Given
-
YSRCP 2024: మహిళలకు, విద్యాధికులకు పెద్దపీట
ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ వెల్లడించింది. ఈసారి మహిళలకు, విద్యాధికులకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చారు. 2019తో పోల్చిచూస్తే మహిళలకు ఈ సారి ఐదు సీట్లు అధికంగా కేటాయించారు. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహిళకు మొత్తం 24 సీట్లు కేటాయించగా, వాటిలో 19 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ తదితర స్థానాల్లో ఉంటూ, పార్టీ కోసం పాటుపడినవారిని గుర్తించి, వారిలో 14 మందికి పార్టీ సీట్లు కేటాయించింది. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన మొత్తం 200 మందిలో 77 శాతం మంది అంటే 153 మంది (131 ఎంఎల్ఏ, 22 ఎంపీ)లు పట్టభద్రులు. వారిలో 58మంది పోస్టు గ్రాడ్యుయేట్, ఆరుగురు డాక్టరేట్ చేసినవారు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అభ్యర్థులలో 17 మంది వైద్యులు, 15మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక రక్షణ విభాగం ఉద్యోగి, ఒక జర్నలిస్టు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోని 50 శాతం సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ వర్గాలకు కేటాయించారు. ఈ జాబితాలో 84 ఎంఎల్ఏ, 16 ఎంపీ అభ్యర్థులున్నారు. 2019 ఎన్నికల సీట్ల కేటాయింపుతో పోల్చి చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటికీ అదనంగా 7 ఎమ్మెల్యే సీట్లను వైఎస్ఆర్సీసీ పార్టీ కేటాయించింది. ఇక మహిళా అభ్యర్థుల విషయానికొస్తే 2019తో పోల్చిచూస్తే ఈసారి అదనంగా 4 ఎమ్మెల్యే సీట్లను కేటాయించారు. -
వంగలపూడి అనిత వల్లే పార్టీ సర్వనాశనం
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఎదురైంది. పాయకరావుపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు అనితకు వ్యతిరేకంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ.30 వేల చొప్పున, పింఛన్ కావాలని వచ్చేవారి నుంచి రూ.5 వేల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడి పదవిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. అనిత వల్లే పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సర్వనాశనౖమెందన్నారు.ఆమె వచ్చాకే పార్టీలో ఆరు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత, ఆమె అనుచరులు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు తమపై కక్షకట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తాము కలవడంతో కక్ష గట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలను కూడా అనిత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె మాటలు విని తమను సస్పెండ్ చేసిన అచ్చెన్నాయుడుపైనా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాయకరావుపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు, తాపీమేస్త్రీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు, పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు దేవవరపు ఆనంద్, మాజీ సర్పంచ్‌లు డి.ఆనంద్, కలిగొట్ల శ్రీను, సుంకర సూరిబాబు, గొల్లపల్లి నాగు, తలారి రాజా, భజంత్రీల శివ, చొక్కా శ్రీను, శ్రీనివాసరెడ్డి, కోడూరి నూకరాజు, థామస్, పడాల కోటి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు..
