
సాక్షి, హైదరాబాద్: మెడికల్ విద్యార్థి ప్రీతి హత్య సహా రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లో సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. గురువారం రాత్రి పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లిక్కర్ దందాలో అడ్డంగా బుక్కైన తన బిడ్డను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్న కేసీఆర్.. రాష్ట్రంలోని అమాయక విద్యార్థినులు, మహిళలపై జరిగే అత్యాచారాలపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment