
సాక్షి, నిజామాబాద్ : కొడుకును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కర్కశంగా మారాడు. ముక్కుపచ్చలారని ఆరేళ్ల కొడుకును అతి దారుణంగా గొంతునులిమి హతమార్చాడు. అనంతరం తానూ ఉరిపోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతులు.. తండ్రి విజయ్ తుల్జారాం, కొడుకు దినేష్ రాజస్తాన్ వాసులుగా స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment