కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం జమ్మకశ్మీర్‌లోకి ప్రవేశించింది. ఈ యాత్రలో రాహుల్ తోపాటు పరమ వీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ బానా సింగ్(రిటైర్డ్) పాల్గొన్నారు. ఆయన శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాకు చేరుకున్న రాహుల్‌తో కలిసి ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్ర పొడవునా రాహుల్‌గాంధీ బానా సింగ్ చేతిని పట్టుకుని కనిపించారు. ఈ యాత్రలో బానాసింగ్ పాల్గొన్నందుకు ట్విట్టర్ వేదికగా ఆయన్ను రాహుల్ అభినందించారు.
భారత్ ఆదర్శాలను రక్షించడం గురించి మాట్లాడినప్పుడూ బానాసింగ్ వంటి ధైర్యవంతులైన దేశభక్తులు పేర్లే గుర్తు తెచ్చుకుంటాను అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సియాచిన్ మంచుకొండలపై త్రివర్ణ పతాకాన్ని ఎగరువేసిన పరమవీర చక్ర విజేత కెప్టెన్ బానాసింగ్ నాతోపాటు ప్రతి దేశభక్తునికి స్ఫూర్తి అని చెప్పారు రాహుల్. ఈ కథువాలోని జోడో యాత్రలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా పాల్గొన్నారు.
"భారత్ జోడో యాత్ర కాశ్మీర్ వరకు రావడం చాలా పెద్ద విషయం అన్నారు. వాస్తవానికి, దేశాన్ని ఏకం చేయాలంటే మాత్రం యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పారు. మేము దేశం ఏకం కావాలని మేము కోరుకుంటున్నందున తాను శివసేన నుంచి వచ్చి పాల్గొన్నాను." అని చెప్పారు. ఇదిలా ఉండగా, కెప్టెన్ బానా సింగ్ (రిటైర్డ్) ఆపరేషన్ రాజీవ్‌కు చేసిన కృషికి అత్యున్నత శౌర్య పురస్కారమైన పరమవీర చక్రను అందుకున్నారు. అతను సియాచిన్ గ్లేసియర్‌లోని పాకిస్థాన్ ఖైద్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకుని జాతీయ జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పోస్టుకు 'బానా పోస్ట్' అని పేరు కూడా పెట్టారు.
जब भी भारत और उसके आदर्शों की रक्षा की बात होती है, बाना सिंह जैसे देश के वीर सपूतों का नाम लिया जाता है।
— Rahul Gandhi (@RahulGandhi) January 20, 2023
सियाचिन की बर्फ़ीली ऊंचाइयों पर तिरंगा लहराने वाले परमवीर चक्र विजेता, कप्तान बाना सिंह जी मेरे और हर देशभक्त की प्रेरणा हैं। pic.twitter.com/5hEWIi3T4T
(చదవండి: ఎట్టకేలకు జాకెట్ ధరించిన రాహుల్..తిట్టిపోస్తున్న ప్రతిపక్షాలు)
Comments
Please login to add a commentAdd a comment