అతిభారీ స్ట్రాబెర్రీ
తిక్క లెక్క
ఎర్రగా నిగనిగలాడే స్ట్రాబెర్రీ పళ్లు మామూలుగా ఒక్కొక్కటి ఐదారు గ్రాముల బరువు తూగడమే ఘనం. అలాంటిది ఈ ఫొటోలో కనిపిస్తున్న గజ స్ట్రాబెర్రీ ఏకంగా 250 గ్రాముల బరువు తూగింది. మామూలుగా స్ట్రాబెర్రీలు సెంటీమీటరు కంటే తక్కువ ఎత్తులోనే ఉంటాయి. ఇది ఏకంగా 8 సెంటీమీటర్ల ఎత్తు, 12 సెంటీమీటర్ల పొడవుతో ఉంది.
దీని చుట్టుకొలత దాదాపు 30 సెంటీమీటర్లు ఉంది. జపాన్‌లోని ఫుకోకాకు చెందిన కోజి నకావో అనే రైతు తోటలో పండిన ఈ స్ట్రాబెర్రీ ప్రపంచంలోనే అతి భారీ స్ట్రాబెర్రీగా గిన్నెస్ రికార్డు సాధించింది.