిపడా అందుతాయి. విటమిన్‌ ఏ మాత్రమే కాక టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాన్సర్‌ సెల్స్‌ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ ని అదుపులో ఉంచుతుంది. 

గుమ్మడికాయ:
కెరోటినాయిడ్‌, ఆల్ఫా-కెరోటిన్‌ లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో సూప్స్, పైస్, స్నాక్స్‌ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్‌ ఎ సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడి గింజలను ప్రతిరోజూ తినడం వల్ల హార్మోనల్‌ బ్యాలెన్స్‌కి కూడా సహాయపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement