
తాబేలు ఆకారంలో ఉన్న ఆలుగడ్డ
నెన్నెల: మండల కేంద్రంలోని వడ్లవాడకు చెందిన మోసీన్ అనే కారు డ్రైవర్ ఇంట్లో అ చ్చం తాబేలు ఆకారంలో ఉన్న ఆలుగడ్డ చూపరును ఆకట్టుకుంటుంది. పది రోజుల క్రితం దుకాణంలో రెండు కిలోల ఆలుగడ్డలు తీసుకొచ్చి ఇంట్లో ఉంచామని అందులో కొన్ని ఆలుగడ్డలు మొలకెత్తాయి. ఒక ఆలుగడ్డ మాత్రం తాబేలు ఆకారంలో కనిపించిందని మోసీన్ తెలిపారు. ఆలుగడ్డకు ముందు భాగంలో తలలాగా ఒక పిలక, వెనుక భాగంలో ఇరువైపుల రెండు పిలకలు, మధ్య భాగంలో కాళ్ల వలె రెండు పిలకలు వచ్చాయని అన్నారు. దీంతో ఆలుగడ్డ అచ్చం తాబేలులా కనిపిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment