Photoshop
-
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
ఫోటోషాప్ జిమ్మిక్కులు మామూలుగా ఉండవు. టెక్నాలజీమీద పట్టు ఉంటే చాలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించవచ్చు. అలాంటి వారిలో జేమ్స్ అనే ఫోటోషాపర్ది అందె వేసిన చేయి. ఆయన కొంచెం చమత్కారి కూడా. మన ఆర్టిస్టు మోహన్‌లా...ఫోటోషాప్‌లో కనికట్టు చేయడంలో చాలా ఫేమస్.అందుకే జేమ్స్‌కు రోజూ కొన్ని రిక్వెస్ట్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. మా ఫోటో కొంచెం ఎడిట్ చేసి ఇవ్వొచ్చు కదా అని అడుగుతారు. జేమ్స్ ఇచ్చే ట్విస్ట్‌కి ఎలాంటి వారైనా ఫిదా కావాల్సిందే. ఒరిజనల్ ఫోటో చూసేదాకా అది ఎడిట్ చేసిన ఫోటో అని ఎవరూ గుర్తుపట్టలేనంత. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే మచ్చుకు కొన్ని మీరే చూడండి.Some Hilarious Photoshop Requests that will make your day😂😂A Thread 🧵😂 pic.twitter.com/DpZi3krCrH— ✨🤍 (@Phillipong3) May 7, 2024 -
బిల్‌గేట్స్‌తో ఫొటో.. బిల్డప్‌కు పోయి నవ్వులపాలయ్యాడు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. బిల్డప్ కొట్టేందుకు బిల్‌గేట్స్‌తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేయగా.. అందులోని ఓ పాయింట్‌తో పాక్ ప్రధానిని ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్‌గేట్స్.. తాజాగా పాక్‌లో పర్యటించారు(ఆయన పాక్‌లో పర్యటించడం ఇదే ఫస్ట్ టైం). ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తన కేబినెట్లోని మంత్రులు, కీలక విభాగాధిపతులతో కలిసి బిల్‌గేట్స్‌తో లంచ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను పాక్ పీఎంవో ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే అందులో అంతా ఓ వ్యక్తి వైపు తిరగ్గా.. అక్కడ ఎవరూ లేకపోవడం ఫొటోకి హైలెట్ అయ్యింది. పాక్ న్యూస్ ఏజెన్సీ ది కరెంట్ కథనం ప్రకారం.. అక్కడ ఉంది ఐఎస్ఐ(Inter-Services Intelligence) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్. అతన్ని ఫొటోగానీ, వీడియోలు తీయడానికి ఇంటెలిజెన్స్ సర్వీస్ అంగీకరించదు. ఒక్కపక్క నదీమ్ ఐడెంటిటీని రివీల్ చేయడం ఇష్టం లేని పాక్ ప్రభుత్వం.. మరోపక్క బిల్‌గేట్స్‌తో ఉన్న ఫొటోను ఎలాగైనా షేర్ చేయాలని ఉవ్విళ్లూరింది. తద్వారా పాక్ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రతిపక్షాలకు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఫొటో షాప్‌లో ఐఎస్ఐ చీఫ్ ఫొటోను ఎగరకొట్టేయడం, అందరూ నదీమ్ వైపే చూస్తుండడంతో.. ఈ ఫొటో వంకతో ఇమ్రాన్ ఇజ్జత్ తీసేస్తున్నారు పాక్ నెటిజన్లు. Prime Minister @ImranKhanPTI's luncheon in honor of @BillGates Mr. Bill Gates is visiting Pakistan at the special invitation of the Prime Minister. pic.twitter.com/zSYNI6ddki — Prime Minister's Office, Pakistan (@PakPMO) February 17, 2022 గత అక్టోబర్‌లో నదీమ్.. ఐఎస్ఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ఆర్మీ మీడియా వింగ్ మొదట నదీమ్ పేరును ప్రకటించింది. ఆ తర్వాతే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఖాన్ పాలనలో మిలిటరీ జోక్యం ఎక్కువైందని, ఫారిన్-మిలిటరీ పాలసీలను సైతం ప్రభావితం చేస్తున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. చదవండి: ఇమ్రాన్‌ఖాన్ ది ఇంటర్నేషనల్ బెగ్గర్ -
పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..
Astrophotographer Andrew McCarthy Sun Photo: సుడులు తిరుగుతున్న లావాలా ఉన్న అగ్నిగోళం ఉపరితలం... పసుపు, ఎరుపు కలగలిసిన ఈకలను తలపిస్తున్న భానుడి భగభగలు... అక్కడక్కడా నల్లటి చుక్కలు... సూర్యుడిని అతి సమీపం నుంచి చూస్తున్నట్టుగా ఉన్నది కదూ! ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని ఆస్ట్రోఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్ కాతీ పట్టి బంధించాడు. నిప్పులు కక్కుతున్న ఆ నిండు సూర్యుడిని... ఓ సోలార్ ఆర్బిటార్ తీసినంత స్పష్టంగా తన కెమెరాలో కట్టిపడేసిన ఆండ్రూ... సూర్యుడిని అంత సమీపంగా, అంత అద్భుతంగా చిత్రీకరించిన మొట్టమొదటి ఫొటోగ్రాఫర్. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) ఇందుకోసం 300 మెగాపిక్సల్స్ కలిగిన కెమెరాను ఉపయోగించాడు. ఇది... సాధారణ కెమెరాకంటే 30 రెట్లు అధికం. ఒక్క పర్ఫెక్ట్ చిత్రం కోసం... ఆయన లక్షా యాభైవేల చిత్రాలను తీసి, వాటిని లేయర్ చేశాడు. నల్లటి చుక్కలను ఫొటోషాప్‌తో ఎడిటింగ్ చేశాడు. సాధారణంగా ఇలాంటివి తీస్తున్నప్పుడు మంటలు వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు కూడా పోవచ్చు. వీటిని నివారించడానికి రెండు ఫిల్టర్లు ఉన్న ప్రత్యేక టెలిస్కోప్ వాడాడు. ‘ఆకాశాన్ని ఆవిష్కరించాలనుకున్నప్పుడు అందరూ చంద్రుడినే బెంచ్‌మార్క్‌గా చూస్తారు. కానీ సూర్యుడిని క్యాప్చర్ చేయడం నన్ను ఉత్సాహపరిచే అంశం. ఎందుకంటే సూర్యుడెప్పుడూ బోర్ కొట్టడు. తీసిన ప్రతిసారీ కొత్తగా కనిపిస్తాడు’అని ఆండ్రూ చెబుతున్నాడు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) -
అడోబ్ అప్డేట్స్ అదుర్స్
ఇప్పుడు... ఫోన్ ఉన్న చోట ఫొటోగ్రఫీ ఉంది. అలా అని ‘టిక్’ అని నొక్కగానే సరిపోదు.మార్పులు, చేర్పులు చేసి ‘మహా అద్భుతం’ అనిపించాలి కదా! ‘మరింత బాగా సొగసులు అద్దాలి’ అని ఆశించే వారి కోసం అప్డేట్లతో ముందుకు వచ్చింది అడోబ్ ఫొటోషాప్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్... క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్లను మూడు దశాబ్దాలకు పైగా అలరిస్తోంది అడోబ్. రస్టర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్‌లోనే కాదు, డిజిటల్ ఆర్ట్‌లోనూ ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా నిలిచింది. పెన్టూల్, క్లోన్ స్టాంప్ టూల్, షేప్ టూల్,కలర్ రిప్లేస్మెంట్టూల్... మొదలైన టూల్స్‌తో ఆకట్టుకుంటూనే ఉంది. ఇక అప్డేట్ (ఐపాడ్ వెర్షన్) విషయానికి వస్తే... పెర్ఫెక్షన్ సరిగ్గా లేని ఇమేజ్‌లను సరిదిద్దడానికి ఫొటోషాప్ టూల్‌బాక్స్‌లోని ‘హీలింగ్ బ్రష్’ పరిచితమే. ఇప్పుడు ఇది ఐపాడ్ వెర్షన్‌కు వచ్చేసింది. డెస్క్‌టాప్ వెర్షన్‌కు తీసిపోని విధంగా ఉంటుంది. లైటింగ్, టెక్చర్,షేడింగ్...మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్ వెర్షన్‌లోని ఆల్సెట్టింగ్స్ ఇందులో ఉంటాయి. మోస్ట్ రిక్వెస్టెడ్ టూల్‌గా చెప్పుకునే ‘మ్యాజిక్ వాండ్’తో ఏంచేయవచ్చు? క్రమరహిత రూపాలు(ఇర్రెగ్యులర్ షేప్స్), ప్లాట్బ్యాక్గ్రౌండ్ ఇమేజ్‌లలోని అబ్జెట్స్ లేదా ఏరియాలను టోన్, కలర్ ఆధారంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ సెలక్షన్, రిఫైన్ ఎడ్జ్టూల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేస్తాయి.ఇక డెస్క్‌టాప్ వెర్షన్‌కి వస్తే స్కైరీప్లెస్మెంట్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ అనే టూల్ వచ్చింది. నైట్సీన్స్, ఫైర్వర్క్స్, సూర్యాస్తమయం... ఇలా హై క్వాలిటీతో కూడిన 5000 రకాల ‘స్కై’లను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాస్త సరదాగా.... ఇంకాస్త ప్రొఫెషనల్‌గా! ‘ఫొటోషాప్’తో గేమ్స్ అనేది మీ సరదాకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. మీరు గట్టిగా కృషి చేస్తే ప్రొషెషనల్ గ్రాఫిక్ డిజైనర్ స్థాయిని చేరుకోవడం కష్టమేమీ కాదు. మార్కెటింగ్, బ్రాండింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్ చేయి తిరిగిన గ్రాఫిక్ డిజైనర్లను కోరుకుంటున్నాయి. చేయి తిరగాలంటే కంటికి పని కనిపించాలి. అనగా అప్డేట్స్ను ఎప్పటికప్పుడూ స్టడీ చేస్తుండాలి. ట్రెండింగ్ ఆర్ట్ మూమెంట్స్, డిజైనింగ్ స్ట్రాటజీలు, కస్టమర్ ప్రాధాన్యతల గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఉరుము లేదు మెరుపు లేదు...ఉత్త మాయ! యూకే నుంచి యూఎస్‌కు వచ్చి స్థిరపడిన జేమ్స్ ఫ్రిడ్మన్ తన క్రియేటివ్ ఫొటోషాప్ స్కిల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జేమ్స్‌కు 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ‘హాయ్ జేమ్స్! నా ఫొటోను మార్చి చూపించవా’ అని అడిగితే చాలు ‘ఇది నా ఫొటోనా!’ అనేంత భారీ ఆశ్చర్యాన్ని కళ్లకు ఇస్తాడు. -
బెస్ట్ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఇవే!
సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఎక్కువ శాతం మంది ఫొటోగ్రఫీ మీద ఆసక్తి చూపుతున్నారు. కొందరు తమ ఫోటోని అందంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత తమ ఫోటోకి ఎన్ని లైక్స్ వచ్చాయి అని చూస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా వచినప్పటి నుండి ప్రతి ఒక్కరు ఫోటో ఎడిటింగ్ మీద ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. అలాగే కొందరు ఫోటోగ్రఫీ ద్వారా వారు కస్టమర్ దృష్టిని ఆకర్షించి వ్యాపారాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నారు. కొన్ని మంచి యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటికీ నెల నెల డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అంతే క్వాలిటీతో కొన్ని ఉచిత యాప్స్ మేము మీకు అందిస్తున్నాం.(చదవండి: 14వేలకే నోకియా 5.4 మొబైల్) 1. స్నాప్‌సీడ్: ఇది ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. మీ మొబైల్ లో దీని ద్వారా బెస్ట్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఉచితంగా లభిస్తున్న బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ లలో ఇది ఒకటి. ఇది గూగుల్ చేత తయారుచేయబడింది. ఇది డెస్క్‌టాప్ ఫోటో ఎడిటర్లలో ఉన్న ఫీచర్స్ దీనిలో లభిస్తాయి. అన్ని యాప్స్ మాదిరిగానే ఇందులో ప్రీసెట్ ఫిల్టర్లు కూడా లభిస్తాయి. దీనిలో మీరు ఈ ఫిల్టర్లను సవరించవచ్చు. క్రాపింగ్, స్ట్రెయిటెనింగ్, ఫ్రేమ్స్, టెక్స్ట్, విగ్నేట్స్ వంటి అన్ని క్లాసిక్ టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. స్నాప్సీడ్లో ప్రెసిషన్ మాస్కింగ్ ఉంది. దీని ద్వారా మీరు గతంలో ఎడిట్ చేసిన హిస్టరీ కూడా సేవ్ చేసి ఉంటుంది. కాబట్టి మీరు ఏ సమయంలోనైనా తిరిగి ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. 2. పిక్స్‌లర్: 50 మిలియన్ డౌన్లోడ్లతో ప్లే స్టోర్‌లో పిక్స్‌లర్ 4.3 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో 27ఎంబి కంటే తక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. ఈ యాప్ ఎక్కువ ఎఫెక్ట్స్ ఆడ్ చేసుకోవడంతో పాటు క్రియేటివ్ గా మీ ఫోటోలను ఎడిటింగ్ చేయవచ్చు . ఇందులో ఉన్న ముఖ్యమైన 'ఆటో-ఫిక్స్' ఫీచర్ తో యాప్ లో రంగులను అదే సర్దుబాటు చేసుకుంటుంది. దీని ద్వారా మీరు ఫోటోలను మరింత స్పష్టతతో కూడిన ఫోటోలను మీకు నచ్చినట్లు తయారు చేయవచ్చు. ఇది ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. 3. విస్కో: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతి ముఖ్యమైన ఫీచర్ వచ్చేసి క్లాసిక్-లుక్ ఫిల్టర్లు. ఇన్స్టాగ్రామ్ మాదిరిగా విస్కో కెమెరా, ఎడిటింగ్ టూల్స్, ఆన్లైన్ కమ్యూనిటీ కూడా ఉంది. ఈ ఉచిత ఫోటో యాప్ మీ ఫోటోలను అనలాగ్ ఫిల్మ్ కెమెరాలో తీసినట్లుగా కనిపించే అద్భుతమైన ఫిల్టర్ల సెట్ అందిస్తుంది. భారీగా ఫిల్టర్ చేసిన ఇన్స్టాగ్రామ్ ప్రీసెట్‌లతో పోలిస్తే మీ ఫోటోలకు క్లాస్ టచ్ ఇస్తాయి. మరియు మీరు వీటిని సాధారణ స్లైడర్ ద్వారా కూడా సర్దుబాటు చేయవచ్చు. అన్ని ఫోటో ఎడిటింగ్ యాప్స్ మాదిరిగానే ఇందులో క్రాపింగ్, బార్డర్స్ ఉన్నాయి. ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, టెంపరేచర్ లేదా స్కిన్ టోన్లను సరి చేయడానికి మీరు విస్కోను కూడా ఉపయోగించవచ్చు. 4. ప్రిస్మా ఫోటో ఎడిటర్: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైన ఫీచర్ వచ్చేసి మీ ఫోటోలను కళాత్మకంగా “పెయింటింగ్స్”, “డ్రాయింగ్లు” గా మార్చుకోవడం. ఈ ఉచిత ఫోటో ఎడిటింగ్ యాప్ కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంది. ఇది “పికాసో, మంచ్ లేదా సాల్వడార్ డాలీ చిత్రించినట్లుగా ఫోటోలను ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనిలో 500 కంటే ఎక్కువ సంఖ్యలో క్రియేటివ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ప్రిస్మాకు ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే ఆన్లైన్ కమ్యూనిటీ కూడా ఉంది. కాబట్టి, మీరు ఎడిటింగ్ పూర్తి చేసిన తర్వాత మీరు మీ చిత్రాన్ని మీ ప్రిస్మా ఫీడ్‌లో షేర్ చేయవచ్చు. 5. అడోబ్ ఫోటోషాప్ ఎక్స్‌ప్రెస్: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైన ఫీచర్ వచ్చేసి ఆల్‌రౌండ్ ఫోటో ఎడిటింగ్. మీరు లాప్టాప్ లేదా డెస్క్ టాప్ లో ఏ విదంగా ఫోటో ఎడిటింగ్ చేసుకుంటారో అదేవిదంగా ఇందులో చేసుకోవచ్చు. దీనిని మొబైల్ లో సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో అడోబ్ ఫోటోషాప్ లో ఉన్న ఫీచర్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. 6. కాన్వా: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైనది వచ్చేసి వ్యాపారానికి సంబందించిన బ్రాండెడ్ ఫోటోలను సులువుగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. కాన్వా యాప్ బెస్ట్ ఫ్రీ ఎడిటింగ్ యాప్స్ లో ఒకటి. దీనిలో ఫోటో ఎడిటింగ్ మాత్రమే కాదు వెబ్సైట్, మార్కెటింగ్ వంటి సంబందించిన ఫోటోలను కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అందుకే చాలా మల్టీ యూజ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో 50,000 ఫ్రీ టెంపల్ట్స్ ఉన్నాయి. మంచి విజువల్స్ తో పోస్టర్లు తయారుచేయవచ్చు. -
చొక్కా లేకుండా కండలు చూపుతూ.. ట్వీట్!
వాషింగ్టన్: తన ఆరోగ్యంపై వదంతులు వస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన ట్విటర్లో ఒక అరుదైన ఫొటోను పోస్ట్ చేశారు. చొక్కా లేకుండా కండలు తిరిగిన బాక్సర్ దేహంతో ఫొటోషాప్ చేసిన తన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. గత శనివారం ట్రంప్ ఆకస్మికంగా వాషింగ్టన్ బయట ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్ తాను ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉన్నానని చాటేందుకు, వదంతులకు చెక్ పెట్టేందుకు ఈ ఫొటోషాప్ ఫొటోను ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు. మంచి దిట్టమైన కండలతో కూడిన బాక్సర్ బాడీకి ట్రంప్ మొఖాన్ని సూపర్ఇంపోజ్ చేసి ఈ ఫొటోను రూపొందించారు. సిల్వెస్టర్ స్టాలోన్ సినిమా ‘రాకీ 3’ పోస్టర్లో వాడిన ఛాతిభాగాన్ని ఈ ఫొటోలో ఫొటోషాప్ కోసం వాడారు. ఈ కండులు తిరిగిన దేహంపై 73 ఏళ్ల ట్రంప్ ముఖాన్ని ఒకింత బ్యూటీఫై చేసి అటాచ్ చేశారు. తన శారీరక దారుఢ్యం గురించి చెప్పేందుకు ట్రంప్ ఏనాడూ సిగ్గుపడింది లేదు. ఇతర వ్యక్తుల శారీరక ఆకృతి గురించి పొగుడుతూనే, వ్యంగ్యంగానే ఆయన అధికారిక కార్యక్రమాల్లో వ్యాఖ్యలు చేసేవారు. గత మంగళవారం ఫ్లోరిడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. మీడియా తీరుపై మండిపడ్డారు. తనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ ప్రధాన మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నా బాడీ నా ఇష్టం.. మీకెందుకు?
లండన్: తన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బ్రిటన్‌కు చెందిన టీవీ యాంకర్ స్టేసీ సోలోమన్(28) తీవ్రంగా స్పందించారు. తన బికినీ ఫొటోలను మార్ఫింగ్ ఎందుకు చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రశ్నించారు. అసలు వివాదం ఏంటంటే.. ఇటీవల ఓ మ్యాగజీన్ కవర్ పేజీ కోసం స్టేసీ సోలోమన్ బికినీ ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు మ్యాగజీన్‌పై దర్శనమిచ్చాయి. కొన్ని రోజుల తర్వాత తన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఆమె గుర్తించారు. నా ఫొటోలు ఎడిటింగ్, మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ గళమెత్తారు. తాను దిగిన ఫొటోతో పాటు ఫొటోషాప్ చేసిన ఫొటోలను జతచేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు పోస్టులు చేశారు. ఆమెకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఎంతో సహజంగా కనిపిస్తున్న తన అందాన్ని ఫొటోషాప్‌తో సహజత్వం కోల్పోయేలా చేశారన్నారు. బొద్దుగా ఉన్న మడతలను, లావుగా ఉన్న నడుము కొలతను కొందరు ఉద్దేశపూర్వకంగానే ఎడిట్ చేశారని వెల్లడించారు. ఇలాంటి ఎడిటింగ్ ఫొటోలు పోస్ట్ చేయడం.. నన్ను సన్నగా, మీకు ఇష్టం వచ్చినట్లుగా శరీరాకృతిని కాపాడుకోవాలని సూచించడంతో పాటు అవహేళన చేయడమేనని స్టేసీ సోలోమన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని చేసినా తాను తనలాగే ఉండాలనుకుంటున్నట్లు చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ఒక్క అడుగు దూరంలో...
ఇంకొక్క అడుగు పడితే వెండితెరపై మరోసారి యువరాణిగా కనిపించే అవకాశం హన్సికనే వరిస్తుందని చెన్నై సినిమా జనాలు అంటున్నారు. ఆల్రెడీ ‘పులి’లో హన్సిక యువరాణిగా నటించారు. తాజాగా తమిళ దర్శకుడు సుందర్ సి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించనున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ ఫిల్మ్ ‘సంఘమిత్ర’లో హన్సిక టైటిల్ రోల్ చేసే ఛాన్సుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దర్శక–నిర్మాతలు ‘సంఘమిత్ర’గా ఎవర్నీ ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. తాజా ఖబర్ ఏంటంటే... ఇటీవల హన్సికకు లుక్ టెస్ట్ జరిగిందట! ‘సంఘమిత్ర’గా ఆమె ఎలా ఉంటుందోనని చెన్నైలోని బిన్నీ మిల్స్‌లో ఫొటోషూట్ చేశారట. దర్శక, నిర్మాతలు హన్సిక లుక్ పట్ల హ్యాపీ అయితే... ఆమె నెక్స్›్ట స్టెప్ సినిమాకు సైన్ చేయడమే. దర్శకుడు సుందర్. సీకి హన్సిక లక్కీ మస్కట్. వీళ్లిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. సో, ‘సంఘమిత్ర’లో హాన్సిక ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినట్లేనని చెన్నై టాక్!! -
సేమ్ టు ఫేమ్
