జక్రాన్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో పీజీ వైద్య విద్యార్థి రోహిత్‌రెడ్డి (29) మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై రామునాయుడు కథనం ప్రకారం.. నిర్మల్‌కు చెందిన రోహిత్‌రెడ్డి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. రోహిత్ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు.
మరో వైద్య విద్యార్థి అన్వేష్‌తో కలసి సోమవారం రాత్రి ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు వస్తుండగా.. మునిపల్లి సమీపంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోహిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అన్వేష్‌ను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అన్వేష్ వరంగల్ జిల్లాకు చెందినవాడని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment