
స్ట్రాబెర్రీలతో మెదడుకు చురుకుదనం
స్ట్రాబెర్రీలను చాలామంది ఇష్టంగా తింటారు. వీటిలో విటమిన్లు, ఖనిజలవణాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ఇవి సహజంగా మేలు చేస్తాయని, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. స్ట్రాబెర్రీలు కలిగించే మరో ప్రయోజనం కూడా తాజా పరిశోధనల్లో వెలుగులోకి వచ్చింది. స్ట్రాబెర్రీలు మెదడుకు చురుకుదనం ఇస్తాయని, వయసు మళ్లిన దశలోనూ మెదడు పనితీరు మందగించకుండా ఉంచుతాయని కాలిఫోర్నియాలోని సాల్క్స్ సెల్యులర్ న్యూరోబయాలజీ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ల్యాబ్‌లో ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో స్ట్రాబెర్రీల వల్ల మెదడులో కలిగే సానుకూల మార్పులను గుర్తించారు. స్ట్రాబెర్రీలను తీసుకుంటున్నట్లయితే వార్ధక్యంలో మెదడు పనితీరు మందగించడం వల్ల వచ్చే అల్జీమర్స్ వ్యాధి, ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని వారు తేల్చి చెబుతున్నారు.