
వైరల్ కావడంతో తొలగించిన యూట్యూబర్
తంగళ్లపల్లి (సిరిసిల్ల): జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ తన యూ ట్యూబ్ చానల్‌లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ అనే వ్యక్తి కొన్నా ళ్లుగా శ్రీటీవి అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు.
అయితే శనివారం తన యూట్యూబ్ చానల్‌లో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ విస్తుపోయారు. అంతేకాకుండా అడవిపంది కూర వండటం గురించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ చానల్‌లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment