Giant Tortoise Hunt Small Birds Video: తాబేలు-కుందేలు కథ గుర్తింది కదా!. కుందేలు బద్ధకం కలిసొచ్చి.. నత్తనడకతోనే పరుగు పందెంలో విజయం సాధిస్తుంది తాబేలు. అటుపై తాబేలు కథలెన్నో వాటిపై సింపథినీ, అదొక సాధు జీవి అనే మార్క్‌ను మనుషులకు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో.. ఆ మార్క్‌ను పూర్తిగా చెరిపిపడేయడం ఖాయం.
సాధారణంగా సెచెల్లెస్ తాబేళ్లు శాఖాహార జీవులు. అలాంటిది ఈ భారీ ఆడ తాబేలు.. ఇలా వేటాడింది. తూర్పు ఆఫ్రికా సెచెల్లెస్ దీవుల సముదాయంలోని ఫ్రెగేట్ ఐల్యాండ్‌లో కిందటి నెలలో ఈ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐల్యాండ్‌లో మూడు వేలకు పైగా తాబేళ్లు ఉన్నాయి. జీవావరణంలో మొట్టమొదటిసారి ఇలాంటి దాడిని చూడడమని పరిశోధకులు తేల్చేశారు. సెచెల్లెస్ తాబేళ్ల నుంచి కచ్చితంగా ఇది ఊహించని పరిణామమేనని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ జువాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జస్టిన్ గెర్లాచ్ చెబుతున్నారు. సెచెల్లెస్ తాబేళ్లలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రవర్తన పెరిగి ఉండొచ్చని ఆయన అంచనా వేస్తూ రాసిన కథనం.. కరెంట్‌బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.
కరోనా ప్రభావం!
తాబేళ్లకు కోపం, చికాకు వచ్చినప్పుడు దాడులు చేయడం సహజం. అయితే ఈ మధ్యకాలంలో పక్షుల గూడుల నుంచి పడిపోయిన పిల్లలను, గుడ్లను సెచెల్లెస్ తాబేళ్లు తింటున్నాయనే ప్రచారాలు వినిపించాయి. అయితే చాలామంది పరిశోధకులు ఈ కథనాలను నమ్మలేదు. ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడంతో అది నిజమనే ఓ అంచానికి వచ్చారు. కరోనా ప్రభావం వల్ల తాబేళ్ల జనాభా విపరీతంగా పెరగడం, వాటికి సరైన ఆహారం అందకపోవడం, గుడ్ల కోసం కావాల్సిన కాల్షియం దొరక్కపోవడం.. తదితర కారణాల వల్ల ఇవి ఇలా క్రూరంగా తయారై ఉంటాయని, అయితే వాటిని జీవన విధానానికి విరుద్ధంగా ప్రవర్తించే క్రమంలో అవి మనుగడ కొనసాగించగలవా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం పరిశీలన తప్పదని ప్రముఖ హెర్పటాలజిస్ట్ జేమ్స్ గిబ్స్ చెప్తున్నారు.
చదవండి: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం!
Comments
Please login to add a commentAdd a comment