Pulitzer Prize
-
వ్యాలీ పులికి.. పులిట్జర్!
కశ్మీర్ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్ మట్టూ. తాజాగా ప్రకటించిన పులిట్జర్ అవార్డుల లిస్టులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్‌తోపాటు రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలను ఈ అవార్డు వరించింది. శ్రీనగర్‌కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుంది. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. చదువయ్యాక కశ్మీర్ మీద డాక్యుమెంటరీలు, విజువల్ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది. సనా ఆర్టికల్స్ బావుండడంతో.. ఆల్జజీరా, ద నేషన్, టైమ్ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్ టుడే, సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు, కర్వాన్ మ్యాగజీన్ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్‌జజీరాకు స్టోరీలు అందించేది. క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్‌లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్ ఫౌండేషన్‌లో ‘ఫొటోగ్రఫీ అండ్ సోషల్ జస్టి్టస్ ఫెలోస్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది. కాలేజీ రోజుల నుంచే.. యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్లో స్పెషలైజేషన్ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్ టౌన్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్ డిగ్గర్’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్‌తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్ ఫీచర్ విభాగంలో పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి. జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్‌లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. -
Danish Siddiqui: మరణానంతరం భారతీయ ఫొటోగ్రాఫర్‌కు పులిట్జర్
న్యూఢిల్లీ: భారతీయ ఫొటోగ్రాఫర్ డానిష్ సిద్దిఖికి రెండోసారి పులిట్జర్ ప్రైజ్ దక్కింది. మరణానంతరం ఆయనకు ఫీచర్ ఫొటోగ్రఫీ కేటగిరీలో ఈ విశిష్ట గౌరవం విశేషం. డానిష్‌తో పాటు మరో ముగ్గురు భారతీయులకు సైతం ఈ గౌరవం దక్కింది. ఈ నలుగురికీ భారత్‌లో కొవిడ్ పరిస్థితుల మీద తీసిన ఫొటోలకే అవార్డులు దక్కడం విశేషం. రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ అయిన డానిష్ సిద్దిఖి.. కిందటి ఏడాది అఫ్గన్ ప్రత్యేక దళాలు-తాలిబన్ల మధ్య ఘర్షణల్లో విధి నిర్వహణలో ఉండగానే తుటాలకు బలైన విషయం తెలిసిందే. పులిట్జర్ ప్రైజ్ 2022 విజేతలను సోమవారం ప్రకటించారు. జర్నలిజం, రచనలు, నాటకం, సంగీతం.. రంగాల్లో పులిట్జర్ ప్రైజ్‌ను అందిస్తారని తెలిసిందే. డానిష్ సిద్ధిఖితో పాటు అమిత్ దవే, అద్నన్ అబిది, సన్నా ఇర్షద్ మట్టోలకు పురస్కారం ప్రకటించారు. 2018లో రొహింగ్యా శరణార్థ సంక్షోభం మీద తీసిన ఫొటోలకు గానూ అద్నాన్ అబిదితో కలిసి తొలిసారి పులిట్జర్ అందుకున్నారు డానిష్ సిద్ధిఖి. అదే సమయంలో వివిధ కేటగిరీలతో పాటు ఉక్రెయిన్ సంక్షోభం, అమెరికా జనవరి 6 కాపిటోల్ మీద దాడి, అఫ్గన్ గడ్డ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ, ఫ్లోరిడాలో సముద్రతీరంలో సగ భాగం కుప్పకూలిన భవనం లాంటి వాటి మీద కవరేజ్‌లకు సైతం ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు పులిట్జర్ ప్రైజ్ నిర్వాహకులు. 1917లో కొలంబియా యూనివర్సిటీ నిర్వాహకుడు, ప్రముఖ పాత్రికేయుడు జోసెఫ్ పులిట్జర్ పేరు మీద ఈ గౌరవాన్ని అందిస్తూ వస్తున్నారు. -
భారత సంతతి జర్నలిస్ట్‌కు పులిట్జర్ పురస్కారం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్ ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారానికి ఎంపికయ్యారు. మరో ఇద్దరితో కలిసి శుక్రవారం ఆమె ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. చైనా జిన్జియాంగ్ ప్రాంతంలో రహస్యంగా వందలాది జైళ్లు, నిర్బంధ శిబిరాలు నిర్మించి.. వేలాది మంది ముస్లింలను అదుపులోకి తీసుకుని.. చిత్ర హింసలకు గురి చేస్తోన్న విషయాలను వెల్లడించినందుకు మేఘ రాజగోపాలన్ ఈ బహుమతి గెలుచుకున్నారు. పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న ఇద్దరు భారత సంతతి జర్నలిస్టులలో అమెరికా బజ్‌ఫీడ్ న్యూస్‌కు చెందిన ఎంఎస్ రాజగోపాలన్ ఒకరు. ఈమె ప్రచురించిన జిన్జియాంగ్ సిరీస్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది. 2017 లో, జిన్జియాంగ్లో చైనా వేలాది మంది ముస్లింలను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించిన కొద్దికాలానికే, రాజగోపాలన్ ఒక నిర్బంధ శిబిరాన్ని సందర్శించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తమ దేశంలో అటువంటి ప్రదేశాలు లేవని చైనా ఖండించిన సమయంలో, బజ్‌ఫీడ్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. "మేఘ రాజగోపాలన్ జిన్జియాంగ్ ప్రాంతంలో సందర్శించిందని గుర్తించిన వెంటనే చైనా ప్రభుత్వం ఆమె నోరు మూయించేందుకు ప్రయత్నించింది, ఆమె వీసాను సస్పెండ్ చేయడమే కాక దేశం నుంచి వెళ్లిపోవాలని బెదిరించింది" అని బజ్‌ఫీడ్ న్యూస్ బహుమతి కోసం పంపిన తన ఎంట్రీలో వెల్లడించింది. డ్రాగన్ బెదిరింపులకు భయపడని మేఘన మరో ఇద్దరి సాయంతో లండన్ నుంచి పనిచేయడం ప్రారంభించారు. వీరిలో ఒకరు అలిసన్ కిల్లింగ్, లైసెన్స్ పొందిన ఆర్కిటెక్చర్, భవనాల ఉపగ్రహ చిత్రాల ఫోరెన్సిక్ విశ్లేషణలో నైపుణ్యం కలిగినవాడు కాగా మరొకరు క్రిస్టో బుస్చెక్ డాటా జర్నలిస్టుల కోసం టూల్స్ రూపొందించే ప్రోగ్రామర్. ఈ ముగ్గురి బృందం చైనా సెన్సార్ చేసిన వేలాది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి అక్కడ జరుగుతున్న అరాచకాలను ప్రపంచానికి వెల్లడించారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న మేఘన పులిట్జర్ గెలవడంపై స్పందిస్తూ.. ‘‘ఈ అవార్డు గెలుచుకుంటానని తాను అస్సలు ఊహిచలేదని.. పూర్తిగా షాక్‌లో ఉన్నాను’’ అన్నారు మేఘన. చదవండి: అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా చైనా క్యాంపుల్లో మహిళలపై అత్యాచారం -
ఈ ఫోటోకి ఏం అవార్డు ఇస్తారు?
శ్రీనగర్: 2017లో కశ్మీర్లో టెరరిస్టులు హతమార్చిన ఒక పోలీసు ఆఫీస్ కుమార్తె ఫోటోను జమ్మూ కశ్మీర్ పోలీసు ఆఫీసర్ ఇంతియాజ్ హుస్సేన్ తన ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో తన తండ్రి ఉగ్రవాదుల చేతిలో బలికావడంతో ఆ పాప ఏడుస్తోంది. ఇది చూసిన ఎవరి హృదయమయిన కరిగిపోవాల్సిందే. ఆయన ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ చిత్రం రాబోయే కాలంలో కూడా మానవత్వం ఉన్న ప్రతి మనిషి మనసాక్షిని వెంటాడుతోంది. ఓదార్చడానికి కూడా వీలు లేకుండా ఏడుస్తున్న ఈ పాప 2017లో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పోలీసు ఆఫీసర్ కూతురు. ఈ ఫోటోకి ఏమైనా అవార్డు లభిస్తుందా? అని ఇంతియాజ్ ట్వీట్ చేశారు. This picture should haunt the conscience of humanity for times to come. An inconsolable daughter of a police officer martyred in 2017 in Kashmir. Any awards for this photograph? pic.twitter.com/TJwpZCPaF7 — Imtiyaz Hussain (@hussain_imtiyaz) May 6, 2020 తాజాగా కశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఫోటో జర్నలిస్టులు చన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్, దార్ యాసిన్‌లకు జీవిత చిత్రాలను చూపించినందుకు గాను పులిట్జర్ ప్రైజ్ 2020 లభించింది. దీంతో ఇప్పుడు ఈ అధికారి చేసిన పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి ముగ్గురికి అవార్డు ఇచ్చే సమయంలో పులిట్జర్ బోర్డు తన వెబ్సైట్లో ఇండియా కశ్మీర్ భూభాగంలో కమ్యూనికేషన్‌ని బ్లాక్ చేయడం ద్వారా కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని పొగొట్టిన సమయంలో అక్కడవారిని జీవితాల్ని ప్రతిబింబించే ఫోటోలు ఇవి అని పేర్కొంది. ఈ విషయం మీద కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. వీరికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశాడు. దేశం గర్వపడేలా చేశారు అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. Congratulations to Indian photojournalists Dar Yasin, Mukhtar Khan and Channi Anand for winning a Pulitzer Prize for their powerful images of life in Jammu & Kashmir. You make us all proud. #Pulitzer https://t.co/A6Z4sOSyN4 — Rahul Gandhi (@RahulGandhi) May 5, 2020 బీజీపీ నేత సంబిత్ పాత్ర భారత్‌కు వ్యతిరేకమైన భావాలను వర్ణించడం ద్వారా వారికి ఈ అవార్డు లభించిందని, అవార్డు అందుకున్న వారిలో ఒకరైన దార్ కశ్మీర్‌ను భారత ఆక్రమిత కశ్మీర్‌గా తన ఫోటోలలో పేర్కొన్నారని తెలిపారు. అలాంటి వారికి అవార్డు వస్తే పొడగ్తలతో ముంచేత్తుతారా? రాహుల్, కశ్మీర్ భారతదేశ భూభాగం కాదా? అని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. Will Sonia Gandhi answer? Whether She and the Congress Party concur with Rahul Gandhi on the issue of Kashmir not being an integral part of India! Rahul today congratulated those who got an award for considering Kashmir as a “Contested Territory”!#AntiNationalRahulGandhi pic.twitter.com/FoAimhYPrh — Sambit Patra (@sambitswaraj) May 5, 2020 -
మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఫీచర్ ఫోటోగ్రఫీలో పులిట్జర్ అవార్డును పొందిన ముగ్గురు భారత ఫోటో జర్నలిస్టులను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభినందించారు. ‘మీ ముగ్గురు దేశాన్ని గర్వపడేలా చేశారు’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. ఇక భారత్‌కు చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్స్ యాసిన్, చన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్ ఫీచర్ ఫోటోగ్రఫీ అవార్డుల అందుకున్న విషయం తెలిసిందే. వీరు ముగ్గురు అసోసియేటెడ్ ప్రెస్‌తో కలిసి పనిచేశారు. గతేడాది కశ్మీర్లో ఆర్టికల్ 370ను తొలగించిన సమయంలో జరిగిన నిరసనలను, భద్రతా దళాలు, హింసాకాండలకు చెందిన పలు చిత్రాలను వీరు తమ కెమెరాల్లో బంధించి ప్రపంచానికి చూపారు. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించినందుకు వీరికి పులిట్జర్ ఫీచర్ ఫోటోగ్రఫీ అవార్డులు వరించాయి. (ఢిల్లీలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం ) Congratulations to Indian photojournalists Dar Yasin, Mukhtar Khan and Channi Anand for winning a Pulitzer Prize for their powerful images of life in Jammu & Kashmir. You make us all proud. #Pulitzer https://t.co/A6Z4sOSyN4 — Rahul Gandhi (@RahulGandhi) May 5, 2020 దార్ యాసిన్, ముక్తార్ ఖాన్ కశ్మీర్‌కు చెందిన వ్యక్తులు కాగా ఆనంద్ మాత్రం జమ్మూలో నివసిస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్, ఎంకరేజ్ డైలీ న్యూస్, ప్రో పబ్లికాలకు పులిట్జర్ బహుమతి లభించింది. కాగా జర్నలిజం రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైదనది పులిట్జర్ అవార్డు. దీనిని వార్తాపత్రికలు, సాహిత్యం, ఆన్లైన్ పత్రికారచన, సంగీతం వటి రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రధానం చేస్తారు. (అడ్వకేట్లకు అండగా నిలిచిన ప్రభుత్వం) -
రాజీపడని వాస్తవికవాది ఫిలిప్ రాత్
రెండో ప్రపంచ యుద్ధానంతరం సుప్రసిద్ధ అమెరికన్ వ్యంగ్య నవలా రచయితల్లో మేటి అయిన ఫిలిప్ రాత్ మంగళవారం రాత్రి న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 20వ శతాబ్దికి చెందిన అత్యంత వివాదాస్పద రచయితల్లో ఒకరిగా గుర్తింపుపొందిన ఈ పులిట్జర్ అవార్డు గ్రహీత వయస్సు 85 ఏళ్లు. ‘అమెరికన్ పేస్టోరల్’, ‘పోర్ట్‌నోయ్స్ కంప్లయింట్’ వంటి 25 నవలలు, గ్రంథాలు రాసిన ఫిలిప్ సాహిత్యంలో నోబెల్ అవార్డు దక్కని అత్యంత ప్రముఖ రచయితల్లో ఒకరు. సెక్స్, మృత్యువు, జాతుల సమ్మేళనం, విధి వంటి అంశాలపై నిర్భయంగా, సాహసోపేతంగా తాను వర్ణించిన తీరు నాటి సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికన్‌గా ప్రత్యేకించి యూదుగా, రచయితగా, మనిషిగా ఉండటం అంటే ఏమిటి అనే అన్వేషణలో భాగంగా జీవితాంతం రచనలు చేశారు. ప్రత్యేకించి అమెరికన్ యూదుల సమస్య గురించి, పురుషుల లైంగికత ఉనికిపై సాహసోపేతమైన వ్యక్తీకరణలతో 50 ఏళ్ల క్రితం అమెరికన్ సమాజానికి షాక్ కలిగించారు. ఫిలిప్ 1959లో అంటే 20 ఏళ్ల ప్రాయంలో రాసిన ‘గుడ్‌బై, కొలం బస్’ రచన తనకు నేషనల్ బుక్ అవార్డును తెచ్చిపెట్టింది. దశాబ్దం తర్వాత రాసిన ‘పోర్ట్‌నోయ్స్ కంప్లయింట్’ అమెరికన్ సమాజంలో సంచలనం కలిగించింది. కఠినతరమైన యూదు కుటుంబ పెంపకం నుంచి బయటపడటానికి అసాధారణ లైంగిక చర్యలను వాహికగా చేసుకోవడంపైనా, యువకుల లైంగికతపైనా ఈ పుస్తకంలో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. పురుషుల ప్రత్యేకించి యూదుల లైంగిక వాంఛల గురించి ఫిలిప్ వ్యాఖ్యానించిన తీరు తనకు పురుషాహంకారి అనే బిరుదును కూడా తెచ్చిపెట్టాయి. తదనంతర జీవితంలో ‘అమెరికన్ పేస్టోరల్’ (1997), ‘ది హ్యూమన్ స్టెయిన్’ (2000), ‘ది ఫ్లాట్ ఎగైనెస్ట్ అమెరికా’ (2004) వంటి ప్రామాణిక రచనలు రాసినా, 1969లో రాసిన ‘పోర్ట్‌నోయ్స్ కంప్లయింట్’ అతడిని అత్యంత వివాదాస్పద రచయితగా మార్చింది. ఈ నవలను అమెరికన్ బూర్జువా ఉదారవాద స్వేచ్చపై చేసిన పెనుదాడిగా విమర్శకులు పేర్కొన్నారు. దీని తర్వాత తాను రాసిన ‘సబ్బాత్స్ థియేటర్’ కూడా పాఠకులకు షాక్ కలి గించింది. పురుషుల అసాధారణ లైంగిక చర్యలపై తన వ్యక్తీకరణలను స్త్రీవాదులు దుమ్మెత్తి పోశారు కూడా. యూదుల కుటుంబ జీవితంలోని సాంప్రదాయిక ఛాందసత్వం నుంచి తన నవలల్లో విముక్తి దారి చూపించానని ఫిలిప్ సమర్థించుకున్నారు. జీవించి ఉండగానే లైబ్రరీ ఆఫ్ అమెరికాలో తన రచనలకు చోటు లభించిన మూడో అమెరికన్ రచయితగా ఫిలిప్ అరుదైన గుర్తింపు పొందారు. 1960–70లలో పులిట్జర్ ప్రైజ్, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, నేషనల్ బుక్ అవార్డ్స్, నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు వంటి వలు అవార్డులు తన సొంతమయ్యాయి. 2012లో రాసిన ‘నెమిసెస్’ తన చివరి రచన. జీవితంలోని వాస్తవానికి భిన్నంగా కల్పననే ఎక్కువగా రాసుకుంటూ పోయానని, ఇక తన రచనలను మళ్లీ చదవాల్సిన అవసరం కానీ, తిరగరాయాల్సిన అవసరం కానీ లేదని ప్రకటించారు. యూదుల ఉనికి, యూదు వ్యతిరేకత, అమెరికాలో యూదుల అనుభవం వంటి కథాంశాలే ఆయన రచనలకు మూలం. కల్పన, వాస్తవం ఎల్లప్పుడు సాహిత్యంలో తమ పాత్రలను మార్చుకుంటుంటాయని, ఒకదాన్ని మరొకటి అధిగమిస్తుంటాయని అందుకే తన జీవిత చరిత్ర పుస్తకంలో వాస్తవానికి విరుద్ధ ఘటనలు కూడా రూపొందించాల్సి వచ్చిందని, తన చరిత్ర రచనల్లో కూడా కాస్త కల్పన చోటు చేసుకుందని ఇది తన జీవితంలోని వాస్తవ నాటకీయత అని ఫిలిప్ సమర్థించుకున్నారు. దీనికి అనుగుణంగానే సాహిత్యం అంటే నైతిక సౌందర్య ప్రదర్శన కానే కాదని స్పష్టం చేశారు. రచయితగా ఫిలిప్ రాత్ తీవ్రమైన వ్యంగ్యానికి, రాజీలేని వాస్తవికతకు మారుపేరు. పురుషుల లైంగికత నుంచి మొదలుకుని అన్నే ఫ్రాంక్ వరకు జీవితంలోని పలు అంశాలను సాహిత్యరూపంలోకి తీసుకొచ్చిన దిట్ట. తనను యూదు రచయితగా కాకుండా అమెరికన్ రచయితగానే చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. వలస జీవితంతో యూదులు అలవర్చుకున్న బాధాకరమైన సర్దుబాటు ధోరణిని తన రచనలు ప్రతిభావంతంగా చిత్రించాయి. మనిషి స్వేచ్చను, స్వాతంత్య్రాన్ని, 1960ల నాటి అమెరికన్ లైంగిక భావోద్వేగాలను ప్రతిభావంతంగా చిత్రించిన రచయితగా అమెరికన్ సమాజం తనను గుర్తించుకుంటుంది. -కె. రాజశేఖర రాజు -
పులిట్జర్ విజేత హార్పర్ లీ కన్నుమూత
న్యూయార్క్: పులిట్జర్ ప్రైజ్ విజేత, అమెరికన్ నవలా రచయిత హార్పర్ లీ(89) కన్నుమూశారు. ఈ విషయాన్ని అలబామా, మోన్రోవిల్లే మేయర్ కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. ఆమె 1926 ఏప్రిల్ 28న అలబామా, మోన్రోవిల్లేలో జన్మించారు. 1960లలో 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' రచన తన కెరీర్ ను ఓ దశకు తీసుకెళ్లింది. ఈ నవల హాట్ కెకుల్లా అమ్ముడవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం విశేషం. ఆ నవలకుగానూ ఆమె ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' నవల 4 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. ప్రముఖ రచయిత్రి మృతి పట్ల యాపిల్ సీఈవో టీమ్ కుక్ సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. రైటర్ మలోరి బ్లాక్‌మన్, తదితర ప్రముఖులు హార్పర్ లీ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆమె గొప్పతనాన్ని ప్రశంసించారు. -
భారతీయుడికి పులిట్జర్ బహుమతి
న్యూయార్క్: భారతీయ సాప్ట్వేర్ ఇంజనీర్ కు ప్రతిష్టాత్మక వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ ఏడాది పులిట్జర్ బహుమతి ప్రకటించింది. తమిళనాడుకు చెందిన పలని కుమనన్ పరిశోధనాత్మక రిపోర్టింగ్‌కు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగంపై ఆయన ప్రజంటేషన్ ఇచ్చారు. పలని కుమనన్ స్వస్థలం కోయంబత్తూరు. కోయంబత్తూరు పీఎస్జీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. -
ఆ నవ్వుకు ఆయువు లేదు!
ఈ చిన్నారిని చూస్తే ఏం కనిపిస్తోంది? చక్రాల కుర్చీలో ఉన్నా ప్రపంచాన్ని చుట్టేయాలన్నంత తపన ఉంది. కాలు నేల మీద మోపలేకపోయినా అంతరిక్షంలో అడుగు పెట్టగలనన్నంత విశ్వాసం ఉంది. లేచి నిలబడలేకపోయినా నిలువునా, అణువణువునా ఉత్సాహం ఉరకలు వేస్తోంది. కల్మషమెరుగని ఆ చిరునవ్వుకు కఠిన శిలలైనా కరిగిపోతాయేమోననిపిస్తోంది కదూ! కానీ ఆ నవ్వుకు ఆయువు లేదు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రెన్ సి. బయర్ తీసిన ఈ చిత్రం తీసేనాటికే ఆ పదకొండేళ్ల చిన్నారి డెరెక్ మ్యాడ్సన్ జీవితం క్యాన్సర్ కారణంగా చివరి దశకు చేరుకుంది. ఇది తీసిన కొద్ది రోజులకే అతడి ప్రాణదీపం ఆరిపోయింది. చివరి రోజుల్లో ఆసుపత్రి మంచానికి పరిమితమైన డెరెక్‌ని, అతడి తల్లి సిండీ ఫ్రెంచ్ వీల్ చెయిర్లో కూర్చోబెట్టి చల్లగాలిలో తిప్పడానికి బయటకు తీసుకు వచ్చింది. అప్పుడు ఆ చిట్టితండ్రి పడిన సంతోషం బయర్ కెమెరా కంట్లో పడింది. పులిట్జర్ ప్రైజు గెలుచుకునే చిత్రంగా వెలువడింది. -
చిన్న వయసు సృజనశీలి
సంక్షిప్తంగా... ఝుంపా లహిరి నీలాంజన సుధేష్ణ లహిరి. లండన్! సంప్రదాయం, అధునికత కలగలిసినట్లున్న ఈ పేరు, ఊరు ఝుంపా లహిరివి. రెండేళ్ల వయసులో కుటుంబంతో పాటు లండన్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన ఝుంపా అసలుకైతే బెంగాలీ అమ్మాయి. తన తొలి కథల సంకలనం ‘ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాలాడీస్’కు పులిట్జర్ అవార్డు గెలుచుకోవడం ద్వారా పద్నాలుగేళ్ల క్రితం తొలిసారి ప్రపంచం దృష్టికి వచ్చిన ఝంపా ప్రస్తుతం అమెరికాలోని ‘ప్రెసిడెంట్స్ కమిటీ’ (ఆర్ట్ అండ్ హ్యుమానిటీస్) లో సభ్యురాలు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా స్వయంగా ఝంపాను కమిటీ సభ్యురాలిగా నియమించారని అంటారు. పులిట్జర్ అవార్డు వచ్చిన మూడేళ్లకు ఝంపా రాసిన తొలి నవల ‘ది నేమ్‌సేక్’ పుస్తకంగానూ, సినిమాగానూ అనేక ప్రశంసలు, అవార్డులు అందుకుంది. సినిమాకు మీరా నాయర్ దర్శకత్వం వహించగా అమెరికన్ నటుడు కాల్ పెన్, బాలీవుడ్ నటులు ఇర్ఫాన్‌ఖాన్, టబూ నటించారు. గత ఏడాది ఝంపా రాసిన ‘ది లోల్యాండ్’ నవల కూడా విమర్శకుల మన్నన అందుకున్నదే.. ఝంపా రోడ్ ఐలాండ్‌లోని కింగ్‌స్టన్‌లో పెరిగారు. ఆమె తండ్రి అమర్ లహిరి రోడ్ ఐలాండ్ యూనివర్శిటీలో లైబ్రేరియన్. ఝంపాకు అమెరికా అంటే ఇష్టం. ‘‘లండన్‌లో పుట్టినప్పటికీ అమెరికన్‌గా చెప్పుకోడానికే నేను ఇష్టపడతాను’’ అని ఆమె అంటారు. అయితే ఝంపా తల్లికి తన పిల్లలు బెంగాలీ సంప్రదాయంలో పెరగాలని ఆశ. అందుకే ఆవిడ తరచు బెంగాల్‌కి ప్రయాణాలు పెట్టుకునేవారు. ఝుంపాకు నీలాంజన సుధేష్ణ అనే పేరు ఎంపిక చేయడంలో ఆమె తల్లి ప్రమేయమే ఎక్కువగా ఉంది. అయితే అలా పిలవడానికి, వినడానికి అమెరికాలో కష్టంగా ఉంటుందని తండ్రి ఆమెకు ఝుంపా అని ముద్దుపేరు పెట్టుకున్నారు. ఝంపా అంటే ‘ముద్దుపేరు’ అని అర్థం. ఇలా ఏ అర్థమూ లేని ఈ పేరంటే తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఒక ఇంటర్వ్యూలో ఝంపా వాపోయారు కూడా. ఝుంపా ఇంగ్లిష్ లిటరేచర్‌లో బి.ఎ. చేశారు. తర్వాత ఎం.ఎ. ఇంగ్లిష్, క్రియేటివ్ రైటింగ్‌లో ఎం.ఎఫ్.ఎ., ఇంకా... కంపారిటివ్ లిటరేచర్‌లో ఎం.ఎ., చేశారు. తర్వాత రినెసైన్స్ (పునరుజ్జీవనోద్యమం) స్టడీస్‌లో పిహెచ్.డి చేశారు. అనంతరం ప్రావిన్స్‌టౌన్ ఫైన్ ఆర్ట్స్ వర్క్ సెంటర్లో రెండేళ్ల పాటు (1997-98) ఫెలోషిప్ తీసుకున్నారు. బోస్టన్ విశ్వవిద్యాలయం, రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్‌లో క్రియేటివ్ రైటింగ్‌పై పాఠాలు చెప్పారు. 2001లో ఝంపా ఆల్బెర్టో వర్వోలియాస్-బుష్‌ను వివాహమాడారు. ఆయన జర్నలిస్టు. అప్పట్లో ఆయన ‘టైమ్’ పత్రిక లాటిన్ అమెరికా విభాగానికి డిప్యూటీ ఎడిటర్‌గా ఉండేవారు. ఇప్పుడు సీనియర్ ఎడిటర్ అయ్యారు. ఇద్దరు పిల్లలు. ఆక్టావియో, నూర్. అంతా కలిసి రోమ్‌లో ఉంటున్నారు. ప్రిన్స్టన్ యూనివర్శిటీలోని ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్లో సృజనాత్మక రచనా విభాగం ప్రొఫెసర్‌గా ఈ నెల 1 నుంచి బాధ్యతలు చేపట్టడానికి ఝుంపా ఇటీవలే మళ్లీ అమెరికా చేరుకున్నారు. ఇవాళ ఝంపా పుట్టినరోజు. -
బుకర్ ప్రైజ్ తుది జాబితాలో ఝంపా లహరి
లండన్: భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి(46) ప్రతిష్టాత్మక ‘బుకర్ ప్రైజ్’ తుది జాబితాలో చోటు సాధించారు. గతంలో ఆమె పులిట్జర్ బహుమతి సాధించారు. కోల్‌కతా నేపథ్యంలో ఆమె రాసిన ‘ద లో లాండ్’ రచనకుగానూ మన్ బుకర్ ప్రైజ్-2013 తుది జాబితాలో ఎంపికైనట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు.