ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఆదిలాబాద్ రూరల్: ప్రజా వైద్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ను, అలాగే నిజామాబాద్ ప్రభుత్వాస్ప తిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో 100 వైద్య పోస్టులు ఖాళీగా ఉంటే.. ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. రిమ్స్ ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ మెషీన్ లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి చెరువులు, స్థలాల ఆక్రమణలపై దృష్టి తప్ప వైద్యసేవలపై పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఉత్సవ విగ్రహంగా ఈటల
నిజామాబాద్ అర్బన్: మంత్రి ఈటల రాజేందర్ ఉత్సవ విగ్రహంగా మారిపోయారని భట్టి ఎద్దేవా చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతోందో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఇతర మంత్రులను సీఎం భజనబ్యాచ్‌ల మార్చారని భట్టి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment