
వయసు పెరిగే కొద్ది, చర్మంలో చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, గీతలు, ముడతలు అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి సమస్యకు చెక్ పెడుతుంది ఈ ‘ఐ రీజెనరేటింగ్ టూల్’. దీన్ని వినియోగించడంతో కళ్లు మిరుమిట్లు గొలిపే అందంతో మృదువుగా మారతాయి. ముఖం యవ్వనకాంతితో మెరుస్తుంది.
ముందుగా కళ్ల కింద చర్మానికి అనువైన క్రీమ్స్, సీరమ్స్ అప్లై చేసుకుని, అనంతరం ఈ డివైస్ సాయంతో మసాజ్ చేసుకోవాలి. కేవలం క్రీమ్ అప్లై చేసి వదిలేయడానికీ, క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఈ టూల్‌తో మసాజ్ చేయడానికీ తేడా స్పష్టంగా కనిపిస్తోందని, ఈ టూల్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తోందని చాలా మంది వినియోగదారులు రివ్యూస్ ఇస్తుండటంతో ఇలాంటి పరికరాలకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది.
ఈ పరికరంతో క్రీమ్ లేదా సీరమ్‌ను కంటి కింద అప్లై చేసుకుంటే, చర్మం 53 శాతం వేగవంతం రికవరీ అవుతోందట! నల్లటి వలయాలను 18 శాతం, పొడిబారిన చర్మం 32 శాతం, గీతలు, ముడతలు 16 శాతం తగ్గుతున్నాయని ఐ రీజెనరేటింగ్ టూల్‌ని రూపొందించిన కంపెనీ వెల్లడిస్తోంది. హె ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్‌తో, 38–42 డిగ్రీల సెల్సియస్ హీట్ థెరపీతో ఈ మసాజ్ డివైస్ పని చేస్తుంది. దీనిలోని లిఫ్టింగ్ మోడ్.. కంటి కండరాలను ఉత్తేజపరచేందుకు, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది.
ఈ మసాజ్ హెడ్ కంటికి అనువుగా, చికిత్సకు వీలుగా డబుల్–కాంటాక్ట్ ప్రాంగ్‌లతో రూపొందింది. దీని హెడ్‌పైన రెండు సెమీ–కర్‌వ్డ్ హైపోఅలెర్జెనిక్ మెటల్ ఎలక్ట్రోడ్ పోల్స్ ఉండటంతో మసాజ్ చేసుకునేటప్పుడు అవి కంటి చర్మంపై సున్నితంగా జారుతూ, మంచి ఫలితాన్ని ఇస్తాయి.
(చదవండి: మెనోపాజ్‌లో నిద్రలేమితో సతమతమవుతున్నారా..? బీకేర్‌ఫుల్..!)
Comments
Please login to add a commentAdd a comment