Guinness World Record for being the world's heaviest strawberry: మీరు ఏ సైజ్ స్ట్రాబెర్రీని చూసి ఉంటారు.. ఈ ఫొటోలోని సైజుదైతే ఎట్టి పరిస్థితుల్లోనూ చూసి ఉండరు.. ఎందుకంటే.. ప్రపంచంలో ఈ స్థాయి సైజుది ఇదొక్కటే ఉంది. 18 సెంటీమీటర్ల పొడవున్న ఈ పండు బరువు 289 గ్రాములు. అందుకే ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీగా దీన్ని గిన్నిస్ బుక్‌వారు గుర్తించారు. ఇజ్రాయెల్‌కు చెందిన స్ట్రాబెర్రీ పండ్ల వ్యాపారి ఏరియల్ చాహీ తోటలో పండిన పండు ఇది. ఇప్పటివరకూ జపాన్‌కు చెందిన కోజీ నాకో అనే ఆయన పండించిన 250 గ్రాముల బరువున్న స్ట్రాబెర్రీదే రికార్డు. ఆ రికార్డును ఇది బద్దలుకొట్టింది.
(చదవండి: ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!)
Comments
Please login to add a commentAdd a comment