ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్తమైన జీవన విధానం, కల్తీ ఫుడ్‌ల కారణంగా టీనేజీ యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తోంది. కనీసం పెళ్లీడు రాకమునుపే పెద్దవాళ్లలా కనిపించేంత భారీకాయంతో సతమతమవ్వుతున్నారు. అచ్చం అలాంటి సమస్యతోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి మరణించాడు. జస్ట్ 33 ఏళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒబెసిటీ ఇంత ప్రమాకమైనదే? లావుగా ఉంటే అంతే సంగతులా..!
లావుగా ఉంటే లైఫ్ లాసే అని ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. బ్రిటన్ నివాసి జాసన్ హోల్డన్ యూకేలోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి. అతడి బరువు ఏకంగా 317 కిలోలు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకోవాలట. ఇక అతడు పడుకోవాలన్నా.. ప్రత్యేకంగా రూపొందించిన ఫర్నిచర్‌పై బెడ్‌పై నిద్రిస్తాడు. అతడికి అతిగా తినే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎంతలా ఉందంటే రోజువారీగా ఏకంగా పదివేలకు పైగా కేలరీలు తీసుకునేంత స్థాయిలో ఉంది.
అతడి బ్రేక్‌ఫాస్ట్‌లో డోనార్ కబాబ్‌లు తీసుకుంటాడంటే..అతడు ఎంతలా తింటాడో చెప్పాల్సిన పనిలేదు. దీని కారణంగానే ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది. దీంతో అతను కొన్నాళ్లుగా గదికే పరితం కాగా, క్రమేణ మంచానికే పరిమతమయ్యాడు. ఆ తర్వాత చలనశీలత దెబ్బతింది. మొదట అతడి శరీరంలో కిడ్నీ పనిచేయడం మానేసింది. అలా నెమ్మదిగా మిగతా అవయవాలు వైఫల్యం చెందడం ప్రారంభించడంతో 34వ ఏటాలోకి అడుగుపెట్టడానికి కొన్ని రోజుల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు గతేడాది ఒక ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని, తాను ఎన్నాళ్లో బతకనని చెప్పేశాడు కూడా. పైగా అలా కాకుండా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఒకసారి 2020లో ప్రమాదవశాత్తు హోల్టన్ మూడవ అంతస్తు నుంచి పడిపోయాడు. పాపం అతడిని రక్షించటానికి ఏకంగా 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, క్రేన్ రంగంలోకి దిగి కాపాడారు. ఆ ఘటనను తలచుకుంటూ అది తన జీవితంలో అత్యంత బాధకరమైన ఘటనగా పేర్కొన్నాడు హోల్డన్. ఆ టైంలో తనను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి చాలా బాధపడడ్డానని అన్నాడు. హోల్డన్ మానసిక స్థితి ఎంతలా మారిపోయిందంటే.. లావుగా ఉండే వ్యక్తులను ఆధారం చేసుకుని తీసిన సినిమాలు సైతం అతడికి భయానక చిత్రాలుగా అనిపించాయి. కనీసం తన అమ్మను కూడా చూడొద్దని కన్నీటి పర్యంతమయ్యాడు.
దీన్ని బట్టి చూస్తే.. ఈ అధిక బరువు కారణంగా ఎంతగా ఇబ్బంది పడ్డానేది నేరుగానే తెలుస్తోంది. అతను తరుచుగా ఈ బ్రిటన్ దేశంలో తానే అత్యంత లావుగా ఉన్నవ్యక్తిని అని బాధపడేవాడు. అతడి పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా అధిక బరువు కారణంగా అవయవాల వైఫల్యం చెంది మరణించినట్లు ఉంది. హోల్టన్ ఈ అధిక బరువు కారణంగా స్ట్రోక్‌లు, రక్త గడ్డకట్టడం వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అధిక బరువు అనేది ప్రాణాంతకమైన సమస్యే. నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తగ్గించుకునే యత్నం చేయకపోతే అంతే సంగతులని ఈ ఉదంతమే చెబుతోంది. అందువల్ల కొద్దిపాటి శారీరక శ్రమ, క్యాలరీల తక్కువ ఉన్న ప్రత్యామ్నాయ ఆహారంతో బరువుని అదుపులో ఉంచుకునే యత్నం చేయండి. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించండి.
(చదవండి: సమ్మర్‌లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?)
Comments
Please login to add a commentAdd a comment