సేమ్ టు ఫేమ్ | same to same | Sakshi
Sakshi News home page

సేమ్ టు ఫేమ్

Published Sun, Aug 16 2015 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

సేమ్ టు ఫేమ్

సేమ్ టు ఫేమ్

సేమ్ గర్ల్. డిఫరెంట్ లుక్స్..
సూపర్ డూపర్ ఫేమ్!

అందానికి నిజమైన నిర్వచనం ఏమిటి? బ్యూటీ అంటే ప్రపంచంలో ఎవడి కొలతలు వాడివే. ఒక్కో కల్చర్‌దీ ఒక్కో లెక్క. ప్రతి లెక్కకీ ఓ మేకోవర్ ఉంటుంది. అదేమిటో కనుక్కోవాలని ఎస్తర్ హోనిగ్ అనే అమెరికన్ ముద్దుగుమ్మ బయలుదేరింది. ప్రపంచంలోని వివిధ దేశాలకీ తన ఫోటో పంపించి, వారి వారి సాంస్కృతిక నేపథ్యం ప్రకారం అందగత్తె ఎలా ఉండాలో ఫోటోషాప్ చేయమంది. ఆ ఫోటోషాప్ చిత్రాలలో కొన్నింటిని మీరూ వీక్షించండి. ఈ పోస్టును ఇప్పటికే 22,72,569 మంది షేర్ చేశారు.
 
ఇప్పుడు వారాన్ని ఎలాగోలా నెట్టుకురానవసరం లేదు. నెట్టుందిగా.... అదే ఇంటర్ నెట్టుందిగా! ఇంటర్‌నెట్‌తో పిడికిట్లో ప్రపంచం. వేలి కొసలపై విశ్వబ్రహ్మాండం!! ఇందులో శృంగారం తీపి, వెటకారం వగరు, చిలిపితనపు పులుపు, అహంకారం కారం ... ఇలా అన్ని టేస్టులూ ఉంటాయి. ఏ ట్వీట్ ఎందుకు అందర్నీ బీట్ చేసింది? ఏ షేర్ ఫేస్ బుక్ షేర్ మార్కెట్‌ను దడదడలాడించింది? ఏ వార్తపై కామెంట్ల కనకవర్షం కురిసింది?

ఏ ఫోటోపై ఎన్ని లైకులు వచ్చాయి? ఆన్‌లైన్‌లో ట్రెండ్స్...   అలా గత ఏడు రోజుల్లో వైరల్ అయిపోయిన టాప్ ట్రెండింగ్ పోస్టులేమిటి?  వేలి కొసలకు వైరల్ ఫీవర్ తెప్పించిన బెస్టు బెస్టు పోస్టులేమిటి? చూద్దాం.
 
మురికి వాడల ముత్యం

 ముంబాయి మురికివాడల్లో ఉండే ఓ పదిహేనేళ్ల అమ్మాయిని బీహార్ తీసుకెళ్లి ఇద్దరు పిల్లల తండ్రికి రెండో పెళ్లాంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ అమ్మాయి ఒంటరిగానే పోరాడింది. ఆఖరికి హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే స్వచ్ఛంద సంస్థ ఆ అమ్మాయికి తోడు నిలిచింది. ఈ అమ్మాయి కథ ఇప్పుడు ఇంటర్‌నెట్‌ని ఏలుతోంది. 62575 లైక్‌లు, 1365 కామెంట్లు, 4846 షేర్ల్లు ఈ అమ్మాయి కథను ఇంటర్‌నెట్ ద్వారా ఇంటింటికీ తీసుకెళ్లాయి. ఆమెకి నెట్ జగత్తు బాసటగా నిలిచింది. ఇంతకీ ఈ అమ్మాయి పేరేమిటి? పేరు బయటికి రాలేదు. ఏం? ‘ముత్యం’ అన్న పేరు బాలేదా?
 
నగ్న సత్యం
కిమ్ కర్దషియాన్. ఆమె సోషల్ మీడియా సామ్రాజ్ఞి. ప్రతిరోజూ పతాక శీర్షికలో ఉండటం ఎలాగో తెలిసిన వ్యక్తి. ఈ మధ్య తాను గర్భవతినని ఆమె పోస్టు చేశారు. అయితే ఆమెది ఫేక్ ప్రెగ్నన్సీ అని కొందరు విమర్శించడం మొదలుపెట్టారు. దాంతో ఆమెకి కోపం వచ్చింది. నిజమేమిటో చెబుతాను చూడండి అని ప్రతి సవాలు విసిరింది. ఆమె ఏదో మెడికల్ రిపోర్టులు నెట్‌లో పెడుతుందనుకున్నారు. కానీ కిమ్ తనదైన శైలిలో నగ్నంగా ఫోటోదిగి దాన్ని సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. చూసుకోండెహె అని సవాలు విసిరింది. ఈ నగ్నసత్యంతో కిమ్మమ్మ అందరినీ కిమ్మనకుండా చేసేసింది.
 
 పన్నెండేళ్ల ప్రసవ వేదన!
 అయ్యవారి పేరు లెన్నార్ట్ నిల్సన్. ఆయన ఓ పుష్కరకాలం పాటు  చేస్తున్నది ఒకే ఒక్క పని. ఒక వీర్యకణం, అండానికి ఎలా కన్ను గీటుతుంది. ఆ రెండూ ఎలా లవ్వాడుకుంటాయి. ఆ లవ్వుకి ఫలితంగా పిండం ఎలా పుడుతుంది. ఆ పిండం బ్రహ్మాండంగా ఎదిగి ఓ బుడ్డోడు/బుడ్డది ఎలా తయారవుతారు - ఇదే ఆ ఫోటోగ్రాఫర్ గారి పరిశోధనాంశం. ఆయన ఓ తల్లి గర్భాన్నే తన ఫోటో స్టూడియోగా మార్చేసుకున్నాడు. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపుని ఎండోస్కోపీ ద్వారా ప్రవేశపెట్టి పన్నెండేళ్లుగా ఫోటోలు తీస్త్తూనే ఉన్నాడు. ఆ ఫోటోలను నెట్‌లో ఎగ్జిబిషన్ పెడితే ఇక చూడండి షేర్లే షేర్ల్లు. లైకులే లైకులు. అసలు లెన్నార్ట్ నిల్సన్ గారి వెబ్ సైట్  ని ఒకసారి విజిట్ చేస్తే సృష్టిమూలమైన సూక్ష్మచిత్రం మీ కళ్ల ముందుంటుంది.
 
 వెక్కిరింతలు వేయి రకాలు!
 ఎదుటి మనిషికి కోపం తెప్పించాలంటే ఏం చేయాలి? వెక్కిరించాలి. వెవ్వెవ్వె అనాలి. అంతే కోపం తన్నుకువచ్చేస్తుంది. అలా కోపం తెప్పించే 26 వెక్కిరింత పద్ధతులను ఒకేచోట మన సౌకర్యం కోసం పోగు చేశారు రచయిత అంకుశ బహుగుణ. మెన్ ఎక్స్‌పీలోని ఈ కథనం పట్టుమని పది రోజుల్లో పేస్‌బుక్‌లో 15 వేలు, ట్విట్టర్‌లో 13 వేలు, గూగుల్ హాంగౌట్‌లో దాదాపు మూడు వేల మంది షేర్ చేశారు. ఈ షేర్‌ఖాన్‌ను మీరూ చూడాలంటే http://www.mensxp.com/special&features/today/27099&26&most&hilarious&ways&to&insult&someone.htmని క్లిక్ చేయండి.
 
 ఓ మై గాడెస్!
 ఓ మై గాడ్ సినిమా చూశారా? అందులో ఓ ఫ్యాషనబుల్ సన్యాసిని లిప్ స్టిక్ పెదాలతో పరమపదం గురించి చెబుతుంది. అదిగో ... సరిగ్గా అలాంటి సన్యాసినే మన సుఖ్విందర్ కౌర్ ఉరఫ్ రాధే మా! ఆమెను పూజించదలచుకున్న భక్తుడు ఆమెను ఎత్తుకోవాల్సిందే. ఆలింగనమే ఆమె ఇచ్చే ఆశీర్వాదం. ఆకలేస్తే అన్నం పెట్టాల్సిన రాధే మా మూడొస్తే ముద్దులు పెట్టేలా ఉన్న ఫోటోలు, దానిపై ట్విట్టర్‌లో జోకులు, కేకలు వైరల్ ఫీవర్‌లా వ్యాపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement