peacock
-
‘నెమలి కర్రీ’ వీడియోతో బుక్కయ్యాడు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ ఓ యూట్యూబర్ తన చానల్లో వీడియో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ శ్రీటీవీ అనే యూట్యూబ్ చానల్లో నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్టు చేశాడు. ఈ విషయంపై ‘యూట్యూబ్‌లో నెమలికూర వంటకం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు.తంగళ్లపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి, ప్రణయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి మాట్లాడుతూ, వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినందుకు అటవీచట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, పలు అటవీ జంతువులు, పక్షుల వంటకాల వీడియోలు కూడా పోస్టు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రవణ్‌కుమార్, బీట్ ఆఫీసర్ ఎంఏ ఖలీమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
యూట్యూబ్‌లో నెమలికూర వంటకం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ తన యూ ట్యూబ్ చానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ అనే వ్యక్తి కొన్నా ళ్లుగా శ్రీటీవి అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు.అయితే శనివారం తన యూట్యూబ్ చానల్లో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ విస్తుపోయారు. అంతేకాకుండా అడవిపంది కూర వండటం గురించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ చానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
అలా పట్టించుకోకుండా వెళ్లిపోతే ఎలా? : హిల్లేరియస్ వీడియో వైరల్
నెమలి మన జాతీయ పక్షి. అందమైన అపురూపమైన పక్షి. ఆడ నెమలిని ఇంప్రెస్ చేసేందుకు మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. గున గున అడుగులేస్తూ ఆడ నెమలి వెంట తిరుగుతుంది. ఈ నాట్యం చేసేటప్పుడు తన పింఛాన్ని చుట్టూ వృత్తం లాగా చేస్తుంది. ఒక్కోసారి విసినకర్రలా వంచి అందంగా నాట్యం చేస్తుంది. ప్రేయసి సంతృప్తి చెంది, చెంతక చేరేదాకా మగ నెమలికి ఈ తిప్పలు తప్పవు. అకస్మాత్తుగా మబ్బులు కమ్మేసి, చినుకులు పడినపుడు, ప్రధానంగా వడగళ్లు పడినపుడు సంతోషంతో పింఛంతో మగ నెమలి చేసే నాట్యం వర్ణశోభితంగా, అత్యంత రమణీయంగా ఉంటుంది కదా. తాజాగా గ్రేట్ ఆర్గస్ నెమలి ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు పాట్లు, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో దాదాపు 30 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. వాస్తవానికి ఈ వీడియో 2021లో ఫ్లోరిడాలోని బే లేక్‌లోని డిస్నీస్ యానిమల్ కింగ్‌డమ్‌లోని మహారాజా జంగిల్ ట్రెక్‌లో తీసింది. ఇపుడు మళ్లీ సందడి చేస్తోంది. ఈ తతంగం అంతా చూసి నెటిజన్లు చతురోక్తులతో స్పందిస్తున్నారు. ఇంత చేసినా అలా వెళ్లిపోతే ఎలా అంటూ ఫన్నీ కమెంట్లు పెడుతున్నారు. A male Pheasant is trying to impress her but she is not impressed! 😂 pic.twitter.com/dqfAj2icz4 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 20, 2024 An incredible leucistic peacock! (Video Laurel Coons) pic.twitter.com/H0eO6ID6TM — Natural Science & History (@joehansenxx) March 20, 2024 This is so so beautiful 🦚🥰😍 pic.twitter.com/XHwbmH5lUC — Aisha Abbasi (@aisha_FCB) March 20, 2024 -
మహిళపై నెమలి దాడి
కర్ణాటక: మహిళపై ఒక నెమలి పదేపదే దాడి చేస్తుండడంతో విసిగిపోయిన ఆమె నెమలిపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన చెన్నపట్టణ తాలూకా అరళాళుసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసి లింగమ్మ బాధితురాలు. ఇంటి వద్ద తాను పనిచేసుకుంటుండగా ఒక నెమలి తరచూ ఎగురుకుంటూ వచ్చి తనను ముక్కుతో పొడుస్తూ గాయపరుస్తోందని, ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా తీసుకుంటున్నానని అందువల్ల నెమలిని పట్టుకుని తనకు రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. రామనగర జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుత దాడులతో ఇప్పటికే విసిగిపోయిన ప్రజలకు నెమళ్లు కూడా దాడి చేస్తుండడం కలవరపెడుతోంది. -
Photo Feature: ‘నాట్య’ మయూరం
మండల పరిధిలోని ఫైజాబాద్ శివారులోని పొలాల్లో పురివిప్పిన మయూరం చూపరులను ఆకట్టుకుంది. కురిసిన వర్షాలకు పచ్చగా చిగురించిన గడ్డిపై అందంగా మయూరం పురివిప్పడంతో ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – చిలప్‌చెడ్(నర్సాపూర్) -
ఆ సినిమా చూసి ఏడ్చేశాను : మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12 విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా కీర్తి సురేష్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఇదిలా ఉండగా రీసెంట్గా మహేశ్ పీకాక్ మ్యాగజైన్ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్‌లో ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తాను తరచుగా బ్యూటిఫుల్ అనే పదం వాడుతానని తెలిపారు. హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ చూసి ఏడ్చినట్లు పేర్కొన్నారు. ఒకవేళ తాను డైరెక్టర్ అయితే 'ఒక్కడు' మూవీని రీక్రియేట్ చేస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన మహేశ్ అల్లూరి సీతారామరాజు సినిమా తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ అని చెప్పుకొచ్చారు. -
‘ద పీకాక్’ మ్యాగజైన్‌పై మహేశ్, ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్
Mahesh Babu Stuns On The Peacock Magazine: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ వరుస ఇంటర్య్వూలు, ప్రెస్మీట్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించి తన ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు ఆయన. ద పీకాక్ మేగజీన్ కవర్ పేజీ కోసం ఆయన ఇటీవల ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని మహేశ్ స్వయంగా తెలిపారు. చదవండి: మహేశ్-రాజమౌళి మూవీపై అప్డేట్ ఇచ్చిన రచయిత విజయేంద్ర ప్రసాద్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించిన తన ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ ద పీకాక్ మ్యాగజైన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ మ్యాగజైన్ కోసం జరిగిన ఫొటోషూట్ మొత్తం చాలా సరదాగా, ఉల్లాసంగా జరిగిందని ఈ సందర్భంగా మహేశ్ పేర్కొన్నారు. ఆ షూట్ కోసం కష్టపడ్డ ద పీకాక్ మ్యాగజైన్ జర్నలిస్టులు ఫాల్గుణి, షేన్లకు మహేశ్ స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పారు. కాగా ద పీకాక్ మ్యాగజైన్‌పై మహేశ్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇందుకోసం ఇచ్చిన ఫొటోషూట్‌ను ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. Humbled and honoured to be starring on the cover of #ThePeacockMagazine. The shoot and the overall experience was so much fun! Thank you @falgunipeacock and @shanepeacock. Here’s to many more! 🤗 pic.twitter.com/pbaoVkcc4f — Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2022 -
అప్పుడు ధైర్యం లేదు, ఇప్పుడు ఏమైనా చేయగలను : సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేస్తుంది. తాజాగా సమంత ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం నెమలి మాదిరిగా స్టన్నింగ్ ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'నా స్కిన్‌టోన్‌తో నేను కంఫర్టబుల్‌గా ఉండేందుకు నాకు కొంత సమయం అయితే పట్టింది..కానీ చాలా సినిమాలు చేసిన అనంతరం ఇప్పుడు ఏదైనా సెక్సీ సాంగ్ కానీ హార్డ్ కోర్ యాక్షన్ సహా ఢిపరెంట్ రోల్స్ చేయడానికి నాపై నాకు నమ్మకం వచ్చింది. ఇంతకుముందు నాలో ఈ ధైర్యం లేదు. కానీ ఇప్పడు నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వచ్చింది. వయసుతో పాటు ఇచ్చిన మెచ్యురిటీ ఇది' అంటూ సమంత పేర్కొంది. ఇక సామ్ లేటెస్ట్ సమంత ఫోటోపై రియాక్ట్ అయిన హీరోయిన్ తమన్నా బ్యూటీ అంటూ కామెంట్ చేసింది. కాగా హరి, హరీష్ దర్శకత్వంలో సమంత నటించిన యశోద సినిమాకు విడుదలకు రెడీ అవుతుంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కతున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
తెల్లటి నెమలిని ఎప్పుడైనా చూశారా? వీడియో వైరల్
white peacock captured in flight: సాధారణంగా నెమలి అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నెమళ్లు ఎక్కడైన కనిపిస్తే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా తన్మయంతో చూస్తుంటారు. నిజానికి తెల్లటి నెమళ్లు గురించి గానీ అవి ఉంటాయని గానీ ఎవ్వరికీ తెలియదు. ఈ వైరల్ వీడియో చూస్తే కచ్చితంగా పాల నురుగులాంటి ఒక అత్యద్భుతమైన నెమలి ఉందని ఒప్పుకుంటారు. వివరాల్లోకెళ్తే....ఉత్తర ఇటాలియన్ ద్వీపం ఐసోలా బెల్లాలోని బరోక్ గార్డెన్‌లోని శిల్పం వద్ద ఒక అరుదైన దేవతా పక్షిలా కనువిందు చేసింది. తొలుత ఈ పక్షిని చూసిన వెంటనే ఏంటిది అనిపిస్తుంది. దాన్ని నిశితంగా చూస్తే గాని అది తెల్లటి నెమలి అని అవగతమవదు. అంతేకాదు దాని ఈకలు తెల్లగా దేవతా పక్షి అనిపించేలా మెరుస్తూ ఉంటాయి. అయితే ఇవి లూసిజం అని పిలువబడే జన్యు పరివర్తన అని శాస్తవేత్తలు అంటున్నారు. ఇవి ఎక్కువగా బంధింపబడే ఉంటాయని చెబుతున్నారు. వీటి జనాభా కూడా చాలా తక్కువేనని అంటున్నారు. White peacock in flight..🦚😍 pic.twitter.com/CnBNbSoprO — 𝕐o̴g̴ (@Yoda4ever) April 29, 2022 (చదవండి: నాగుపాముతోనే నాగిని డ్యాన్స్.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు) -
మరణాన్ని తట్టుకోలేకపోయింది.. కడదాకా వెంటపడింది
మనుషులకు మల్లే పశుపక్ష్యాదులు భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. పిల్లల కోసం అల్లలాడిపోవడం, ఆపదలో అవసరమైతే పోరాడడం, యజమానుల పట్ల విశ్వాసం, ఆప్యాయత-ప్రేమల్ని ప్రదర్శించడం ఈ కోవలోకే చెందుతాయి కూడా. అయితే మృతి చెందిన తన నేస్తాన్ని పూడ్చడానికి వెళ్తుంటే.. ఆ బాధను తట్టుకోలేక ఓ పక్షి చేసిన పని నెటిజనుల హృదయాన్ని కరిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని కుచేర ప్రాంతంలో రామస్వరూప్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇంటి వద్ద రెండు నెమళ్లు సందడి చేసేవి. ఎక్కడి నుంచో వచ్చిన వాటికి రోజూ ధాన్యం గింజలు వేస్తున్నాడాయన. అలా నాలుగేళ్లు గడిచిపోయింది. అయితే అందులో ఓ నెమలి మృతి చెందింది. దీంతో ఇద్దరు వ్యక్తులను పురమాయించి ఆ నెమలిని పూడ్చమని చెప్పాడు రామస్వరూప్. నెమలి మృతదేహాన్ని పూడ్చడానికి తీసుకువెళ్లున్న క్రమంలో.. పాపం మరో నెమలి దాని వెంట పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నెమలి తన సహచర నెమలిని విడిచి ఉండలేకపోతోంది. హృదయాన్ని కదిలించే వీడియో’ అని కామెంట్ జతచేశారు. అలా పరుగులు తీసిన నెమలి.. ఖననం చేసేదాకా ఆ నెమలి అక్కడే ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఆ నెమలి పరుగులు తీసిన వీడియోను 1.26 లక్షల మంది వీక్షించారు. నెమలి వీడియో వీక్షించిన నెటిజనులు హార్ట్ టచింగ్ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘మనుషుల కంటే పక్షులు, పశువులకే ప్రేమ అధికంగా ఉంటుంది!’, ‘ఆ నెమలి ఎంత బాధ అనుభవిస్తోందో.. పక్షి ప్రేమికులకు తెలుస్తుంది’, ‘దేవుడి సృష్టి చాలా గొప్పదని.. ప్రేమ, అనుబంధాలకు సంబంధించి ఆ నెమలి ఆధునిక మానవుని కళ్లు తెరిపిస్తోంది’, ‘నువ్వు లేక నేనుండలేను నేస్తం.. నువ్వు ఎక్కడికి పోతున్నావ్!’ అని నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు. The peacock doesn’t want to leave the long time partner after his death. Touching video. Via WA. pic.twitter.com/ELnW3mozAb — Parveen Kaswan (@ParveenKaswan) January 4, 2022 -
బైకర్పై దాడి.. వ్యక్తి, నెమలి మృతి
తిరువనంతపురం: కేరళలో విషాదం చోటు చేసుకుంది. జనావాసంలోకి వచ్చిన ఓ నెమలి హంగామా సృష్టించింది. ఎగురుతూ వెళ్లి బైక్ మీద వస్తున్న ఓ వ్యక్తిని తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నెమలి మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన బైకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కేరళ అయ్యంతోల్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ప్రమోద్ తన భార్య వీణతో కలిసి బైక్ మీద వెళ్తున్నాడు. ఇంతలో అటుగా ఎగురుతూ వచ్చిన నెమలి.. బైక్ మీద ఉన్న ప్రమోద్ ఛాతీలో పొడిచింది. ఈ క్రమంలో ప్రమోద్ బ్యాలెన్స్ కోల్పోయి.. పక్కనే ఉన్న కంపోజిషన్ గోడకు గుద్దుకున్నాడు. ఈ ఘటనలో నెమలి అక్కడికక్కడే మృతి చెందగా ప్రమోద్, అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రమోద్ తీవ్ర గాయాలపాలు కావడంతో అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సందర్భంగా ఓ ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇతర పక్షుల్లాగా నెమళ్లు ఎక్కువ ఎత్తు.. దూరం ఎగరలేవు. అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో నెమళ్లు జనావాసంలోకి రావడం బాగా పెరిగింది’’ అని తెలిపాడు. -
Peacock: మయూర వయ్యారం.. కళ్లారా వైభోగం
పచ్చని ప్రకృతి ఒడిలో మయూరాలు వయ్యారాలు పోయాయి. ఆనందంతో పురివిప్పి నాట్యమాడాయి. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనగా.. నెమళ్లు అందంగా నాట్యమాడుతూ, గెంతులేస్తూ అటువైపు వెళ్లిన వారికి కనువిందు చేశాయి. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొకన్పల్లి గ్రామ శివారులో ఈ నెమళ్ల సందడిని ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
‘బిగ్‌బాస్’ బ్యూటీపై నెమలి దాడి..
-
‘బిగ్‌బాస్’ బ్యూటీపై నెమలి దాడి.. వీడియో వైరల్
‘బిగ్‌బాస్’బ్యూటీ, బాలీవుడ్ టీవి నటి దిగంగన సూర్యవంశిపై నెమలి దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం ఒక అందమైన నెమలి దగ్గరకు దిగంగన వెళ్లింది. అది అలాగే చూస్తూ ఉండడంతో నవ్వుతూ మరింత దగ్గరకు వెళ్లింది. నెమలి మెల్లిగా ముందుకు వచ్చి అకస్మాత్తుగా దిగంగనపై దాడిచేసింది. దీంతో భయానికి లోనైన దిగంగన.. గట్టిగా అరుస్తూ చేతులతో నెమలిని కిందికి తోసేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. బాలీవుడ్లో పలు సీరియళ్లలో నటించిన దిగంగన..‘ఏక్ వీర్ కి అర్దాస్ ... వీరా’తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ సిరియల్ వల్లే..హిందీ బిగ్‌బాస్-9లోకి వెళ్లింది. అనంతరం పలు సినిమాల్లో నటించిది. తెలుగులో యువహీరో కార్తికేయతో కలిసి ‘హిప్పీ’సినిమాలో నటించింది. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ చిత్రంలో రెండో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్గా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎలుగుబంటి విత్ పింఛం
కొన్ని చాలా సడెన్‌గా జరుగుతాయి.. కన్నార్పేలోపే మాయమైపోతుంటాయి కూడా.. ఇక్కడ కనిపించే చిత్రం కూడా అలాంటిదే.. బైజూపాటిల్ అనే ఫొటోగ్రాఫర్ కాస్త చురుకు కాబట్టి.. వెంటనే ఇలా క్లిక్మనిపించేశాడు.. చూశారుగా.. ఎలుగుబంటి విత్ పింఛం.. రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో పర్యాటకులు జీప్‌లో వెళ్తుండగా.. నెమలి పింఛం విప్పి ఆడటం మొదలుపెట్టింది.. వారు చూస్తున్నారు.. అంతలో ఒక ఎలుగుబంటి అలా వచ్చి.. నిల్చుని చూడటం.. బైజూపాటిల్ తన కెమెరా కంటిలో దీన్ని బంధించేయడం చకచకా జరిగిపోయాయి. -
మయూరానికి ప్రేమతో...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నెమలికి ఆహారం అందిస్తున్న దృశ్యమిది. ఇదే కాంపౌండ్‌లో ఆఫీసు భవనాలు ఉన్నాయి. వీటి మధ్య నిత్యం మోదీ మార్నింగ్ వాక్ చేస్తుంటారు. ప్రధాని నడక, ఇతర వ్యాయామాలు చేస్తుంటే పరిసరాల్లో నెమళ్లు తచ్చాడుతుంటాయట. వీటి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూసుకుంటారాయన. ప్రకృతి ప్రేమికుడైన మోదీ తన నివాసంలో పక్షులు గూళ్లు పెట్టుకునేందుకు వీలుగా ఎత్తైన స్తంభాలతో కూడిన ఆకృతులను కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం వాకింగ్ చేస్తున్నపుడు తన దగ్గరకు వచ్చిన నెమళ్లకు మోదీ కింద కూర్చొని మరీ ఇలా ఆహారం అందించారు. తన మార్నింగ్ వాక్ దృశ్యాలతో కూడిన 107 సెకన్ల నిడివిగల వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. -
కంటి చూపు పోగొట్టిన సెల్ఫీ
చెన్నై,తిరువొత్తియూరు: సెల్ఫీ తీస్తున్న సమయంలో రైతు కన్నును నెమలి పొడవడంతో అతను ఆ కంటి చూపును కోల్పోయే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కృష్ణగిరి జిల్లా డెంకినీకోట మారుదాంపల్లెకి చెందిన రామచంద్రారెడ్డి (60) రైతు. అతని ఇంటికి సమీపంలో రోజూ మధ్యాహ్నం సమయంలో ఆహారం కోసం ఒక నెమలి వచ్చి వెళ్లేది. దీన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన రైతు బాలాజీ (33) ఆ నెమలి పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం నెమలి వచ్చిన వెంటనే దాని పక్కకు వెళ్లి నిలబడి సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో నెమలి హఠాత్తుగా బాలాజీ ఎడమకంటిని తన ముక్కుతో పొడిచింది. ఈ ఘటనలో అతని కంటి నుంచి రక్తం వెలువడింది. అతన్ని చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి డాక్టర్లు కంటి చూపు రావడం చాలా కష్టమని తెలిపారు. నెమలిని సోమవారం గ్రామ ప్రజలు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న డెంకినీ కోట అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని నెమలిని విడిపించి ఐఆర్ అటవీశాఖ ప్రాంతంలో వదలిపెట్టారు. -
ఆనంద నాట్యం
కడప :అట్లూరు మండలం తంభళ్లగొంది పంచాయతీ పరిధిలో నబీ ఆభాద్ గ్రామం ఉంది. గ్రామంలో 25 కుటుంబాల వారు నివసిస్తున్నారు. అంతా ముస్లింలే. ఆ గ్రామంలోకి రెండేళ్ల క్రితం లంకమల్లేశ్వర అభయారణ్యం నుంచి ఒక నెమలి పిల్ల వచ్చింది. దాన్ని గ్రామస్తులు చేరదీసి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ నెమలి పెద్దదై గ్రామంలో కోళ్లతో కలిసి కలియ తిరుగుతూ రోజూ ఉదయం, సాయంత్రం పురి విప్పి నాట్యం చేస్తోంది.æ ఈ గ్రామం కడప–బద్వేలు ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ఆ దారి వెంట వెళ్లే వారు సైతం నెమలి నాట్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ గ్రామస్తులు నెమలిని ప్రేమగా పెంచుకుంటున్న తీరును చూస్తుంటే వారికి సలాం కొట్టాలనిపించక మానదు. -
‘వావ్.. ట్రాఫిక్ జామ్ అయితే ఎంత బాగుందో’
నెమలి కనిపిస్తే ఎప్పుడు పురివిప్పి నాట్యం చేస్తుందా అని ఎదురు చుస్తాం. అంత అద్భుతంగా ఉంటుంది మరి దాని అందం. అదే పదుల సంఖ్యలో నెమళ్లు రోడ్లపైకి వచ్చి తిరుగుతుంటే ఎలా ఉంటుంది. చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. దేశమంతా లాక్డౌన్ ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో అడవి జంతువులన్ని రోడ్లపైకి వచ్చి స్వేచ్ఛగా విహరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చిన అనంతరం రోడ్లపై వాహనాల రాకపోకలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో రద్దీగా ఉన్న రోడ్డుపైకి అనుకొని అతిథులు వచ్చి వాహనదారులకు కాస్తా ట్రాఫిక్ జామ్ కలిగించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. కొన్ని నెమళ్లు గుంపులుగా రోడ్డుపైకి అడ్డంగా వచ్చాయి. వాటిలో ఒకటి ఒక్కసారిగా పురివిప్పి అందంగా కనిపించింది. ఈ దృశ్యాలను భారతీయ అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ‘జాతీయ పక్షితో అద్భుతమైన ట్రాఫిక్ జామ్’ అంటూ ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు దీనిని లక్షా ఇరవై వేల మంది వీక్షించారు. నెమళ్ల కారణంగా రోడ్డుపై వెళుతున్న వాహనాలకు కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే దీనిని విసుగ్గా భావించకుండా ఆసక్తిగా తిలకిస్తున్నారు. ‘వావ్ .... ఎంత ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన ట్రాఫిక్ జామ్.. గంటల కొద్ది ట్రాఫిక్‌లో ఇరుకున్న ఇబ్బందిగా అనిపించదు. ’’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (కరోనా : అనుకోని అతిధి వైరల్ వీడియో) -
కరోనా : అనుకోని అతిధి వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ , లాక్డౌన్ సంక్షోభ కాలంలో నాలుగ్గోడలకే పరిమితమైన మీ ఇంటికి అనుకోని అతిధి వస్తే ఎలా వుంటుంది. అదీ ఒక అందమైన సోయగాల మయూరం వచ్చి వయ్యారంగా తలుపు తడితే..ఏం చేస్తారు..సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది ఓ నెటిజనుడికి. దీంతో పరవశించిపోయిన గుంజన్ మెహతా అనే యూజర్ ఈ అపురూప దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఎక్కడినుంచి తెలీదుగానీ, ఒక నెమలి కిటికీ మీద వాలి..ఎంతో పొందిగ్గా.. టక్..టక్.టక్.. ఎవరైనా ఉన్నారా లోపల అన్న చందంగా ముక్కుతో పొడుస్తున్న ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీ, కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేయమంటే కొందరు చమత్కరిస్తోంటే.. పాపం ఆకలేస్తోందేమే.. కొద్దిగా తృణధాన్యాలు, కాస్త నీరు ఇవ్వండి అని మరికొందరు సూచిస్తున్నారు. కోరలు చాచిన కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. మనుషులంతా ఇంటికే పరిమితమవుతున్నారు. ఆహారం, నీరు లభ్యం కాక కొన్ని మూగ జీవులు, పక్షులు అల్లాడుతున్నాయి. మరోవైపు అన్ని రవాణా సేవలు నిలిచిపోవడంతో కాలుష్యం గణనీయంగా తగ్గి ప్రకృతి సేదతీరుతోంది. చదవండి : మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ -
నెమలి సోయగం.. అద్భుతమైన వీడియో!
అటవీ శాఖ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో అరుదైన వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. తాజాగా.. అందమైన ఈకలను రెపరెపలాడిస్తూ నెమలి చెట్టుపైకి ఎగురుతున్న అద్భుత దృశ్యాలు చూసే అవకాశం తన ఫాలోవర్లకు కల్పించారు. ‘‘నెమలి ఇలాగే ఎగురుతుంది. దాని తోకలోని ఈకలు దాదాపు ఆరు అడుగుల పొడవు ఉంటాయి. శరీరం పొడవు కంటే అవే 60 శాతం ఎక్కువ’’అంటూ ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియోకు వారంతా ఫిదా అవుతున్నారు.(ఇళ్ల ముందు నుంచే కనిపిస్తున్న మంచుకొండలు) ఇక ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ సాధించిన ఆ వీడియో రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో తీశారు. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ హర్షా నరసింహమూర్తి గతేడాది తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించారు. రెండు నెమళ్లు నడుస్తూ వెళ్తుండగా... అందులో ఒకటి తన పింఛం సోయగాన్ని ప్రదర్శిస్తూ ఓ కొమ్మపై వాలింది. ఈ అద్భుత వీడియోను చూసిన నెటిజన్లు హర్షతో పాటు అతడి వీడియోను షేర్ చేసినందుకు సుశాంత్ నందాను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి.(‘ఘోస్ట్ ఆఫ్ మౌంటేన్’.. ఇవి అందమైనవి!) -
నెమలి ఆర్డర్ చేస్తే టర్కీ కోడి వచ్చింది..!
సాధారణంగా పెళ్లి వేడుకల్లో వివాహం చేసుకునే జంట అందమైన, రంగురంగుల ఆకృతిలో ఉండే కేకులను కట్ చేసి తమ అనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. ఈ క్రమంలోనే జార్జియాకు చెందిన రెనా డేవిస్ అనే పెళ్లి కూతురు తన వివాహ వేడుకకు నెమలి ఆకారంలో ఉన్న కేకును 300 డాలర్లు ఖర్చు చేసి మరి ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. కేకు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన తాను కేకు వచ్చాక దాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆ కేకు పూర్తిగా తాను పంపించిన నెమలి ఆకారానికి భిన్నంగా ఉండటంతో సదరు పెళ్లి కూతురు అగ్గి మీద గుగ్గిలంలా మారింది. తాను వృత్తాకారంలో ఉండే పదార్థం మీద కూర్చున్న నెమలి.. తన పింఛము కన్నులు నీలం, ఆకుపచ్చ రంగులతో చిన్న బుట్ట కేకులుగా ఉండే కేకును ఆర్డర్ చేసింది. అయితే అందమైన కేకు కోసం వేచి చూసిన రెనాకు చేదు అనుభవం ఎదురైంది. వింత ఆకారంలో తయారు చేయబడిన కేకును రేనా వదిన అన్నెట్ హిల్ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘కేకును తయారు చేసే పదార్థం తెల్లగా లేదు. కుష్టి రోగం వచ్చిన నెమలి లేదా ఓ టర్కీ కోడిలా కేకు మాకు దర్శనమిచ్చిందని వ్యంగ్యంగా తెలిపారు. కనీసం ఆ పక్షికి తోక కూడా సరిగా లేదని మండిపడ్డారు. ఎటునుంచి చూసినా ఆ పక్షి ఆకారం తాము ఆర్డర్ చేసిన నెమలి ఆకృతిలో మాత్రము లేదని’ హిల్ పేర్కొన్నారు. ఇంత వికృతంగా తయారుచేయబడిన ఈ కేకు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చివరగా సంబంధిత బేకరీ సిబ్బంది కేకు డబ్బులను తిరిగి ఇచ్చినట్టు హిల్ తెలిపారు. -
మైమరపించి.. ఆపై మరణించి..
చిత్తూరు, భాకరాపేట : అడవుల్లో నుంచి ఓ నెమలి గ్రామంలోకి వచ్చి పురి విప్పి నాట్యమాడుతూ గ్రామస్తులను మైమరపిస్తూ ప్రాణాలు వదిలిన ఘటన చిన్నగొట్టిగల్లు మండలం దిగవూరు పంచాయతీ గాజులవారిపల్లెలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. చాలారోజులుగా ఓ నెమలి తరచూ గ్రామంలోకి వచ్చి కొంతసేపటి తర్వాత వెళ్లిపోయేది. గ్రామస్తులు కూడా నెమలి రాక కోసం చూసేవారు. క్రమంగా అది ఆ గ్రామంలో ఓ భాగమైంది. అది శుక్రవారం ఉదయం ఓ చెట్టు కింద నాట్యమాడింది. గ్రామస్తులు తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. నెమలి హఠాత్తుగా గిలగిలమంటూ కొట్టుకుని కింద పడిపోయింది. గ్రామస్తులు పరిశీలించ గా అప్పటికే ప్రాణాలు వదిలేసింది. దీంతో గ్రామస్తులు ఆవేదన చెందారు. గ్రామంలో చంటి బిడ్డలు ఏడిస్తే నెమలిని చూపిం చి వారికి బువ్వ పెట్టేవారమని, ఉదయం, సాయంత్రం వేళల్లో పురివిప్పి నాట్యం ఆడుతుంటే చూడడానికి కన్నులు చాలవని గ్రామస్తులు చెప్పారు. వెంటనే భాకరాపేట ఫారెస్టు అధికారులకు సమాచారం తెలియజేయడంతో వారు వచ్చి తీసుకెళ్లి పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి జూపార్క్‌కు పంపించారు. గాజులవారిలపల్లె గ్రామస్తులు మాత్రం నెమలి చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు సైతం ఆ గ్రామస్తులు నెమలిపై చూపిన ప్రేమకు ఆశ్చర్యానికి లోనయ్యారు. -
మయూరం.. వయ్యారం
కోస్గి : మేఘాలు కమ్ముకున్న వేళ.. ఆనంద పరవశంలో ఓ మయూరం తన పురివిప్పి చేసిన నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం పట్టణ శివారులోని బిజ్జారపు బావుల కాలనీ సమీపంలోని ఓ రైతు పొలంలో ఇదిగో ఇలా నాట్యమాడుతూ అబ్బురపరిచింది. పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలి -
నెమలి జన్యుక్రమాన్ని కనుగొన్నారు
సాక్షి, న్యూఢిల్లీ : మన జాతీయ పక్షి నెమలి జన్యు క్రమాన్ని భోపాల్‌లోని ఐఐఎస్ఆర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెమలి పురివిప్పినప్పుడు అందంగా కనిపించే నెమలి పించాలు నెమలికి ఎలా వచ్చాయి? బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ నెమలి ఎలా గాల్లోకి సులువగా ఎగురగలుగుతుందన్నది నెమలికి సంబంధించిన రెండు ప్రత్యేక అంశాలు. ఏడాదిన్నర కృషితో ఇప్పుడు నెమలి జన్యుక్రమాన్ని పరిశోధకులు కనుగొనడంతో ఈ రెండు ప్రత్యేక అంశాలు దానికి ఎలా సిద్ధించాయో! సులభంగానే తెలుసుకోవచ్చు. నెమలిలో మొత్తం 15,970 జన్యువులు, 110 కోట్ల డీఎన్ఏ జతలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. నెమలికి దగ్గరిగా ఉండే మన నాటు కోడి, టర్కీ కోడితోని పోల్చి చూడగా నెమలిలో 99 జన్యువులు వేరుగా ఉన్నాయి. నెమలి పిండం ఎదగడానికి, దానిలో రోగ నిరోధక శక్తి పెరగడానికే ఈ జన్యువులు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని వారు తేల్చారు. 99 భిన్నమైన జన్యువులు కనిపించడం తమకు నూతనోత్సాహాన్ని కలిగిస్తోందని ‘బీ10కె ప్రాజెక్ట్’ నిర్వాహకుల్లో ఒకరైన గోజీ జాంగ్ వ్యాఖ్యానించారు. 2020 నాటికి అన్ని పక్షి జాతుల జీనోమ్‌ను కనుగొనడమే తమ ప్రాజెక్ట్ లక్ష్యమని ఆయన తెలిపారు. కోళ్లు ఏడెనిమిది ఏళ్లు జీవిస్తుండగా, టర్కీ కోళ్లు పదేళ్లు జీవిస్తాయి. నెమళ్లు మాత్రం 25 సంవత్సరాలు జీవిస్తాయి. కోళ్లకన్నా నెమళ్లు ఎక్కువ కాలం జీవించడానికి కారణం అందులో ప్రత్యేకంగా కనిపిస్తోన్న 99 జన్యువులే కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. నెమళ్లలో ఆడ నెమళ్లే తమతో లైంగికంగా జతకట్టే మగనెమళ్లను ఎంపిక చేసుకోవడం వీటిలో ఉండే మరో ప్రత్యేకత. అందుకే ఆడ నెమళ్ల దష్టిలో పడేందుకు మగ నెమళ్లు పురివిప్పి నాట్యమాడుతున్నట్లుగా తిరుగుతాయి. మగ నెమలి పించాల్లో ఎన్ని కనులు ఉన్నాయనే అంశం ఆధారంగానే వాటి లైంగిక జీవితం ఆధారపడుతుంది. సాధారణంగా ఆడ నెమళ్ళు ఎక్కువ ఈకలపై ఎక్కువ కన్నులున్న నెమళ్లనే జోడిగా ఎంపిక చేసుకుంటాయి. వాటి లైంగిక పటుత్వానికి నెమలి కన్నులు ప్రతీకగా నిలుస్తున్నాయని, ఈ విషయంలో మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.