పోలీసులను పరుగు పెట్టించిన తాబేలు
పోలీసులను పరుగు పెట్టించిన తాబేలు
Published Tue, Aug 5 2014 5:06 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
తాబేలును పట్టుకోవడానికి పోలీసులు ఛేజింగ్ చేయాల్సి వచ్చిందంటే.. ముక్కున వేలేసుకుని నవ్వుకోవాల్సిందే. అయితే అమెరికాలో ఓ తాబేల్ ను పట్టుకోవడానికి అక్కడి పోలీసులు చిన్న ఛేజింగ్ చేయాల్సి వచ్చిందట.
అమెరికాలోని అల్హంబ్రా నగరంలో 150 పౌండ్లున్న తాబేల్ రోడ్డుపై తిరుగుతూ పోలీసులకు కనిపించింది. అయితే తాబేలు అంత సులువుగా పోలీసుల చేతికి చిక్కకపోవడం కథలో ఓ ట్విస్ట్. రోడ్డుపైన తిరుగుతూ కనిపించిన తాబేల్ పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు చిన్నపాటి ఛేజింగ్ చేయాల్సి వచ్చిందని అల్హంబ్రా పోలీసుల విభాగం ఫేస్ బుక్ లో వెల్లడించింది. చివరకు లాస్ ఎంజెలెస్ కౌంటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనిమల్ కేర్ అండ్ కంట్రోల్ వారికి అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసులు, తాబేలు లో వేగం ఎవరిది? తాబేల్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కాని తాబేలు కంటే పోలీసులు వేగంగా పరిగెత్తి పట్టుకున్నారు. దాని బరువు 150 పౌండ్లు ఉంది. అని ఫేస్ బుక్ లో వెల్లడించారు.
Advertisement
Advertisement