
జనారణ్యంలోకి జాతీయ పక్షి
అప్పుడే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగుంటాయి. తాగునీటి కోసం జనమే కాదు.. వన్యప్రాణులు సైతం విలవిల్లాడిపోతున్నాయి. దాహార్తిని తీర్చుకునేందుకు అడవులు వదిలి జనారణ్యంలోకి వన్యప్రాణులు వచ్చేస్తున్నాయి. అందుకు మడకశిర మండలం ఆదిరెడ్డిపాళ్యం సమీపంలోని ప్రధాన రహదారిపైకి ఓ నెమలి ఒయ్యారంగా నడుచుకుంటూ వచ్చిన దృశ్యం ఆ మార్గంలో రాకపోకలు సాగించిన వారందరినీ గురువారం ఆకట్టుకుంది. కాసేపటికి అక్కడే ఉన్న కోళ్ల మధ్యలోకి చేరుకుంది. వన్యప్రాణులకు మేత, నీరు ఏర్పాటు చేయాలని స్థానికులు అటవీ అధికారులను కోరారు.
- మడకశిర రూరల్