జాతియ పక్షిని కాల్చిన దృశ్యం
పోలీసుల అదుపులో నిందితులు
మెదక్ రూరల్: తొగిట రామాలయం సమీపంలో జాతీయపక్షిని దుండగులు కాల్చివేసిన సంఘటన మెదక్ మండల పరిధిలోని తొగిట గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఫారెస్టు అధికారులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రైతులైన దేవునికూచన్‌పల్లి గ్రామానికి చెందిన పంతెం దుర్గయ్య, ఎరుకల భూమలయ్య, ఎరుకల బక్కయ్యలు తొగిట, దేవుని కూచన్‌పల్లి సరిహద్దులోని రామాలయం సమీపంలో శనివారం రాత్రి నెమలిని చంపి కాలుస్తున్నారు.
ఈ విషయాన్ని గమనించిన పశువుల కాపరులు తొగట గ్రామస్తులకు చెప్పడంతో వారు నిందితులను పట్టుకొని ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోని తీసుకున్నారు. కాగా, ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి నెమలి చనిపోయిందని, దానిని కాల్చామని నిందితులు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఫారెస్టు డిప్యూటీ రేంజర్ మనోజ్‌కుమార్ తెలిపారు. ఆయన వెంట బీట్ ఆఫీసర్లు ప్రియాంక, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.