
హైదరాబాద్: తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను కావాలనే ఇందులో ఇరికించాలని చూస్తున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు రోహిత్‌రెడ్డి. డ్రగ్స్ కేసుతో తనకు ఎటువంటి సంబంధ లేదని తాను భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసి చెబుతున్నానని, మరి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధారాలతో నిరూపిస్తారా అంటూ సవాల్ విసిరారు.
ఆధారాలు ఉంటే భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని చాలెంజ్ చస్త్రశారు. తాను ఆదివారం ఇదే టైమ్‌కి ఇక్కడకి వస్తానని, బండి సంజయ్ ఆధారాలతో రావాలన్నారు. తమకు నోటీసులు వస్తాయిన బీజేపీకి ముందే ఎలా తెలుసని రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని, కర్ణాటక పోలీసులు నుంచి కూడా తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.