
పచ్చని ప్రకృతి ఒడిలో మయూరాలు వయ్యారాలు పోయాయి. ఆనందంతో పురివిప్పి నాట్యమాడాయి. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనగా.. నెమళ్లు అందంగా నాట్యమాడుతూ, గెంతులేస్తూ అటువైపు వెళ్లిన వారికి కనువిందు చేశాయి.
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొకన్‌పల్లి గ్రామ శివారులో ఈ నెమళ్ల సందడిని ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment