
సాక్షి, నిజమాబాద్ : ఓ వ్యక్తి డమ్మీ గన్‌తో పోలీసులను బెదిరించిన ఘటన నిజామాబాద్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌లోని కోటగల్లిలో జరిగిన పోలీసుల దాడిలో తప్పించుకుని, ఆ తర్వాత డమ్మీ గన్‌తో బెదిరించిన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరెస్టు చేయబడిన వ్యక్తిని పోలీసులు చాట్ల గోపిగా గుర్తించారు. గోపి పై గతంలో మర్డర్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గోపి దగ్గర ఉన్న కత్తి, డమ్మీ గన్‌లను స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment