జమ్మూ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం శ్రీకారం చుట్టారు. బనిహాల్, దూరూ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విపక్షాల ‘ఇండియా’కూటమి సాయంతో జమ్మూకశీ్మర్ రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తాం.
తమ కూటమి వచ్చే నెలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది’’అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల్లో నేషనల్ కాన్ఫెరెన్స్ పారీ్టతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడం తెల్సిందే. దూరూలో జరిగిన సభలో ఎన్‌సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సైతం పాల్గొన్నారు. సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 8వ తేదీల్లో మూడు దశల్లో జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెల్సిందే.
2019 ఆగస్ట్‌లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. ‘‘ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఆధునిక భారతదేశ చరిత్రలో కేంద్రపాలిత ప్రాంతాలు సైతం రాష్ట్రహోదా సాధించాయిగానీ ఏ రాష్ట్రం కూడా తన రాష్ట్రహోదాను కోల్పోలేదు. రాష్ట్రహోదాను మాత్రమే పునరుద్దరిస్తే సరిపోదు. ఇక్కడి ప్రజల హక్కులను పునరుద్ధరించాలి. స్వాతం్రత్యానికి పూర్వం రాజుల కాలంలో లెఫ్టినెంట్ గవర్నర్లు ఉండేవారు. అలాగే ఇప్పుడూ ఇక్కడ ఒక లెఫ్టినెంట్ గవర్నర్ 21వ శతాబ్దపు రాజుగా పాలిస్తున్నారు.
కేంద్రపాలిత ప్రాంత ప్రజలుగా ఇక్కడి స్థానికులకు దక్కాల్సిన ప్రయోజనాలు, ఉద్యోగాలు, కాంట్రాక్టులను ఆయన బయటి వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు’’అని ఆరోపించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయసు మినహాయింపును 40 దాకా పెంచుతాం. రోజువారీ వేతనాలను క్రమబద్దీకరిస్తాం. అధిక విద్యుత్ చార్జీలను తగ్గిస్తాం’అని అన్నారు. కన్యాకుమారి నుంచి కశీ్మర్‌కు తాను చేసిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచి్చన ‘‘విద్వేష మార్కెట్లలో ప్రేమ దుకాణాలను తెరుద్దాం’నినాదాన్ని ఈ సందర్భంగా రాహుల్ గుర్తుచేశారు.
మత రాజకీయాలకు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్‌తో దోస్తీ
జమ్మూకశీ్మర్‌లో బీజేపీ మత, విభజన రాజకీయాలకు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్‌తో జట్టుకట్టామని నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జీఏ మిర్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ చేపట్టిన ర్యాలీలో ఫరూక్ అబ్దుల్లా ఓటర్లనుద్దేశిస్తూ మాట్లాడారు. ‘‘పోటీలో ఉన్నది ఎన్‌సీ అభ్యర్థా కాంగ్రెస్ అభ్యర్థా అనేది చూడకండి. మాలాగే మీరు కూడా చేయిచేయి కలిపి అందరం విభజన శక్తులపై పోరాటం చేద్దాం’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment