
ఫారెస్ట్ అధికారికి నెమలి అప్పగింత
అటవీప్రాంతం నుంచి ఓ నెమలి ఆదివారం మండలంలోని కూనూరు గ్రామంలో జనవాసాల్లోకి వచ్చింది. దీంతో గ్రామస్తులు ఆ నెమలిని పట్టుకుని ఫారెస్ట్ అధికారికి సమాచారం అందజేశారు.
కూనూరు (భువనగిరి అర్బన్) : అటవీప్రాంతం నుంచి ఓ నెమలి ఆదివారం మండలంలోని కూనూరు గ్రామంలో జనవాసాల్లోకి వచ్చింది. దీంతో గ్రామస్తులు ఆ నెమలిని పట్టుకుని ఫారెస్ట్ అధికారికి సమాచారం అందజేశారు. వెంటనే గ్రామానికి చేరుకున్న అధికారి సీహెచ్.వెంకటయ్యకు నెమలిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్బగాని వెంకట్‌గౌడ్, పాశం శివానంద్, వెంకట్, అఫ్రిద్, గ్రామస్తులు పాల్గొన్నారు.