vitamin A deficiency
-
విటమిన్ ‘ఏ’ లోపిస్తే ...అంత ప్రమాదమా..!
ఆరోగ్యంగా జీవించాలంటే విటమిన్లు, పోషకాలు చాలా అవసరం. శరీరంలోని అనేక ప్రక్రియలకు విటమిన్ ‘ఏ’ చాలా అవసరం. రెటినోల్, రెటీనా రెటినోయిక్ యాసిడ్ సమ్మేళనం ఈ విటమిన్. అందుకే దీన్ని రెటినోల్ అని కూడా పిలుస్తారు. ఇది కొవ్వులో కరిగే పోషకం. మాంసం, చికెన్, చేపలు , పాలు, ఇతర మాంసాహారంలో ఇది లభిస్తుంది. ఏ విటమిన్ తో వచ్చే లాభాలు, లోపిస్తే నష్టాలు గురించి తెలుసుకుందాం. కెరోటినాయిడ్స్, ఆల్ఫా-కెరోటిన్, బీటా-కెరోటిన్ , బీటా-క్రిప్టోక్సంతిన్ విటమిన్ ఏలో పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి, సంతానోత్పత్తి, చక్కటి దృష్టికి ఇవి చాలా కీలకం అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం ఏ మిటమిన్ లోపిస్తే శరీర పనితీరు దెబ్బతినడమే కాదు, అంధత్వం నుండి వంధ్యత్వం వరకు చాలా సమస్యలు పొంచి ఉన్నాయి. ఊపిరితిత్తులు, కణజాలాలు, చర్మం, గుండె, రోగనిరోధక వ్యవస్థ సమస్యలకు కూడా దారితీస్తుంది ఇక కాలేయ రుగ్మతలు, అవసరమైన విటమిన్లను గ్రహించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ‘ఎ’ లోపిస్తే మొటిమలు పొడి చర్మం, కళ్ళు పొడిబారడం వంధ్యత్వం, గర్భ ధారణలో సమస్యలు గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు లాభాలు రేచీకటి, వయసు సంబంధిత సమస్యలనుంచి రక్షిస్తుంది. కొన్ని రకాల కేన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది. మొటిమలు, నల్లటి మచ్చలు రాకుండా చూస్తుంది. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డీతో పాటు, ఎముకల పెరుగుదలకు విటమిన్ ఏ కూడా చాలా అవసరం. ఎముకల బలానికి విటమిన్ఏ కూడా చాలా అవసరం. నోట్: విటమిన్ ఏ ఎక్కువైనా కూడా చాలా ప్రమాదం. విటమిన్ ఏ ఎక్కువైతే హైపర్ విటమినోసిస్ A కి దారి తీస్తుంది. సప్లిమెంట్లతో పోలిస్తే విటమిన్ ఏ సహజంగా లభించే ఆహారాలు (పాలు,గుడ్డు, కేరట్, చేపలు లాంటివి) మేలు. ఏదైనా వైద్యుల పర్యవేక్షణ అవసరం. -
గుడ్లు, ఆకుకూరలు తింటున్నారా? మీ చర్మంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా?
శరీరానికి సరైన ఆహారం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనం ఏం తింటామో అదే మన చర్మంపై రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరైన ఆహారం తీసుకోకపోతే వ్యర్థమే. బ్యాలెన్స్ డైట్లో విటమిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్లలో ముఖ్యంగా విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారం చర్మ సంరక్షణకు కీలకంగా ఉపయోగపడుతుంది. మరి విటమిన్-ఎ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో లభ్యమవుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. క్యారట్లు: విటమిన్-ఎ కి బెస్ట్ ఛాయిస్ క్యారట్లు. రోజూ కప్పు క్యారెట్ ముక్కలు తింటే రోజువారీ శరీరానికి అవసరమైన విటమన్ ‘ఎ’లో దాదాపుగా 334 శాతం అందుతుందని అధ్యయనంలో వెల్లడైంది. చాలామంది క్యారట్స్ని వండుకొని తింటారు. కానీ క్యారట్స్లోని పోషకాలు సంపూర్తిగా అందాలంటే పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్ తీసుకుని తాగచ్చు. చిలగడ దుంప: చిలగడ దుంప లో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు. లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్ కూడా బాగుంటాయి. పాలు: పాలల్లో కాల్షియమే కాదు విటమిన్ ఏ కూడా ఉంటుంది. ప్రతిరోజూ గ్లాసెడు పాలు తాగడం వల్ల మీ స్కిన్‌టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గుడ్లు గుడ్లలో విటమిన్ ‘డి’ తోపాటు అధికమోతాదులో విటమిన్ ‘ఎ’ కూడా ఉంటుంది. ఇవి రెండు చర్మ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగవుతుంది. ఆకుకూరలు: ఆకుకూరల్లో విటమన్ ‘ఎ’ పుష్కలంగా ఉంటుంది. కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది. ప్రతిరోజూ వీటిని మీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి టమాటా: విటమిన్ ‘ఎ’ టమాటాల్లో అధికంగా ఉంటుంది. సహజంగానే మనరోజువారీ వంటకాల్లో టమాటా ఉపయోగిస్తాం! వంటలతోపాటు టమాటా సూప్, టమాటా చట్నీ ఇలా కూడా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరానికి సరిపడా అందుతాయి. విటమిన్ ఏ మాత్రమే కాక టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ: కెరోటినాయిడ్, ఆల్ఫా-కెరోటిన్ లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో సూప్స్, పైస్, స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడి గింజలను ప్రతిరోజూ తినడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్‌కి కూడా సహాయపడుతుంది. -
చీకట్లు
పసిమొగ్గల్లో అంధత్వం! ♦ చిన్నారుల్లో ఏ విటమిన్ లోపం ♦ {పతి వంద మందిలో ఏడుగురికి సమస్య ♦ రోజురోజుకు పెరుగుతున్న బాధితులు ♦ పౌష్టికాహారలోపం, చీకటి గదుల్లో విద్యాబోధనే కారణం ♦ కళ్లజోళ్లు తప్పనిసరి అవుతున్న దుస్థితి జోగిపేట: గతంలో కంటి చూపు తగ్గుతుందంటే వృద్ధాప్యం దగ్గర పడుతుందని భావించే వారు. కానీ నేడు వయసుతో సంబం ధం లేకుండా కంటిచూపు మందగిస్తోంది. చీకటి గదుల్లో విద్యా బోధన, టీ వీ చూడటం, కంప్యూటర్, వీడియో గేమ్స్, సెల్లో చిత్రాలు వీక్షించడం తదితర కారణాలతో పిల్లల్లో కంటి చూపు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారుల్లో దృష్టిలోపం ఏర్పడడం ఆందోళన కల్గించే అంశం. తల్లిదండ్రులు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పిల్లలందరూ కళ్లజోళ్లతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో ఏడుగురికి దృష్టిలోపం ఉన్నట్లు సమాచారం. జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో 50 వేల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో తప్పనిసరిగా 2,609 మంది విద్యార్థుల కు కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. ఈ మాసంలో అద్దాలను పంపిణీ చేయనున్నారు. వేలాది మంది విద్యార్థులకు కంటిలో వేసుకునేందుకు ఐ డ్రాప్స్‌ను పంపిణీ చేశారు. వీరిలో 10 ఏళ్లలోపు వారే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కంటి చూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పదేళ్లలోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. పదేళ్లలోపు ఉన్న 100 మంది చిన్నారులను పరిశీలిస్తే అందులో ఏడుగురు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కంటి చూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రతి ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు నిర్వహించి విటమిన్ ఏ అందిస్తున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదు. కాగా.. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. చూపు తగ్గడానికి కారణాలు ♦ పిల్లలకు పాలు, గుడ్డు అకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు అవసరమైనంత మేరకు తీసుకోకపోవడంతో విటమిన్ ఏ కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపు మందగిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ♦ వెలుతురు, గాలి లేని తరగతి గదుల్లో విద్యాభ్యాసం చేయడం. ♦ తరగతి గదుల్లో బ్లాక్ బోర్డులనే వాడాలి. బ్లాక్ బోర్డుపై చాక్‌పీస్‌తో రాసిన అక్షరాలు దూరం నుంచి కూడా కళ్లపై ఒత్తిడి లేకుండా కనిపిస్తాయి. ♦ తెల్లబోర్డులు, మార్కర్లు వాడడంతో కళ్లపై ఒత్తిడి పడి నరాలపై ప్రభావం చూపి కంటి చూపు తగ్గుతుంది. ♦ {పస్తుతం పుస్తకాలలో అక్షరాలు కూడా మరీ చిన్నగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతుంది. ♦ టీవీ, కంప్యూటర్, వీడియో, సెల్లో గేమ్స్ ఆడే పిల్లల్లో కంటి చూపు సమస్య ఉత్పన్నమవుతుంది. 50 వేల మంది చిన్నారులకు కంటి పరీక్షలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరపున కంటి పరీక్షలు నిర్వహించాం. ఇందులో 2.069 మంది విద్యార్థిని, విద్యార్థులకు తప్పనిసరిగా కంటి అద్దాలు అవసరమని గుర్తించాం. వారికి ఈనెలలో కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తున్నాం. అవసరమైన వారికి ఐ డ్రాప్స్ మందులను పంపిణీ చేశాం. చిన్నారులకు కంటిని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలను ప్రతి పాఠశాలలో వివరించాం. ప్రతి సంవత్సరం కంటి పరీక్షలను పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. దృష్టిలోపంతో బాధపడుతున్న వారందరినీ గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం - డాక్టర్ అమర్‌సింగ్, డీఎంహెచ్ఓ, సంగారెడ్డి జాగ్రత్తలు తప్పనిసరి ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు క్యారెట్, ద్రాక్ష, బొప్పా యి, చిలుగడదుంపలు తీసుకోవడం తో కంటి సమస్యల నుంచి రక్షణ పొం దవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా అయిదారు సార్లు చేయడంతో కళ్లపై వత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూ స్తూ.. తెరుస్తూ ఉండటం మరచిపోవద్దు. పిల్లలు, పెద్ద లు ఎలాంటి సమస్య లేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేదుకు పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. - డాక్టర్ ఎస్.రవీందర్‌గౌడ్, కంటి వైద్య నిపుణులు