PG medical student
-
వీడిన మిస్టరీ.. డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యే
సాక్షి, వరంగల్: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ధారావత్ ప్రీతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమెది ఆత్మహత్యేనని, ఆమె శరీరంలో పాయిజన్ ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ప్రకటించారు. ప్రీతి మృతికి సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతను బెయిల్‌పై ఇటీవలే బయటికి వచ్చాడు. డాక్టర్ ప్రీతిది హత్యేనని ఆమె కుటుంబసభ్యులు ప్రకటించడంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. అయితే రెండు నెలలు గడుస్తున్నా పోలీసులు ప్రీతి కేసు విషయంలో ఎటూ తేల్చకపోవడంతో పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ‘సాక్షి’జిల్లా పేజీలో ‘ప్రీతి మృతిపై వీడని మిస్టరీ’శీర్షికన శుక్రవారం ప్రత్యేక కథనం కూడా ప్రచురితమైంది. దీంతో శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రీతిది ఆత్యహత్యేనని ప్రకటించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. ప్రీతి ఆత్మహత్యకు డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమన్నారు. ఘటనాస్థలిలో ఆత్మహత్యకు కారణమైన సిరంజీ ఉందని, సూది మాత్రం కనిపించలేదన్నారు. వారం, పది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. సాక్షి వరంగల్ జిల్లా పేజీలో శుక్రవారం ప్రచురితమైన కథనం.. చదవండి: వీడిన సనత్ నగర్ బాలుడి హత్య కేసు మిస్టరీ.. అదే కారణం! -
మెడికో ప్రీతి మృతిపై వీడని మిస్టరీ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి మిస్టరీగానే మిగిలింది. రెండు నెలలు కావస్తున్న ప్రీతి డెత్ ఆత్మహత్యనా.. హత్యనా తేలక అనుమానస్పద మృతిగానే పోలీసులు పరిగణిస్తున్నారు. ప్రీతి ఏలా చనిపోయిందో స్పష్టమైన ఆధారాలు లభించకపోయినప్పటికి ర్యాగింగే ప్రీతి డెత్‌కు కారణమని పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందుకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్ధి సైఫ్‌ను అరెస్టు చేసి జైల్ కు పంపగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరయ్యింది. ఈ ఏడాది పిబ్రవరి 22న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ మెడికల్ విద్యార్థి ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయింది. నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించినా ప్రీతి ప్రాణాలు కోల్పోయారు. ప్రీతి మృతిపై అనేక అనుమానాలు ఆందోళనలు వ్యక్తం కావడంతో పోలీసులు విచారణ చేపట్టి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు ర్యాగింగే కారణమని తేల్చారు. ముందుగా ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ టాక్సికాలజీ రిపోర్టులో ఎలాంటి మత్తు రసాయనాలు తీసుకున్నట్లు ఆధారాలు లభించలేదు. ఎవరైనా హత్య చేశారా అంటే అందుకు సంబంధించి ఎవిడెన్స్ దొరకలేదు. హత్య కాదు... ఆత్మహత్య చేసుకోలేదు.. మరి ప్రీతి ఎలా చనిపోయిందనేది అందరి మదిని తోలుస్తున్న ప్రశ్న. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా బావిస్తూ అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా సాగిస్తున్న విచారణలో ఏమి తేలలేదు. పోలీసులకు సవాల్‌గా మారిన ఈ కేసులో కీలకంగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స విబాగంలో ప్రీతి పడిపోయిన విశ్రాంతి గది సీజ్‌ను తొలగించారు. ఘటన జరిగిన రోజున మట్టెవాడ పోలీసులు ఈ గదిని సీజ్ చేసి పలుమార్లు సిపి రంగనాథ్ సందర్శించి స్వయంగా విచారణ చేశారు. ఇప్పటి వరకు కేసులో ఏలాంటి పురోగతి కనిపించకపోగా, మట్టెవాడ పోలీసులు సీజ్ చేసిన గది తాళాలను తొలగించి ఎంజీఎం అధికారులకు అప్పగించారు. ఈ కేసును పోలీసులు ఎటు తేల్చకుండానే గది తాళాలను ఎంజీఎం అధికారులకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రీతి డెత్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా క్రమంగా కేసు తీవ్రతను తగ్గిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను ప్రీతి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరు సరిగాలేదని, ఇప్పటివరకు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండా కేఎంసీ ప్రిన్సిపల్ హెచ్ఓడీపై చర్యలు తీసుకోకుండా హాస్పిటల్ లో రూమ్ ఎందుకు సీజ్ తొలగించారని ప్రీతి సోదరుడు పృథ్వి ప్రశ్నిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిందని ఇండైరెక్ట్ గా చెబుతున్నారని, అదే నిజమైతే ఎందుకు రక్తం ఎక్కించారు.. కడుపుకు ఆపరేషన్ ఎందుకు చేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయిన గది సీజ్‌ను తొలగించడానికి కారణం పీజీ వైద్య విద్యార్థులు, సిబ్బందికి అత్యవసర చికిత్స కోసం అవసరం కావడంతోనే సీజ్ తొలగించి ఆసుపత్రికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రీతి తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేస్తూ ఏ ఒక్క చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని సిపి రంగనాథ్ తెలిపారు. తప్పు చేసిన వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా జాగ్రత్తగా లోతైన విచారణ చేస్తున్నామని చెప్పారు. ఫైనల్‌గా పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ నిర్ణయానికి రాలేమన్నారు సిపి రంగనాథ్. ఒకవేళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినా, సాధారణ మరణమే అయినా అందుకు ర్యాగింగే కారణమని స్పష్టం చేశారు. సైఫ్, ప్రీతి సెల్ ఫోన్ మెసేజ్‌లు, వాట్సాప్ గ్రూప్ చాటింగ్‌ల ఆధారంగా ప్రీతి ర్యాగింగ్‌కు గురైందని నిర్ధారించామని, ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం సైఫ్ కు పదేళ్ళ శిక్షతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు శిక్ష అదనంగా ఉండే అవకాశం ఉందని ఇటీవల సీపి ప్రకటించారు. మరోవైపు సైఫ్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా.. మూడుసార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికాగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ లభించింది. పది వేల బాండ్, ఇద్దరు పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర బెయిల్ ఇచ్చి, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతు విధించారు. చార్జిషీటు దాఖలు చేసే వరకు లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఇక దాదాపు రెండు నెలలు కావస్తున్న ఇంకా పోస్ట్ మార్టమ్ రిపోర్టు రాకపోవడం, కేసు మిస్టరీ వీడకపోవడంతో కన్నవారు మానసిక ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. తన కూతురు ఎలా చనిపోయిందో స్పష్టం చేసి ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునఃరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ప్రీతి హత్య కేసు.. సైఫ్‌కి బెయిల్ మంజూరు
సాక్షి, వరంగల్: కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి హత్య కేసులో నిందితుడు సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌కి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి సత్యేంద్ర షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 60 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ బుధవారం నాటికి 58 రోజులు అవుతున్న సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదనలు విన్పించారు. వాదనల అనంతరం కోర్టు సైఫ్‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే చార్జి షీట్ దాఖలు చేసేనాటికి లేదా 16 వారాల వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధిత విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని షరతు విధించింది. వ్యక్తిగతంగా రూ.10 వేల బాండ్, ఇద్దరు జమానత్దారుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాక్షులపై కానీ, మృతురాలి కుటుంబ సభ్యులపై కానీ ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని, నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ప్రాసిక్యూషన్ వారికి బెయిల్ రద్దు కోరే అవకాశం ఇస్తూ కోర్టు ఆదేశించింది. చదవండి: లండన్‌లో హైదరాబాద్ యువతి మృతి.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పి.. -
అత్యాచారాలపై నేడు బీజేపీ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ విద్యార్థి ప్రీతి హత్య సహా రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లో సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. గురువారం రాత్రి పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లిక్కర్ దందాలో అడ్డంగా బుక్కైన తన బిడ్డను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్న కేసీఆర్.. రాష్ట్రంలోని అమాయక విద్యార్థినులు, మహిళలపై జరిగే అత్యాచారాలపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. -
ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ ఫోన్లో 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనుషా, భార్గవ్, ఎల్డీడీ+నాక్ అవుట్స్(LDD+knockout) గ్రూప్ చాట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా విభాగంలో ప్రీతి సుపర్ వైజర్‌గా సైఫ్ ఉండేవాడని.. రెండు ఘటనల ఆధారంగా ఆమెపై కోపం పెంచుకున్నట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డిసెంబర్లో ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేసినట్లు తెలిసింది. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాయగా.. ఆమె రాసిన రిపోర్టును వాట్సాప్ గ్రూపుల్లో హేళన చేశాడు. రిజర్వేషన్లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ అవమానించాడు. తనతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే హెచ్ఓడీకి చెప్పాలని ప్రీతి.. సైఫ్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రీతిని వేధించాలని సైఫ్.. భార్గవ్‌కు చెప్పాడు. ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని చెప్పాడు. దీంతో గత నెల 21న హెచ్ఓడీ నాగార్జునకు ప్రీతి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలోప్రీతి సైఫ్‌లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది’ అని సైఫ్ రిమాండ్ రిపోర్టులో తేలింది. కాగా, సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. మరోవైపు నిందితుడు మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. -
ప్రీతి మృతిపై విచారం.. తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజి విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతిపై ఎమ్మెల్సీ కవిత విచారం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందిన విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి గురైనట్లు తెలిపారు. ప్రీతి మరణంతో ఒక తల్లిగా తనెంతో మనో వేదనకు గురయ్యానన్నారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రీతి మృతికి సంతాపం ప్రకటిస్తూ.. తల్లిదండ్రులకు లేఖ రాశారు. ‘ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని. ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది. మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని మీకు హామీ ఇస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. యావత్ రాష్ట్ర ప్రజలు మీ వెంటే ఉన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని కవిత పేర్కొన్నారు. డాక్టర్ ప్రీతి తల్లితండ్రులకు నా లేఖ pic.twitter.com/SsIQimvQdP — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 28, 2023 -
ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై గవర్నర్ తమిళి సై సీరియస్
సాక్షి, హైదరాబాద్: ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్ మండిపడ్డారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని వీసీకి లేఖ రాశారు. ప్రీతి మరణం భయంకరమైనదని, సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల్లో యాంటి ర్యాగింగ్ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలన్నారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీల్లో కఠిన చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న గవర్నర్.. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, విశ్రాంతి లాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు. మహిళా మెడికోలకు కౌన్సెలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని గవర్నర్ పేర్కొన్నారు. -
ప్రీతి కేసులో కొత్త ట్విస్ట్.. వేధింపులతోపాటు రూ.50 లక్షల అడ్మిషన్ బాండ్
సాక్షి, వరంగల్: ఎంబీబీఎస్ పీజీ సీటు రావడం ఒక ఎత్తయితే.. ఆ మూడేళ్ల కోర్సు పూర్తి చేయడం కూడా ఓ సవాల్.. ఎందుకంటే.. ఇటు తరగతులతోపాటు ప్రాక్టికల్‌గా ఆస్పత్రుల్లో సీనియర్లతో కలిసి పనిచేయడం, వారి ఆలోచనలకు తగ్గట్టుగా నడవడం అనేది ఓ చాలెంజ్ లాంటిదే. ఆకతాయిలుంటే వేధించేవారూ లేకపోలేదు. కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. పీజీ సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ రూ.50 లక్షల అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్నాక కారణాలేవైనా కోర్సు మధ్యలో డ్రాప్ అయితే ఆ మొత్తం తిరిగి కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి చెల్లించాలి. ఇదే ఇప్పుడు ప్రీతి పాలిట శాపమైందన్న వాదన తెరపైకి వచ్చింది. మోయలేని భారమేనా...: గతేడాది వర్సిటీ మెడికల్ పీజీ సీటు మధ్యలోనే ఆపేస్తే రూ.20 లక్షలు చెల్లించాలన్న నిబంధన ఉండేది. అయితే చాలామంది విద్యార్థులు మధ్యలోనే వెళ్లిపోతున్నారన్న కారణంతో రాష్ట్ర ప్రభు త్వం ఈ ఏడాది రూ.50 లక్షలకు పెంచింది. దీంతో చాలామంది విద్యార్థులు వేధింపులు, ర్యాగింగ్, ఇత రత్రా ఏవైనా ఉన్నా వాటిని భరిస్తూ పీజీ పూర్తి చేస్తున్నా రన్న వాదనలు వర్సిటీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సైఫ్ నుంచి వేధింపులు ఎక్కువవడంతో పీజీ కోర్సు ఆపేసి రావొచ్చు కదా అని తండ్రి నరేందర్ అన్నప్పుడు రూ.50 లక్షలు వర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది కదా.. వద్దులే అంత మొత్తం ఎలా అడ్జస్ట్ చేస్తావు అని ఆమె చివరి మాటల్లో చెప్పినట్లు చర్చ జరుగుతోంది. వేధింపులు తట్టుకోలేక, డ్రాప్ అయితే అంత మొత్తం కట్టలేక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వేధింపులు, ర్యాగింగ్‌లపై ప్రభుత్వం కొత్త అడ్మిషన్ బాండ్ నిబంధనలు తీసుకురావాలని, లేదా విద్యార్థినులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. -
ముగిసిన ప్రీతి అంత్యక్రియలు
కొడకండ్ల/దేవరుప్పుల: వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె అంత్యక్రియలు స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి రెవెన్యూ పరిధిలోని గిర్నితండాలో సోమవారం ముగిశాయి. ధరావత్ నరేందర్, శారదల మూడో కూతురైన ప్రీతి గత బుధవారం కాలేజీ సీనియర్ సైఫ్ వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఐదు రోజులపాటు హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందిన ఆమె ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం ఉదయం 6:30 గంటలకు గిర్నితండాకు తెచ్చారు. ప్రీతి మృతదేహం వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అంతిమయాత్రలో మంద కృష్ణమాదిగ, బీజేపీ, గిరిజన సంఘాల నాయకులు పాడె మోశారు. ఆ తరువాత గిరిజన సంప్రదాయ పద్ధతిలో వారి వ్యవసాయ భూమిలో ఖననం చేశారు. ప్రీతికి పలువురి నివాళి ప్రీతికి గ్రామస్తులతోపాటు రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ ఎల్.లక్ష్మీనారాయణనాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండి శ్రీధర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు నివాళులర్పించారు. ప్రీతి మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలంటూ బీజేపీ నాయకులు గిర్నిబావితండా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ గాంధీఆస్పత్రి: ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించగా, మృతదేహాన్ని గాంధీమార్చురీకి తరలించే క్రమంలో కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు అడ్డుకున్న విషయం విదితమే. దీంతో ఆదివారం రాత్రి నుంచి గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. ఆస్పత్రిలోకి మీడియాను అనుమతించలేదు. రోగులు, రోగి సహాయకులను ధ్రువీకరణ పత్రం చూపించాకే ఆస్పత్రిలోకి అనుమతించారు. అర్ధరాత్రి 1.46 గంటలకు ప్రీతి మృతదేహం గాంధీ మార్చురీకి వచ్చింది. ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కృపాల్‌సింగ్ నేతృత్వంలో వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. అనంరతం వేకువజాము 4.15 గంటలకు ప్రత్యేక అంబులెన్స్‌లో స్వగ్రామానికి ప్రీతి మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతదేహాం గాంధీ మార్చురీకి వచ్చినప్పటి నుంచి పోస్టుమార్టం పూర్తయి అంబులెన్స్‌లో తరలించేంత వరకు వీడియో చిత్రీకరించారు. ఉమ్మడి వరంగల్‌వ్యాప్తంగా ఆందోళనలు సాక్షి నెట్వర్క్: ప్రీతి మరణానికి కారకులైన సైఫ్, కేఎంసీ కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కేఎంసీ ఎదుట ఏబీవీపీ నాయకులు, ఎంజీఎం జంక్షన్లో బీజేపీ, ఐద్వా నాయకులు ఆందోళనలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి సైఫ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ములుగులో ఎల్‌హెచ్‌పీఎస్, డీవైఎఫ్ఐ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంతోపాటు నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి తదితర మండలాల్లో ఏబీవీపీ, వీహెచ్‌పీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఏఐబీఎస్ఎస్, మహిళా కాంగ్రెస్, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కఠినంగా శిక్షించాలి ప్రీతి తండ్రి నరేందర్ తన బిడ్డలాగా మరొకరికి జరగకూడదని ప్రీతి తండ్రి నరేందర్ నాయక్ రోదిస్తూ చెప్పారు. నిందితుడు సైఫ్‌తోపాటు కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రీతి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వపరంగా రూ.10 లక్షలతోపాటు మంత్రి దయాకర్‌రావు సొంతంగా రూ.20 లక్షలు ఇచ్చి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. -
ప్రీతి మృతి కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి(26) మృతి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఓయూ జేఏసీ మానవ హక్కుల కమిషన్‌ను (హెచ్ఆర్సీ) ఆశ్రయించింది. ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలపై విచారణ చేయాలని జేఏసీ కోరింది. ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని హెచ్‌ఆరీసీలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రీతి మృతదేహానికి జూనియర్ డాక్టర్లతో పోస్టుమార్టం చేయించారని ఫిర్యాదు చేసింది. నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో పోలీసుల వ్యవహర తీరుపై విచారణ చేపట్టాలని తెలిపింది. మరోవైపు తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. తన కూతురు ఎలా చనిపోయిందో సమగ్ర నివేదిక కావాలని కోరారు. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌తో పాటు అనస్థీషియా హెచ్ఓడీని సస్పెండ్ చేసిన తర్వాతే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. కన్నీటి వీడ్కోలు కాగా సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలో సోమవారం ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఖమ్మం జైలులో సైఫ్.. ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. చదవండి: ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే.. -
మెడికో ప్రీతికి కన్నీటి వీడ్కోలు
-
సమగ్ర విచారణ జరపాలని ప్రీతి తండ్రి డిమాండ్
-
పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి
-
జనగామ జిల్లా గిర్ని తండాలో ప్రీతి అంత్యక్రియలు
-
అతన్ని సీనియర్లేమీ అనట్లేదు..
ఎంజీఎం: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి తన తల్లితో చివరిసారిగా మాట్లాడిన ఫోన్ సంభాషణ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేస్తున్న వైనాన్ని వివరించింది. అతన్ని సీనియర్లు ఏమీ అనడంలేదని.. ఒకవేళ అతనిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లు తనకు ఏమీ నేర్పించకుండా దూరంపెడతారని తల్లికి చెప్పుకొని బాధపడింది. వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఇలా.. ప్రీతి: హలో అమ్మా.. తల్లి: అయిపోయిందా డ్యూటీ. ప్రీతి: లేదమ్మా నైట్ డ్యూటీ. 2, 3 గంటల తర్వాత ఎవరైనా వస్తారు.. వస్తే గాంధీకి వెళ్లాలి. అక్కడ కూడా నైట్ డ్యూటీ. తల్లి: బండి తీసుకుపోలేదా? ప్రీతి: తీసుకెళ్లినా.. తల్లి: డాడీ వచ్చిండంట కదా.. ప్రీతి: ఆ వచ్చిండు.. ఆస్పత్రి దగ్గర దించిండు. మళ్లీ హెచ్ఓడీ దగ్గరకు వెళ్లి మాట్లాడినా.. చూసుకుంటా అన్నాడు. తల్లి: నువ్వు ఒక్కదానివే వెళ్లినవా.. డాడీ కూడా వచ్చాడా. ప్రీతి: నేనే వెళ్లినా.. డాడీ పనిలో ఉండే.. నేను వెళ్లినా.. ఏమైనా ఉంటే నేను చూసుకుంటా.. ప్రిన్సిపాల్ సర్ దగ్గరికి ఎందుకు వెళ్లినావు అని హెచ్ఓడీ అడిగాడు. ఆయనను పిలిచి ఏం మాట్లాడిండో తెలియదు. వాని గురించి డాడీకి ఫోన్ చేయాలి.. నన్ను ఏం చేస్తారు? అంటున్నాడు. ఆయన పేరు కంప్లైంట్ చేసినా సీనియర్లు నాకు ఏమీ నేర్పించకుండా దూరం పెడతారు. తల్లి: సెకండియర్ అంతా ఒక్కటేనా.. అందరూ అలాగే ఉంటారా..? ప్రీతి: అందరూ ఆయనలాగా ఉండరు.. తల్లి: వాళ్లు అతన్ని ఏమీ అనడం లేదా.. అలా ఎందుకు చేస్తున్నావని..? ప్రీతి: అలా ఎవరూ అనడం లేదు. తల్లి: వీడు అంత ఇదా.. హెచ్ఓడీ మాట కూడా వినడా..? ప్రీతి: ఏం తెలియదు.. తల్లి: నువ్వేపోయి చెప్పినావా..? ప్రీతి: లేదు.. ప్రిన్సిపాల్‌కు డాడీ ఎవరితో చెప్పించిండో తెలియదు.. హెచ్ఓడీ పిలిపించి అడిగిండు. ప్రిన్సిపాల్ దగ్గరికి ఎందుకు వెళ్లినావు అన్నాడు. నేను పడుతున్న ఇబ్బంది గురించి హెచ్ఓడీకి చెప్పినా. తల్లి: ఏం భయపడకు.. మనం వరంగల్‌లోనే ఉన్నాం. ఎక్కడో దేశంలో లేం.. రెండు, మూడు రోజుల్లో కాలేజీకి వస్తాం. రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో సైఫ్‌పై వస్తున్న ఆరోపణలతోపాటు పోలీసులు నమోదు చేసిన కేసులపై మంగళవారం కేఎంసీలో యాంటీ ర్యాంగింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. సైఫ్ ఘటనలో జరిగిన వివరాలను చర్చించి ఢిల్లీ యాంటీ ర్యాగింగ్ కమిటీతోపాటు కాళోజీ ఆరోగ్య వర్సిటీకి సైతం నివేదిక సమర్పించనున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు సైఫ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. -
ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం
లక్డీకాపూల్ (హైదరాబాద్)/సాక్షి, వరంగల్: పీజీ వైద్యవిద్యార్థిని ️ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ప్రొటోకాల్ ప్రకారం వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై శనివారం యాజమాన్యం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ప్రస్తుతం ఆమెకు ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్న ప్రీతిని నిమ్స్‌కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లు నిమ్స్‌కు వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో కూడా పేదవర్గాలపై కనబడకుండా ర్యాగింగ్ జరుగుతోందని తెలిపారు.ప్రీతి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా విచారణ: మంత్రి హరీశ్‌రావు ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా కల్పించారు. నిష్పాక్షికంగా పూర్తి విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై మంత్రి సమీక్షించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, చికిత్స చేస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని ఆరా తీశారు. డాక్టర్ ప్రీతికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సైఫ్ విషయంలో ఏం చేద్దాం?: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టయిన సీనియర్ విద్యార్థి సైఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ర్యాగింగ్, వేధింపుల కేసులో అరెస్టయి జైలుకెళ్లిన సైఫ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాళోజీ హెల్త్‌వర్సిటీకి.. కేఎంసీ ప్రిన్సిపల్ మోహనదాస్ శనివారం లేఖ రాశారు. సోమవారంలోగా నిర్ణయం రావొచ్చని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సైఫ్‌పై చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ శనివారం ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా కేఎంసీలో సోమవారం ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశమై నివేదికను రూపొందించి పంపుతుందన్నారు. ప్రీతి కేసులో సైఫ్‌పై ఆరోపణలు రుజువైతే అతడి పీజీ అడ్మిషన్‌ను రద్దు చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఒకవేళ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించేలా సైఫ్ వ్యవహార శైలి ఉందని రుజువైతే ఎంబీబీఎస్ పట్టా కూడా రద్దు కావచ్చంటున్నారు. ఏమైనా.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి చర్యలుంటాయని మోహన్‌దాస్ తెలిపారు. ‘సర్’పై సర్వత్రా చర్చ: కేఎంసీ కాలేజీలో సీనియర్లను.. జూనియర్లు ‘సర్’అని పిలుస్తున్నారని, దీనిపై దృష్టి సారించాల్సి ఉందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇలా పిలిపించుకోవడం ర్యాగింగ్ కిందికే వస్తుందని వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అభిప్రాయపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య ‘సర్’అనే పదం చాలా గ్యాప్ తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు. -
మెడికో ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి అవమానించాడు: సీపీ రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతిని సీనియర్ వేధించినట్లు పోలీసులు నిర్ధారించారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభించాయని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఈమేరకు వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై సీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రీతిని టార్గెట్ చేసి సైఫ్ వేధించాడని తెలిపారు. నాలుగు నెలలుగా వేధిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ప్రీతి చాలా తెలివి, ధైర్యం ఉన్న అమ్మాయని.. అలాగే సున్నిత మసన్తత్వం కలిగినదని సీపీ చెప్పారు. వాట్సాప్ గ్రూపులో ప్రీతిని అవమానించేలా సీనియర్ విద్యార్థి సైఫ్ మెసెజ్‌లు పెట్టాడని పేర్కొన్నారు. సైఫ్ తన ఇతర మిత్రులతో చేసిన చాటింగ్‌లో ప్రీతిని టార్గెట్ చేసినట్లు తెలిసిందన్నారు. ఆమెకు సహకరించవద్దని సైఫ్ తన ఫ్రెండ్స్‌కు చెప్పాడని, బ్రెయిన్ లేదంటూ హేళన చేస్తున్నట్లు చాటింగ్ ద్వారా వెల్లడైందన్నారు. ‘దీనిపై ఈనెల 18న వాట్సాప్ గ్రూపులో అతడు పెట్టిన మెసేజ్‌పై ప్రీతి ప్రశ్నించింది. తనను ఉద్దేశించి గ్రూప్‌లో చాట్ చేయడం సరికాదని.. ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పింది. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తీసుకోలేకపోయాడు. వేధింపుల గురించి ప్రీతి వాళ్ల తల్లిదండ్రులకు తెలియజేసింది. మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బందిగా భావించింది. వాట్సాప్ గ్రూప్‌లో మెసెజ్‌ల ద్వారా అవమానించడం కూడా ర్యాగింగ్ కిందకే వస్తుంది. 21వ తేదీనే ప్రీతి, సైఫ్‌ను పిలిచి కాలేజీ యాజమాన్యం విచారించింది. పాయిజన్ ఇంజెక్షన్ ఏముంది అన్నదానిపై ప్రీతి గూగుల్‌లో సెర్చ్ చేసింది. విద్యార్థిని వేధించినందుకు ర్యాగింగ్ కేసుతోపాటు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాం. సైఫ్‌ను కోర్టులో హాజరుపరచనున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు, కేసును పక్కదారి పట్టిస్తున్నారని ప్రచారం చేయడం సరికాదు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల దీని వల్ల విచారణపై ప్రభావం పడుతుంది.’ అని సీపీ పేర్కొన్నారు. -
మెడికల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ నిర్లక్ష్యం వల్లే ప్రీతి ప్రాణాలు తీసుకోవలనుకున్నట్టు పాల్పడినట్లు తెలుస్తోంది. తనను వేధిస్తున్న సీనియర్ విద్యార్థి సైఫ్ అఘాయిత్యాల గురించి ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. గత కాలంగా సైఫ్ ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రీతి తన తండ్రికి చెప్పింది. తండ్రి స్వయంగా ఆర్ ఎస్సై కావడంతో పోలీస్ భద్రతా లభిస్తుందని విద్యార్థిని ఎదురుచూసింది. అయితే తన తండ్రి ఏసీపీ బోనాల కిషన్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పినా స్పందించలేదు. మరోసారి ఏసీపీకి మెసేజ్ చేసినా అటునుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఈ విషయాన్ని కూతురికి చెప్పాడు. దీంతో పోలీసుల సహకారం కూడా రాకపోవడం, ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు హోంమంత్రి మహమూద్ అలీ అండదండలు ఉన్నాయని కొంతకాలంగా సైఫ్ వేధిస్తున్నట్లు ప్రీతి తన తండ్రికి తెలిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సైఫ్ వేధింపుల గురించి తన తండ్రికి ప్రీతి పెట్టిన మెసేజ్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని బులెటెన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. -
అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. జనవరి 22న పాయిజన్ ఇంజిక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్తితిలోకి వెళ్లి యువతి ఒక్కసారిగా కుప్పకూలంతో సహచర విద్యార్థులు, డాక్టర్లు ఆమెను వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కాలేజీలో సీనియర్ వేధింపులతోక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్‌పై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
విషమంగానే ప్రీతి ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అంతర్గత అవయవాలు ఫెయిలైన స్థితిలో ఆమెను నిమ్స్‌కు తెచ్చారని, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరిచేందుకు ఎక్మో, సీఆర్ఆర్టీలతో ప్రయత్నం చేస్తున్నామని నిమ్స్ వైద్యులు వివరించారు. అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈమేరకు గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. సీనియర్ విద్యార్థి చేతిలో వేధింపులకు గురైన ప్రీతి బుధవారం ఎంజీఎం ఆస్పత్రిలో ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. పోలీసుల అదుపులో సైఫ్? ప్రీతి తండ్రి నరేందర్ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు, సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సైఫ్‌పై ర్యాగింగ్, వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఏసీపీ బోనాల కిషన్ గురువారం కేఎంసీ, ఎంజీఎంలో విచారణ జరిపారు. ప్రీతి, సైఫ్‌ల సెల్ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణమా..? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ఆరా తీశారు. మరోవైపు, ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ప్రీతి సహచర విద్యార్థులు, అనస్థీషియా విభాగ వైద్యులతో మాట్లాడి ప్రాథమిక నివేదిక తయారుచేసింది. ఈ నివేదికను శుక్రవారం డీఎంఈకి పంపనున్నట్లు ఎంజీఎం పరిపాలనాధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రీతి, సైఫ్ ఇద్దరి కుటుంబాలదీ రైల్వే బ్యాక్ గ్రౌండే కావడం గమనార్హం. ప్రీతి తండ్రి ధరావత్ నరేందర్ నాయక్ వరంగల్ రైల్వే ప్రొటెక్షన్స్ ఫోర్స్‌లో ఏఎస్ఐగా పని చేస్తుండగా, సైఫ్ తండ్రి సలీం కాజీపేటలో రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో పని చేస్తున్నారు. సరస్వతీ పుత్రిక ఎంజీఎం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి సర్వసతీ పుత్రిక అని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెబుతున్నారు. ఎస్ఎస్సీలో 600కు గాను 526 మార్కులు సాధించింది. ఇంటర్లో వెయ్యి మార్కులకు 970 సాధించింది. ఎంసెట్ ఎంట్రన్స్‌లో 5 వేల ర్యాంకు సాధించి కామినేని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. 2013లో వైద్యవిద్యను ప్రారంభించి 2019లో పూర్తిచేసింది. పీజీ ఎంట్రన్స్‌లో ఆలిండియా 1161 ర్యాంకు సాధించి కేఎంసీలో అనస్థీషియా విభాగంలో అడ్మిషన్ పొందింది. అన్ని స్థాయిల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్న ప్రీతి ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గేది కాదని, వైద్యవిద్య అంటే ఆమెకు ఇష్టమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. -
ప్రీతి కేసు: పోలీస్ కస్టడీలో సీనియర్ మెడికో సైఫ్!
వరంగల్: వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి కేసుకు సంబంధించి సీనియర్ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ప్రీతి కేసులో కీలకంగా పరిగణిస్తున్న సైప్ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని వేధించిన కేసులో సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు వేధింపుల కేసు నమోదు చేశారు మట్టేవాడ పోలీసులు. ఈ క్రమంలోనే ఎంజీఎం ఆసుపత్రిలోని అనస్తీషియా విభాగంలోని సీనియర్ వైద్యులను పోలీసులు విచారించారు. ఇదిలాఉంచితే, ప్రీతికి ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. సీఆర్ఆర్పీ ద్వారా కిడ్నీ ఫంక్షన్ చేయిస్తున్నామని, ప్రీతి మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయన్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తాజా హెల్త్ బులెటన్లో వైద్యులు వెల్లడించారు. -
ప్రాణాలతో పోరాడుతున్న ప్రీతి.. అత్యంత విషమంగా పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం నిమ్స్‌లోని ఏఆర్సీయూలో వెంటిలేటర్‌పైనే ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అవయవాలు దెబ్బతినడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. మత్తు ఇంజక్షన్ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్ పద్మజా నేతృత్వంలోని అయిదుగురు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమిస్తుంది. అనస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్లు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని, బీపీ, పల్స్ రేట్ నమోదు కానీ పరిస్థితి వచ్చిందన్నారు. వరంగల్ నుంచి నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలో రెండుసార్లు గుండె ఆగిపోయిందని.. వైద్యులు సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారని తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేమని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో సీనియర్ వేధింపులతోక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. సైఫ్ వేధింపుల వల్లే.. కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ వల్లే తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. నవంబర్‌లో ప్రీతి కేఎంసీలో చేరిందని, డిసెంబర్ నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిపై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ‘జనవరి 20వ తేదీనకాలేజీ దగ్గరికి వెళ్లానని, ఉన్నతాధికారులకు వేధింపుల గురించి తెలియజేశాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నాం. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్‌తో మాట్లాడుతానని ప్రీతికి చెప్పా. వద్దు, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. మార్కులు తక్కువ వేస్తారు అని భయపడింది. ఎంతో ధైర్యంగా ఉండేది. కరోనాలో కూడా విధులు నిర్వర్తించింది. అలాంటి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే సైఫ్ ఎంతగా వేధించాడో. కాలేజీకి చెడ్డ పేరు ఎక్కడో వస్తుందోనని నిమ్స్‌కు తీసుకువచ్చారు. వరంగల్‌లో గొడవ అవుతుందని కావాలని హైదరాబాద్ తరలించారు. మాకు న్యాయం చేయాలి. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్ల నా బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలి. మా బిడ్డ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వాడికి శిక్ష పడాలి. చాలా దారుణంగా వేధించాడు. మా బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ప్రీతికి ఎటువంటి ఆనారోగ్యం లేదు. చదువుల్లో నంబర్ వన్. పోలీసు ఫిర్యాదు తర్వాత సైఫ్ వేధింపులు తీవ్రతరమయ్యాయి. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు సరికావు: జూనియర్ డాక్టర్లు ఆధారాలు లేకుండా సీనియర్ విద్యార్థిపై ఆరోపణలు చేయడం సరికాదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఘటనపై ప్రస్తుతం అధికారుల విచారణ జరుగుతోందని, విచారణపూర్తయ్యే వరకు తప్పుడు ఆరోపణలు చేయవద్దని పేర్కొన్నారు. అయితే ర్యాంగింగ్ లాంటిదేమి జరగలేదని కేఎంసీ ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. -
పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/నిజామాబాద్ అర్బన్/తిమ్మాపూర్(మానకొండూర్): నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పీజీ వైద్యవిద్యార్థిని డాక్టర్ గుర్రం శ్వేత(27) శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. శ్వేత పీజీ గైనకాలజీ చదువుతోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మరో ఇద్దరు పీజీ గైనకాలజిస్టులతో కలసి ఆమె విధులకు హాజరైంది. రాత్రి 2 గంటలకు పేషంట్లను చూసి వచ్చిన శ్వేత 3 గంటల సమయంలో నిద్రపోయేందుకు గదిలోకి వెళ్లింది. తెల్లవారుజామున 3.45 గంటలకు రోగులను పరీక్షించే నిమిత్తం శ్వేతను నిద్ర లేపేందుకు తోటి పీజీ వైద్యులు ప్రయత్నించారు. అయినా ఆమె నిద్ర నుంచి మేల్కోలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ నిద్రలేపేందుకు ప్రయత్నించినా ఉలుకూపలుకూ లేకపోవడంతో స్టాఫ్ నర్సులతో కలసి ఆమెను పరిశీలించారు. ఆ తర్వాత శ్వేత చనిపోయిందని నిర్ధారించుకున్నారు. ఉదయం 6 గంటలకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ వచ్చి పరిశీలించి శ్వేత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మొదట గుండెపోటుతో మృతి చెందినట్లు సూపరింటెండెంట్ చెప్పారు. తరువాత కోవిడ్ అనంతర లక్షణాలతో చనిపోయినట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వాస్తవం తెలుస్తుందని పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అడిషనల్ డీసీపీ డాక్టర్ వినీత్ అన్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్నారు. శ్వేత మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమంటున్నారు ఆమె సహచర విద్యార్థినులు. శ్వేత గతంలో రెండుసార్లు కోవిడ్ బారిన పడిందని, దాని ప్రభావంతోనే కార్డియాక్ అరెస్ట్ అయి ఉంటుందని పేర్కొంటున్నారు. శ్వేత సోదరుడు కిరణ్ వచ్చిన తరువాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం ఆస్పత్రి నుంచి రోడ్డు వరకు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, వైద్యులు, వైద్య విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. శ్వేత మృతదేహం నిజామాబాద్ నుంచి శుక్రవారం రాత్రి 10 గంటలకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చేరుకుంది. శ్వేతను కడసారి చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ఉన్నత ఆశయంతో వైద్య విద్య చదువుతున్న శ్వేతను నిర్జీవంగా చూసి కన్నీరుపెట్టారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకు అత్యుత్తమ ప్రతిభతో ఉన్నత వైద్యవిద్యను అభ్యసిస్తున్న గుర్రం శ్వేత జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్వేత తండ్రి శ్రీనివాస్ కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డులో వాచ్‌మన్. తల్లి కళావతి గృహిణి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన వీరి కుటుంబం కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌లో స్థిరపడింది. శ్వేత పదో తరగతిలో 547/600 మార్కులు, ఇంటర్లో 944/1,000 మార్కులు, ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీటు సాధించి కరీంనగర్లో కోర్సు పూర్తిచేసింది. పీజీ వైద్యవిద్యకు సంబంధించి ఆలిండియాస్థాయిలో 4,891 ర్యాంకు సాధించి 2021 జూన్ 17న నిజామాబాద్ మెడికల్ కళాశాలలో పీజీ గైనకాలజీలో చేరింది. 2023 జూన్ 25న కోర్సు పూర్తి కానుంది. శ్వేతకు పెళ్లి సంబంధాలు సైతం వస్తున్నాయి. శ్వేత అన్నయ్య కిరణ్ జార్ఖండ్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. ఎండలు ఉన్నాయి.. బయటకు వెళ్లొద్దు.. రోజూ రాత్రి 8 గంటలకు భోజనం చేశాక శ్వేత తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది. గురువారంరాత్రి కూడా తల్లికి ఫోన్ చేసి ‘ఎండలు మండిపోతున్నాయి అమ్మా.. నాన్నను ఊకే బయటకు వెళ్లొద్దని చెప్పు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. జ్యూస్‌లు ఎక్కువ తాగండి’ అని చెప్పింది. ఇలా జాగ్రత్తలు చెప్పిన శ్వేత తెల్లారేసరికి అకస్మాత్తుగా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి
జక్రాన్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో పీజీ వైద్య విద్యార్థి రోహిత్‌రెడ్డి (29) మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై రామునాయుడు కథనం ప్రకారం.. నిర్మల్‌కు చెందిన రోహిత్‌రెడ్డి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. రోహిత్ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. మరో వైద్య విద్యార్థి అన్వేష్‌తో కలసి సోమవారం రాత్రి ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు వస్తుండగా.. మునిపల్లి సమీపంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోహిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అన్వేష్‌ను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అన్వేష్ వరంగల్ జిల్లాకు చెందినవాడని సమాచారం. -
ముసుగు వీడేనా..!
తిరుపతి (అలిపిరి) : ఎస్వీ మెడికల్ కళాశాల పిడియాట్రిక్ పీజీ ఫైనలియర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వైద్యులపై చేపట్టిన విచారణ ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ పది రోజుల పాటు వైద్యులను, విద్యార్థులతోపాటు బాధితురాలిని విచారించింది. కమిటీ సభ్యులు మరో రెండు రోజుల్లో నివేదికను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు అందజేయనున్నారు. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుల్లో టెన్షన్ మొదలైంది. పకడ్బందీగా విచారణ ఎస్వీ మెడికల్ కళాశాల పిడియాట్రిక్ వైద్యుల లైంగిక వేధింపుల ఆరోపణలపై జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో చిత్తూరు అడిషనల్ ఎస్పీ, ఐసీడీఎస్ పీడీ, డీఎం అండ్ హెచ్‌వో, తిరుపతి ఇన్చార్జ్ ఆర్డీవో, తుడా సెక్రటరీ ఉన్నారు. ఈ కమిటీ విచారణను పకడ్బందీగా చేపట్టింది. పిడియాట్రిక్ వైద్యులు, విద్యార్థులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు బాధిత విద్యార్థినిని విచారించింది. విచారణకు సంబంధించిన విషయాలు బయటకు పొక్కకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. విచారణకు సంబంధించిన నివేదికను మరో రెండు రోజుల్లో తుదిరూపునకు తీసుకొచ్చి కలెక్టర్‌కు సమర్పించనున్నారు. పిడియాట్రిక్ విభాగాధిపతిపై ప్రత్యేక విచారణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్‌ను కమిటీ ప్రత్యేకంగా విచారించింది. గతంలో ఆయన ప్రవర్తన తీరు ఎలా ఉంది, ఆరోపణలు ఉన్నాయా.. అన్న కోణంలోనూ విచారణ చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు వైద్యులు డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్‌ను విడివిడిగా విచారించినట్లు సమాచారం. వైద్య విద్యార్థిని వెనుక ఒక ప్రొఫెసర్ ఉండి రెచ్చగొట్టడం వల్లే తమపై ఇలా ఆరోపణలు చేసినట్లు సంబంధిత వైద్యులు చెప్పుకొచ్చినట్లు సమాచారం. కొందరు పిడియాట్రిక్ వైద్య విద్యార్థులు సాక్షితో మాట్లాడుతూ కమిటీ లైంగిక వేధింపులపై ప్రశ్నించినప్పుడు వైద్యులు విద్యార్థినులపై మండిపడడం సహజమేనని, లైంగిక వేధింపులు జరిగాయా అన్నది తమకు తెలియదని చెప్పుకొచ్చారు. వైద్యులను కాపాడే ప్రయత్నం లైంగిక వేధింపులపై ఎస్వీ మెడికల్ కళాశాల పిడియాట్రిక్ వైద్య విద్యార్థిని గవర్నర్‌కు లేఖ రాయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఆదేశాల మేరకు ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణయ్య అధ్యక్షతన సీనియర్ వైద్యులు జమున, జయాభాస్కర్, సిద్ధానాయక్ ఈ నెల ఒకటో తేదీ నుంచి వారం రోజులు విచారణ చేపట్టారు. కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్ రమణయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్‌కు అనుకూలంగా ప్రకటన చేసి నివేదికను లీకు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపట్టారు. ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్ రమణయ్య, ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ కిరీటీలదీ తెనాలి కావడంతో సహచర బృందాన్ని ఎలాగైనా కాపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌కు నివేదిక అందిన తరువాత నేరుగా చర్యలు తీసుకుంటారా..? వైద్య ఆరోగ్య శాఖకు రెఫర్ చేస్తారా..? హెల్త్ వర్సిటీ వీసీకి పంపుతారా.. అన్నది తెలియాల్సి ఉంది. మూడేళ్లుగా వేధించిన తీరును వివరించా మూడేళ్లుగా తనను లైంగికంగా వేధించిన తీరును కమిటీకి వివరించా. అసలు పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ ఒక ప్రొఫెసర్‌గా అనర్హుడని చెప్పా. నా దగ్గర ఉన్న సాక్షాలను కమిటీకి అందజేశా. – పిడియాట్రిక్ వైద్య విద్యార్థిని, ఎస్వీఎంసీ, తిరుపతి