Preethi Suicide Case: New Twist In PG Medical Student Suicide Death Case - Sakshi
Sakshi News home page

ప్రీతి కేసులో కొత్త ట్విస్ట్‌.. వేధింపులతోపాటు రూ.50 లక్షల అడ్మిషన్‌ బాండ్‌ 

Feb 28 2023 2:34 AM | Updated on Feb 28 2023 2:58 PM

PG Medical Student Suicide: Preethi Last Words With Father - Sakshi

సాక్షి, వరంగల్‌: ఎంబీబీఎస్‌ పీజీ సీటు రావడం ఒక ఎత్తయితే.. ఆ మూడేళ్ల కోర్సు పూర్తి చేయడం కూడా ఓ సవాల్‌.. ఎందుకంటే.. ఇటు తరగతులతోపాటు ప్రాక్టికల్‌గా ఆస్పత్రుల్లో సీనియర్లతో కలిసి పనిచేయడం, వారి ఆలోచనలకు తగ్గట్టుగా నడవడం అనేది ఓ చాలెంజ్‌ లాంటిదే. ఆకతాయిలుంటే వేధించేవారూ లేకపోలేదు.

కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. పీజీ సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్‌ బాండ్‌ రూ.50 లక్షల అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్‌ తీసుకున్నాక కారణాలేవైనా కోర్సు మధ్యలో డ్రాప్‌ అయితే ఆ మొత్తం తిరిగి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి చెల్లించాలి. ఇదే ఇప్పుడు ప్రీతి పాలిట శాపమైందన్న వాదన తెరపైకి వచ్చింది. 

మోయలేని భారమేనా...: గతేడాది వర్సిటీ మెడికల్‌ పీజీ సీటు మధ్యలోనే ఆపేస్తే రూ.20 లక్షలు చెల్లించాలన్న నిబంధన ఉండేది. అయితే చాలామంది విద్యార్థులు మధ్యలోనే వెళ్లిపోతున్నారన్న కారణంతో రాష్ట్ర ప్రభు త్వం ఈ ఏడాది రూ.50 లక్షలకు పెంచింది. దీంతో చాలామంది విద్యార్థులు వేధింపులు, ర్యాగింగ్, ఇత రత్రా ఏవైనా ఉన్నా వాటిని భరిస్తూ పీజీ పూర్తి చేస్తున్నా రన్న వాదనలు వర్సిటీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

సైఫ్‌ నుంచి వేధింపులు ఎక్కువవడంతో పీజీ కోర్సు ఆపేసి రావొచ్చు కదా అని తండ్రి నరేందర్‌ అన్నప్పుడు రూ.50 లక్షలు వర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది కదా.. వద్దులే అంత మొత్తం ఎలా అడ్జస్ట్‌ చేస్తావు అని ఆమె చివరి మాటల్లో చెప్పినట్లు చర్చ జరుగుతోంది. వేధింపులు తట్టుకోలేక, డ్రాప్‌ అయితే అంత మొత్తం కట్టలేక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వేధింపులు, ర్యాగింగ్‌లపై ప్రభుత్వం కొత్త అడ్మిషన్‌ బాండ్‌ నిబంధనలు తీసుకురావాలని, లేదా విద్యార్థినులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement