
కొన్ని చాలా సడెన్‌గా జరుగుతాయి.. కన్నార్పేలోపే మాయమైపోతుంటాయి కూడా.. ఇక్కడ కనిపించే చిత్రం కూడా అలాంటిదే.. బైజూపాటిల్ అనే ఫొటోగ్రాఫర్ కాస్త చురుకు కాబట్టి.. వెంటనే ఇలా క్లిక్‌మనిపించేశాడు.. చూశారుగా.. ఎలుగుబంటి విత్ పింఛం.. రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో పర్యాటకులు జీప్‌లో వెళ్తుండగా.. నెమలి పింఛం విప్పి ఆడటం మొదలుపెట్టింది.. వారు చూస్తున్నారు.. అంతలో ఒక ఎలుగుబంటి అలా వచ్చి.. నిల్చుని చూడటం.. బైజూపాటిల్ తన కెమెరా కంటిలో దీన్ని బంధించేయడం చకచకా జరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment