
ఫ్రూట్ అండ్ లెట్యూస్ సలాడ్
కావలసినవి:
లెట్యూస్ ఆకులు (దీనికి బదులుగా తరిగిన క్యాబేజీ ఆకులను వాడుకోవచ్చు) – 1 కప్పు
బొప్పాయి ముక్కలు – అర కప్పు
ద్రాక్ష – అర కప్పు
ఆరెంజ్ తొనలు – అర కప్పు
జామపండు ముక్కలు – అర కప్పు
స్ట్రాబెర్రీలు – అర కప్పు
పుచ్చకాయ ముక్కలు – అర కప్పు
బాదం పప్పు పలుకులు – టేబుల్‌స్పూన్
డ్రెస్సింగ్‌కోసం...
నిమ్మరసం – టేబుల్ స్పూన్
తేనె – 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి – 2
ఉప్పు – తగినంత
తయారి:
1. డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలపాలి.
2. పండ్ల ముక్కలన్నీ ఒక పాత్రలో తీసుకుని, డ్రెస్సింగ్ మిశ్రమం వేసి కలపాలి.
3. సలాడ్ కప్పులో లెట్యూస్ ఆకులు వేసి, పైన డ్రెస్సింగ్ చేసిన పండ్లముక్కలను వేసి సర్వ్ చేయాలి.
కప్పు సలాడ్‌లో పోషకాలు:
క్యాలరీలు : 103కి.క్యా
కొవ్వు : 2.5 గ్రా.
పిండిపదార్థాలు : 18.7 గ్రా.
విటమిన్ : 30.7 గ్రా.
Comments
Please login to add a commentAdd a comment