సాక్షి, న్యూఢిల్లీ : ఫీచర్ ఫోటోగ్రఫీలో పులిట్జర్ అవార్డును పొందిన ముగ్గురు భారత ఫోటో జర్నలిస్టులను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభినందించారు. ‘మీ ముగ్గురు దేశాన్ని గర్వపడేలా చేశారు’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. ఇక భారత్‌కు చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్స్ యాసిన్, చన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్ ఫీచర్ ఫోటోగ్రఫీ అవార్డుల అందుకున్న విషయం తెలిసిందే. వీరు ముగ్గురు అసోసియేటెడ్ ప్రెస్‌తో కలిసి పనిచేశారు. గతేడాది కశ్మీర్‌లో ఆర్టికల్ 370ను తొలగించిన సమయంలో జరిగిన నిరసనలను, భద్రతా దళాలు, హింసాకాండలకు చెందిన పలు చిత్రాలను వీరు తమ కెమెరాల్లో బంధించి ప్రపంచానికి చూపారు. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించినందుకు వీరికి పులిట్జర్ ఫీచర్ ఫోటోగ్రఫీ అవార్డులు వరించాయి. (ఢిల్లీలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం )
Congratulations to Indian photojournalists Dar Yasin, Mukhtar Khan and Channi Anand for winning a Pulitzer Prize for their powerful images of life in Jammu & Kashmir. You make us all proud. #Pulitzer https://t.co/A6Z4sOSyN4
— Rahul Gandhi (@RahulGandhi) May 5, 2020
దార్ యాసిన్, ముక్తార్ ఖాన్ కశ్మీర్‌కు చెందిన వ్యక్తులు కాగా ఆనంద్ మాత్రం జమ్మూలో నివసిస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్, ఎంకరేజ్ డైలీ న్యూస్, ప్రో పబ్లికాలకు పులిట్జర్ బహుమతి లభించింది. కాగా జర్నలిజం రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైదనది పులిట్జర్ అవార్డు. దీనిని వార్తాపత్రికలు, సాహిత్యం, ఆన్‌లైన్ పత్రికారచన, సంగీతం వటి రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రధానం చేస్తారు. (అడ్వకేట్లకు అండగా నిలిచిన ప్రభుత్వం)
Comments
Please login to add a commentAdd a comment