Watermelon Apple Juice Recipe and Health Benefits in Telugu - Sakshi
Sakshi News home page

Watermelon Apple Juice: వేసవిలో పుచ్చకాయ, యాపిల్‌ జ్యూస్‌ కలిపి తాగుతున్నారా.. అయితే!

Published Tue, May 24 2022 11:54 AM | Last Updated on Tue, May 24 2022 1:40 PM

Summer Drinks: Watermelon Apple Juice Recipe And Health Benefits - Sakshi

వేసవిలో  పుచ్చకాయ యాపిల్‌ జ్యూస్‌ మంచి రుచికరమైన రిఫ్రెషింగ్‌ డ్రింక్‌. పుచ్చకాయలోని నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. యాపిల్‌లో ఉన్న పోషకాలు శరీరానికి అంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల దాహం తీరడంతో పాటు, శరీరానికి కావాల్సిన అనేక ఖనిజ పోషకాలు అందుతాయి.

పుచ్చకాయ యాపిల్‌ జ్యూస్‌ తయారీకి కావాల్సినవి:
►గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు- రెండు కప్పులు
►పంచదార- రెండు టేబుల్‌ స్పూన్లు
►యాపిల్‌- పెద్దది ఒకటి
►రాక్‌సాల్ట్‌- టీస్పూను
►జీలకర్ర పొడి- అర టీ స్పూను
►ఐస్‌ క్యూబ్స్‌- అరకప్పు
►పుదీనా ఆకులు- ఐదు

తయారీ:
►పుచ్చకాయ ముక్కల్ని బ్లెండర్‌లో వేయాలి.
►ముక్కలతో పాటు పంచదార, రాక్‌సాల్ట్‌ వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి
►ఇవన్నీ నలిగాక జీలకర్ర పొడి, ఐస్‌క్యూబ్స్‌ వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి
►గ్రైండ్‌ అయిన జ్యూస్‌ను ఒక పాత్రలో తీసుకోవాలి
►ఇప్పుడు యాపిల్‌ తొక్కతీసి గ్రేటర్‌తో సన్నగా తురిమి జ్యూస్‌లో వేసి చక్కగా కలుపుకోవాలి.
►జ్యూస్‌ను గ్లాస్‌లో పోసి, సన్నగా తరిగిన పుదీనా ఆకులను వేసి సర్వ్‌ చేసుకోవాలి.

వేసవిలో ట్రై చేయండి: Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్‌ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement