Summer Drinks- Carrot Apple Juice: తియ్యగా పుల్లగా ఎంతో రుచిగా ఉండే క్యారట్ యాపిల్ జ్యూస్ వేసవిలో తాగడానికి చాలా బావుంటుంది. దీనిలో ఫాలీఫీనాల్స్, పొటాషియంలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, ఆల్జీమర్స్ ముప్పుని తగ్గిస్తాయి.
►విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
►అల్లం, క్యారట్, యాపిల్ కలిపి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరి గుణాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి.
►దీనివల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు దరిచేరవు. ఆరెంజ్‌లోని విటమిన్ సి శరీరానికి తగినంత అందుతుంది.
►రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి.
క్యారట్ యాపిల్ జ్యూస్ తయారీకి కావలసినవి:
తొక్కతీసి తరిగిన క్యారట్ ముక్కలు – కప్పు, యాపిల్ ముక్కలు – కప్పు, తొక్క తీసిన నారింజ లేదా కమలా తొనలు – కప్పు, అల్లం తరుగు – టీస్పూను, ఐస్ క్యూబ్స్ – కప్పు.
తయారీ విధానం:
►ముక్కలన్నింటిని బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
►అన్ని ముక్కలు మెదిగాక కొన్ని ఐస్‌క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి.
►ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్‌ని గ్లాసులో వేయాలి.
►దీనిలో ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి.
వేసవిలో ట్రై చేయండి: Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల!
Comments
Please login to add a commentAdd a comment