
బాబ్బాబు.. ఎలాగూ ఎత్తుకున్నారు.. ఇలాగే నన్ను మా ఇంటి దగ్గర దించేయండి ( ఫోటో : టీ రమేశ్, కడప)

నువ్వు ఎలకనెక్కితే సరిపోదు.. నీకు నచ్చిన, జనం మెచ్చిన నాయకున్ని సీఎం కుర్చీ ఎక్కించాలి.. (ఫోటో : భాషా, అనంతపురం)

బురద ఆటలో ఉన్న మజా.. అన్నా నీ వెనకాల మేమున్నాం గట్టిగా పట్టుకో! ( ఫోటో : వి రవీందర్, హైదరాబాద్)

అన్నదాత కలల పంటకు నాట్లు.. నాగరికత నడుమన రైతన్నల పాట్లు.. (ఫోటో : విజయ్‌క్రిష్ణ, అమరావతి )

ఒంటి చేత్తో కొండను మోసే హనుమయ్య.. లారీ ఎక్కినాడు చూడయ్యా.. (ఫోటో : వీరేష్, అనంతపురం)

నళ్లాలో నీళ్లు తాగితే ఆ టేస్టే వేరయ్యా.. ( ఫోటో : రామ్ గోపాల్ రెడ్డి, గుంటూరు)

బాపిరాజు గారు.. బుల్లెట్‌తో జర భద్రం మీరు.. ( ఫోటో : రామ్ గోపాల్ రెడ్డి, గుంటూరు)

సైజులో చిన్నగా ఉన్నా.. పెద్దగానే దీవిస్తాను.. రండి త్వరపడండి ( ఫోటో : కే రమేశ్ బాబు, హైదరాబాద్)

డప్పు మోత కాదు సారు.. ఎన్నికల్లో మోత మోగించాలి మీరు.. ( ఫోటో : ఎమ్ రవికుమార్, హైదరాబాద్)

ఈ సృష్టిలో పనికొచ్చేవి రెండే రెండు.. ఒకటి నేను.. రెండోది నా నెత్తి మీద సంచి ( ఫోటో : సాయి దత్తు, హైదరాబాద్)

బుజ్జి వినాయకుల బొమ్మలు.. పిల్లల బోసి నవ్వులు (ఫోటో : వేణుగోపాల్, జనగాం)

రోగం వచ్చినప్పుడు పాట్లు పడటం కాదు.. రోగం తగ్గించుకోవటానికి కూడా పాట్లు పడాలి! (ఫోటో : థశరద్ రాజ్వా, ఖమ్మం)

మనుషులుగా మమ్మల్ని తీర్చిదిద్దావు.. బొమ్మగానైనా నిన్నుతీర్చిదిద్దలేమా.. (ఫోటో : రాజు రాధారపు, ఖమ్మం)

పెట్రోల్‌తో పెట్టుకుంటే మండదా మరి! (ఫోటో : రాజు రాధారపు, ఖమ్మం)

ఏం నాయనా అట్లా చూస్తున్నావ్.. తినమంటావా? పొమ్మంటావా? (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

మీ మనుషులు సానా తెలివైనోళ్లయ్యా మట్టితో నన్ను చేసి.. లడ్డూను మాత్రం బూందీతో చేస్తారు.. ( ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

మానవ పరిణామ క్రమం.. వృక్ష జాతికి తీవ్ర పరిణామం ( ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

పదవిలో లేక పోయినా.. ఫాంలో ఉన్నామయ్యా.. స్టిక్కర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ ( ఫోటో : సుధాకర్, నాగర్ కర్నూల్)

బ్యాగులే బరువనుకుంటే.. బామ్మ ఒకతి.. ( ఫోటో : రాజ్ కుమార్, నిజామాబాద్)

బాల గణేషా.. ఇక చూడు తమాషా.. (ఫోటో : ప్రసాద్ గరగ, రాజమండ్రి)

అంబా.. నేను పెట్రోల్ తాగి పాలు ఇవ్వను కద నాయనా.. బంద్‌తో నాకు పనేంటి.. అంబా ( ఫోటో : యాకయ్య, సిద్ధిపేట్ )

సూపర్ మ్యాన్ అయినా .. హనుమాన్ ముందర బలాదూరే.. (ఫోటో : మోహన క్రిష్ణ, తిరుమల)

మనషులు చేసిన దేవుళ్ల మధ్య... దేవుడు చేసిన మనుషులు ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)

చల్తీకానాం ఘాడీ హై చమటోడిస్తే.. సీట్లే హై ( ఫోటో : కిషోర్, విజయవాడ)

కళకు పదును పెట్టారు.. కళగా ఉంది.. కరుణిస్తాడు.. ( ఫోటో : కిషోర్, విజయవాడ)

డబ్బులు సంపాదించటం కాదు.. దేనికి ఖర్చుపెట్టాలో తెలియడమే నిజమైన కళ ( ఫోటో : మను విశాల్, విజయవాడ)

అది శిక్షణ మాత్రమే తల్లి.. మరీ అంతలా శిక్షించకు.. ( ఫోటో : మను విశాల్, విజయవాడ)

ఆకాశ వీధిలో అవధులు లేని అభిమానం ( ఫోటో : మోహన్ రావ్, వైజాగ్ )

అధికారులకు అండగా గణపతి (ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)

పొద్దున్నుంచి కడుపులో అదోలా ఉంది... పొట్టను అలా గట్టిగా పట్టమాకురా ( ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

ఓట్లు ఎలా వేయాలో తెలుసుకున్నోళ్లు కాదు.. ఎవరికి వేయాలో తెలుసుకున్నోళ్లే నిజమైన ఓటర్లు (ఫోటో : యాదిరెడ్డి, వనసర్తి)