ఇప్పుడు... ఫోన్ ఉన్న చోట ఫొటోగ్రఫీ ఉంది. అలా అని ‘టిక్’ అని నొక్కగానే సరిపోదు.మార్పులు, చేర్పులు చేసి ‘మహా అద్భుతం’ అనిపించాలి కదా! ‘మరింత బాగా సొగసులు అద్దాలి’ అని ఆశించే వారి కోసం అప్‌డేట్‌లతో ముందుకు వచ్చింది అడోబ్ ఫొటోషాప్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్... క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్లను మూడు దశాబ్దాలకు పైగా అలరిస్తోంది అడోబ్. రస్టర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్‌లోనే కాదు, డిజిటల్ ఆర్ట్‌లోనూ ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా నిలిచింది. పెన్‌టూల్, క్లోన్ స్టాంప్ టూల్, షేప్ టూల్,కలర్ రిప్లేస్‌మెంట్‌టూల్... మొదలైన టూల్స్‌తో ఆకట్టుకుంటూనే ఉంది.
ఇక అప్‌డేట్ (ఐపాడ్ వెర్షన్) విషయానికి వస్తే...
పెర్‌ఫెక్షన్ సరిగ్గా లేని ఇమేజ్‌లను సరిదిద్దడానికి ఫొటోషాప్ టూల్‌బాక్స్‌లోని ‘హీలింగ్ బ్రష్’ పరిచితమే. ఇప్పుడు ఇది ఐపాడ్ వెర్షన్‌కు వచ్చేసింది. డెస్క్‌టాప్ వెర్షన్‌కు తీసిపోని విధంగా ఉంటుంది. లైటింగ్, టెక్చర్,షేడింగ్...మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్ వెర్షన్‌లోని ఆల్‌సెట్టింగ్స్ ఇందులో ఉంటాయి.
మోస్ట్ రిక్వెస్టెడ్ టూల్‌గా చెప్పుకునే
‘మ్యాజిక్ వాండ్’తో ఏంచేయవచ్చు?
క్రమరహిత రూపాలు(ఇర్రెగ్యులర్ షేప్స్), ప్లాట్‌బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లలోని అబ్జెట్స్ లేదా ఏరియాలను టోన్, కలర్ ఆధారంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ సెలక్షన్, రిఫైన్ ఎడ్జ్‌టూల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేస్తాయి.ఇక డెస్క్‌టాప్ వెర్షన్‌కి వస్తే స్కైరీప్లెస్‌మెంట్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ అనే టూల్ వచ్చింది. నైట్‌సీన్స్, ఫైర్‌వర్క్స్, సూర్యాస్తమయం... ఇలా హై క్వాలిటీతో కూడిన 5000 రకాల ‘స్కై’లను ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
కాస్త సరదాగా.... ఇంకాస్త ప్రొఫెషనల్‌గా!
‘ఫొటోషాప్’తో గేమ్స్ అనేది మీ సరదాకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. మీరు గట్టిగా కృషి చేస్తే ప్రొషెషనల్ గ్రాఫిక్ డిజైనర్ స్థాయిని చేరుకోవడం కష్టమేమీ కాదు. మార్కెటింగ్, బ్రాండింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్ చేయి తిరిగిన గ్రాఫిక్ డిజైనర్లను కోరుకుంటున్నాయి. చేయి తిరగాలంటే కంటికి పని కనిపించాలి. అనగా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడూ స్టడీ చేస్తుండాలి. ట్రెండింగ్ ఆర్ట్ మూమెంట్స్, డిజైనింగ్ స్ట్రాటజీలు, కస్టమర్ ప్రాధాన్యతల గురించి తెలుసుకుంటూ ఉండాలి.
ఉరుము లేదు మెరుపు లేదు...ఉత్త మాయ!
యూకే నుంచి యూఎస్‌కు వచ్చి స్థిరపడిన జేమ్స్ ఫ్రిడ్‌మన్ తన క్రియేటివ్ ఫొటోషాప్ స్కిల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జేమ్స్‌కు 2 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. ‘హాయ్ జేమ్స్! నా ఫొటోను మార్చి చూపించవా’ అని అడిగితే చాలు ‘ఇది నా ఫొటోనా!’ అనేంత భారీ ఆశ్చర్యాన్ని కళ్లకు ఇస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment