అడ్డుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ మరో ఆరేడు గంటల్లో ప్రారంభమవుతుందనగా, బుధవారం అర్ధరాత్రి హైడ్రా మా చోటుచేసుకుంది. ప్రచారం గడువు ముగిశాక కూడా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాల టీఆర్‌ఎస్ నేతలు మునుగోడులో ఉన్నారని, ఓటర్ల ను ప్రభావితం చేయడంతో పాటు తమ పార్టీ కార్య కర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్, ఇతర నాయకులు ఆందోళన చేపట్టారు. బుధవారం అర్ధ రాత్రి 12 గంటల సమయంలో రాష్ట్ర పార్టీ కార్యా లయానికి చేరుకున్న సంజయ్, నాయకులు, కార్య కర్తలు పెద్దసంఖ్యలో మును గోడుకు బయలుదేరారు.
మలక్‌పేట వద్ద సంజయ్ కాన్వాయ్‌ను తొలుత పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తల నిరసనల మధ్య పోలీసులతో తోపులాట మధ్య కాన్వాయ్ ముందుకు కదిలింది. ఆ తర్వాత పనామా గోడౌన్ వద్ద పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. సంజయ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో కార్యకర్తలు రక్షణ వలయంగా నిలిచారు. అక్కడి నుంచి ముందుకు కదిలిన సంజయ్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద మరోసారి అడ్డుకున్నారు.
మంత్రులు, ఇతర ప్రాంత ఎమ్మెల్యేలను మునుగోడు నుంచి బయటకు పంపే దాకా ఇక్కడినుంచి కదిలే దిలేదని సంజయ్ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు రాత్రి 1.30 ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టి ఆయనను అబ్దుల్లాపూర్‌మెట్ స్టేషన్‌కు తరలించా రు. గురువారం ఉదయం ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. తర్వాత పోలీ సులు సంజయ్‌ను పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచే మును గోడు ఎన్నికల పోలింగ్ సరళి, ఇతర పరిణామాలను తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment