బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లు గ్రామంలో బెస్త హనుమంతు (30) అనే వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ శ్రీరాంశ్రీనివాస్ సోమవారం తెలిపారు. వివరాలు.. హనుమంతుకు మతిస్థిమితం లేక భార్య సరస్వతిని వేధించేవాడు. ఆమె భరించలేక పుట్టింటికి వెళ్లింది. అయితే ఆయన ఒంటరిగా జీవితాన్ని గడపలేక రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి పోస్టుమార్టం చేయించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.