సేమ్ గర్ల్. డిఫరెంట్ లుక్స్.. సూపర్ డూపర్ ఫేమ్! అందానికి నిజమైన నిర్వచనం ఏమిటి? బ్యూటీ అంటే ప్రపంచంలో ఎవడి కొలతలు వాడివే. ఒక్కో కల్చర్దీ ఒక్కో లెక్క. ప్రతి లెక్కకీ ఓ మేకోవర్ ఉంటుంది. అదేమిటో కనుక్కోవాలని ఎస్తర్ హోనిగ్ అనే అమెరికన్ ముద్దుగుమ్మ బయలుదేరింది. ప్రపంచంలోని వివిధ దేశాలకీ తన ఫోటో పంపించి, వారి వారి సాంస్కృతిక నేపథ్యం ప్రకారం అందగత్తె ఎలా ఉండాలో ఫోటోషాప్ చేయమంది. ఆ ఫోటోషాప్ చిత్రాలలో కొన్నింటిని మీరూ వీక్షించండి. ఈ పోస్టును ఇప్పటికే 22,72,569 మంది షేర్ చేశారు. ఇప్పుడు వారాన్ని ఎలాగోలా నెట్టుకురానవసరం లేదు. నెట్టుందిగా.... అదే ఇంటర్ నెట్టుందిగా! ఇంటర్నెట్తో పిడికిట్లో ప్రపంచం. వేలి కొసలపై విశ్వబ్రహ్మాండం!! ఇందులో శృంగారం తీపి, వెటకారం వగరు, చిలిపితనపు పులుపు, అహంకారం కారం ... ఇలా అన్ని టేస్టులూ ఉంటాయి. ఏ ట్వీట్ ఎందుకు అందర్నీ బీట్ చేసింది? ఏ షేర్ ఫేస్ బుక్ షేర్ మార్కెట్‌ను దడదడలాడించింది? ఏ వార్తపై కామెంట్ల కనకవర్షం కురిసింది? ఏ ఫోటోపై ఎన్ని లైకులు వచ్చాయి? ఆన్లైన్లో ట్రెండ్స్... అలా గత ఏడు రోజుల్లో వైరల్ అయిపోయిన టాప్ ట్రెండింగ్ పోస్టులేమిటి? వేలి కొసలకు వైరల్ ఫీవర్ తెప్పించిన బెస్టు బెస్టు పోస్టులేమిటి? చూద్దాం. మురికి వాడల ముత్యం ముంబాయి మురికివాడల్లో ఉండే ఓ పదిహేనేళ్ల అమ్మాయిని బీహార్ తీసుకెళ్లి ఇద్దరు పిల్లల తండ్రికి రెండో పెళ్లాంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ అమ్మాయి ఒంటరిగానే పోరాడింది. ఆఖరికి హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే స్వచ్ఛంద సంస్థ ఆ అమ్మాయికి తోడు నిలిచింది. ఈ అమ్మాయి కథ ఇప్పుడు ఇంటర్నెట్‌ని ఏలుతోంది. 62575 లైక్‌లు, 1365 కామెంట్లు, 4846 షేర్ల్లు ఈ అమ్మాయి కథను ఇంటర్నెట్ ద్వారా ఇంటింటికీ తీసుకెళ్లాయి. ఆమెకి నెట్ జగత్తు బాసటగా నిలిచింది. ఇంతకీ ఈ అమ్మాయి పేరేమిటి? పేరు బయటికి రాలేదు. ఏం? ‘ముత్యం’ అన్న పేరు బాలేదా? నగ్న సత్యం కిమ్ కర్దషియాన్. ఆమె సోషల్ మీడియా సామ్రాజ్ఞి. ప్రతిరోజూ పతాక శీర్షికలో ఉండటం ఎలాగో తెలిసిన వ్యక్తి. ఈ మధ్య తాను గర్భవతినని ఆమె పోస్టు చేశారు. అయితే ఆమెది ఫేక్ ప్రెగ్నన్సీ అని కొందరు విమర్శించడం మొదలుపెట్టారు. దాంతో ఆమెకి కోపం వచ్చింది. నిజమేమిటో చెబుతాను చూడండి అని ప్రతి సవాలు విసిరింది. ఆమె ఏదో మెడికల్ రిపోర్టులు నెట్లో పెడుతుందనుకున్నారు. కానీ కిమ్ తనదైన శైలిలో నగ్నంగా ఫోటోదిగి దాన్ని సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. చూసుకోండెహె అని సవాలు విసిరింది. ఈ నగ్నసత్యంతో కిమ్మమ్మ అందరినీ కిమ్మనకుండా చేసేసింది. పన్నెండేళ్ల ప్రసవ వేదన! అయ్యవారి పేరు లెన్నార్ట్ నిల్సన్. ఆయన ఓ పుష్కరకాలం పాటు చేస్తున్నది ఒకే ఒక్క పని. ఒక వీర్యకణం, అండానికి ఎలా కన్ను గీటుతుంది. ఆ రెండూ ఎలా లవ్వాడుకుంటాయి. ఆ లవ్వుకి ఫలితంగా పిండం ఎలా పుడుతుంది. ఆ పిండం బ్రహ్మాండంగా ఎదిగి ఓ బుడ్డోడు/బుడ్డది ఎలా తయారవుతారు - ఇదే ఆ ఫోటోగ్రాఫర్ గారి పరిశోధనాంశం. ఆయన ఓ తల్లి గర్భాన్నే తన ఫోటో స్టూడియోగా మార్చేసుకున్నాడు. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపుని ఎండోస్కోపీ ద్వారా ప్రవేశపెట్టి పన్నెండేళ్లుగా ఫోటోలు తీస్త్తూనే ఉన్నాడు. ఆ ఫోటోలను నెట్లో ఎగ్జిబిషన్ పెడితే ఇక చూడండి షేర్లే షేర్ల్లు. లైకులే లైకులు. అసలు లెన్నార్ట్ నిల్సన్ గారి వెబ్ సైట్ ని ఒకసారి విజిట్ చేస్తే సృష్టిమూలమైన సూక్ష్మచిత్రం మీ కళ్ల ముందుంటుంది. వెక్కిరింతలు వేయి రకాలు! ఎదుటి మనిషికి కోపం తెప్పించాలంటే ఏం చేయాలి? వెక్కిరించాలి. వెవ్వెవ్వె అనాలి. అంతే కోపం తన్నుకువచ్చేస్తుంది. అలా కోపం తెప్పించే 26 వెక్కిరింత పద్ధతులను ఒకేచోట మన సౌకర్యం కోసం పోగు చేశారు రచయిత అంకుశ బహుగుణ. మెన్ ఎక్స్పీలోని ఈ కథనం పట్టుమని పది రోజుల్లో పేస్‌బుక్‌లో 15 వేలు, ట్విట్టర్లో 13 వేలు, గూగుల్ హాంగౌట్లో దాదాపు మూడు వేల మంది షేర్ చేశారు. ఈ షేర్‌ఖాన్‌ను మీరూ చూడాలంటే http://www.mensxp.com/special&features/today/27099&26&most&hilarious&ways&to&insult&someone.htmని క్లిక్ చేయండి. ఓ మై గాడెస్! ఓ మై గాడ్ సినిమా చూశారా? అందులో ఓ ఫ్యాషనబుల్ సన్యాసిని లిప్ స్టిక్ పెదాలతో పరమపదం గురించి చెబుతుంది. అదిగో ... సరిగ్గా అలాంటి సన్యాసినే మన సుఖ్విందర్ కౌర్ ఉరఫ్ రాధే మా! ఆమెను పూజించదలచుకున్న భక్తుడు ఆమెను ఎత్తుకోవాల్సిందే. ఆలింగనమే ఆమె ఇచ్చే ఆశీర్వాదం. ఆకలేస్తే అన్నం పెట్టాల్సిన రాధే మా మూడొస్తే ముద్దులు పెట్టేలా ఉన్న ఫోటోలు, దానిపై ట్విట్టర్లో జోకులు, కేకలు వైరల్ ఫీవర్లా వ్యాపిస్తున్నాయి. -
అందంగా లేనా..?
చూసే కంటిని బట్టే అందం ఉంటుందంటారు. విభిన్న జాతులు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన ఈ ప్రపంచంలో ఏది అందమో ఎలా చెప్పగలం? మేకప్, ఫొటోషాప్‌లు అందానికి మరిన్ని మెరుగులు దిద్దే సాధానాలుగానే కాక.. ఆ అందాన్నే సృష్టించే స్థాయికి చేరిన తరుణంలో అందాన్ని కొలిచే కొలబద్ధ లేదా ఓ ప్రమాణం ఏదైనా ఉందా? అంటే సమాధానం చెప్పడం కష్టమే. కానీ ఇవే ప్రశ్నలతో ఎస్తేర్ హోనిగ్ అనే జర్నలిస్టు ‘బిఫోర్ అండ్ ఆఫ్టర్’(ముందు-తర్వాత) అనే ఓ శోధనా ప్రాజెక్టు చేపట్టింది. అందానికి కొలబద్ధలు దేశదేశానికీ ఎలా మారిపోతాయో తెలుసుకోవడానికి.. 25 దేశాల్లోని 40 మంది ఫొటోషాప్ నిపుణులను సంప్రదించింది. ‘నన్ను అందంగా తయారు చేయండి’ అంటూ తన ఫొటో పంపింది. వచ్చిన ఫొటోలు చూసి ఆశ్చర్యపోవడం ఆ అమ్మడి వంతైంది. ప్రతి ఫోటోషాప్ నిపుణుడూ తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆమె ఫొటోకు నగిషీలు చెక్కి అందంగా తయారుచేసి పంపించారు. మరి ఈ ఫొటోల్లో ఎవరు అందగత్తె అంటే ఎలా చెప్పగలం?