Nizambad District
-
వలస కార్మికులకు మొండిచేయి
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ వలస కార్మికులకు మరోసారి మొండిచేయి ఎదురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. ఎన్నో సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించిన తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికుల ఆశలను తీర్చలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో.. గల్ఫ్ వలస కార్మికుల అంశంపై ప్రత్యేక హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం రూ.7.50 కోట్లను ఖర్చు చేసింది. ఈసారి మాత్రం ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ బోర్డు ఏర్పాటుతో పాటు రూ.500 కోట్ల కేటాయింపులే లక్ష్యంగా వలస కార్మిక సంఘాలు కృషి చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులతో అనేకమార్లు సమావేశాలను నిర్వహించారు. సీఎం కూడా గల్ఫ్ వలస కార్మికుల ఆశలు తీర్చడానికి సానుకూలంగానే స్పందించారు. తీరా బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం, కనీసం వలస కార్మికుల సంక్షేమం ప్రస్తావనే లేకపోవడంతో వలస కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వలస కార్మికులను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తీరుపైనా అలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఎన్నోమార్లు చర్చించి.. గల్ఫ్ వలస కార్మికులు, వారి కుటుంబాల ఓట్లను రాబట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంది. గల్ఫ్ ఓటర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందేవారు. ఒకవేళ ఓడినా.. ఓట్లలో వ్యత్యాసం తక్కువగా ఉండేది. అయినా వలస కార్మికులను కరివేపాకులాగా తీసి పారేశారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి.చదవండి: యూఏఈకి ఉచిత వీసాలు.. నకిలీ గల్ప్ ఏజెంట్లకు చెక్ప్రభుత్వ తీరు సరికాదు వలస కార్మికుల ఆశలు తీర్చేలా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆశించాం. ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయక నిరాశ మిగిల్చింది. వలస కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోవడం శోచనీయం. వలస కార్మికులు పంపే విదేశీ మారకద్రవ్యం అవసరం కానీ వారి సంక్షేమం పట్టక పోవడం సరైంది కాదు. – గుగ్గిల్ల రవిగౌడ్, చైర్మన్, గల్ఫ్ జేఏసీ -
వలస కార్మికుల మృత్యు ఘోష
మోర్తాడ్ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో గుండెపోటుతో మరణించాడు. వారం రోజుల కిందనే ఒమన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రాజన్న అనే వలస కార్మికుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై బ్రెయిన్‌డెడ్‌తో మృత్యువాత పడ్డాడు. ఇలా గల్ఫ్ దేశాల్లో తెలంగాణ (Telangana) జిల్లాలకు చెందిన వలస కార్మికులు అనారోగ్యం, మానసిక ఒత్తిడితో గుండెపోటుకు గురై చనిపోతూనే ఉన్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఏడాది కాలంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతర్, ఒమన్ (Oman), బహ్రెయిన్, కువైట్, ఇరాక్లలో దాదాపు 200 మంది వలస కార్మికులు వివిధ కారణాలతో మరణించారు. గతంలో కంటే మరణాల సంఖ్య రెండేళ్ల నుంచి పెరగడంతో కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించకపోవడంతోనే ప్రమాదం పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది.అంపశయ్యపై ప్రవాసీల ఆరోగ్యంగల్ఫ్ దేశాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లిన వలస కార్మికుల్లో అత్యధికులు తక్కువ నైపుణ్యం గల అల్పాదాయ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తాము పని చేసేచోట అనారోగ్యం పాలైతే ఖరీదైన వైద్యం అందుకోలేని దుస్థితిలో ఉన్నారు. వైద్య ఖర్చులను భరించలేక ఎడారి దేశాల్లో వలస కార్మికులు మృత్యువాత పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎల్లలు దాటి విదేశాలకు వలస వెళ్లిన వారికి అంతర్జాతీయ సూత్రాల ప్రకారం ఆరోగ్య హక్కు ఉన్నా దీనిపై అవగాహన లేకపోవడం, విదేశాంగ శాఖ దృష్టి సారించకపోవడం, కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యంతో వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణ గాలిలో దీపంలా మారింది.చదవండి: ఆదిలాబాద్ కా అమితాబ్ అధిక పనిగంటలు, తీవ్ర ఒత్తిడి, విశ్రాంతి లేకుండా జీవనం సాగిస్తుండటంతో వలస కార్మికులు మానసిక వేదనకు గురవుతున్నారు. గడిచిన రెండు నెలల్లో 20 మంది బ్రెయిన్‌డెడ్‌తో మరణించినట్లుగా నమోదవడం గమనార్హం. పనిచేసే చోట భద్రత లేకపోవడం, నైపుణ్యం లేక ప్రమాదాలకు గురి కావడం వలస కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది.ప్రవాసీ బీమాలో ‘ఆరోగ్యం’కరువు దేశం నుంచి గల్ఫ్‌తో సహా 18 దేశాలకు వలస వెళ్తున్న ఈసీఆర్ కేటగిరీ (10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగిన) వారికి భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం తప్పనిసరి విధానంలో అమలు చేస్తుంది. ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్న ఈ బీమా పథకంలో ఆస్పత్రి ఖర్చులకు సంబంధించిన అంశం లేకపోవడంపై కార్మిక సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి వలస కార్మికుల అనారోగ్య మరణాలు, ఆత్మహత్యలను నిరోధించడానికి విదేశాంగ శాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పలువురు కోరుతున్నారు. -
ఉత్తర తెలంగాణకు మంచిరోజులెన్నడు?
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధికి పుష్కల వనరులు ఉన్నా... పేదరికమూ, దారిద్య్రమూ తాండవిస్తూనే ఉన్నాయి. రైతన్నల ఆత్మ హత్యలు, నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి. యువత ఎడారి బాట పడుతుంటే... బీడీ కార్మికుల బతుకులు మసిబారుతున్నాయి. సామాజిక అణిచివేతలు సరేసరి! ఇలా ఎన్నో సమస్యలు. గతం గతః. నేడు కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశతో ఈ ప్రాంతవాసులు ఉన్నారు.రాష్ట్రంలోనే ఓ మూలకు విసిరేయబడ్డ ట్లున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్నింటా వివక్షకు గురవుతోంది. ఆదర్శ జిల్లాగా చెప్పు కుంటున్న ఆదిలాబాద్ కేవలం అక్షర క్రమంలోనే ముందుండి, అభివృద్ధిలో మాత్రం ఏళ్లుగా వెనుక బాటుకు గురవుతోంది. ఉన్నంతలో కొంత మేరకు పైపై అభివృద్ధి ఛాయలు కనిపిస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలది మరో ప్రత్యేక స్థితి. కార్పొరేటీకరణ దుష్ఫలితంగా విద్య, వైద్యం పేదలకు ఎండ మావిగానే మిగులుతున్నాయి. ప్రపంచీకరణ పుణ్యమా అని అసంఘటిత, బీడీ కార్మికుల బతుకులు మరింత దుర్భర మవుతున్నాయి. మూడు జిల్లాల్లో కలిపి సుమారు 7–8 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఆకాశాన్నంటు తున్న ధరలు, అందని కనీస వేతనాలు, వెరసి వీరి బతుకులు మరింత దుర్భర స్థితిలోకి నెట్ట బడుతున్నాయి.ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) మొత్తం జనా భాలో 18 శాతం మంది గిరిపుత్రులున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర చరిత్రలోనూ వీరివి చీకటి బతుకులే. జ్వరమొచ్చినా. జలుబు చేసినా వందల్లో జనం రాలిపోవాల్సిందే. ఈ మూడు జిల్లాల్లోనూ పుష్కల వనరులున్నా వాటి సద్వినియోగం లేక లక్షల మంది యువత ఉపాధి కోసం ఎడారి బాట పడుతున్నారు. ప్రణాళికా బద్ధంగా వినియోగించుకుంటే పక్క రాష్ట్రాలకు అప్పిచ్చేంత నీటి వనరులున్నాయి. అయినా ఖరీఫ్ ప్రారంభంలో రైతులు కారుమబ్బుల నుండి జాలువారే చినుకు కోసం ఆకాశానికేసి ఎదురు చూడాల్సిందే. గోదావరి వంటి జీవ నదులు, సిరులు పండించే సారవంతమైన నల్లరేగడి నేలలు, విస్తారమైన అటవీ సంపద. సిరులు కురిపించే సింగరేణి బొగ్గు గనులు, (Sigareni Coal Mines) విస్తారమైన ఖనిజ సంపద ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఇలా ఎన్ని ఉన్నా వనరులను ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేక పోతోంది.నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ... అభివృద్ధికి నోచుకోని ఉత్తర తెలంగాణ జిల్లాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇక్కడి దుర్భిక్ష పరిస్థి తుల్ని పారదోలేందుకు ‘జలయజ్ఞం’ ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి బాటలు వేసిన మహానేత ఆయన. అయితే గడిచిన దశాబ్ద కాలంలో ఏ ఒక్క కొత్త పరిశ్రమ స్థాపించకపోగా ఉన్న పరిశ్రమలనేకం ఉత్తర తెలంగాణలో మూసి వేతకు గురయ్యాయి. ఆదిలాబాద్‌లో సీసీఐ మూసివేతతో 2,500 మంది, స్పిన్నింగు మిల్లు ప్రైవేటీకరణతో 750 మంది, నిర్మల్ ప్రాంతంలో నటరాజ్ స్పిన్నింగ్ మిల్లుల మూతతో 2,000 మంది, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ (Bodhan Sugar Factory) మూసివేతతో 2,500 మంది, కరీంనగర్లో ఎరువుల కర్మాగారం మూతతో 2,500 మంది ఉపాధికి దూరమయ్యారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఈ పరి స్థితుల్లో యువతకు గల్ఫ్ బాట తప్పడం లేదు. ఫలితంగా వేలాది కుటుంబాల్లో గల్ఫ్ గాయం మిగులుతోంది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వైఎస్సార్ ‘సమ వికేంద్రీకరణ’ సిద్ధాంతం బదులు ‘అపసవ్య కేంద్రీకరణ’పై దృష్టి పెట్టడంతో ప్రాంతాల మధ్య అసమాన తలు మళ్లీ మొదలవుతున్నాయి.చదవండి: చెప్పిన గొప్పలు ఏమయ్యాయి?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సింగరేణి బొగ్గుగనులతో పాటు విస్తారంగా మాంగనీసు, ఇనుప ధాతువూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పసు పుతో పాటు ప్రత్యేక పంటగా ఎర్రజొన్న సాగ వుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు స్థాపించాలి. ఆదిలాబాద్‌లో అటవీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. కరీంనగర్, నిజామాబాద్‌లలో గ్రానైట్ గనులున్నాయి. కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దులో భీమదేవరపల్లి మండలంలో ఇనుపరాతి గుట్టలున్నాయి. కావున ఇక్కడ ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి పూను కోవాలి. మంథని కేంద్రంగా మైనింగ్ యూని వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. స్థానికులకే ఇక్కడ పనులు కల్పించాలి. ఈ ప్రాంతం నుండి ఎన్నుకోబడిన ప్రతి నేతా న్యాయంగా మనకు రావాల్సిన నిధుల కోసం చట్టసభల్లో గొంతు విప్పాలి.- డాక్టర్ బి. కేశవులు నార్త్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్ – చైర్మన్ -
ఏకచక్రపురం.. నవనాథపురం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అశ్మక రాష్ట్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఇందూరు వరకు నామాంతరం చెందిన నిజామాబాద్ (Nizamabad) చుట్టుపక్కల ప్రాంతాలు పౌరాణిక, ప్రాచీన చారిత్రక నేపథ్యాన్ని ఇముడ్చుకున్నాయి. మంజీర, గోదావరి పరీవాహకంలో ఉండి ప్రాచీన కాలంలో ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా విరజిల్లి, ప్రస్తుతం సాధారణ పట్టణంగా ఉన్న బోధన్ (Bodhan) ఎనలేని ప్రాచీన చరిత్రను కలిగి ఉంది. అయితే దీని చరిత్ర నిరంతరం బయటపడుతూనే ఉంది. తవ్వకాలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా దీని చరిత్ర ఆశించిన స్థాయిలో వెలుగు చూడటం లేదనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ ఎన్ని తవ్వకాలు జరిపితే అంత చరిత్ర (History) బయటపడే అవకాశముంది. ఈ విషయంలో పాలకులు అంతగా దృష్టి సారించకపోవడంతో.. పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ఘనమైన చరిత్ర బయటకు రావడం లేదని పలువురి వాదన.పౌరాణిక నేపథ్యం ప్రకారం ఈ ప్రాంతాన్ని పరశురాముడు(Parasu Ramudu) తన చక్రంతో రక్షించడంతో పాటు చక్రతీర్థమనే చెరువును నిర్మించడంతో ఏకచక్రపురంగా పేరుపొందినట్లు పలువురు చెబుతున్నారు. పౌరాణిక సాహిత్యంలో, జైన సాహిత్యంలో, బౌద్ధ సాహిత్యంలో బోధన్ ప్రాశస్త్యం ఉంది. మహాభారతంలో వసుమతి, పద్మపురం నామాలతో, జైన సాహిత్యంలో పోదనపురం నామంతో, బౌద్ధ సాహిత్యంలో పోదన నామంతో పేరొందింది. ఇక ప్రాచీన, మధ్యయుగాల్లో ఈ ప్రాంతం ధన సంపదలతో తులతూగడంతో.. బహుధాన్యపురం పేరుతో పిలిచినట్లు చరిత్ర చెబుతోంది. గొప్ప వర్తక కేంద్రంగా వర్ధిల్లినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనేక శాసనాలు, పాత్రలు, శిల్పాలు, నాణేలు(Coins) లభించాయి. అశ్మకుడనే రాజు పాలనలో.. ఈ ప్రాంతాన్ని అశ్మకుడనే రాజు పరిపాలించినట్లు మహాభారతంలో ప్రస్తావన ఉందని పలువురు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వాకాటకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు, మరాఠా రాజులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ రాజులు, మొఘలులు పరిపాలించారు. ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా చాలాకాలం పేరొందిన ఈ పట్టణం ప్రస్తుతం బోధన్ పేరుతో స్థిరపడింది. ఈ ప్రాంతం గురించి ఎంత శోధిస్తే అంత చరిత్ర బయటపడే అవకాశముందని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.నాటి నవనాథపురం.. నేటి ఆర్మూర్ ప్రస్తుతం పసుపు పంట అత్యధికంగా పండించే ప్రాంతంగా ఉన్న ఆర్మూర్ (Armoor) ప్రాంతం సైతం ఘనమైన చరిత్రను కలిగి ఉంది. నవనాథపురంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం.. నేడు ఆర్మూర్ నామాంతరంతో స్థిరపడింది. ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్ధులగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్టపై నవనాథ సిద్ధులు తపస్సు చేశారు. దీంతో గుట్ట చుట్టూ ఉన్న ప్రాంతానికి నవనాథపురంగా పేరు వచ్చింది. కాలక్రమంలో నవనాథపురం నుంచి ఆర్మూర్‌గా నామాంతరం చెందింది.వందల ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనాథులైన గోరఖ్‌నాథ్, జలంధర్నా, చరఫట్‌నాథ్, అపభంగనాథ్, కానీషనాథ్, మచ్చింద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్, బర్తరినాథ్ తదితరులు ఇక్కడికి వచ్చారు. నల్లని రాళ్లు పేర్చినట్లున్న ఈ గుట్టపై ఒక ఇరుకైన గుహలో తమ ఇష్టదైవమైన సిద్ధేశ్వరుడిని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. వారి పేరిట గుట్టకు నవనాథ సిద్ధుల గుట్టగా పేరు వచ్చింది. దీంతో గుట్టను ఆనుకున్న గ్రామానికి నవనాథపురంగా నామకరణం చేసుకున్నారు. చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!కాలక్రమంలో ఈ తొమ్మిది మంది సాధువుల్లో ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సాధువులు ఇక్కడే ఉండి పూజలు చేయడంతో ఆరు.. మూరు.. అంటూ కాలక్రమంలో ఆర్మూర్‌గా పేరు స్థిరపడింది. మరికొందరు చరిత్రకారులు ఆర్మూర్ అనే పదం.. ఆరావం అనే పదం నుంచి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సిద్ధుల గుట్ట ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది. -
నిజామాబాద్ కు ఈడీ అధికారులు..?
-
తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఓటమి భయంతోనే ‘కామారెడ్డికి’ కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీజన్ రాకముందే కోయిల కూసింది అన్నట్లుగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ప్రత్యేక అభివృద్ధి పేరుతో గజ్వేల్ నియోజకవర్గంలో లెక్కలేనంత ఖర్చు పెట్టినా.. అక్కడ గెలిచే పరిస్థితిలేదనే కేసీఆర్ మరో చోటుకు వెళ్తున్నారని విమర్శించారు. ఈసారి గజ్వేల్‌లో ఓడిపోతున్నారనే సర్వే ఫలితాల భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని భట్టి అన్నారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాలన్న నిర్ణయంతోనే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందనేది అర్థం అవుతోందని.. బీఆర్ఎస్ నేతలు పార్టీలు మారుతారనే ఆందోళనలోనే కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన ముందే చేశారని అన్నారు. సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఢిల్లీలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌కే గెలిచే పరిస్థితి లేకపోతే, ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు. ఏ లక్ష్యాలకోసం తెలంగాణ సాధించుకున్నామో.. ఆ లక్ష్యాలన్నీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిందని.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచి్చనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాగా, సెల్ఫీ విత్ కాంగ్రెస్ అభివృద్ధి అనే కార్యక్రమంతో మరోసారి ప్రజల్లోకి వెళ్తామని.. కాంగ్రెస్ హయంలో చేసిన అభివృద్ధి పనులను సెల్ఫీ తీసుకొని ప్రజలతో పంచుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనతో నష్టపోయిన వారందరూ కాంగ్రెస్‌తో కలసిరావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. -
నిజామాబాద్ జిల్లా బీజేపీలో నేతల ఆందోళనలు
-
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు
-
నిజామాబాద్: పెళ్లికుమార్తె రవళి ఆత్మహత్య కేసులో వరుడు అరెస్ట్
-
రాజుకు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీ
కామారెడ్డి టౌన్: గుట్టపైకెళ్లి ప్రమాదవశాత్తు బండరాళ్ల కింద ఇరుక్కుపోయి సురక్షితంగా బయటపడిన రాజు పూర్తిగా కోలుకున్నాడని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి శుక్రవారం కౌన్సెలింగ్‌తోపాటు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీని మానసిక వైద్య నిపుణులు, జిల్లా మెంటల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి.రమణ అందించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు వన్యప్రాణుల వేటకు వెళ్లి మాచారెడ్డి మండలం సింగరాయిపల్లి అడవిలోని ఓ గుట్టపైనున్న బండరాళ్ల కింద మంగళవారం ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. రెండ్రోజులు నరకయాతన అనుభవించాడు. సహాయక బృందం బండరాళ్లను పగులగొట్టి రాజును సురక్షితంగా బయటకు తీసి గురువారం కామారెడ్డి జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించింది. ఈ సందర్భంగా రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ కొన్నిగంటలపాటు తలకిందులుగా ఉండటం, రాళ్లు బరుసుగా ఉండటంతో కాళ్లు, చేతులు రాపిడికి గురై గాయాలయ్యాయని చెప్పాడు. తొడభాగంలో కాస్త పెద్ద గాయమైందని, ఒళ్లునొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాడు. రాజును శనివారం డిస్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. జీవితంలో తీవ్రమైన బాధ కలిగించిన ఘటనలు, ప్రతికూల పరిస్థితుల(రేప్, పెద్ద ప్రమాదం, అగ్నిప్రమాదం)ను ఎదుర్కొన్నవారు మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని, ఆ భయంకరమైన జ్ఞాపకాల నుంచి బయటకురాలేక చాలామంది మానసికంగా కుంగిపోతుంటారని వైద్యులు తెలిపారు. సాధారణ వైద్యంతోపాటు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఇలాంటివారిని సాధారణస్థితికి తీసుకురావచ్చన్నారు. రాజుతోపాటు కుటుంబసభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రాం సామాజిక కార్యకర్త డాక్టర్ విరాహుల్ కుమార్, డ్యూటీ డాక్టర్ కాళిదాసు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
నిజామాబాద్ ఫస్ట్.. హైదరాబాద్ సెకండ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. వలస వెళ్లిన వారిలో అత్యధికులు నిజామాబాద్ జిల్లా వారు కాగా... హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. కేంద్రం అధీనంలోని విదేశాంగశాఖ ఇటీవల వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2021లో రాష్ట్రం నుంచి మొత్తం 4,375 మంది గల్ఫ్ దేశాల బాట పట్టారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికే ఈ సంఖ్య 8,547కు చేరింది. ప్రభావం చూపని ఆ వృత్తులు.. హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు తూర్పు మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి యువకులు ఖతర్, యూఏఈ, సౌదీ, ఒమన్, కువైట్, బర్హేన్‌లకు వలస వెళ్లడం ఏళ్లుగా సాగుతోంది. ఇలా అత్యధికులు అసంఘటిత రంగ కార్మికులుగానే వెళ్తున్నారు. ఆయా దేశాలకు వెళ్లిన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంటుంది. ఇటీవల కాలంలో వివిధ రకాలైన డెలివరీ యాప్‌లకు డెలివరీ బాయ్స్‌గా, బైక్ ట్యాక్సీలు నిర్వహిస్తున్న వాళ్లు కూడా నగరంలో ఉంటూనే ఈ మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. దీని ప్రభావంతో వలసల సంఖ్య నానాటికీ తగ్గాల్సి ఉంది. అయినప్పటికీ వలస వెళ్లే వారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరగడం గమనార్హం. గతేడాది ఖతర్‌కే అత్యధికులు.. ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌నకు ఖతర్ ఆతిథ్యమిచ్చింది. దీనికోసం దాదాపు రెండు మూడేళ్లుగా అక్కడ భారీ ఫుట్‌బాల్ స్టేడియాలు, క్రీడాకారులకు అవసరమైన బస కోసం ప్రాంగణాలు తదితరాలను నిర్మించారు. వీటిలో పని చేయడానికి అక్కడి వారితో పాటు పెద్ద ఎత్తున వలస కూలీలు అవసరమయ్యారు. ఈ కారణంగానే ఆయా కాంట్రాక్టర్లు దళారుల సాయంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మందిని ఆకర్షించారు. గతేడాది రాష్ట్రం నుంచి ఖతర్‌కు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నాటికే ఆయా నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో ఆ దేశానికి వెళ్లే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. గణనీయంగా పెరిగిన పుష్పింగ్.. ఆయా దేశాలకు అసంఘటిత, సెమీ స్కిల్డ్ లేబర్‌గా వెళ్లే వారు విమానాశ్రయంతో కచ్చితంగా తమ పాస్‌పోర్టు, వీసాలపై ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ స్టాంప్ రిక్వైర్డ్గా (ఈసీఆర్) దీనికి అనేక నిబంధనలు ఉంటాయి. దీంతో అనేక మంది వలసదారులు ఇమ్మిగ్రేషన్ స్టాంప్ నాట్ రిక్వైర్డ్ (ఈసీఎన్ఆర్) విధానంలో దేశం దాటాలని భావిస్తుంటారు. ఇలాంటి వారికి సహకరించడానికి విమానాశ్రయం కేంద్రంగా కొందరు పని చేస్తుంటారు. విజిట్, టూరిస్ట్ వీసాలపై వెళ్తున్న వీరిని తనిఖీలు దాటించి విమానం ఎక్కించడాన్నే ‘పుష్పింగ్’ అని పిలుస్తుంటారు. ప్రతి నిత్యం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అనేక మంది ఈ విధానంలో బయటకు వెళ్లిపోతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అక్రమంగా వెళ్లి అష్టకష్టాలు.. సాధారణంగా విదేశాల్లో పని చేయడానికి వెళ్లే వాళ్లు వర్క్ పర్మిట్ తీసుకుని వెళ్లాలి. ఇలా చేస్తే వారికి ఉద్యోగ, వ్యక్తిగత భద్రతతో పాటు ఇతరు సదుపాయాలు లభిస్తాయి. అయితే పుష్ఫింగ్ ద్వారా దేశం దానికి అక్రమ వలసదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్లు గల్ఫ్ దేశాల్లో చిక్కుక్కుపోయి ఇబ్బందులు ఎదుర్కోవడం, కొన్నిసార్లు డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) ప్రక్రియను ఎదుర్కోవాల్సి వస్తోంది. కొందరు అక్రమ వలసదారులు ఆ దేశాల్లోని జైళ్లలోనూ మగ్గుతున్నారు. అక్కడ ఉండగా ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబీకులు, బంధువులకు కడసారి చూపులు దక్కడమూ గగనంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: ముంబై, బెంగళూరులను మించిపోయిన రంగారెడ్డి జిల్లా) -
ఎన్వోసీ లభించక.. ఇంటికి చేరుకోలేక.. పాపం మనోడు
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధికోసం విజిట్ వీసాపై మలేసియాకు వెళ్లిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన కూన గంగాధర్ పక్షవాతంతో మంచం పట్టాడు. వీసా గడువు ముగిసిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి మలేసియా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖ ద్వారా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ను కోరుతోంది. అయితే ఎన్వోసీని జారీ చేయడంలో భారత విదేశాంగ శాఖ తాత్సారం చేయడంవల్ల అనారోగ్యంతో అవస్థలు పడుతున్న కూన గంగాధర్ ఇంటికి చేరుకోలేకపోతున్నాడు. గంగాధర్ నాలుగు నెలల క్రితం మలేసియాకు వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. పదిహేను రోజుల కిందట పని ముగించుకుని తన గదికి చేరుకున్న తరువాత గంగాధర్‌కు పక్షవాతం వచ్చింది. దీంతో అతనితో పాటు ఉన్న తెలంగాణ వాసులు అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పక్షవాతంతో బాధపడుతున్న గంగాధర్‌ను ఇంటికి పంపించడానికి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు యనమల వెంకటస్వామి, శుభ్రలు ప్రయత్నిస్తున్నారు. విజిట్ వీసాపై వెళ్లిన గంగాధర్ మలేసియాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి రూ.25 వేల జరిమానా చెల్లించడంతో పాటు భారత రాయబార కార్యాలయం నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంది. జరిమానా చెల్లించడానికి బాధితుని పక్షాన తెలంగాణ వాసులు సిద్ధంగా ఉన్నారు. ఎన్వోసీ జారీ చేయడానికి విదేశాంగ శాఖ అధికారులు స్పందించకపోవడంతో పదిహేను రోజులుగా గంగాధర్ ఆస్పత్రిలోనే ఉండిపోయాడు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కూన గంగాధర్‌ను ఇంటికి పంపడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. (క్లిక్ చేయండి: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే) -
ఆ జిల్లాలో టీఆర్ఎస్ గట్టెక్కుతుందా?
కామారెడ్డి జిల్లాలోని సెగ్మెంట్లలో కూడా గులాబీ పార్టీ మీద అంత పాజిటివ్ ఒపీనియన్స్ లేవనే చెప్పాలి. ఎమ్మెల్యేల మీద ప్రజల నుంచి గతంలో మాదిరిగా సానుకూల పరిస్థితులు కనిపించడంలేదు. ప్రత్యర్థులు బలహీనంగా ఉంటేనే టీఆర్ఎస్ గట్టెక్కుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్కు గతంలోలాగా పరిస్థితులన్నీ అనుకూలంగా లేవని చెప్పొచ్చు. సిటింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రూప్ పాలిటిక్స్ కూడా అధికారపార్టీకి మైనస్ అనే వాదన వినిపిస్తోంది. ఉర్దూ అకాడమీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన ముజీబ్ ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్ఆశిస్తున్నారు. గతంలో అతణ్ని మంత్రి కేటీఆర్ బుజ్జగించి జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పాటు, ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. గతంలో బీజేపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ నిట్టు వేణుగోపాల్ కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉండటంతో ఇక్కడ గులాబీ పార్టీ మూడు గ్రూపులుగా మారింది. అయితే గంప గోవర్ధన్ కొడుకు శశాంక కూడా నియోజకవర్గంలో కలియతిరుగుతుండటంతో... కొడుకునూ భవిష్యత్ నేతగా తీర్చిదిద్దే పనిలో గోవర్ధన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకు దక్కకపోతే... కొడుకుకైనా దక్కించుకోవాలనే యత్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోవర్ధన్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్‌నేత షబ్బీర్ అలీపై ఈసారి సానుభూతి కనిపిస్తోంది. కామారెడ్డిలో మైనార్టీల ఓట్లు ఎంత కీలకమో..అదే స్థాయిలో హిందువుల ఓట్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ సెగ్మెంట్ లో ఎన్నిక మత ప్రాతిపదికన కీలకం కానుంది. గతంలో షబ్బీర్ అలీ సోదరుడు నయీంపైన ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ నువ్వు చూసుకో... కామారెడ్డి నేను చూసుకుంటా అంటూ నయూం ఏకంగా పత్రికల్లో యాడ్ ఇవ్వడం వంటివి షబ్బీర్ కు మైనస్ గా మారాయి. అయితే ఇటీవల తరచూ నియోజకవర్గానికి వస్తుండటం.. పబ్లిక్‌లో ఉండటంతో షబ్బీర్ వైపు ఈసారి సానుభూతి పవనాలు వీస్తున్నాయి. బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపెల్లి వెంకటరమణారెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ కాషాయ పార్టీకి హైప్ తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ నేతల అవినీతంటూ కొన్ని భూకబ్జాలకు సంబంధించి.. రమణారెడ్డి సవాల్ విసరడం... టీఆర్ఎస్ దాన్ని స్వీకరించడంతో కామారెడ్డి రాజకీయం రక్తికడుతోంది. బీజేపి నుంచి గతంలో బరిలోకి దిగి ఓటమిపాలైన ఇద్దం సిద్ధిరాములు కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి ఆయనకు టిక్కెట్ దక్కుతుందా.. కాటిపెల్లిని వరిస్తుందా.. లేక, ఇంకెవరైనా రాష్ట్రస్థాయి నేత కామారెడ్డి నుంచి బరిలోకి దిగనున్నారా అనే ఆసక్తికరమైన చర్చ కాషాయసేనలో జరుగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాలిటిక్స్హాట్ హాట్ గా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న సెగ్మెంట్ ఎల్లారెడ్డి. ప్రస్తుతం గులాబీ కండువా ధరించిన జాజుల సురేందర్ గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పక్షాన గెల్చిన ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పక్షాన గెల్చి... టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయాడన్న ఒక అపవాదు ఇప్పటికే సురేందర్ కి మైనస్‌గా ప్రచారంలో ఉంది. కాని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయనకు శ్రీరామరక్షగా నిల్చే అవకాశాలూ లేకపోలేదు. కాంగ్రెస్ కు బలమున్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ గ్రూప్ పాలిటిక్స్ ఆ పార్టీ పుట్టి ముంచేలా ఉన్నాయి. గతంలో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమిచెందిన మదన్ మోహన్ రావు ప్రస్తుతం ఎల్లారెడ్డి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఇంఛార్జ్ గా ఉన్న సుభాష్ రెడ్డికి, మదన్ మోహన్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ మధ్య పలుచోట్ల రచ్చబండ కార్యక్రమాల్లో మదన్ మోహన్ వర్గీయులు, సుభాష్ రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగిన సంఘటనలు మరోసారి కాంగ్రెస్ పరువును మంజీరాలో కలిపేశాయి. అయితే ఎల్లారెడ్డి వేదికగా జరిగిన రేవంత్ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నా.. ప్రత్యర్థి పార్టీతో ఫైట్ చేయాల్సిన ఆ పార్టీ కార్యకర్తలు తమలో తామే కొట్టుకోవడం ఇప్పుడు పార్టీకి మైనస్సని చెప్పాల్సి ఉంటుంది. ఉద్యమకాలం నుంచి గులాబీ పార్టీలో ఉండి.. ఆ తర్వాత కాషాయకండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డితో పాటు..గతంలో బీజేపి తరపున పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి కమలం పార్టీ ఆశావహులుగా ఉన్నారు. రవీందర్ రెడ్డికి గనుక టిక్కెట్ దక్కితే మాత్రం నియోజకవర్గంలో హోరాహోరీ తప్పదు. కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ కు నెట్ వర్క్ ఎక్కువ ఉండటం.. స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ దక్కితే కచ్చితంగా ఎల్లారెడ్డిలో మూడుపార్టీలు ఢీ అంటే ఢీ అంటాయి. బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కంచుకోట అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడినుంచి పోచారం ఆరుసార్లు వరుసగా గెలిపొందిన చరిత్ర ఉంది. నియోజకవర్గంలో అణువణువు గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. పోచారం కుమారులు డీసీసీబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారన్న ప్రచారమూ ఉంది. భాస్కర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం మీద, రెండుసార్లుగా అధికారంలో ఉన్న గులాబీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోగల ప్రత్యర్థులు నియోజకవర్గంలో కనిపించడంలేదు. కాంగ్రెస్ నుంచి కాసుల బాలరాజు.. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. ఎల్లారెడ్డి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మదన్మోహన్ రావు ఇక్కడి నుంచి కూడా ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు కాంగ్రెస్‌నేతలు. బీజేపి నుంచి స్థానిక నేత మాల్యాద్రిరెడ్డి పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే మాల్యాద్రిరెడ్డి గతంలో పోటీ చేసి ప్రత్యర్థులకు సహకరించాడనే అపవాదు ఉంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ ఆరోపణ వినిపిస్తోంది. బీజేపీలోనూ ఇక్కడ రెండు వర్గాలుండటం... ఆ రెండువర్గాల మధ్య తారాస్థాయిలో విభేదాలుండటం కాషాయసేనకు మైనస్‌గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేంత స్థాయిలో లేవు. అందుకే మరోసారి పోచారం ఫ్యామిలీలో ఎవరికి టిక్కెట్ దక్కినా విజయం అటువైపేనన్న ప్రచారమూ ఉంది. ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గమైన జుక్కల్ లోనూ రసవత్తర రాజకీయమే కనిపిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకే మళ్లీ గులాబీ పార్టీ టిక్కెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి గతంలో నాల్గుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన గంగారాం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే మూడుసార్లుగా ఓటమిపాలు కావడంతో గంగారాంకు ఈసారి సానుభూతి లభించవచ్చంటున్నారు. అయితే గడుగు గంగాధర్ కూడా కాంగ్రెస్‌నుంచి జుక్కల్ టిక్కెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ ఆశీస్సులతో ఎలాగైనా టిక్కెట్ సాధించేందుకు గంగాధర్ ప్రయత్నిస్తున్నారు. చారంలో ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే గంగారాంకు పీసీసీ చీఫ్ రేవంత్మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గంగారాం ప్రత్యర్థిగా ఉన్నంత కాలం హన్మంత్ షిండే గెలుపుకు ఢోకా లేదనే ఓ టాక్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. నిజామాబాద్ కు చెందిన అరుణతార జుక్కల్ లో బీజేపీ తరపున ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్నారు. ఈమె కామారెడ్డి జిల్లా బీజేపి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో అనుకున్న స్థాయిలో నియోజకవర్గంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అదే సమయంలో క్యాడర్ కూడా ఆమెకు పెద్దగా సహకరించడంలేదని..ఆమె క్యాడర్‌ను కాపాడుకోలేకపోతున్నారని వినిపిస్తోంది. తరచుగా పార్టీలు మారతారన్న నెగటివ్ ప్రచారం కూడా అరుణతారకు మైనస్ అవుతోంది. ఈ మధ్య ప్రతీ ఫంక్షన్ కీ హాజరవుతూ..ప్రజల్లో ఉండే యత్నం చేయడంతో ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నారనే టాక్సంపాదించుకున్నారు అరుణతార. సిట్టింగ్ ఎమ్మెల్యే షిండే అభివృద్ధి విషయంలో చెప్పుకునేంత చేయకపోయినా.. వివాదరహితుడనే పేరు మాత్రం తెచ్చుకున్నారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు పరిస్థితులను చూస్తే.. టీఆర్ఎస్ అన్ని సెగ్మెంట్లల్లో విజయాలు సాధించడం అంత తేలిక కాదనేది మాత్రం స్పష్టం అవుతోంది. అలాగే కాంగ్రెస్, బీజేపీలు గట్టిగా ఫైట్ చేస్తూఉంటే.. వారికి కనీసం చెరో రెండైనా సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎత్తులు...దానికి ప్రత్యర్థుల పై ఎత్తులు..టిక్కెట్లెవ్వరికి దక్కనున్నాయి.. పార్టీల్లోని అంతర్గత విభేదాలు... ఇలా ఎన్నో అంశాలు వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. -
నిఖత్ జరీన్‌ను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
-
నిఖత్ జరీన్‌ను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడలు- 2022లో బంగారు పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌ను ఎమ్మెల్సీ కవిత బుధవారం తన నివాసంలో కలిశారు. ప్రతిష్టాత్మక క్రీడల్లో పసిడి పంచ్ విసిరి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన నిఖత్‌ను అభినందించారు. ఈ సందర్భంగా కవిత సాయం చేసిన విషయాన్ని నిఖత్ గుర్తు చేసుకున్నారు. తనను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారని.. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో రూ.50 లక్షలు మంజూరు చేశారని ఆమె అన్నారు. అదే విధంగా రూ.2 కోట్లు మంజూరు చేయడం, నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నిఖత్ విజయాలను ప్రస్తావిస్తూ.. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌గా నిలవడం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఎ ప్రశంసించారు. కాగా కామన్వెల్త్ గేమ్స్-2022 మహిళల 50 కిలోల బాక్సింగ్ విభాగంలో నిఖత్ స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: IPL- Punjab Kings: మయాంక్ అగర్వాల్‌పై వేటు! స్పందించిన పంజాబ్ ఫ్రాంఛైజీ! ఇంతకీ ఏం చెప్పినట్టు? KL Rahul Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్ ఏంటంటే! -
జవాన్ల గ్రామం.. ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లుగా ప్రత్యక్షంగా దేశసేవ చేస్తూ తమ ఊరికే కాక నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నారు ఈ యువకులు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి నుంచి గత 21 ఏళ్లలో సగటున ఏడాదికొకరు చొప్పున 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. దీంతో ఈ గ్రామాన్ని ‘అడవి మామిడిపల్లి’ అని కాకుండా ‘జైహింద్ మామిడిపల్లి’ అని మార్చాలనే స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇక ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు నెలకొల్పడంతో పాటు తమ బిడ్డలను దేశ రక్షణ కోసం సరిహద్దుల పహారాకు పంపుతున్న ఆ ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని పలువురు చెబుతుండడంలో అతిశయోక్తి లేదు. చాలాసార్లు ఏడుపొస్తుంది మా కుమారుడు కల్లెడి సాయికుమార్ 2012లో ఆర్మీలోకి వెళ్లాడు. ఉన్న ఎకరం అమ్మి కుమార్తె పెళ్లి చేశాం. మాకు ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇంటర్ తర్వాత చదివించలేకపోయాం. ఉన్న ఒక్క కొడుకు పట్టుబట్టి ఆర్మీలోకి వెళ్లాడు. ఒక్కడే కొడుకు కావడంతో బాధతో చాలాసార్లు ఏడుస్తాం. అయినా దేశానికి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఫోన్ చేసి ఏడవద్దని ఓదారుస్తాడు. మా కోడలి డెలివరీకి సైతం అతి కష్టంమీద సెలవు తీసుకుని వచ్చి వెళ్లాడు. –కల్లెడి జయ, నారాయణ దంపతులు అగ్నిపథ్‌కు ముందుకొస్తున్నారు.. మా ఊరి నుంచి యువకులు సైన్యంలోకి వెళ్లడం 2000 సంవత్సరం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ విభాగాల్లోకి వెళ్లారు. ముగ్గురు ఇప్పటికే ఆర్మీ నుంచి రిటైర్ కాగా మిగిలినవారు సర్వీసులో ఉన్నారు. మరో ఎనిమిది మంది యువకులు అగ్నిపథ్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. 600 గడపలు ఉన్న మా ఊరి నుంచి క్రమం తప్పకుండా యువకులు సైన్యంలోకి వెళుతుండడం ఊరంతటికీ గర్వకారణం. – గంగోని సంతోష్, మాజీ సర్పంచ్ ఎన్ఎస్జీలో పనిచేశాను.. దేశ సేవ చేయాలని ఆర్మీలోకి వెళ్లాను. అసోంలో పనిచేసే సమయంలో కఠినంగా సాధన చేసి ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్)కి ఎంపికయ్యా. ఎన్ఎస్జీలో మూడేళ్లు పనిచేశా. 90 రోజుల కఠిన శిక్షణలో నెగ్గితేనే దీనికి ఎంపిక చేశారు. మిలిటెంట్ ఆపరేషన్, వీఐపీ పర్యటనలు, బాంబ్ స్క్వాడ్ విధుల్లో పాల్గొన్నాను. 16 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక ఊరికి వచ్చి కౌలు వ్యవసాయం చేస్తున్నా. ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు ఇవ్వడం లేదు. – కాపుకారి జానకీరాం, మాజీ జవాన్ శ్రీనగర్‌లో హవల్దార్‌గా.. గత 19 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నా. సిపాయిగా ఎంపికై లాన్స్‌నాయక్, నాయక్‌గా ఉన్నతి పొంది ప్రస్తుతం హవల్దార్‌గా ఉన్నాను. ప్రస్తుతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నాను. పలుసార్లు తీవ్ర మంచులో ఆపరేషన్లలో పనిచేశాను. రోడ్లు ధ్వంసమై, కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో నెలలతరబడి బయటకు రాలేని పరిస్థితి. కనీసం ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. – కేతావత్ రవీందర్ పెద్దనాన్న మృతి సైతం తెలియలేదు.. 2011లో ఆర్మీలో చేరాను. ప్రస్తుతం జమ్ములో నాయక్ హోదాలో పనిచేస్తున్నా. మహారాష్ట్ర, రాజస్థాన్, సికింద్రాబాద్, కశ్మీర్‌లలో పనిచేశాను. మేం మరణించినా సరే శత్రువును చంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. కొన్ని సందర్భాల్లో 3 నెలల పాటు కుటుంబ సభ్యులతో పాటు మరెవరితోనూ కమ్యూనికేషన్ లేదు. నా పెద్దనాన్న మృతి గురించి కూడా తెలియకుండా అయింది. – బాణావత్ నరేశ్ ఆర్టికల్ 370 రద్దు తరువాత.. 2012లో ఆర్మీలో చేరి ప్రస్తుతం జమ్ములో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నా. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో మూడు నెలల పాటు ఏమాత్రం కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. బయటి ప్రపంచంతో సంబంధం లేని లేకుండా విధులు నిర్వహించాం. ఆర్మీలో పనిచేయడం ఆనందంగా ఉంది. – సంగెం అనిల్ 17 ఏళ్ల సర్వీసు పూర్తి.. మా ఊరి నుంచి మొదటిసారి 2000 సంవత్సరంలో చంద్రశేఖర్ ఆర్మీలోకి వెళ్లారు. ఆయన స్ఫూర్తితో నేను సైతం దేశ సేవ చేసేందుకు 2004లో ఆర్మీలో చేరాను. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాను. 17ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 2021లో వచ్చాను. అప్పటినుంచి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. – మావూరి రవీందర్, మాజీ జవాన్ భర్త గురించి టెన్షన్ పడ్డా.. నా భర్త జానకీరాం ఆర్మీలో చేసే సమ యంలో నేను కూడా పంజాబ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హైదరాబాద్ క్వార్టర్స్‌లో ఉన్నా. అయితే అభినందన్ వర్ధమాన్ ఘటన నేపథ్యంలో నా భర్త కిట్ బ్యాగులతో వెళ్లిన సందర్భంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందాను. నా భర్త ఏ విషయం చెప్పకపోవడంతో బాగా టెన్షన్ కలిగింది. ప్రస్తుతం సర్వీసు పూర్తి చేసుకుని ఊర్లోనే ఉంటున్నాం. – కాపుకారి భవిత గర్వంగా ఉంది.. నా భర్త అనిల్ ఆర్మీ లో పనిచేస్తున్నాడంటే ఏదో ఉద్యోగం అనుకున్నా. అయితే ఇది దేశం కోసం చేసే అత్యంత రిస్క్ అని తెలిసి ఆందో ళన చెందినప్పటికీ గర్వంగానే ఉంటోంది. కు టుంబాన్ని మిస్ అవుతున్నప్పటికీ మాకు గర్వమే. గతంలో ఢిల్లీలో ఉన్నాను. ఇప్పుడు నా భర్త జమ్ములో పనిచేస్తుండగా, నేను ఇద్దరు పిల్లలు, అత్త, మామలను చూసుకుంటూ ఊర్లోనే ఉంటున్నా. – సంగెం వాణి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది మాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఏకైక కుమారుడు అనిల్ జమ్ము లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేశాను. ఒక్కగానొక్క కొడుకును ఆర్మీలోకి ఎలా పంపావని చాలామంది అడుగుతుంటే, జమ్ము కశ్మీర్లో విధ్వంసకర వార్తలు వస్తుంటే బాధ కలుగుతుంది. అయినప్పటికీ మా కొడుకు విషయంలో గర్వంగా ఉంటోంది. – సంగెం చిన్న హనుమాండ్లు -
మంచిజీతం ఉంటుందని ఆశపడితే.. అమ్మేశారు!
ఆర్మూర్‌టౌన్(నిజామాబాద్): ఆమె ఇళ్లలో పనిచేసి జీవితాన్ని వెళ్లదీసేది. మస్కట్‌లో పని అంటే... మంచిజీతం, కుటుంబం బాగుంటుందని ఆశపడింది. తీరా వెళ్లాక అదో నరకకూపం అని ఆమెకు అర్థమయింది. తన వేదననంతా వీడియో ద్వారా కుటుంబంతో పంచుకుంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్‌కు చెందిన అర్జున్, లక్ష్మి బతుకుదెరువు కోసం 15 ఏళ్ల కిందట నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్ట ణానికి వలస వచ్చారు. అక్కడ లక్ష్మి ఇళ్లలో పనిచేసేది. నిజామాబాద్‌కు చెందిన సల్మా అనే ఏజెంటు మస్కట్‌లో మంచి పని ఉందని లక్ష్మికి చెప్పింది. సల్మా మాటలను నమ్మిన లక్ష్మి సరేనంది. బతుకు బాగుపడుతుందనే ఆశతో మస్కట్‌కు వెళ్లింది. అయితే ఏజెంట్ సల్మా, లక్ష్మిని మస్కట్‌లో విక్రయించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్కడ తనను రెండు నెలలుగా లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని లక్ష్మి తమకు వీడియో పంపిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆర్మూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు వాపోయారు. -
నిజామాబాద్ జిల్లాలో కాలి బూడిదైన కరెన్సీ కట్టలు
-
డెంగ్యూ డేంజర్ బెల్స్
-
ఆశ్రమం లో చిక్కుకున్న ఏడుగురిని కాపాడిన NDRF బృందం
-
నిజామాబాద్ జిల్లాలో నకిలీ డిఎస్పీ గుట్టురట్టు
-
Peacock: మయూర వయ్యారం.. కళ్లారా వైభోగం
పచ్చని ప్రకృతి ఒడిలో మయూరాలు వయ్యారాలు పోయాయి. ఆనందంతో పురివిప్పి నాట్యమాడాయి. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనగా.. నెమళ్లు అందంగా నాట్యమాడుతూ, గెంతులేస్తూ అటువైపు వెళ్లిన వారికి కనువిందు చేశాయి. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొకన్పల్లి గ్రామ శివారులో ఈ నెమళ్ల సందడిని ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
కరోనాతో ప్రాణం పోయింది.. అప్పు మిగిలింది
సాక్షి, కామారెడ్డి: వేలు పట్టుకుని నడిపించే నాన్న ఏమైండో తెలియని పసిపిల్లలు.. ‘మమ్మీ! డాడీ ఎప్పుడస్తడే’అంటుంటే ఆ తల్లి కన్నీళ్లతోనే సమాధానం చెబుతోంది. నాన్న ఎటుపోయిండో, అమ్మ ఎందుకు ఏడుస్తోందో ఆ చిన్నారులకు అర్థం కాదు. ఇంటి పెద్ద దిక్కును కరోనా బలిగొంటే... ఆయన ప్రాణం నిలబెట్టేందుకు తెచ్చిన అప్పు కొండలా పేరుకొని కూర్చుంది. తానెలా బతకాలి, పిల్లలను ఎలా సాదాలో దిక్కుతోచని దయనీయ స్థితి ఆమెది. తలకొరివి పెడుతాడనుకున్న కొడుకు కళ్లముందే కాటికి పోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నరు. పండు ముదుసలి అయిన నాయినమ్మ కూడా మనవడు పోయిండని మంచం పట్టింది. దయనీయ పేద కుటుంబం విలవిల్లాడుతోంది. ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. పర్శరాములు (38)ది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామం. తల్లిదండ్రులు రాజయ్య, సత్తవ్వ.. భార్య లావణ్య, పిల్లలు అశ్విత్ (7), నిశ్విత(4)తోపాటు నాయినమ్మ సుశీలతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపాడు. డిగ్రీ వరకు చదివిన రాములు కొంతకాలం గల్ఫ్‌కు వెళ్లి పనిచేశాడు. తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయం చేసేవాడు. ఏడాది కిందట గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిన అటెండర్ ఉద్యోగం సంపాదించాడు. రాములుకు ఏప్రిల్ 20న తీవ్ర జ్వరం వచ్చింది. మాచారెడ్డి పీహెచ్సీలో పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. సాధారణ జ్వరం అనుకుని మందులు వాడాడు. ఎంతకూ తగ్గకపోవడంతో మూడు రోజులకు మళ్లీ పరీక్ష చేయించుకున్నాడు. అప్పుడు కూడా నెగెటివ్ వచ్చింది. నీరసం కూడా పెరగడంతో 24న కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి సీటీ స్కాన్ చేయించుకున్నాడు. కరోనాతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలింది. దీంతో అదే రోజు ఆస్పత్రిలో చేరాడు. అక్కడ ఆరు రోజుల పాటు ఉన్నాడు. తరువాత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో 29న రాత్రి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆçస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రూ.18 లక్షల బిల్లు అయ్యింది. అక్కడా ఇక్కడా అప్పు తెచ్చి కట్టేశారు. చివరకు కరోనాతో పోరాడి రాములు గత నెల 15న కన్నుమూశాడు. ఇతర మందులు, అంబులెన్స్‌లకు మరో రూ. 3 లక్షలు ఖర్చయింది. మొత్తంగా రూ.21 లక్షలైంది. కొడుకును బతికించుకుందామని.. ఒక్కగానొక్క కొడుకును బతికించుకుందామని ఎన్ని పైసలైనా సరే అని తెలిసిన వాళ్ల దగ్గర, సుట్టాల దగ్గర పైసలు తెచ్చి కట్టినం. డాక్టర్లు మంచిగైతడనే చెప్పిండ్రు. పైసలు పోయినా పాణం దక్కాలని దేవుండ్లకు మొక్కినం. ఆఖరుకు కొడుకును కరోనా గద్దలెక్క తన్నుకుపోయింది. ఇప్పుడు మాకు దిక్కెవరు. భూమి అమ్మినా అప్పు తీరేటట్టు లేదు. –తండ్రి రాజయ్య మా బతుకులు ఆగం ఆయన అందరితో మంచిగ ఉండెటోడు. ఇంట్లో ఎవలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటోడు. కరోనా ఆయన్ను మింగి మా బతుకులను ఆగం జేసింది. పిల్లలు డాడీ ఎప్పుడస్తడే అని అడుగుతుంటే ఏం చెప్పాలి. మా అత్త, మామలు, నేను ఎట్ల బతకాలో అర్థమైతలేదు. –భార్య లావణ్య చదవండి: థర్డ్‌వేవ్ తీవ్రత: ఆ మూడే కీలకం! -
రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్‌పోర్టుల కేసు
సాక్షి, హైదరాబాద్: బోధన్ పాస్‌పోర్టుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దేశానికి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులు తప్పుడు చిరునామాలు, ధ్రువీకరణలతో పాస్‌పోర్టులు పొందడాన్ని కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. స్థానికుల సహకారంతో... ఇప్పటిదాకా మొత్తం 72 పాస్‌పోర్టులను విదేశీయులు తప్పుడు ఆధార్, ఇతర ఐడీ కార్డులతో పొందారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రతీ పాస్‌పోర్టు క్లియరెన్స్‌కు స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులు రూ.పది వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. అయితే, ఇంత తక్కువ మొత్తానికే పాస్‌పోర్టుల జారీకి సహకరిస్తారా? అన్న అనుమానాలు పోలీసుశాఖలో తలెత్తుతున్నాయి. కచ్చితంగా దీని వెనక పెద్ద రాజకీయ నేతలే ఉండి ఉంటారని, వారి అభయం, ఒత్తిడి కారణంగానే ఎస్బీ పోలీసులు ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి కేసులు బోధన్ ప్రాంతంలో పాస్‌పోర్టుల జారీలో అక్రమాలు కొత్త విషయమేమీ కాదు. గతంలోనూ ఇక్కడ కొందరు రాజకీయ నాయకులపై ఇలాంటి కేసులు నమోదవడం గమనార్హం. అందుకే ప్రస్తుతం వెలుగుచూస్తోన్న దొంగపాస్‌పోర్టుల వ్యవహారంలోనూ పోలీసులు ఏమైనా రాజకీయ లింకులున్నాయా అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అబూసలేం పాస్‌పోర్ట్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జారీ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది. నకిలీ పత్రాలు సమర్పించి కర్నూలు జిల్లా నుంచి దొంగపాస్పోర్టు సంపాదించిన కేసులో అబూసలేంకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక బోధన్ కేసు విషయానికి వస్తే సగానికి పైగా నిందితులు విదేశీయులు. వీరంతా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు. వీరందరిపై ఐపీసీ 420, 468, 471(ఫోర్జరీ), సెక్షన్ 14 ఫారినర్స్ యాక్ట్ 1946 (నకిలీ పత్రాలతో దొంగపాస్‌పోర్టులు పొందడం) ప్రకారం వీరికి ఏడేళ్ల కంటే అధికంగానే జైలు శిక్ష పడుతుందని సమాచారం. పాత నేరస్థులని తెలిసీ క్లియరెన్స్ ఈ కేసులో ఎస్బీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ చేసే సమయంలో కనీస నిబంధనలు పాటించకుండా.. పూర్తిగా దరఖాస్తుదారుల పక్షం వహించడం చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. ఎనిమిది పాస్‌పోర్టులు ఏకంగా ప్రార్థనామందిరం చిరునామాతో ఉండటం చూసి దర్యాప్తు అధికారులు విస్మయం చెందినట్లు తెలిసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పోలీసులు పట్టుకున్న బంగ్లాదేశీయుల్లో కొందరికి భారత్‌లో నేరచరిత్ర ఉంది. సాధారణంగా ఎస్బీ పోలీసులు పాస్‌పోర్టు విచారణ సమయంలో దరఖాస్తుదారుల వేలిముద్రలు తీసుకుంటారు. వాటిని ‘పాపిలాన్’ అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌లో పోల్చి చూస్తారు. దేశవ్యాప్తంగా ఏమూలన నేరచరిత్ర ఉన్నా.. ఈ సాఫ్ట్‌వేర్‌లో కేవలం 10 సెకండ్లలో తెలిసిపోతుంది. అలాంటిది విదేశీయులు, పైగా పాత నేరస్థులు అని తెలిసినా... ఈ విషయాన్ని దాచిపెట్టి పాస్‌పోర్టులు పొందేందుకు సహకరించే సాహసం చేశారంటే.. తెరవెనక రాజకీయశక్తుల ఒత్తిడి తప్పక ఉండి ఉంటుందన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. చదవండి: అసలు సూత్రధారి గల్ఫ్ ఏజెంటే.. నిరూపిస్తే రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
అసలు సూత్రధారి గల్ఫ్ ఏజెంటే..
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశీయులకు పాస్‌పోర్టు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత రెండు, తర్వాత 32 పాస్‌పోర్టులు అనుకున్నప్పటికీ ఈ విషయంలో కూపీ లాగిన కొద్దీ అక్రమంగా జారీ అయిన పాస్‌పోర్టుల సంఖ్య పెరుగుతూనే ఉందని సమాచారం.. ఈ పాస్‌పోర్టులతో ఎవరైనా ఇప్పటికే దేశం దాటారా? అన్న విషయంపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇమిగ్రేషన్ అధికారులతో కలసి బోధన్‌లో ఒకే ఇంటి నంబరు నుంచి జారీ అయిన పాస్‌పోర్టుల నంబర్లతో విచారణ చేస్తున్నారు. మొత్తం వ్యవహారానికి సూత్రధారి స్థానిక గల్ఫ్ ఏజెంటేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. స్థానిక మీసేవ కేంద్రం నిర్వాహకుడి సాయంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వాటితో విదేశీయులతో పాస్‌పోర్టుకు దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. తనకున్న పరిచయాలతోనే ఒకే చిరునామా నుంచి 32 మందికిపైగా విదేశీయులకు అక్రమ పద్ధతిలో పాస్‌పోర్టులు వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత అధికంగా ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇంకా ఎన్ని పాస్‌పోర్టులు ఒకే ఇంటి నంబరు నుంచి వచ్చాయన్న దానిపై చిక్కుముడి వీడాల్సి ఉంది. మరింత లోతుగా దర్యాప్తు..! ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనేక కొత్త విషయాలు తెలిశాయి. తొలుత కేవలం రెండు పాస్‌పోర్టులే అనుకున్నా పోలీసులు మరింత కూపీలాగారు. మొత్తంగా 32కిపైగా పాస్‌పోర్టులు రెంజల్ కాలనీలోని ఒకే చిరునామా నుంచి జారీ అయ్యాయని తెలిసి అధికారులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిందన్న ప్రచారం స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణలో అనేక లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై, ఏఎస్సైలను ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విదేశీయులకు పాస్‌పోర్టుల వ్యవహారంలో ఈ ఇద్దరు పోలీసులేనా..? ఇంకా ఇతర పోలీసు అధికారులెవరైనా సహకరించారా? ఒకే ఇంటిపై పదుల సంఖ్యలో పాస్‌పోర్టు దరఖాస్తులు వస్తున్నా ఎందుకు అనుమానించలేదు? దీని వెనక ఇంకా ఎవరైనా హస్తముందా? అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
ఆ ఊరి పేరు వింటే మన నోరూరుతుంది..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆ ఊరి పేరు వింటే కోవా గుర్తుకు వస్తుంది.. కోవా అనగానే మన నోరూరుతుంది. నిజాంకాలం నుంచి ఆ ఊరే ఓ పాలకోవా... ఇంటింటా పాలవెల్లి.. ఏ ఇంటి ముందు చూసినా పాడిగేదెలే.. ఏ ఇంట చూసినా వంట చెరుకే.. పాలకోవా తయారీ ఆ గ్రామస్తుల వృత్తి. ఇది ఆ ఊరి ఒకప్పటి వైభవం.. ఆ ఊరి రైతు ప్రాభవం.. మరిప్పుడో! పాలవెల్లి పోయింది. కోవా.. వృత్తిని వదులు‘కోవా’అంటోంది. పాడి ఉత్పత్తి పడిపోయింది. వంట చెరుకు కోసం తంటాలు పడాల్సివస్తోంది. ఫలితంగా ఇప్పుడు పాలను మరిగించే రైతుల సంఖ్య కరిగిపోయింది. వారి సంఖ్య 200 నుంచి 20కి తగ్గింది. కోవా తయారీ మూడు క్వింటాళ్ల నుంచి అరక్వింటాకు పడిపోయింది. అంటే.. కోవా తయారీదారులు ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. ఇదీ నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి పాలకోవా కథ. తయారీదారుల వ్యథలు, కష్టాలపై ‘సాక్షి’అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.. సిర్నాపల్లి కోవా రుచే వేరు.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామం కోవా తయారీకి ప్రసిద్ధి. నిజాంకాలంలో ఈ ఊరు శీలం జానకీబాయి సంస్థానం. దీని చుట్టూ అటవీప్రాంతమే. పాడిగేదెల పెంపకం ఆ ఊరి రైతుల జీవనాధారం. ఒక్కో కుటుంబం కనీసం పది లీటర్ల నుంచి 50 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి చేసేది. పాలను కేంద్రంలో విక్రయిస్తే నామమాత్రంగా డబ్బులు వస్తున్నాయని క్రమంగా పాల ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించారు. పాలను కాచి కోవా తయారు చేసి విక్రయిస్తున్నారు. కోవా చేసి అమ్మితే రెట్టింపు డబ్బులు గిట్టుబాటు కావడంతో రైతులు ఈ వృత్తిని ఎంచుకున్నారు. కట్టెల కొరత.. కోవా చేయాలంటే పాలను గంటల తరబడి మరిగించాల్సి ఉంటుంది. గతంలో సమీప అటవీ ప్రాంతం నుంచి కట్టెలు తెచ్చుకుని పాలను మరిగించేవారు. ఇప్పుడు కట్టెలు తెచ్చుకోవడంపై అటవీ అధికారులు ఆంక్షలు విధించారు. గ్యాస్ సిలిండర్‌పై పాలు కాద్దామంటే పెరిగిన గ్యాస్ ధరల దడదడ. ఇలా చేస్తే ఏమాత్రం గిట్టుబాటు కాదు. దీంతో కోవా తయారీపై రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. పాడి గేదెల గడ్డికి గడ్డు పరిస్థితి. గతంలో ఒక్కో రైతు కుటుంబంలో పది వరకు గేదెలుంటే ఇప్పుడు రెండు, మూడుకు మించి ఉండటంలేదు. 3.5 లీటర్ల పాలకు కిలో కోవ.. కిలో కోవా తయారు చేయాలంటే కనీసం 3.5 లీటర్ల చిక్కటి పాలు అవసరం. నిత్యం పది లీటర్ల పాలు మరిగిస్తే 3.5 కిలోల వరకు కోవా ఉత్పత్తి అవుతుంది. కిలోకు రూ.300 చొప్పున ఊరిలోనే దళారులకు విక్రయిస్తున్నారు. కోవాను దళారులు నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ వంటి నగరాలకు తరలించి కిలోకు రూ.500 నుంచి రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. పది లీటర్ల పాలను పాలకేంద్రంలో విక్రయిస్తే రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు మాత్రమే వస్తుంది. కానీ కోవా తయారు చేసి విక్రయిస్తే రోజుకు రూ.వెయ్యి వరకు గిట్టుబాటు అవుతుంది. గ్రామంలో గతంలో రోజుకు సుమారు మూడు క్వింటాళ్ల వరకు కోవా ఉత్పత్తయ్యేది. ప్రస్తుతం అర క్వింటాలుకు పడిపోయింది. కోవా తయారు చేసే కుటుంబాలు సిర్నాపల్లిలో ఒకప్పుడు సుమారు 200 వరకు ఉండేవి. ఇప్పుడా సంఖ్య 20కి పడిపోయింది. పాలను కలుపుతూ కోవా తయారు చేస్తున్న ఈ రైతు పేరు శీలమంతుల నర్సయ్య. గతంలో రోజుకు కనీసం 40 లీటర్ల పాలతో 15 కిలోల కోవాను తయారు చేసి విక్రయించేవారు. దీంట్లో తన ఇద్దరు కుమారులు కూడా పాలుపంచుకునేవారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో రోజుకు రెండు, మూడు కిలోలకు తగ్గించారు. ఇద్దరు కొడుకులు కోవా తయారీ పనిని వదిలేసి ట్రాక్టర్ మెకానిక్‌గా, ఇతర వృత్తుల్లో నిమగ్నమయ్యారు. విద్యుత్ ఆధారిత పాలు కాచే యంత్రాలు ఇవ్వాలి ఇరవై ఏళ్లుగా కోవా తయారీనే మా వృత్తి. మాకున్న రెండు గేదెలు ఎనిమిది లీటర్ల పాలు ఇస్తాయి. రోజుకు రెండు కిలోల వరకు కోవా తయారు చేస్తున్నాం. ఎండాకాలంలో గడ్డి దొరక్క పాలు ఉత్పత్తి తగ్గుతోంది. ప్రభుత్వం గేదెలతోపాటు విద్యుత్ ఆధారిత పాలు కాచే యంత్రాలు, కోవా నిల్వచేసే యంత్రాల కోసం రుణం ఇస్తే బాగుంటుంది. మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించాలి. – ఉప్పు వసంత, సిర్నాపల్లి పెళ్లిళ్ల సీజన్లో ఎక్కువ గిరాకీ రైతుల వద్ద కొనుగోలు చేసిన కోవాను నిజామాబాద్, కామారెడ్డిలకు తీసుకెళ్లి అమ్ముతుంటా. ఒక్కో కిలోకు రూ.వంద నుంచి రూ.రెండు వందల వరకు గిట్టుబాటు అవుతుంది. ఒక్కోసారి ఎవరూ కొనుగోలు చేయకపోతే నష్టపోవాల్సి వస్తుంది. పెళ్లిళ్ల సీజన్లోనే గిరాకీ ఎక్కువ. కోవాను నిల్వ చేస్తే రుచిపోతుంది. ఏ రోజుకు ఆ రోజు వినియోగిస్తేనే బాగుంటుంది. – ఎం.డి జావెద్, కోవా వ్యాపారి -
వారికి ఒమన్ ప్రభుత్వం శుభవార్త
మోర్తాడ్ (బాల్కొండ): ఒమన్ దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీయులు స్వచ్ఛందంగా వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి ప్రకటించిన క్షమాభిక్ష గడువును ఆ దేశ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2020 డిసెంబర్ 31 వరకు క్షమాభిక్ష పొందడానికి గడువు నిర్ణయించిన ఒమన్ ప్రభుత్వం.. అంతర్జాతీయ విమానాల నిలుపుదల నేపథ్యంలో మొదటిసారి ఈ నెల 15 వరకు పొడిగించింది. క్షమాభిక్ష పొందేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మరోసారి మార్చి 31 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ, కార్మిక సంక్షేమ డైరెక్టర్ జనరల్ సేలం బిన్ సయీద్ అల్‌బాడి వెల్లడించారు. గడిచిన నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన క్షమాభిక్షతో ఇప్పటివరకు 12,378 మంది విదేశీయులు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు.(చదవండి: వీసా లేకుండానే ఒమన్ వెళ్లొచ్చు) ఇదిలా ఉండగా మరో 57,847 మంది క్షమాభిక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు గడువు పెంచడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒమన్‌లో అమలవుతున్న క్షమాభిక్ష వల్ల లబ్ధిపొందే వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు క్షమాభిక్ష పొందిన వారికి ఎలాంటి సహకారమైనా అందిస్తామని, ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి విమాన టికెట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తామని ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేంద్ర పన్నీరు తెలిపారు. -
నమ్మించి.. రూ.25 కోట్లకు ముంచారు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలలో పెట్టుబడి పెడితే కొన్ని రోజులకు రెట్టింపు చేసిస్తామని నలుగురు వ్యక్తులు జిల్లాలోని పలువురు యువకులను నమ్మించి రూ.25 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. బాధితులు సోమవారం పోలీస్ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశా రు. చైన్ స్కీం, ఈగల్ బిట్ కాయిన్, యాడ్స్ స్టూడియో, వరల్డ్ డిజిటల్ గోల్డ్ కాయిన్ సంస్థల పేరుతో చిట్టోజి రాజేశ్, తాటి గంగయ్య, వెంకటేశ్, పుప్పాల శ్రీనివాస్ జిల్లాలో కొంతమంది యువకులను సంప్రదించారు. ఆన్లైన్ ద్వా రా తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు చేసిస్తామని, సంస్థల్లో ఇంకా కొం తమందిని సభ్యులుగా చేర్చితే కమీషన్ వస్తుందని చెప్పారు. ఈ మాటలను నమ్మిన ఆర్మూర్, నందిపేట్, నిజామాబాద్ నగర ప్రాంతాలకు చెందిన యువకులు ఒక్కొక్కరు రూ.63వేల వరకు నాలుగైదు సార్లు ఆన్లైన్లో చెల్లించారు. వీరు పెట్టుబడి పెట్టినందుకు కొంత లాభం వచ్చిందంటూ రాజేశ్ బృందం ప్రతినెలా రూ.5 వేల వరకు రెండు, మూడు నెలల పాటు ఆ యువకులకు ఇచ్చింది. దీంతో డబ్బులు వస్తున్నాయనే ఆశతో బాధిత యువకులు చాలామందిని సభ్యులుగా చేర్పించి వారితోనూ పెట్టుబడి పెట్టించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 450 మంది సభ్యులుగా చేరగా, రూ.25 కోట్లకు పైగా పెట్టుబడిగా వచ్చింది. ఇటీవల తాటి గంగయ్య, వెంకటేశ్, పుప్పాల శ్రీనివాస్, చిట్టోజి రాజేశ్‌కు పెట్టుబడి పెట్టిన వారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురూ పారిపోయారని, వారిని పట్టుకుని తమ డబ్బులు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కోరారు. -
ఆర్మూర్‌లో ‘లవ్‌స్టోరీ’ చిత్రీకరణ
సాక్షి, నిజామాబాద్ : నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘లవ్‌స్టోరీ’. షూటింగ్ తిరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో చిత్ర యూనిట్ సందడి చేసింది. నాగచైతన్య, సాయిపల్లవికి సంబంధించి కొన్ని సన్నివేశాలను ఆర్మూర్‌లోని నవసిద్ధుల గుట్ట వద్ద చిత్రీకరించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు. ఇది వరకే ఫిదా సినిమాలో తెలంగాణ యూసతో సాయిపల్లవి ఆకట్టుకుంది. కరోనా బ్రేక్ తర్వాత ఇటీవలే చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయ్యింది. షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. నారాయణ్ దాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పవన్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. (బోడకొండలో 'లవ్‌స్టోరీ' సందడి ) -
బాలికపై అత్యాచారం.. బాబాకు బడితపూజ
సాక్షి, నిజామాబాద్ : భూత వైద్యం పేరుతో మహిళలను మోసం చేస్తు అత్యాచార యత్నానికి పాల్పడుతున్న ఓ వ్యక్తికి బాధితులు, మహిళలు దేహశుద్ధి చేశారు. వైద్యం పేరుతో 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పతున్న దొంగ బాబాకు బడితపూజ చేశారు. అభంశుభం తెలియని బాలికను బెదిరించి లైంగిక వాంఛను తీర్చుకుంటున్న ఘటన నిజామాబాద్ నగరంలో మంగళవారం వెలుగుచూసింది. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగుతూ.. మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా బాలికపై ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం చెప్పింది. (గర్భం దాల్చిన మైనర్ బాలిక) దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు దొంగబాబాను చితకబాదారు. అయితే భూతవైద్యం పేరుతో మరికొంతమంది మహిళలపై కూడా గతకొంతకాలంగా లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
ప్రజావైద్యాన్ని గాలికొదిలేశారు
ఆదిలాబాద్ రూరల్: ప్రజా వైద్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ను, అలాగే నిజామాబాద్ ప్రభుత్వాస్ప తిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో 100 వైద్య పోస్టులు ఖాళీగా ఉంటే.. ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. రిమ్స్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ మెషీన్ లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి చెరువులు, స్థలాల ఆక్రమణలపై దృష్టి తప్ప వైద్యసేవలపై పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఉత్సవ విగ్రహంగా ఈటల నిజామాబాద్ అర్బన్: మంత్రి ఈటల రాజేందర్ ఉత్సవ విగ్రహంగా మారిపోయారని భట్టి ఎద్దేవా చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతోందో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఇతర మంత్రులను సీఎం భజనబ్యాచ్‌ల మార్చారని భట్టి విమర్శించారు. -
గోడకూలి ముగ్గురు మృతి
-
వలస కూలీలకు అండగా ప్రభుత్వ టీచర్లు
ఆర్మూర్: లాక్డౌన్ వేళ పొట్ట చేత పట్టుకొని చిన్న పిల్లలను చంకన ఎత్తుకొని ఇతర రాష్ట్రాలలోని తమ స్వగ్రామాలకు కాలి నడకన వెళుతున్న వలస కార్మికులకు అండగా మేమున్నామంటూ.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. ఈ మూడు మండలాల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా కొంత మొత్తాన్ని పోగు చేసుకున్నారు. గత నెల 16 నుంచి 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్మూర్ పట్టణం పెర్కిట్ శివారుతోపాటు ముప్కాల్, పోచంపాడ్ చౌరస్తాల్లో వలస కార్మికులకు భోజనాన్ని అందిస్తున్నారు. దాతల సహకారంతో కొనుగోలు చేసిన వంట సామగ్రితో ముప్కాల్, మెండోర కేజీబీవీలలో అన్నం, కూరగాయలు వండిస్తున్నారు. అలాగే రొట్టెలను కూడా తయారు చేయిస్తున్నారు. ఉపాధ్యాయులు ఈ వంటకాలను మూడు కేంద్రాల్లోకి తరలించి.. మూడు షిఫ్టులుగా పనిచేస్తూ జాతీయ రహదారి వెంట కాలినడకన, లారీలు, ఇతర వాహనాల్లో వెళుతున్న వలస కార్మికులకు భోజనంతోపాటు చల్లని నీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్, పండ్లు అందిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ 500 పైగా కార్మికులకు భోజనాన్ని అందిస్తున్నారు. పెర్కిట్ శివా రులోని అన్నదాన కేంద్రం నిర్వహణకు రూ.40 వేలు, ముప్కాల్, పోచంపాడ్ చౌరస్తా కేంద్రాల్లో రూ.12 వేల చొప్పున ప్రతి రోజు ఖర్చవుతోంది. ఉపాధ్యాయుల సేవలను గుర్తించిన చాలామంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ రహదారిపై ఉంటూ వలస కార్మికుల కడుపులు నింపుతున్నారు. సమష్టి కృషితో సాధిస్తున్నాం.. బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సమష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. దాతలు కూడా ముందుకు రావడం చాలా తోడ్పాటుగా ఉంది. ఉపాధ్యాయులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా పాల్గొనడం అభినందనీయం. కాలి నడకన వెళుతున్న కార్మికుల వెతలు చూడలేక మేము ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రతి రోజూ 500 మందికి పైగా భోజనాన్ని అందిస్తున్నాం. – బట్టు రాజేశ్వర్, ఎంఈవో, బాల్కొండ -
జాతీయ రహదారిపై ప్రమాదం
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నాకాతండా శివారులో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లా కొయెన్‌చెరి గ్రామానికి చెందిన అనీశ్ థామస్ (33), తన ఇద్దరు సోదరులతో కలసి బిహార్‌లోని నెవడా జిల్లా సిర్‌దల్లాలో స్కూల్ నడుపుతున్నాడు. కరోనా కారణంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో వారి స్కూల్‌ను మూసివేశారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో అక్కడి అధికారుల అనుమతి తీసుకుని మూడు వాహనాల్లో ముగ్గురు సోదరులు తమ భార్యా పిల్లలతో ఈ నెల 13న బిహార్ నుంచి కేరళకు బయలు దేరారు. అనీశ్ థామస్‌తో పాటు భార్య దివ్య, కూతుళ్లు అనాలియా (14 నెలలు), అజాలియా ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డిచ్పల్లి మండలం నాకాతండా వద్దకు రాగానే ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన థామస్ కుటుంబాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనీశ్ థామస్, కూతురు అనాలియా, డ్రైవర్ స్టేనీ జోస్ (24) మృతి చెందారు. దివ్యతో పాటు అజాలియాను మెరుౖ గెన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి నిన్న (ఆదివారం) రాత్రి నిరాడంబరంగా జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్పల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో రాత్రి 11 గంటల సమయంలో వివాహం చేసుకున్నారు. ‘దిల్’ రాజు వివాహం చేసుకున్నది వాళ్ల బంధువుల అమ్మాయినే అని, వారిది సినిమా నేపథ్యం లేని కుటుంబం అని తెలిసింది. 2017లో ‘దిల్’ రాజు భార్య అనిత హార్ట్ ఎటాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా నిర్మాత ‘దిల్’ రాజు రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కువైట్‌లో మనోళ్లకు ఊరట
సాక్షి, హైదరాబాద్/మోర్తాడ్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అక్రమ వలసదారులకు కువైట్ ప్రభుత్వం కల్పించిన అత్యవసర క్షమాభిక్షతో 2,500 మంది తెలుగువాళ్లకు ఊరట లభించింది. రెండు విడతల్లో క్షమాభిక్ష కోసం కువైట్ దరఖాస్తులను స్వీకరించగా 10 వేల మంది భారతీయ కార్మికులు ఆమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 8 వేల మందికి కువైట్ ఔట్ పాస్పోర్టులిచ్చింది. ఔట్ పాస్‌పోర్టు పొందిన 8 వేల భారతీయుల్లో 2,500 మంది తెలంగాణ, ఏపీ వారని అంచనా. ఔట్ పాస్‌పోర్టులు పొందని మిగతా 2 వేల మంది కార్మికుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఔట్ పాస్‌పోర్టుల జారీలో ఏర్పడిన అంతరాయం వల్ల క్షమాభిక్ష గడువును పొడిగించాలని వలస కార్మికులతోపాటు వారికి అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. మరోవైపు క్షమాభిక్ష పొంది ఔట్ పాస్‌పోర్టులు తీసుకున్న వలస కార్మికుల కోసం కువైట్ ప్రభుత్వం విడిది కేంద్రాలను ఏర్పాటు చేసింది. విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వరకు విడిది కేంద్రాల్లో భోజన సదుపాయాలను సమకూర్చనుంది. నౌకలు రెడీ క్షమాభిక్షకు అనుమతి లభించి ప్రత్యేక క్యాంపుల్లో ఉండే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం నౌకలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర సర్కారు సంకేతాలివ్వడంతో నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ సహా రెండు పెద్ద ఓడలు గల్ఫ్ తీరం వెళ్లనున్నాయి. ముందుగా కువైట్ నుంచి వారిని తరలించాలని భావిస్తున్నాయి. నౌకాయానానికి చాలా రోజులు పట్టే అవకాశమున్నందున ఆర్థిక స్థితి బాగుండి విమానాల్లో రావడానికి ఆసక్తి చూపే వారిని విమానాలు పునరుద్ధరించాక విమానాల్లో తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ విమాన సేవలు ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశాలు లేనందున ఒకేసారి వేల మందిని తరలించేందుకు ప్రత్యేక నౌకలు, ఎయిర్ ఇండియా జంబో విమానాలను పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా... లాక్డౌన్ కారణంగా కువైట్‌లోనూ జనజీవనం స్తంభించింది. పరిశ్రమలు, నిర్మాణ రంగ ప్రాజెక్టులు, రిటైల్, చమురు ఉత్పత్తుల కంపెనీ లన్నీ మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వలస కార్మికులు ఉపాధి కోల్పో యే పరిస్ధితి ఏర్పడింది. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కువైట్ సర్కారు వర్క్ పర్మిట్ల గడువు ముగిసిన, అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)ను వారి స్వదేశాలకు పంపాలని నిర్ణయించింది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రయాణ ఖర్చులను కూడా భరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు క్షమాభిక్ష కోసం పేర్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఔట్ పాస్‌పోర్టు రానివారు విలవిల.. ఔట్ పాస్‌పోర్టులు పొందని కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నా విదేశాంగ శాఖ సకాలంలో ఔట్ పాస్‌పోర్టులను జారీ చేయలేదని పలువురు రాష్ట్ర కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. విదేశాంగ శాఖ తప్పిదం వల్ల తాము కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిది కేంద్రాలకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు. ఆమ్నెస్టీని వినియోగించుకోని వలస కార్మికులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని కువైట్ గతంలోనే హెచ్చరించి ందని... ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిసు న్నారు. విడిది కేంద్రాల్లో ఉంటే తమకు భోజన సదుపాయం దక్కేదని, ఇప్పుడు సొంతంగా భోజన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కొన్ని రోజులుగా పని లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేదని, దాతల సహకారం పొందాల్సి వస్తుందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 20 మంది కార్మికులు (ఔట్ పాస్‌పోర్టు పొందని వారు) తమను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాలంటూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి లేఖ రాశారు. ఔట్ పాస్‌పోర్టు ఇప్పించాలి... మూడేళ్ల నుంచి కువైట్‌లో ఖల్లివెళ్లి కార్మికుడిగా పని చేస్తున్నా. గతంలో వీసా ఇచ్చిన కంపెనీ సరిగా వేతనం ఇవ్వకపోవడంతో మరో కంపెనీలో చేరా. కరోనా వైరస్ వల్ల ఆమ్నెస్టీ పెట్టారు. ఇంటికి రావడానికి దరఖాస్తు చేసుకున్నా. నాతోపాటు 20 మందికి ఔట్ పాస్‌పోర్టులు ఇవ్వలేదు. మాకు ఎలాగైనా ఔట్ పాస్‌పోర్టులు ఇప్పించాలి. – సంతోష్ లకావత్, డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లా -
5 నిమిషాల్లో కరోనా పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఐదు నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్ణయించింది. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటం, పెద్దఎత్తున పరీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో ర్యాపిడ్ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2.20 లక్షల మందికి సరిపోయేలా కిట్ల కోసం ప్రభుత్వం ఆర్డర్లు పెట్టింది. వీటి ద్వారా రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి అక్కడికక్కడే ర్యాపిడ్ కరోనా టెస్ట్ చేస్తారు. ఐదు నిమిషాల్లో పాజిటివ్ లేదా నెగెటివ్ అనేది తెలుస్తుంది. ఈ పరీక్షను రక్త నమూనాల ఆధారంగా చేస్తారు. దీన్నే యాంటీబాడీ రక్త ఆధారిత పరీక్ష అని కూడా అంటారు. అంటే ఆ వ్యక్తి శరీరంలోకి వైరస్ ప్రవేశించిందా లేదా ప్రభావితమైందా అనేది ఈ ర్యాపిడ్ టెస్ట్‌ల ఉద్దేశం. ఈ పరీక్షలను కరోనా వైరస్ పాజిటివ్ అత్యధికంగా నమోదైన ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు. అందుకోసం అత్యధికంగా పాజిటివ్ నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గుర్తించే పనిలో ఇప్పటికే నిమగ్నమైంది. పరీక్షల ప్రక్రియ ఇలా.. ఇప్పటికే హైదరాబాద్ సహా వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో హాట్స్పాట్లను గుర్తించారు. మిగిలిన జిల్లాల్లోనూ గుర్తిస్తున్నారు. అటువంటి ప్రాంతాల్లోనే ర్యాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ర్యాపిడ్ టెస్టుల్లో ఒకవేళ పాజిటివ్ వస్తే తక్షణమే, హైదరాబాద్‌లోని నిర్ణీత ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ గొంతుల్లోంచి స్వాబ్ తీసి రియల్ టైం పాలిమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్టీ–పీసీఆర్) పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాజిటివ్ వస్తే హైదరాబాద్‌లో చికిత్స చేస్తారు. ఇక ర్యాపిడ్ పరీక్షలో నెగటివ్ వచ్చినా జ్వరం, జలుబు, దగ్గు ఉంటే వారిని హోం క్వారంటైన్లో 14 రోజులు ఉంచాలని ఐసీఎంఆర్ సూచించింది. వారికి లక్షణాలు అధికంగా ఉంటే హైదరాబాద్‌లో ఆర్టీ–పీసీఆర్ పరీక్ష నిర్వహిస్తారు. ర్యాపిడ్ టెస్టుల్లో నెగటివ్ వచ్చిన వారు హోం క్వారంటైన్ పూర్తయ్యాక తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహించాకే బయటకు వెళ్లడానికి అనుమతించాలని ఐసీఎంఆర్ సూచించింది. జాతీయస్థాయిలో ఏర్పాటైన జాతీయ టాస్క్‌ఫోర్స్ ఈ పరీక్ష ప్రక్రియను వేగవంతం చేస్తోంది. హైదరాబాద్‌లో హాట్స్పాట్లివే.. రెండ్రోజుల క్రితం వరకు 25 హాట్స్పాట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు గుర్తించాయి. ఇంకా అనేక జిల్లాల్లో వీటిని గుర్తించే ప్రక్రియ మొదలైంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన యూసఫ్‌గూడ, చంచల్‌గూడ, సికింద్రాబాద్, దారుషిఫా, మహేంద్రహిల్స్, సికింద్రాబాద్ ఎంజే రోడ్, నాంపల్లి, ఎమ్మెల్యే కాలనీ, న్యూమలక్‌పేట, నారాయణగూడ, ఖైరతాబాద్, మణికొండ, రాజేంద్రనగర్, షాద్‌నగర్, కుత్బుల్లాపూర్, టోలిచౌకి, చార్మినార్, ఫిలింనగర్ బస్తీ, బేగంపేట, నాచారం, కొత్తపేట, పీఅండ్‌టీ కాలనీ, అంబర్‌పేట ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కేసుల సంఖ్య మరో నాలుగైదు రోజుల్లో పెరిగే పరిస్థితి ఉన్నందున మరికొన్ని ప్రాంతాలను గుర్తించే అవకాశముంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వేచేసి ర్యాపిడ్ టెస్ట్‌లు చేసే విషయమై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదు. ఒకవిధంగా చెప్పాలంటే హైదరాబాద్ రెడ్‌జోన్‌లోనే ఉన్నట్టుగానే భావిస్తున్నారు. హాట్స్పాట్లకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లకు బాధ్యత అప్పగించామని అధికారులు చెబుతున్నారు. వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో.. వరంగల్ అర్బన్ జిల్లాలో జులైవాడ, సుబేదారి, ఈద్గా, కుమార్‌పల్లి, మండిబజార్, పోచంమైదాన్, చార్బౌలి, కాశీబుగ్గ, గణేష్‌నగర్, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట, శాంబునిపేట, బాపూజీనగర్, చింతగట్టు క్యాంప్‌లను హాట్స్పాట్లుగా గుర్తించారు. వీటినే నో మూమెంట్ జోన్లుగా అక్కడి అధికారులు పిలుస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కాలనీలను గుర్తించి ఎనెన్ని ఇళ్లలో సర్వే చేయాలో కూడా నిర్ణయించారు. ఆ తర్వాత అత్యధిక కేసులు నమోదైన నిజామాబాద్‌లో ఆర్యానగర్, మాలపల్లి, ఖిల్లారోడ్ను కూడా హాట్స్పాట్లుగా గుర్తించినట్లు తెలిసింది. కరీంగనగర్ జిల్లాలోనూ అధికంగా కేసులు నమోదయ్యాయి. అక్కడ కూడా అధికారులు హాట్స్పాట్లను గుర్తించినట్లు సమాచారం. తక్కువ కేసులున్న ప్రాంతాల్లో పాజిటివ్ వ్యక్తులున్న ఇళ్లకు మూడు కిలోమీటర్ల మేర హాట్‌స్పాట్‌గా ప్రకటించి కంటైన్మెంట్ ప్రణాళికను అమలుచేస్తారు. ఇంటింటికి వెళ్లి వైరస్ లక్షణాలున్న వారికి ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. -
లాక్డౌన్ : మద్యం బ్లాక్ దందా..
సాక్షి, నిజామాబాద్: లాక్డౌన్ పీరియడ్‌లో మద్యం వ్యాపారుల దోపిడీకి అంతులేకుండా పోయింది. మద్యం ప్రియుల బలహీనతను సొమ్ముగా మార్చుకుంటున్నారు. వైన్స్ షాపులు, బార్లలోని మొత్తం స్టాక్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. ఎమ్మారీ్పకి నాలుగింతల రేట్లకు మద్యం బాటిళ్లను అమ్ముతున్నారు. మద్యం తాగటం బలహీనతగా మారిన కొందరు గత్యంతరం లేని స్థితిలో కొనుగోలు చేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. వారం రోజులుగా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు సాగుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం మారింది. ఇప్పుడిది అంతటా హాట్ టాపిక్‌గా మారింది. అడ్డుకోవాల్సిన వారే అండగా.. మద్యం బ్లాక్ మార్కెట్లో అమ్ముడవుతుంటే మరోవైపు ఎక్సైజ్‌శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. మద్యం అక్రమంగా విక్రయిస్తే పట్టుకొని కేసులు నమోదు చేయాల్సిన వారే అక్కమార్కులకు అండగా ఉంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజృంభిస్తున్న కల్తీకల్లు.... మరో వైపు కల్తీకల్లు విజృంభిస్తోంది. నగరంలో, జిల్లాలో కల్లు డిపోలు , కల్లు దుకాణాలు ఎక్కడికక్కడ మూతపడిన విషయం తెలిసిందే. అయితే కల్లు విషయంలో సైతం రూ.10 నుండి 20 లోపు ఉండే సీసా ధర ఇప్పుడు ఏకంగా రూ.50 పైనే విక్రయాలు జరుపుతున్నారు. మా దృష్టికి వస్తే లైసెన్స్ రద్దు చేస్తాం జిల్లాలో , నిజామాబాద్ నగరంలో ఎక్కడైన సరే అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపడం నేరం. దీనిపైన ఎవరైన మాకు కచ్చితమైన సమాచారంతో ఫిర్యాదు చేస్తే సంబంధిత మద్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని లైసెన్స్‌ను రద్దుచేయడం చేస్తాం. ఈ విషయంపై మూడు టీమ్‌లు సిద్ధం చేస్తున్నాం. ఎవరు కూడా అక్రమంగా మద్యం , కల్తీకల్లు విక్రయించవద్దు. – డాక్టర్ నవీన్‌చంద్ర, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
సాక్షి, లింగంపేట(ఎల్లారెడ్డి): పట్టామార్పిడి కోసం లంచం తీసుకుంటూ ఆర్ఐ ఏసీబీకి పట్టుబడ్డారు. రూ. 3 వేలు, సెల్‌ఫోన్ లంచంగా తీసుకుంటుండగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ఏసీబీ డీఎస్పీ రవికుమార్ బుధవారం సాయంత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కొర్పోల్‌కు చెందిన మహమ్మద్ నూరొద్దీన్కు చెందిన పలు భూముల పట్టా మార్పిడి కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. స్పందించకపోవడంతో గత కలెక్టర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఆయన సమస్య పరిష్కరించాలని ఆర్డీవోను ఆదేశించారు. దీంతో ఆయన విచారణ చేపట్టారు. ఆర్ఐని సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అయితే ఆర్ఐని నూరొద్దీన్ సంప్రదించగా రూ. 4,500, రూ. 3500 విలువ గల సెల్‌ఫోన్ ఇస్తే సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. సదరు భూములను నూరొద్దీన్, బిపాషా, జూనెత్, ఓవెస్ల పేరుపైకి పట్టా మార్పిడి చేయిస్తానని చెప్పాడు. దీంతో నూరొద్దీన్ కుమారుడు సలీం రెండు రోజుల క్రితం రూ. 1500 ఆర్ఐకి ఇచ్చినట్లు తెలిపారు. మిగతా రూ. 3000తో పాటు రూ. 3,500 విలువ గల సెల్‌ఫోన్‌ను ఇవ్వాలని కోరడంతో బాధితుడు బుధవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆర్ఐకి సదరు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రవికుమార్ బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
ఇంజిన్‌లో ఇరుక్కున్న విద్యార్థి కాళ్లు
-
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి
జక్రాన్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో పీజీ వైద్య విద్యార్థి రోహిత్‌రెడ్డి (29) మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై రామునాయుడు కథనం ప్రకారం.. నిర్మల్‌కు చెందిన రోహిత్‌రెడ్డి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. రోహిత్ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. మరో వైద్య విద్యార్థి అన్వేష్‌తో కలసి సోమవారం రాత్రి ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు వస్తుండగా.. మునిపల్లి సమీపంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోహిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అన్వేష్‌ను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అన్వేష్ వరంగల్ జిల్లాకు చెందినవాడని సమాచారం. -
వర్సిటీలో చిరుత కలకలం.. పరీక్షలు వాయిదా
-
‘ఉపకారా’నికి టీ–వ్యాలెట్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతన పథకానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి అనే నిబంధనకు కాస్త బ్రేక్ పడింది. బ్యాంకు ఖాతా తెరవడం, దాని నిర్వహణ తదితర అంశాలు విద్యార్థులకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయనే ఆందోళన ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీ–వ్యాలెట్ యాప్/ఆన్లైన్ సర్వీసు ద్వారా ఉపకారవేతనాలు పంపిణీ చేసేలా నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా గతేడాది అందుబాటులోకి తెచ్చింది. ఈ జిల్లాలోని విద్యార్థులు ఉపకారవేతనం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకు ఖాతా నంబర్ బదులుగా టీ–వ్యాలెట్ బటన్ ను ఎంపిక చేసుకుంటారు. దరఖాస్తుదారు ఎంట్రీ చేసిన ఫోన్ నంబర్, విద్యార్థి పేరు ఆధారంగా టీ–వ్యాలెట్ రిజి స్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఉపకారవేతనం విడుదలైన వెంటనే విద్యార్థి టీ–వ్యాలెట్ ఖాతాకు నిధులు జమవుతాయి. వీటిని సమీప మీ సేవా కేంద్రంలో విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. గతేడాది నిజామాబాద్ జిల్లాలో 32 వేల మంది విద్యార్థులు టీ–వ్యాలెట్ ఎంపిక చేసుకున్నారు. మరో నాలుగు జిల్లాల్లో.. నిజామాబాద్ జిల్లాలో టీ–వ్యాలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలివ్వడంతో మరో నాలుగు జిల్లాల్లో కూడా ఇదే తరహాలో ఉపకారవేతనాలు ఇవ్వాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో టీ–వ్యాలెట్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యాలెట్ ఆప్షన్ ఇస్తే మేలు.. ప్రస్తుతం ఉపకారవేతన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే వివరాల్లో తప్పులు, మార్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చు. నిర్దేశించిన 4 జిల్లాలకు సంబంధించి వెబ్సైట్లో టీ–వ్యాలెట్ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే విద్యార్థులంతా బ్యాంకు ఖాతాకు బదులుగా టీ–వ్యాలెట్ వివరాలు సమర్పించవచ్చు. కొత్తగా నాలుగు జిల్లాల్లో టీ–వ్యాలెట్ అమలుపై అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
యువతిపై పెద్దనాన్న కొడుకే అఘాయిత్యం
బోధన్‌టౌన్: సోదరి అవుతుందన్న విషయం మరిచి చిన్నాన్న కూతురిపైనే కన్నేశాడో కీచకుడు. మిత్రుడితో కలసి రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీటీ నగర్‌కు చెందిన యువతి (19) దివ్యాంగురాలు. పదో తరగతి చదివిన ఆమె ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసముంటున్న ఆ యువతి పెద్దనాన్న కుమారుడు నవీన్ మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. మిత్రుడు రవితో కలసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆమె నోరు విప్పలేదు. ఈ క్రమంలో ఆమెలో శారీరక మార్పులు గమనించిన తల్లి దండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా విషయం తెలిసింది. బాధితురాలు ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. అయితే, ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కుల పెద్దలను ఆశ్రయించగా వారు ఈ విషయాన్ని బయటకు రాకుండా యత్నించారు. దీంతో బాధితులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీని కలసి జరిగిన విషయం చెప్పారు. దీంతో ఆమె వారిని వెంట బెట్టుకుని శనివారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆరేళ్ల చిన్నారిపై బాలుడి లైంగికదాడి
రెంజల్ (బోధన్): ఆరేళ్ల చిన్నారిపై పదిహేనేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు. సాయంత్రం కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లి బాలిక స్పృహలో లేకపోవడంతో ఆందోళనకు గురైంది. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చిన బాలిక జరిగిన విషయం తల్లికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కత్తులతో బెదిరించి దోపిడీ
-
‘పాలిథిన్’పై సమరం.. నేటినుంచి నిషేధం
పర్యావరణానికి హాని కలిగిస్తున్న పాలిథిన్ కవర్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిని పక్కాగా అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. నెలరోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సాక్షి, బాన్సువాడ: పాలిథిన్ కవర్ల వాడకం ప్రజారోగ్యానికి పెను భూతంలా పరిణమించింది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఎటు చూసినా కొండల్లా పేరుకుపోయిన చెత్తకుప్పల్లో సింహభాగం పాలిథిన్ కవర్లే నిండి ఉంటున్నాయి. పాలిథిన్ కవర్లను నిషేధిస్తూ జారీ అయిన ఉత్తర్వులు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. మున్సిపల్, గ్రామ పంచాయతీల అధికారులు పాలిథిన్ కవర్ల నిషేధం గురించి గత నెల రోజులుగా విస్తృత ప్రచారం చేశారు. అయితే ప్రజలందరూ స్పందించి సహకరిస్తేనే పాలిథిన్ కవర్లను నిషేధించేందుకు వీలుంటుంది. అలాగే దుకాణాల యజమానులు వీటి విక్రయాలను పూర్తిగా నిషేధించాల్సి ఉంది. పర్యావరణానికి ముప్పు భూమిలో ఏ మాత్రం కరిగే అవకాశం లేని వీటి వల్ల వర్షపు నీరు లోతుల్లోకి ఇంకకపోవడమే కాకుండా, వాటిని తిన్న పశువులను తీవ్ర అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. పాలథిన్ కవర్లను కాల్చడం వల్ల వెలువడే విష వాయువులు మనుషులు ఆరోగ్యానికి తీరని ముప్పు చేస్తున్నాయి. ప్రభుత్వం, అధికారుల చిత్తశుద్ధి లోపంతో గతంలో విధించిన నిషేదాజ్ఞలు నీరుగారిపోయాయి. పాలథిన్ కవర్ల వాడకం వల్ల పర్యావరణానికి, జంతుజాలానికి, మానవులకు వచ్చే ముప్పును ప్రభుత్వాలు గుర్తించడం వల్లే నిషేధాన్ని అమలు చేసింది. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో పాలథిన్ కవర్ల నిషేధం అమలుకు చర్యలు తీసుకొంటున్నారు. బాన్సువాడలో పాలిథిన్ కవర్లను సేకరించి తరలిస్తున్న మున్సిపల్ సిబ్బంది ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేధం మానవాళికి ప్రమాదకర పరినమిస్తున్న ప్లాస్టిక్‌పై దేశవ్యాప్తంగా ఉద్యమం చేయటానికి ప్రధాని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేటి నుంచి ‘స్వచ్చతా హీ సేవా’ కార్యక్రమాన్ని చేపడుతోంది. దీని ప్రధాన ఉద్ధేశ్యం పాలిథిన్ వాడకాన్ని దేవాలయాల్లో నిషేధించడం. ఒక్కసారి వాడి పారేసిన ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీపావళి పండుగ నుంచి గ్రామాలు, పట్టణాలు, నగరాలు, దేవాలయాలు, పాఠశాలల పరిసరాలను పాలిథిన్ వ్యర్థాల నుంచి విముక్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. పాలిథిన్ కవర్ల వల్ల అనర్థాలు.. పాలిథిన్ కవర్లు, వేల లక్షల సంవత్సరాలు కరిగిపోకుండా అలాగే భూమి పొరల్లో పేరుకుపోతాయి. ఇవి అడ్డుపడడం వల్ల భూమిలోకి నీరు ఇంకడం ఆగిపోయి భూగర్భ జల మట్టాలు తగ్గిపోతాయి. పాలిథిన్ కవర్ల వల్ల సారవంతమైన వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోతాయి. చెత్తకుప్పల్లోని పాలిథిన్ కవర్లను పశువులు ఆహారంగా తీసుకోవడం వ్లల ఉదరకోశ, శ్వాస సంబంధ వ్యాధులతో మరణిస్తాయి. ఎక్కడపడితే అక్కడ ఆ పాలిథిన్ కవర్లు పారేయడం వల్ల అవి అడ్డుపడి మురుగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. పర్యావరణం కోసం.. ప్టాస్టిక్ వినియోగాన్ని తగ్గించి సంప్రదాయ పర్వదినాల్లో ప్రకృతి ప్రసాదించిన మోదుగాకులను ఇతర సామాగ్రిని వినియోగించవలిసిన అవసరం ఎంతైన ఉంది. –డాక్టర్ సుధీర్‌సింగ్, పర్యావరణవేత్త, కంఠేశ్వర్ దేవాలయాలు కలుషితమవుతున్నాయి భక్తులు విచ్చల విడిగా వినియోగిస్తున్న ప్లాస్టిక్ వల్ల దేవాలయాలు కలుషితమవుతున్నాయి. పూజాసామాగ్రికి కూడా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నాము. నైవేద్యం, భోజనం కూడా ప్లాస్టిక్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. –సోమయ్య, సహాయ కమిషనర్ అన్ని కార్యాలయాల్లో అమలు జాతి పిత మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి నిజామాబాద్ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడానికి అన్ని కార్యాలయాలు, దైనందిన జీవితంలో అన్ని చోట్ల ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం. – ఆర్.ఎం.రావు.. జిల్లా కలెక్టర్ -
నిందితులంతా నేర చరితులే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఓ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 3 బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులంతా నిజామాబాద్ శివారు లోని సారంగాపూర్ గ్రామానికి చెందిన వారని తేలింది. శుక్రవారం సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఓ యువతిపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పా ల్పడి..సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిం చిన విషయం విదితమే. ప్రధాన నిందితుడు మక్కల సురేశ్‌తోపాటు నాగరాజు, శంకర్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల నేర చరిత్ర అఘాయిత్యానికి పాల్పడిన నిందితులకు నేర చరిత్ర ఉంది. నిందితుల్లో ఒకరైన నాగరాజు ఆటో నడుపుకుంటూ జులాయిగా తిరుగుతుంటాడు. గతంలో ఇదే గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి ఓ యువతిపై అత్యాచారానికి యత్నించాడు. మిగిలిన నిందితులపై కూడా 6వ టౌన్ పోలీస్‌స్టేషన్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. నిందితుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందుకు వివరాలు వెల్లడించడం కుదరదని కేసు దర్యాప్తు అధికారి రఘునాథ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. నిందితులను వెంటనే పట్టుకోండి: డీజీపీ సారంగాపూర్ గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆరా తీశారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సీపీ కార్తికేయను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు అధికారి రఘునాథ్, ఏసీపీ శ్రీనివాస్‌లతో కేసు పురోగతిపై సమీక్షించారు. పోలీసులకు చిక్కారిలా.. ప్రధాన నిందితుడు మక్కల సురేష్ యువతిని ద్విచక్ర వాహనంపై సారంగాపూర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చారు. రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. ఆటోలో వచ్చి ఆరుగురు ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీన్ని మరో ఇద్దరు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఓ కేసు విచారణ నిమిత్తం అటువైపు వెళ్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్లకు రోడ్డు పక్కన కొంత దూరంలో ఆటో కనిపించింది. నిర్మానుష్య ప్రాంతంలో ఆటో ఉండటాన్ని అనుమానించిన పోలీసులు అటువైపు వెళ్లి చూడగా.. ఆటోలో కూర్చుని సెల్ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు యువకులు కనిపించారు. వారిని ప్రశ్నించగా.. ఏడుగురు స్నేహితులం బహిర్భూమికి వచ్చామంటూ దాటుకునే ప్రయత్నం చేశారు. గద్దించి అడుగగా.. వారికి ఫోన్ చేయించి స్పీకర్ ఆన్ చేయించడంతో యువతి అరుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డమ్మీ గన్‌తో పోలీసులనే బెదిరించి..!
సాక్షి, నిజమాబాద్ : ఓ వ్యక్తి డమ్మీ గన్‌తో పోలీసులను బెదిరించిన ఘటన నిజామాబాద్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌లోని కోటగల్లిలో జరిగిన పోలీసుల దాడిలో తప్పించుకుని, ఆ తర్వాత డమ్మీ గన్‌తో బెదిరించిన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరెస్టు చేయబడిన వ్యక్తిని పోలీసులు చాట్ల గోపిగా గుర్తించారు. గోపి పై గతంలో మర్డర్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గోపి దగ్గర ఉన్న కత్తి, డమ్మీ గన్లను స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అద్దె ఇల్లే శాపమైంది!
సాక్షి, నందిపేట్(నిజామాబాద్) : బతుకు దెరువు కోసం వచ్చిన ఆ కుటుంబంలో విధి విషాధం నింపింది. తమ పిల్లల భవిష్యత్ కోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన ఆ దంపతుల ఆనందాన్ని గోడ కూలి ఆవిరి చేసింది. కొత్తగా దిగిన అద్దె ఇంట్లో సామగ్రి సర్దుకోక ముందే చిన్న కూతరును గోడ రూపంలో మృత్యువు కబలించింది. కొత్తగా అద్దె ఇంట్లో దిగిన గంటల వ్యవధిలోనే గోడకూలి చిన్నారి మృతి చెందిన ఘటన నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా లింగసముందర్ మండలం ఎర్రేటిపాలెం గ్రామానికి చెందిన రావూరి అంజయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి నిమిత్తం మేస్త్రీ పనిచేసేందుకు నందిపేట మండలానికి వచ్చాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మండల కేంద్రంలోని రామ్‌నగర్ దుబ్బ ప్రాంతంలో గల ఒక ఇంటిలో భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడితో కలిసి అద్దెకు దిగాడు. ఉదయం 8 గంటలకు వచ్చిన వారు సామన్లు సర్దుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భార్యభర్తలు అంజయ్య, చెంచమ్మ ఆరుబయట మెట్ల వద్ద కూర్చుని ఉండగా ముగ్గురు పిల్లలు ఆర్సీసీ బిల్డింగ్‌ను ఆనుకుని ఉన్న రేకులషెడ్డు వంట గదిలో ఆడుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన వంటగది రేకుల షెడ్డు గోడ ఒక్కసారిగా ముగ్గురి చిన్నారులపై కూలింది. తీవ్రంగా గాయపడిన వారి చిన్న కూతురు రేణుక(8) సంఘటన స్థలంలో మృతి చెందింది. అలాగే పెద్ద కుమార్తె శాంకుమారి(12), కొడుకు కొండయ్య(10) తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటిలో చేరిన మొదటి రోజే కూతురును పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు, అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నారి తల్లి చెంచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. -
గొంతు నులిమి కొడుకును చంపిన కసాయి తండ్రి..!
సాక్షి, నిజామాబాద్ : కొడుకును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కర్కశంగా మారాడు. ముక్కుపచ్చలారని ఆరేళ్ల కొడుకును అతి దారుణంగా గొంతునులిమి హతమార్చాడు. అనంతరం తానూ ఉరిపోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతులు.. తండ్రి విజయ్ తుల్జారాం, కొడుకు దినేష్ రాజస్తాన్ వాసులుగా స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. -
అద్దె కట్టు; తహసీల్దార్ ఆఫీస్‌కు తాళం..!
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని మోపాల్ మండల తహసీల్దార్ ఆఫీసుకు తాళం పడింది. తన ఇంట్లో నిర్వహిస్తున్న తహసీల్దార్ ఆఫీసుకు అద్దె చెల్లించకపోవడంతోనే తాళం వేశాయని యజమాని గుంగుబాయి స్పష్టం చేశారు. ఏడాది కాలంగా అద్దె ఇవ్వడం లేదని ఆవేదన వెళ్లగక్కాడు. ఈ విషయంపై కలెక్టర్ రామ్మోహన్ రావు దృష్టికి ఫిర్యాదు చేశానని కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గంగుబాయి అసహనం వ్యక్తం చేశాడు. -
కాన్పు చేసిన డ్యూటీ సూపర్వైజర్
-
మహిళ చేతిలో వీఆర్వోకు చెప్పుదెబ్బలు
-
కాంగ్రెస్– బీజేపీలను ఓడిద్దాం
బోధన్ టౌన్ : దేశంలోని మైనారిటీకు ఫెడరల్ ఫ్రంట్‌తోనే న్యాయం జరుగుతుందని, 70ఏళ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీలు మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించాయని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం రాత్రి బోధన్‌లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేనానికి కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అలాగే బోధన్‌లో జరిగిన కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కవిత ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మైనార్టీలకు ఓటు బ్యాంకుగా మార్చు కున్నారని, మైనార్టీల అభివృద్ధిని విస్మరించారని గుర్తు చేశారు. దేశంలో 36 కోట్ల మంది మైనార్టీలు ఉన్నారని, వారి సంక్షేమం కోసం ఫెడరల్ ఫ్రంట్ పనిచేస్తుందన్నారు. దేశంలో 40 శాతం ప్రజలు ప్రాంతీయ పార్టీలకు అండగా ఉన్నారని, వీరందరు, ఒక్కటైదే ఫ్రడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపామని గుర్తు చేశారు. దేశంలో మోదీ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయిందని ఆరోపించారు. బీజేపీ పార్టీ అధికారంలోకి రాక ముందు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకు వచ్చి ప్రజలకు పంచుతానని హామీ ఇచ్చారని, 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి విస్మరించారని విమర్శించారు. బీజేపీ కాదని, భారతీయ జూట పార్టీ అని ఆరోపించారు. రాహుల్‌కు విజన్ లేదు... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాçహుల్ గాంధీకి ఒక విజన్ లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసేది చెప్పడంలో విఫలం అవుతున్నారని, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం నమ్మడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలకు మైనార్టీల ఓటు పడకుండా చూడాలన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పోరులో కాంగ్రెస్ పార్టీ కనబడడం లేదని, మధుయాష్కి పారీ పోయాడని, దేశంలో కాంగ్రెస్ పార్టీ తీరు నిజామాబాద్ తరహాలోనే ఉందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. బోధన్– బీదర్ రైల్వే ప్రాజెక్టు కోసం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి కృషి చేస్తానని, ఇచ్చిన మాట ప్రకారం పెద్దపల్లి– నిజామాబాద్ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేశామని గుర్తు చేశారు. క్రిస్టియన్, మైనారిటీలు అధైర్య పడవద్దన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. -
నిజామాబాద్‌లో స్టార్ వార్..
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ముఖ్యనేతలు ఉమ్మడి జిల్లా బాట పట్టారు. ఇప్పటికే మూడు చోట్ల పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించిన టీఆర్ఎస్ మరో నాలుగు చోట్ల బహిరంగసభలకు ఏర్పాట్లు చేసింది. సోమవారం కేసీఆర్, మంగళవారం ప్రధాన మంత్రి మోదీ ప్రచార సభలకు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. సాక్షి, నిజామాబాద్: జిల్లాకు అగ్రనేతలొస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ పార్టీల ముఖ్యనేతలు జిల్లా బాట పట్టారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార సభలను నిర్వహించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించాయి. ఇప్పటికే మూడు చోట్ల ఎన్నికల ప్రచార సభలను నిర్వహించిన టీఆర్ఎస్ మరో నాలుగు చోట్ల జరగనున్న బహిరంగసభలకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 27న నిజామాబాద్ నగరంలో జరగనున్న భారీ బహిరంగసభకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. స్థానిక గిరిరాజ్ కళాశాల మైదానంలో బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలు సోమవారం జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి, డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్), బోధన్, బాల్కొండల్లో ఈ సభలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ కూడా మరోమారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కామారెడ్డిలో రాహల్‌గాంధీ సభ జరిగింది. అగ్రనేతల రాకతో జిల్లాలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాని హోదాలో తొలిసారి .. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి హోదాలో జిల్లాకు తొలిసారిగా రానున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటించిన ఆయన ఈసారీ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వస్తున్నారు. సభను నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించిన ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ మైదానాన్ని పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. మోదీ బహిరంగసభ ఏర్పాట్లను ఆ పార్టీ కేంద్ర మంత్రి జేపీనడ్డా పరిశీలించారు. మోదీ బహిరంగసభ జిల్లాలోని బీజేపీ అభ్యర్థుల్లో నూతనోత్సాహం నింపుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరో కేంద్ర సహాయ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ నగరంలో చాయ్‌పే చర్చలో పాల్గొన్నారు. అలాగే స్వామి పరిపూర్ణనంద, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్, ఎల్లారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగసభలను నిర్వహించిన టీఆర్ఎస్ ఈనెల 26న ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల వరుస సభలను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం కామారెడ్డి బహిరంగ సభ అనంతరం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి వద్ద, అలాగే బోధన్ నియోజకవర్గ కేంద్రంలో, బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌లో సభలను నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను, కార్యకర్తలను ప్రజలను తరలించేందుకు ఆ పార్టీ అభ్యర్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎల్లారెడ్డి, ఆర్మూర్‌లలో నిర్వహించిన కేసీఆర్ సభలతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. రాహుల్ సభ నిర్వహించే యోచన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ మరోమారు జిల్లాకు రానున్నారు. ఇప్పటికే కామారెడ్డిలో కాంగ్రెస్ రాహుల్‌గాంధీ బహిరంగసభను నిర్వహించిన విషయం విధితమే. ఈసారి నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్‌లో గానీ, ఆర్మూర్‌లో గానీ ఈ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వీలైతే జిల్లా కేంద్రంలో రాహుల్ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్ క్యాంపెయినర్లతో ప్రచార కార్యక్రమాలకు కార్యచరణ రూపొందిస్తోంది. పలుచోట్ల రేవంత్‌రెడ్డితో రోడ్‌షోలు, సభలను నిర్వహించే యోచనలో ఉంది. విజయశాంతి వంటి నేతలు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. మొత్తం మీద అగ్రనేతల ప్రచారంతో జిల్లా హోరెత్తనుంది. -
తండ్రి ఫామ్‌హౌస్‌కు తనయుడు అమెరికాకు
బిక్కనూరు : అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పామ్‌హౌజ్‌కు, ఆయన తనయుడు కేటీఆర్ అమెరికాలో రెస్టు తీసుకుంటారని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జంగంపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ప్రజలు నాల్గున్నర ఏళ్లుగా కేసీఆర్ నియంత పాలనను కళ్లార చూశారని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను పాతర పెట్టెందుకు ఇప్పటికే సిద్ధమయ్యారన్నారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం కాగా మూటలు కట్టుకోవడం ప్రజా ధనాన్ని దోచుకోవడం టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. షబ్బీర్అలీకి గ్రామస్తులు బోనాలతో ఘన స్వాగతం పలికారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, పీసీసీ కార్యదర్శులు ఇంద్రకరన్‌రెడ్డి, నల్లవెళ్లి అశోక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు లింబాద్రి, కుంట చిన్నమల్లారెడ్డి, నేతలు పుల్లురి రామస్వామి, నర్సింలు, బాల్‌నర్సవ్వ, సుదర్శన్, నాగభూషణంగౌడ్, సిద్దగౌడ్, అంకం రాజు, లింగారెడ్డి, ఎల్లారెడ్డి ఉన్నారు. అప్పుల ఊబిలో రాష్ట్రం ఘనత కేసీఆర్‌దే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకపోవడానికి సీఎం కేసీఆర్ కారణమని మాజీ ప్రభుత్వ విప్ సయ్యద్ యూసుప్ అలీ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జంగంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ తరపున ప్రచారం చేశారు. కోట్లాడి సాధించుకున్న రాష్ట్రం ద్రోహుల చేతిలో తల్లడిల్లుతుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నారు. రైతుబంధు చెక్కులు 30 శాతం మందికి ఇంకా అందలేదన్నారు. తాత ముత్తాతల నుంచి భూములు ఉన్న రైతులకు రైతుబంధు పథకం వర్తించలేదని, రియల్టర్లకు, భూములు క్రయవిక్రయాలు చేసే వారికి మాత్రం రైతుబంధు చెక్కులు అందాయన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు రాకేష్, భూమయ్య, సిద్దరాములు ఉన్నారు. -
ఊదరగొడితే కేసుల మోత
సాక్షి,సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఎన్నికల సందడి మొదలైందంటే చాలు.. గ్రామాల్లో మైకులు హోరెత్తుతుంటాయి. మీ ఓటు మాకే అంటూ పాటల రూపంలో, అనుకరణల మధ్య పార్టీల పేరుతో ఊదరగొట్టడం సర్వసాధారణం. ప్రచార సాధనాల మోత చెవుల్లో మార్మోగుతుంది. హద్దులు మీరిన శబ్ధాలతో తలబొప్పి కడుతుంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా డీజే శబ్ధాలతో విపరీత ధోరణికి పోవడంతో కొంత సమస్యగా మారుతుంది. చట్టపరంగా ఏ మేరకు ధ్వని వినియోగించుకోవాలో ఎన్నికల సంఘం నిర్ణయించింది. శబ్ధం పెరిగిందా.. కేసులు నమోదు కావాల్సిందే. ఈసారి ఎన్నికల్లో అతి శబ్ధంతో ఊదరగొడితే కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు, ఆయన తరపున ప్రచారం చేసే వారు జాగ్రత్త పడాల్సిందే మరి. ఏ ప్రాంతంలో ఎంత శబ్ధం వినియోగించాలో.. ఎన్ని డెసిబుల్స్ ఉండాలో పర్యావరణ చట్టానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. నివాస ప్రాంతాల్లో 45-55 డెసిబుల్స్ మాత్రమే వినియోగించాలి. వైద్యశాలలు, విద్యాలయాలు, న్యాయస్థానాల సమీపంలో 40-50 డెసిబుల్స్ . వ్యాపార ప్రాంతాల్లో 55-65 డెసిబుల్స్ . పారిశ్రామిక ప్రాంతాల్లో 70-75 డెసిబుల్స్ లోపు వినియోగించవచ్చు. -
నీవు లేని.. జీవితం మాకొద్దు
కమ్మర్పల్లి(బాల్కొండ) : కూతురి మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. రెండు నెలల కిత్రం అనారోగ్యంతో చిన్నారి కూతురు మృతి చెందడంతో దంపతులిద్దరు తీవ్ర మనస్థాపం చెందారు. అప్పటి నుంచి కూతురును పదేపదే తలచుకుంటూ నీవు లేక సమాజంలో బతకలేకపోతున్నాం.. అంటూ డైరీలో రాసి శనివారం ఉదయం గరిపె సందీప్(30), పూజ(26) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ మురళి కథనం ప్రకారం.. నర్సాపూర్ గ్రామానికి చెందిన గరిపె సందీప్, పూజ దంపతుల కూతురు సహన(5) అనారోగ్యంతో రెండు నెలల కిత్రం మరణించింది. దీంతో దంపతులిద్దరూ డిప్రెషన్లోకి వెళ్లారు. కూతురుని ఎక్కడైతే ఖననం చేశారో అక్కడికి వెళ్లి పడుకోవడం, కూర్చోవడం, ఏడ్వడం చేశారు. గ్రామస్తులు, సన్నిహితులు వారిని ఇంటికి తీసుకువచ్చి సముదాయించారు. కూతురును తలచుకుంటూ పదేపదే ఏడుస్తూ తీవ్ర మనస్తాపం చెందిన దంపతులిద్దరూ శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులకు తల్లి సత్తెమ్మ, తండ్రి బాలయ్య, రెండు నెలల కొడుకు మణిదీప్ ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మురళి సంఘ టన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆకలైతే అన్నం తింటున్నం.. మనసునైతే పడతలేదు ఆకలైతే అన్నం తింటున్నం, కానీ మనసునైతే పడతలేదని దంపతులిద్దరు డైరీలో రాసుకున్నారు. డైరీలో పాపపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచారు. నీవు లేని ఈ సమాజంలో మేమేందుకుండాలి.. చనిపోవాలనుకుంటున్నాం అని రాశారు. కూతురును మరిచిపోలేకపోతున్నాం.. చనిపోతున్నాం అని రాసుకున్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
ఆర్మూర్ : ఏళ్ల తరబడి శ్రమ దోపిడీకి గురవుతున్న వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన పెన్‌డౌన్, టౌల్ డౌన్ నిరసన కార్యక్రమం బుధవారం కొనసాగింది. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి ఆస్పత్రి ప్రాంగణం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించడంతో పాటు అక్కడే వంటావార్పు, భోజనాల కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేయాలని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్లను సాధించుకొనే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు రెగ్యులర్ ఉద్యోగులు సంఘీబావం తెలిపారు. -
టీడీపీ వర్సెస్ ఎమ్మార్పీఎస్
* టీడీపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించిన ఎమ్మార్పీఎస్ * ప్రతిఘటించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు * పోలీసుల రంగ ప్రవేశం.. స్వల్ప లాఠీచార్జి * ధ్వంసమైన ‘మండవ ’ వాహనం ఆరుగురి అరెస్టు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు కొందరు ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ కార్యకర్తలు ప్రయత్నించడం, ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించడం, కార్యకర్తలపై దాడికి దిగడంతో సదస్సులో రభస జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు యత్నించగా, వారిపైనా కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయగా, ఆగ్రహం చెందిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కారును ధ్వంసం చేశారు. ఈ కేసులో పోలీసులు ఆరు గుర్ని అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ప్రసంగం కొనసాగుతుండగా ఒక్కసారిగా ఎమ్మార్పీఎస్ నాయకులు దూసుకొచ్చారు. ఏపీ అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ వేదికపై ఉన్న టేబుళ్లను తీసి విసిరేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌పై దాడికి దిగారు. ఎస్సైలు మధు, సైదయ్య వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ఎస్సైలకు సైతం దెబ్బలు తగిలాయి. టీడీపీ కార్యకర్తలు కుర్చీలను విసిరేశారు. కేసీఆర్ టార్గెట్‌గా నేతల ప్రసంగాలు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ టార్గెట్‌గా టీడీపీ సమావేశంలో ఆ పార్టీ నాయకులు నిప్పులు కురిపించారు. టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచీ ముగిం చేంత వరకూ కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. ‘అడుక్కోవడానికి వచ్చిన నీకు మా పార్టీ కార్యకర్తలు భిక్షంగా ఓట్లు వేసి గెలిపించారు. కానీ, గెల్చిన తరువాత ప్రజలు భిక్షమెత్తుకునే విధంగా చేస్తున్నావు... నువ్వు రావణాసురుడివైతే మా కార్యకర్తలు రాముళ్లై బాణాలను సంధిస్తారు. తెలంగాణ ఉద్యమంలో వెయ్యికి పైగా అమరులైతే, 459 మందే ఉన్నారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు.. సకల జనుల సర్వేలో కోళ్లు, మేకలు, పశువులు ఎన్ని ఉన్నాయో వివరాలు సేకరించిన నువ్వు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ప్రాణ, అవయవాల త్యాగం చేసినవారు మీ ఇంట్లో ఉన్నారా? అని సర్వేలో అడిగించావా’’ అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో బండారం బయటపెడ తాననే ఉద్దేశంతో తనను మాట్లాడనివ్వకుండా కుట్ర చేశారన్నారు. కాని ప్రజల ముందు నిజాలు బయటపెట్టి టీఆర్ఎస్ పార్టీ పీక నొక్కడం ఖాయమని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం పక్కన అమర వీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలని 20 సార్లు సీఎంకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బహుశా ఆయన పోయాక తన విగ్రహం పెట్టించుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. బుద్ధుడి పక్కన రూ. వెయ్యి కోట్లతో స్తూపం పెట్టే వరకు ఊరుకోబోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా అమర వీరుల త్యాగానికి గుర్తుగా ప్రత్యేక రోజును కేటాయించి హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వర్రావు, అరికెల నర్సారెడ్డి తదితరులు కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. అనంతరం, జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 44 మంది రైతు కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున చెక్కులను అందజేశారు. -
కర్షకున్ని వేధించి..ఏసీబీకి చిక్కి..
నిజామాబాద్క్రైం/ఆర్మూర్, న్యూస్‌లైన్: ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన ముస్కు చిన్న రాజారెడ్డి పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వలస వెళ్లారు. నాలుగేళ్లపాటు అక్కడ కష్టపడ్డా లాభం లేకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. తనకున్న ఆరు ఎకరాల భూమిలో వ్యవసాయం చేశారు. ప్రస్తుతం ఈయన పొలంలో రెండు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. 16 కేవీ ట్రాన్స్ ఫార్మర్పై ఓవర్‌లోడ్ కారణంగా మోటార్లు చెడిపోతుండడంతో అదనపు ట్రాన్స్ఫార్మర్కోసం ఇరవై రోజుల క్రితం దేగాం ఏఈ గోవర్ధన్‌ను కలిశారు. అయితే రూ. 20 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేస్తానని సదరు ఏఈ తెగేసి చెప్పాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని చిన్న రాజారెడ్డి పేర్కొన్నా వినలేదు. పైసా తగ్గినా కుదరదన్నాడు. దీంతో చేసేదేమీ లేక ఆయన స్వగ్రామానికి వెళ్లిపోయారు. తోటి రైతులతో విషయం చెప్పారు. వారు ఏసీబీని ఆశ్రయించాలని సూచించారు. దీంతో ఆయన ఏసీబీకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే గురువారం గ్రామానికి వచ్చిన ఏఈని రైతు చిన్న రాజారెడ్డి కలిశారు. రూ. 17 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఫలానా చోట.. ‘తాను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా పవర్‌హౌస్ కార్యాలయంకు వెళ్తున్నానని, అక్కడికి డబ్బులు తీసుకుని రావాలని’ ఏఈ చెప్పాడు. చిన్నరాజారెడ్డి శుక్రవారం పవర్‌హౌస్‌కు వెళ్లి ఏఈను కలిశాడు. అయితే చౌరస్తాలోని సలీం హోటల్‌కు వెళ్లమని, అక్కడికి వచ్చి డబ్బులు తీసుకుంటానని ఏఈ చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత అక్కడికి వెళ్లి రైతు వద్దనుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, రఘనాథ్‌రెడ్డిలు పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏఈని శనివారం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. అవినీతి అధికారిని పట్టించిన రైతు రాజారెడ్డిని మిగతా రైతులు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయకుండా, డబ్బుల కోసం పీడించే అధికారుల సమాచారం తమకు అందించాలని సూచించారు. -
సీఐడీ కస్టడీ నుంచి సీఐ పరారీ
బాల్కొండ, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కేంద్రంగా విధులు నిర్వర్తించే ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం రాత్రి సీఐడీ అధికారుల వద్ద నుంచి పరారయ్యారు. 2011లో మెదక్ జిల్లా తుప్రాన్‌లో సీఐగా పని చేస్తుండగా ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో సీఐను అరెస్ట్ చేయడానికి సీఐడీ సీఐ వెంకటేశ్వర్లు బృందం బుధవారం రాత్రి వారెంట్‌తో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోని సీఐ కార్యాలయానికి వచ్చారు. వారిని గమనించిన సీఐ తన ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పి వస్తానని వెళ్లి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. అసలు కేసు ఏంటి..? 2011లో తుప్రాన్‌లో సీఐగా శ్రీనివాస్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తుండగా అక్కడ బంగారు వ్యాపారి ఉంగరాల శ్రీను అలియాస్ కొత్త శ్రీనివాస్‌గుప్తాతో పరిచయం ఏర్పడింది. సీఐ అండదండలు ఉండటంతో ఉంగరాల శ్రీను బంగారం తక్కువ ధరకు ఇస్తానని పలువురిని నమ్మించి సుమారు రూ.మూడు కోట్లు వసూలు చేసి, పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ జరిపి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. తర్వాత కొన్ని రోజులకు తిరిగి ఉద్యోగంలో చేరి లూప్లైన్లో విధులు నిర్వర్తించారు. గత అక్టోబర్‌లో ఆర్మూర్ రూరల్ సీఐగా వచ్చారు. బాల్కొండ స్టేషన్లో కేసు నమోదు సీఐడీ అధికారులకు సహకరించకుండా పరారు కావడంతో 224 సెక్షన్ ప్రకారం బాల్కొండ ఠాణాలో శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు.