Meet World's Oldest Tortoise Jonathan At St Helena - Sakshi
Sakshi News home page

జోనాథన్‌: వీడి వయసు 190 ఏళ్లు.. ప్రపంచ యుద్ధాలతో పాటు ఎన్నో చూశాడు

Published Sat, Dec 3 2022 1:16 PM | Last Updated on Sat, Dec 3 2022 1:38 PM

Meet Worlds Oldest Tortoise Jonathan At St Helena - Sakshi

ఈ భూమ్మీద అత్యంత వయసు గల జీవి ఏదో తెలుసా?.. పోనీ అధిక కాలం బతికే జీవిగా పేరు దేనికి ఉందో తెలుసా?.. తాబేలు!

అవును.. తాబేలు గూటికి చెందిన జోనాథన్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మగ తాబేలు వయసు.. అక్షరాల 190 సంవత్సరాలు. తద్వారా ప్రస్తుతానికి ఈ భూమ్మీద అత్యధిక వయసున్న ప్రాణిగా జోనాథన్‌ పేరు రికార్డుల్లోకి ఎక్కింది!.

ఇక..  సౌత్‌ అట్లాంటిక్‌లోని మారుమూల ద్వీపం సెయింట్‌ హెలెనాలో జోనాథన్‌కు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

► ఈ ప్రాంతంలోనే ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌.. తన ఆఖరిరోజుల్ని ఇక్కడే గడిపి 1821లో కన్నుమూశారు.

► 1832లో ఇది గుడ్డు నుంచి బయటకు వచ్చి ఉంటుందని.. దానిపై ఉండే డొప్ప ఆధారంగా వయసుపై ఓ అంచనాకి వచ్చారు  పరిశోధకులు.  

► తూర్పు ఆఫ్రికా దేశం సీషెల్స్ నుంచి యాభై ఏళ్ల వయసులో జోనాథన్‌ను.. యూకే ఓవర్సీస్‌ సరిహద్దులకు తీసుకొచ్చారు.


జోనాథన్‌(ఎడమ వైపు ఉన్న తాబేలు)

► 1882లో యాభై ఏళ్ల వయసున్న ఈ తాబేలును.. సర్‌ విలియమ్‌ గ్రే విల్సన్‌కు కానుకగా అందించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆ ద్వీపానికి గవర్నర్‌ అయ్యారు.

► అప్పటి నుంచి సెయింట్‌ హెలెనా గవర్నర్‌ అధికార భవనంలోని మొక్కల సంరక్షణ కేంద్రంలో ఇది సేదతీరుతోంది. 

► జోనాథన్‌ బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయక్కడ. తోడు కోసం ఓ ఆడ తాబేలును కూడా తీసుకొస్తారు.

► జోనాథన్‌ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. అంతేకాదు.. దాని ఫేవరెట్‌ ఫుడ్‌(పండ్లు) అందించడంతో పాటు ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేశారు. జోనాథన్‌ పేరు మీద ఓ స్టాంప్‌ను సైతం విడుదల చేయబోతున్నారు. 

► ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న భూప్రాణిగా జోనాథన్‌ పేరు ఈ ఏడాది మొదట్లోనే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. అయితే.. అత్యంత వయస్కురాలైన తాబేలుగా మాత్రం ఈ నెలలోనే ఘనత సాధించింది. 

► జోనాథన్‌ కళ్ల ముందే ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రాజులు-రాణులు పోయారు. బ్రిటిష్‌ రాజ్యమైతే చేతులూ మారింది. కానీ, జోనాథన్‌ మాత్రం వాడి స్వేచ్ఛా జీవితాన్ని స్వేచ్ఛగా ఆస్వాదిస్తూ ఉన్నాడు.

► ఇంకా వాడు ఎక్కువ కాలం బతకాలన్నది సెయింట్‌ హెలెనా అధికారుల కోరిక. ఒకవేళ.. వయసురిత్యా సమస్యలతో కన్నుమూసినా.. దాని పైడొప్పను భద్రంగా పదిలపరుస్తామని అధికారులు చెప్తున్నారు.

:::వెబ్‌డెస్క్‌

ఇదీ చదవండి: రష్యాకు లక్ష, మాకు 13 వేలు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement