హైదరాబాద్: గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు మహావీర చక్ర అవార్డును అందించనున్నట్లు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ విషయంపై కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ స్పందించారు. గాల్వాన్ లోయలో చైనాతో వీరుడికి మహావీర్ చక్ర పురస్కారం దక్కడం సంతోషంగా, గర్వముగా ఉంది. కానీ, "100 శాతం సంతృప్తిగా లేను" అని సంతోష్ బాబు తండ్రి పేర్కొన్నారు. ఆ మహావీరుడికి పరమవీర చక్ర పురస్కారం అందుకోవడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు.(చదవండి: చైనా యాప్‌లకు మరో భారీ షాక్!)
మహావీర్ చక్ర పురస్కారాన్నితక్కువగా ఏమి చూడటం లేదు, కానీ పరమవీర చక్ర పురస్కారం దక్కితే పూర్తి న్యాయం జరిగేదని నా వ్యక్తిగత అభిప్రాయం. తన కుమారుడు చూపిన శౌర్యం రక్షణ దళాలలో పనిచేసే వారితో సహా చాలా మందికి స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు. ప్రస్తుతం సంతోష్ బాబు లేకున్నా అందరి మనసుల్లో వున్నారు. సంతోష్ బాబులా ఆర్మీలో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని సంతోష్ బాబు తండ్రి పేర్కొన్నారు. గల్వాన్ లోయలో గత ఏడాది 2020 జూన్ 15న జరిగిన భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన 20 మంది భారతీయ సైనికుల్లో 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బాబు కూడా ఉన్నారు. తన కుమారుడు అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించి చైనా దళాలతో వీరోచితంగా పోరాడానని మిస్టర్ ఉపేంద్ర అన్నారు. గత ఏడాది సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.ఐదు కోట్ల పరిహారం, అతని భార్యకు గ్రూప్ -1 పోస్టుతో పాటు హైదరాబాద్ లో నివాస స్థలం కూడా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment