Heaviest
-
ఒబెసిటీ ఇంత ప్రమాదకరమైనదా? పాపం ఆ వ్యక్తి..!
ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్తమైన జీవన విధానం, కల్తీ ఫుడ్ల కారణంగా టీనేజీ యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తోంది. కనీసం పెళ్లీడు రాకమునుపే పెద్దవాళ్లలా కనిపించేంత భారీకాయంతో సతమతమవ్వుతున్నారు. అచ్చం అలాంటి సమస్యతోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి మరణించాడు. జస్ట్ 33 ఏళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒబెసిటీ ఇంత ప్రమాకమైనదే? లావుగా ఉంటే అంతే సంగతులా..!లావుగా ఉంటే లైఫ్ లాసే అని ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. బ్రిటన్ నివాసి జాసన్ హోల్డన్ యూకేలోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి. అతడి బరువు ఏకంగా 317 కిలోలు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకోవాలట. ఇక అతడు పడుకోవాలన్నా.. ప్రత్యేకంగా రూపొందించిన ఫర్నిచర్‌పై బెడ్‌పై నిద్రిస్తాడు. అతడికి అతిగా తినే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎంతలా ఉందంటే రోజువారీగా ఏకంగా పదివేలకు పైగా కేలరీలు తీసుకునేంత స్థాయిలో ఉంది. అతడి బ్రేక్‌ఫాస్ట్‌లో డోనార్ కబాబ్‌లు తీసుకుంటాడంటే..అతడు ఎంతలా తింటాడో చెప్పాల్సిన పనిలేదు. దీని కారణంగానే ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది. దీంతో అతను కొన్నాళ్లుగా గదికే పరితం కాగా, క్రమేణ మంచానికే పరిమతమయ్యాడు. ఆ తర్వాత చలనశీలత దెబ్బతింది. మొదట అతడి శరీరంలో కిడ్నీ పనిచేయడం మానేసింది. అలా నెమ్మదిగా మిగతా అవయవాలు వైఫల్యం చెందడం ప్రారంభించడంతో 34వ ఏటాలోకి అడుగుపెట్టడానికి కొన్ని రోజుల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు గతేడాది ఒక ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని, తాను ఎన్నాళ్లో బతకనని చెప్పేశాడు కూడా. పైగా అలా కాకుండా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి 2020లో ప్రమాదవశాత్తు హోల్టన్ మూడవ అంతస్తు నుంచి పడిపోయాడు. పాపం అతడిని రక్షించటానికి ఏకంగా 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, క్రేన్ రంగంలోకి దిగి కాపాడారు. ఆ ఘటనను తలచుకుంటూ అది తన జీవితంలో అత్యంత బాధకరమైన ఘటనగా పేర్కొన్నాడు హోల్డన్. ఆ టైంలో తనను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి చాలా బాధపడడ్డానని అన్నాడు. హోల్డన్ మానసిక స్థితి ఎంతలా మారిపోయిందంటే.. లావుగా ఉండే వ్యక్తులను ఆధారం చేసుకుని తీసిన సినిమాలు సైతం అతడికి భయానక చిత్రాలుగా అనిపించాయి. కనీసం తన అమ్మను కూడా చూడొద్దని కన్నీటి పర్యంతమయ్యాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ అధిక బరువు కారణంగా ఎంతగా ఇబ్బంది పడ్డానేది నేరుగానే తెలుస్తోంది. అతను తరుచుగా ఈ బ్రిటన్ దేశంలో తానే అత్యంత లావుగా ఉన్నవ్యక్తిని అని బాధపడేవాడు. అతడి పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా అధిక బరువు కారణంగా అవయవాల వైఫల్యం చెంది మరణించినట్లు ఉంది. హోల్టన్ ఈ అధిక బరువు కారణంగా స్ట్రోక్‌లు, రక్త గడ్డకట్టడం వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అధిక బరువు అనేది ప్రాణాంతకమైన సమస్యే. నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తగ్గించుకునే యత్నం చేయకపోతే అంతే సంగతులని ఈ ఉదంతమే చెబుతోంది. అందువల్ల కొద్దిపాటి శారీరక శ్రమ, క్యాలరీల తక్కువ ఉన్న ప్రత్యామ్నాయ ఆహారంతో బరువుని అదుపులో ఉంచుకునే యత్నం చేయండి. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించండి.(చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?) -
ఈ సైజు స్ట్రా బెర్రీని ఎప్పుడైనా చూశారా ?
Guinness World Record for being the world's heaviest strawberry: మీరు ఏ సైజ్ స్ట్రాబెర్రీని చూసి ఉంటారు.. ఈ ఫొటోలోని సైజుదైతే ఎట్టి పరిస్థితుల్లోనూ చూసి ఉండరు.. ఎందుకంటే.. ప్రపంచంలో ఈ స్థాయి సైజుది ఇదొక్కటే ఉంది. 18 సెంటీమీటర్ల పొడవున్న ఈ పండు బరువు 289 గ్రాములు. అందుకే ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీగా దీన్ని గిన్నిస్ బుక్‌వారు గుర్తించారు. ఇజ్రాయెల్‌కు చెందిన స్ట్రాబెర్రీ పండ్ల వ్యాపారి ఏరియల్ చాహీ తోటలో పండిన పండు ఇది. ఇప్పటివరకూ జపాన్‌కు చెందిన కోజీ నాకో అనే ఆయన పండించిన 250 గ్రాముల బరువున్న స్ట్రాబెర్రీదే రికార్డు. ఆ రికార్డును ఇది బద్దలుకొట్టింది. (చదవండి: ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!) -
బయటకు తీసుకురావడానికి గోడని కూల్చేశారు!
పాకిస్తాన్ భారీకాయుడు నూర్ హస్సన్‌ను చికిత్స నిమిత్తం లాహోర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ రెస్క్యూ టీంల సహకారంతో నూర్ హస్సన్‌ను పంజాబ్‌లోని సదిక్వాబాద్ నుంచి మిలిటరీ హెలికాప్టర్లో లాహోర్‌కు తరలించారు. అతని తరలింపు, చికిత్స కోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావేద్ బజ్వా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థూలకాయుడు హస్సన్ 330 కిలోల బరువుండి కదలడానికి కూడా వీలు లేని స్థితిలో ఉన్నాడు. దీంతోపాటు బరువు కారణంగా వచ్చిన ఇతర ఆరోగ్య సమస్యలు అతన్ని బాధిస్తున్నాయి. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం లాపొరోస్కోపీ సర్జరీ చేయించుకోనున్నాడు. అతన్ని చికిత్సకు తరలించడానికి రెస్క్యూ టీం నానాకష్టాలు పడింది. అతని శరీరం పెద్దదిగా ఉండి ఇంటి ప్రధాన ద్వారంలో పట్టకపోవడంతో ఇంటి గోడను కూల్చి బయటకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో లాహోర్‌కు తరలించారు. పాకిస్తాన్ మీడియా నూర్ హస్సన్‌ను ఆ దేశంలోనే అతి భారీకాయుడిగా వర్ణిస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం తెలియరాలేదు. 2017లో 360 కిలోల బరువున్న ఊబకాయుడు కూడా లాపొరోస్కోపీ సర్జరీ ద్వారా 200 కిలోలకు తగ్గాడు. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే నూర్ హస్సన్ ఉన్నాడు. ఓ నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 29 శాతంమంది అధిక బరువుతో బాధపడుతుండగా అందులో 51 శాతం ఊబకాయుల లిస్టులో ఉన్నారు. -
బాలిక కాదు.. బాహుబలి!
బెంగళూరు: భారతదేశంలోనే అత్యధిక బరువుతో పుట్టిన ఆడ శిశువుకు, బెంగళూరు మహిళ జన్మనిచ్చింది. నందిని అనే గర్భిణికి హసన్ ఆస్పత్రిలో సోమవారం పుట్టిన బాలిక 6.82 కిలోల బరువు ఉందని డాక్టర్లు వెల్లడించారు. అప్పుడే పుట్టిన శిశువులు సగటున 3.4 కిలోల వరకు బరువుంటారు. తన 25 ఏళ్ల సర్వీసులో ఇంత భారీగా బరువున్న ఆడ శిశువును ఎప్పుడూ చూడలేదంటూ డాక్టర్ వెంకటేశ్ రాజు అనే స్థానిక వైద్యాధికారి ఆశ్చర్యపోయారు. బిడ్డకు తగ్గట్టే తల్లి నందిని కూడా 5.9 అడుగుల ఎత్తు, 94 కిలోల బరువు ఉన్నారు. ప్రస్తుతం ఈ శిశువును ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శిశువు ఆరోగ్యం అన్ని విధాలా బాగుందని, అయితే ఆమె భారీ కాయాన్ని చూసి అంతా విస్తుపోయామని సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించిన గైనకాలజిస్టు డాక్టర్ పూర్ణిమ మణు వివరించారు. గత ఏడాది కూడా ఫిర్దోస్ ఖాటూన్ అనే మహిళ 6.7 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చారు. నందిని కుమార్తె ఇంతకంటే ఎక్కువ బరువు ఉండటం విశేషం.