Param Vir Chakra
-
కార్గిల్ యుద్ధ వీరుడికి సలాం
ఇండిగో ఎయిర్‌లైన్స్ పుణె ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న మేజర్ సంజయ్ కుమార్‌ను ఇండిగో సిబ్బంది సత్కరించారు. కార్గిల్ యుద్ధవీరుడు, పరమవీర చక్ర పురస్కార గ్రహీత సంజయ్ కుమార్‌ను ప్రయాణికులకు పరిచయం చేసి ఆనాటి యుద్ధంలో ఆయన సాహసాలను గురించి చెప్పారు ఎయిర్‌లైన్స్ పైలట్. సంజయ్ కుమార్‌ని ప్రయాణికులు ప్రశంసల్లో ముంచెత్తారు. దీనితాలూకు దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. -
అండమాన్‌లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు
అండమాన్ నికోబార్ దీవులలోని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహిత పేర్లు పెట్టేందుకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. పైగా జనవరి 23న పరాక్రమ దివాస్‌గా పాటించనున్నట్లు పేర్కొంది. అంతేగాదు ఈ కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమునాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. మోదీ 2018లో ఈ దీవులను సందర్శించి వాటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నేతాజీ స్మృతిని పురస్కరించుకుని అక్కడ ఉన్న రాస్ ఐలాండ్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టారు. అలాగే నీల్ ఐస్లాండ్, హావ్లాక్ ఐస్లాండ్ వరుసగా నీల్ ద్వీప్, హావ్లాక్ ద్వీప్గా మారాయి. దేశంలో నిజ జీవితంలోని హిరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికే ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ స్ఫూర్తితోనే మందుకు వెళ్తూ.. ద్వీప సమూహంలోని 21 పేరులేని దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన దేశవీరులకు ఇది శాశ్వత నివాళి అని పేర్కొంది. (చదవండి: వృద్ధుడిపై లాఠీ ఝళిపించిన మహిళా పోలీసులు) -
భారత్ జోడో యాత్రలో సియాచిన్ హీరో..ఆయనే నాకు స్ఫూర్తి!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం జమ్మకశ్మీర్లోకి ప్రవేశించింది. ఈ యాత్రలో రాహుల్ తోపాటు పరమ వీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ బానా సింగ్(రిటైర్డ్) పాల్గొన్నారు. ఆయన శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాకు చేరుకున్న రాహుల్‌తో కలిసి ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్ర పొడవునా రాహుల్‌గాంధీ బానా సింగ్ చేతిని పట్టుకుని కనిపించారు. ఈ యాత్రలో బానాసింగ్ పాల్గొన్నందుకు ట్విట్టర్ వేదికగా ఆయన్ను రాహుల్ అభినందించారు. భారత్ ఆదర్శాలను రక్షించడం గురించి మాట్లాడినప్పుడూ బానాసింగ్ వంటి ధైర్యవంతులైన దేశభక్తులు పేర్లే గుర్తు తెచ్చుకుంటాను అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సియాచిన్ మంచుకొండలపై త్రివర్ణ పతాకాన్ని ఎగరువేసిన పరమవీర చక్ర విజేత కెప్టెన్ బానాసింగ్ నాతోపాటు ప్రతి దేశభక్తునికి స్ఫూర్తి అని చెప్పారు రాహుల్. ఈ కథువాలోని జోడో యాత్రలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా పాల్గొన్నారు. "భారత్ జోడో యాత్ర కాశ్మీర్ వరకు రావడం చాలా పెద్ద విషయం అన్నారు. వాస్తవానికి, దేశాన్ని ఏకం చేయాలంటే మాత్రం యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పారు. మేము దేశం ఏకం కావాలని మేము కోరుకుంటున్నందున తాను శివసేన నుంచి వచ్చి పాల్గొన్నాను." అని చెప్పారు. ఇదిలా ఉండగా, కెప్టెన్ బానా సింగ్ (రిటైర్డ్) ఆపరేషన్ రాజీవ్‌కు చేసిన కృషికి అత్యున్నత శౌర్య పురస్కారమైన పరమవీర చక్రను అందుకున్నారు. అతను సియాచిన్ గ్లేసియర్‌లోని పాకిస్థాన్ ఖైద్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకుని జాతీయ జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పోస్టుకు 'బానా పోస్ట్' అని పేరు కూడా పెట్టారు. जब भी भारत और उसके आदर्शों की रक्षा की बात होती है, बाना सिंह जैसे देश के वीर सपूतों का नाम लिया जाता है। सियाचिन की बर्फ़ीली ऊंचाइयों पर तिरंगा लहराने वाले परमवीर चक्र विजेता, कप्तान बाना सिंह जी मेरे और हर देशभक्त की प्रेरणा हैं। pic.twitter.com/5hEWIi3T4T — Rahul Gandhi (@RahulGandhi) January 20, 2023 (చదవండి: ఎట్టకేలకు జాకెట్ ధరించిన రాహుల్..తిట్టిపోస్తున్న ప్రతిపక్షాలు) -
నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్..
Chitrangada Make Film Youngest Param Vir Chakra Awardee Yogendra Yadav: యే సాలీ జిందగీ, దేశీ బాయ్స్, ఐ, మీ ఔర్ మే, బజార్, బాబ్ బిస్వాస్ వంటి చిత్రాలతో నటిగా మంచిల గుర్తింపు తెచ్చుకుంది మోడల్, బ్యూటిఫుల్ హీరోయిన్ చిత్రాంగద సింగ్. 2018లో వచ్చిన 'సూర్మా' చిత్రంతో నిర్మాతగా కూడా మారింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాకు నిర్మాతగా మారనుంది ఈ మోడల్. కార్గిల్ యుద్ధంలో పోరాడి 19 ఏళ్ల వయసులో పరమ వీర చక్ర అవార్డు అందుకున్న సుబేదార్ యోగేంద్ర యాదవ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు చేజిక్కించుకున్నట్లు శనివారం (జులై 30) చిత్రాంగద తెలిపింది. ''నిజమైన హీరోల గురించి, మన మధ్యలో తిరుగుతూ మరుగున పడిన గొప్ప వ్యక్తుల కథల్ని చెప్పడం నాకు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. వాళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని, జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవసరం ఎంతైనా ఉంది. నిర్మాతగా 'సూర్మా' తర్వాత ఇది నా రెండో ప్రయత్నం' అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సీఎస్ ఫిల్మ్స్ దీపక్ సింగ్‌తో కలిసి సంయుక్తంగా ఈ బయోపిక్‌ను నిర్మించనుంది చిత్రాంగదా. -
పరమవీర చక్ర ఇస్తే బాగుండేది!
హైదరాబాద్: గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు మహావీర చక్ర అవార్డును అందించనున్నట్లు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ విషయంపై కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ స్పందించారు. గాల్వాన్ లోయలో చైనాతో వీరుడికి మహావీర్ చక్ర పురస్కారం దక్కడం సంతోషంగా, గర్వముగా ఉంది. కానీ, "100 శాతం సంతృప్తిగా లేను" అని సంతోష్ బాబు తండ్రి పేర్కొన్నారు. ఆ మహావీరుడికి పరమవీర చక్ర పురస్కారం అందుకోవడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు.(చదవండి: చైనా యాప్‌లకు మరో భారీ షాక్!) మహావీర్ చక్ర పురస్కారాన్నితక్కువగా ఏమి చూడటం లేదు, కానీ పరమవీర చక్ర పురస్కారం దక్కితే పూర్తి న్యాయం జరిగేదని నా వ్యక్తిగత అభిప్రాయం. తన కుమారుడు చూపిన శౌర్యం రక్షణ దళాలలో పనిచేసే వారితో సహా చాలా మందికి స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు. ప్రస్తుతం సంతోష్ బాబు లేకున్నా అందరి మనసుల్లో వున్నారు. సంతోష్ బాబులా ఆర్మీలో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని సంతోష్ బాబు తండ్రి పేర్కొన్నారు. గల్వాన్ లోయలో గత ఏడాది 2020 జూన్ 15న జరిగిన భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన 20 మంది భారతీయ సైనికుల్లో 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బాబు కూడా ఉన్నారు. తన కుమారుడు అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించి చైనా దళాలతో వీరోచితంగా పోరాడానని మిస్టర్ ఉపేంద్ర అన్నారు. గత ఏడాది సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.ఐదు కోట్ల పరిహారం, అతని భార్యకు గ్రూప్ -1 పోస్టుతో పాటు హైదరాబాద్ లో నివాస స్థలం కూడా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.