ఆనంద నాట్యం | Peacock Dance in Atluru Forest Area YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఆనంద నాట్యం

Published Wed, May 27 2020 11:08 AM | Last Updated on Wed, May 27 2020 11:08 AM

Peacock Dance in Atluru Forest Area YSR Kadapa - Sakshi

కడప :అట్లూరు మండలం తంభళ్లగొంది పంచాయతీ పరిధిలో నబీ ఆభాద్‌ గ్రామం ఉంది. గ్రామంలో 25 కుటుంబాల వారు నివసిస్తున్నారు. అంతా ముస్లింలే. ఆ గ్రామంలోకి రెండేళ్ల క్రితం లంకమల్లేశ్వర అభయారణ్యం నుంచి ఒక నెమలి పిల్ల వచ్చింది. దాన్ని గ్రామస్తులు చేరదీసి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ నెమలి పెద్దదై గ్రామంలో కోళ్లతో కలిసి కలియ తిరుగుతూ రోజూ ఉదయం, సాయంత్రం పురి విప్పి నాట్యం చేస్తోంది.æ ఈ గ్రామం కడప–బద్వేలు ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ఆ దారి వెంట వెళ్లే వారు సైతం నెమలి నాట్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ గ్రామస్తులు నెమలిని ప్రేమగా పెంచుకుంటున్న తీరును చూస్తుంటే వారికి సలాం కొట్టాలనిపించక మానదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement