అందం మకరందం
హనీబిట్స్
►ఒక టేబుల్ స్పూన్ తేనెలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలపాలి. దాన్ని మాడుకు, జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే అది మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.
►ముఖంపై మొటిమలతో బాధపడే వారు రోజూ స్వచ్ఛమైన తేనెను రాసుకొని ఓ 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు వారాలు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
► రెండు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కలిపి కొద్దిసేపు నానబెట్టాలి. దాన్ని ముఖానికి, శరీరానికి రాసుకుంటే మంచి స్క్రబ్‌లా ఉపయోగపడుతుంది.
►తల స్నానానికి ఉపయోగించే షాంపూలో కొద్దిగా తేనెను కలిపి వాడితే చాలు... జుట్టు రాలడం తగ్గడంతో పాటు అది మంచి కండిషనర్‌గానూ ఉపకరిస్తుంది.
►తేనె మంచి ఔషధంగానూ మనకెంతో మేలు చేస్తుంది. చర్మంపై పడ్డ గాట్లపై, దెబ్బలపై తేనెను రాసుకుంటే చాలు. నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
►కళ్లకు విశ్రాంతినివ్వడంలోనూ తేనెకున్న ప్రత్యేకత గొప్పది. ఒక టీ స్పూన్ గోరువెచ్చటి నీళ్లలో ఒక టీ స్పూన్ తేనెను కలిపి కనురెప్పలపై రాసుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చు. తేనెను ఆహారంతో పాటు తిన్నా కళ్లకు ఎంతో మంచిది. బరువు తగ్గాలంటే ప్రతి రోజూ ఉదయం గ్లాసెడు నిమ్మరసంలో రెండు టీ స్పూన్ల తేనెను కలిపి తాగితే సరి. రెండు నెలల్లోనే మంచి ఫలితం కనపడుతుంది.