రాయ్‌పుర్: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే వధువు తల్లిదండ్రులు తోచినంత కట్నం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా మనం చూసినంతవరకు కట్నంగా డబ్బులు, బంగారం, భూములు వంటి ఆస్తులను వరునికి కానుకగా ఇస్తుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఓ తెగ ప్రజలు చాలా వింత ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నారు. కట్నంగా వారు పాములను వరునికి కట్నంగా ఇస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో కన్వారా తెగ ప్రజలు వింతైన ఆచారం పాటిస్తున్నారు. ఆడపిల్లకు పెళ్లి చేసేప్పుడు వరునికి పాములను కట్నంగా ఇస్తారు. కనీసం తొమ్మిది రకాలకు చెందిన 21 పాములను కట్నంగా ఇచ్చేస్తారు. కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లలను ఎవరూ వివాహం చేసుకోరు. తమ పూర్వికులు కనీసం 60 పాములను కట్నంగా ఇచ్చేవారని ప్రస్తుతం ఆ సంఖ్య క్రమంగా తగ్గినట్లు ఆ తెగకు చెందిన ఓ సభ్యుడు కటంగీ తెలిపారు. పాములను కట్నంగా ఇవ్వండం తమ ఆచారంగా వస్తోందని వెల్లడించారు. కన్వారా తెగ ప్రజలు తమ పూర్వికుల నుంచి కూడా పాములను ఆడిటడం జీవనాధారంగా చేసుకున్నారు. వివిధ రకాల పాములను పట్టుకుని వాటిని ఆడిస్తూ వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తారు. పాములనే తమ ఆస్తిగా భావిస్తారు. అందుకే ఆడపిల్లకు కట్నంగా పాములనే ఇస్తుంటారు. విషరహిత పాములనే పట్టుకుని జీవనం సాగించాలని అటవీ అధికారులు తెగ ప్రజలకు సూచించారు. స్థానిక సంప్రదాయాలను గౌరవించి ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తోందని అటవీ రేంజి అధికారి సియారామ్ కర్మాకర్ తెలిపారు. ఇదీ చదవండి: ఇలాంటి వారితో జాగ్రత్త.. బైక్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం -
CM YS Jagan Birthday: చిన్నారులకు ట్యాబ్స్ అందజేసిన సీఎం జగన్
-
ప్రజాపంపిణీ ప్రైవేట్ పరం
-
రైతుకు అందని... పెట్టుబడి రాయితీ
- మూడు తుపాన్ల సొమ్ముల ప్రభుత్వం వద్దే - హెలిన్..భారీ వర్షాల పెట్టుబడి రాయితీ ఇవ్వనంటున్న బాబు సర్కార్ - రెండేళ్ల క్రితం తుపాను రాయితీ కూడా అందని తీరు - పెట్టుబడుల కోసం మళ్లీ బయట అప్పులే - కోనసీమలో రైతుల ఆందోళన అమలాపురం : ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కోట్ల రూపాయిల పెట్టుబడి రాయితీ సొమ్ములు హామీలకే పరిమితమైంది. తుపాన్లు రావడం.. పంట నష్టపోవడం.. ఆనక కనీసం పెట్టుబడి రాయితీ సొమ్ములు కూడా రాకపోవడం రైతులకు పరిపాటిగా మారింది. పంట నష్టపోతే పరిహారం భరోసా లేకపోవడం వల్లే డెల్టాలో ముంపు ప్రాంత రైతులు ఖరీఫ్ సాగుకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో గడిచిన ఆరేళ్లలో మూడుసార్లు భారీ తుపాన్లు వచ్చి రైతులు రూ.వందల కోట్ల రూపాయిల పంటను కోల్పోయారు. ఆయా సందర్భాలలో సందర్భాలలో ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు సర్వేలు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో హెలెన్ తో పాటు భారీ వర్షాలు కారణంగా జిల్లాలో వరితోపాటు వాణిజ్య, కూరగాయ పంటలను రైతులు ఎక్కువగా నష్టపోయారు. హెలెన్‌కు సంబంధించి 1.23 లక్షల మంది రైతులకు రూ.53 కోట్లు, 2013లో భారీ వర్షాలకు సంబంధించి 1.50 లక్షల మంది రైతులకు రూ.71 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. అంతకుముందు నీలం పరిహారం 3.09 లక్షల మంది రైతులకు రూ.144 మంజూరైనా ఇప్పటికీ సుమారు 12 వేల మందికి రూ.ఆరు కోట్లు చెల్లించాల్సి ఉండడం గమనార్హం. వీటికి సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ రాష్ట్ర విభజన తరువాత ఎన్నికలు రావడంతో జీవో జారీ చేయలేదు. కొత్త రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ప్రచారంలో పెట్టుబడి రాయితీని అటకెక్కించింది. ఉమ్మడి రాష్ట్రంలో పరిహారం ఇప్పుడెలా ఇస్తామంటూ కొత్తపల్లవి అందుకుంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత 2015–16 తుపాను పరిహారం రూ.162 కోట్లు వరకు జిల్లాకు పెట్టుబడి రాయితీ రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ పరిహారాన్ని జూన్ 20 నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. తీరా గత ఏడాది కరువు పరిహారం ఇస్తామని చెప్పి అంతకుముందు ఏటా తుపాను పరిహారాన్ని అటకెక్కించే యత్నం చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబు ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాయితీగా రైతులకు అందకపోవడం విశేషం. సాధారణం పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకూడదని, తరువాత పంటను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి రాయితీగా సొమ్ములు చెల్లిస్తారు. పంట తరువాత పంటకు అటుంచి ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా రైతులను గాలికి వదిలేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కనీసం పాత బకాయిలన్నా సాగు ఆరంభానికి ముందు ఇస్తే ఖరీఫ్‌కు కొంత వరకు పెట్టుబడి సొమ్ములు వస్తాయని ఆశించిన రైతులు ప్రభుత్వం మరోసారి నిరాశ పరిచింది. దీంతో వారు బయట అప్పులు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఉన్న రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వకూడదనే జీవో ఇచ్చి రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. రైతులు ఆందోళనలు... పెండింగ్‌లో ఉన్న పెట్టుబడి రాయితీలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రైతులు బుధవారం కోనసీమలో ఆందోళన చేపట్టారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంతోపాటు కోనసీమలోని 16 తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మీ, ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావులు నాయకత్వం వహించారు. పెట్టుబడి రాయితీలను తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను అడుగడుగునా మోసం చేస్తోందని విమర్శించారు. రైతు సంఘం నాయకులు అప్పారి చిన వెంకటరమణ, అడ్డాల గోపాలకృష్ణ, రేకపల్లి ప్రసాద్, అబ్బిరెడ్డి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ. 50వేలు పరిహారం ఇవ్వాలి
బతుకమ్మపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు రైతులపై ముఖ్యమంత్రిది కక్షపూరిత ధోరణి నకిలీ విత్తనాల బాధ్యత ప్రభుత్వానిదే.. వైఎస్ హయాంలోనే రైతులు ఆనందంగా ఉన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి కూసుమంచి: ‘రైతు ఏడ్చిన రాజ్యం..ఎద్దు ఏడ్చిన ఎవుసాయం ముందుకు సాగవు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం రైతాంగం పట్ల కక్షపూరిత ధోరణినితో వ్యవహరిస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. కూసుమంచి సమీపంలోని ఆదివారం ధర్మాతండా వద్ద వర్షాలకు దెబ్బతిన్న పత్తిచేలను ఆయన పరిశీలించారు. గిరిజన రైతులు జర్పుల కృష్ణ, శివతో మాట్లాడారు. పత్తికి పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయాన్ని అడిగి తెలసుకున్నారు. ‘ఈ ఏడాది తమ పంటలు బాగాలేవు. కల్తీ విత్తనాలు, వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పంటలు పోతుంటే ఏ మంత్రి, అధికారి కూడా వచ్చి చూడటం లేదు’ అని వాపోయారు. తెలంగాణ వస్తే తమ కష్టాలు పోతాయనుకున్న రైతులకు కష్టాలే మిగులుతున్నాయని కొండా రాఘవరెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ కాక, రుణాలు ఇవ్వక బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి పెట్టుబడులకు రుణాలు తెచ్చుకునే దుస్థితి వచ్చిందని అన్నారు. ఓ పక్క నకిలీ విత్తనాలు, వర్షాలతో రైతులు నష్టపోతుంటే చలించని ముఖ్యమంత్రి బతుకమ్మలకు మాత్రం కోట్లాది రూపాయలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. నకిలీ విత్తనాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు 10 జిల్లాలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వారి ఆత్మహత్యలకు ప్రభుత్వ తీరే కారణమని ధ్వజమెత్తారు. రైతులు ఆనందంగా లేకుంటే ఏ ప్రభుత్వం మనుగడ సాగలేదని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో వ్యవసాయాన్ని పండగ చేయబట్టే ఇన్నాళ్లకీ అయనను రైతులు గుండెల్లో పెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 50వేలు తక్షణ పరిహారం అందజేయాలని, ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయకపోవటంతో ఇచ్చే అరకొర రుణాలు అప్పు వడ్డీలకే సరిపోతుందన్నారు., వైఎస్ లాగా రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రైతుల ఇంట పండుగ వచ్చే విధంగా ముఖ్యమంత్రి కృషి చేయాలని కోరారు. రైతులకు వైఎస్సార్సీసీ అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడుతుందని ప్రకటించారు. రాఘవరెడ్డి వెంట పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు బండారు వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జిల్లేపల్లి సైదులు, పాపా వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఆలస్యం సుధాకర్, మందడపు వెంకటేశ్వర్లు, పులి సైదులు, కుర్సం సత్యనారాయణ, కొల్లు వెంకటరెడ్డి, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహాయ కార్యదర్శి బండ్ల సోమిరెడ్డి, ఖమ్మం టౌన్ అద్యక్షులు తుమ్మా అప్పిరెడ్డి, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల అధ్యక్షులు వైవీడీ రెడ్డి, నరికంటి సూర్యానారాయణ మూర్తి, వాలూరి సత్యనారాయణ, ఎండపల్లి వెంకయ్య, మహిళా నాయకురాలు నామెర్ల రేవతి, యూత్ అధ్యక్షులు ఆదూరి రాజవర్దన్‌రెడ్డి ఉన్నారు. -
లక్ష్యం రూ.17 వేల కోట్లు.. ఇచ్చింది రూ.6 వేల కోట్లు
►ఖరీఫ్ రుణాల పంపిణీలో బ్యాంకుల మొండిచెయ్యి ►వర్షాలు ఊపందుకోవడంతో పెద్ద్ద ఎత్తున రైతుల రాక హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్ పంటల సాగులో రైతులు మునిగిపోయారు. మరోవైపు రుణాల కోసం రైతులు బ్యాంకులకు పోటెత్తుతున్నారు. బ్యాంకుల్లో మాత్రం సకాలంలో రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవైపు సాంకేతిక సమస్యలు... మరోవైపు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకులు రైతులకు మొండిచెయ్యి చూపిస్తున్నాయి. ఈ ఖరీఫ్‌లో బ్యాంకులు రూ. 17,460 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు రూ. 6,114 కోట్లకు మించి ఇవ్వలేదు. అంతేకాదు మొత్తం 36 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటారని అంచనా వేయగా... 13.50 లక్షల మందికే రుణాలు ఇచ్చినట్లు అధికారులు తేల్చారు. ఖరీఫ్ కీలక తరుణంలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు అప్పుల వైపు వెళ్లకతప్పడంలేదు. ఆన్లైన్ నమోదుతో మరింత ఆలస్యం... రైతులకు పంట రుణాలు విడుదల చేయడంలో సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని బ్యాంకులు వ్యవసాయ శాఖకు చెబుతున్నాయి. బ్యాంకుల్లో సిబ్బంది కొరత కూడా కారణమేనని అంటున్నారు. ఆన్లైన్ కారణంగా రైతుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేయాల్సి వస్తోంది. ఆన్లైన్ నమోదు ప్రక్రియకు అధిక సమయం తీసుకుంటుండటంతో రైతుల తాకిడిని తట్టుకునే పరిస్థితి లేకుండాపోయింది. వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో పెద్ద ఎత్తున రైతులు బ్యాంకులకు తరలి వస్తున్నారు. ఆన్లైన్ సమస్య కారణంగా తక్కువ మందికే రుణాలు ఇస్తున్నామని బ్యాంకు వర్గాలు వ్యవసాయశాఖకు విన్నవించాయి. సాధారణంగా చేతి రాతతో రుణాలు ఇచ్చేట్లయితే ఇంత సమస్య ఉండేది కాదని అంటున్నారు. -
భవనాల ననూనాను ఇచ్చిన మలేషియా సంస్థ
-
ఫారెస్ట్ అధికారికి నెమలి అప్పగింత
కూనూరు (భువనగిరి అర్బన్) : అటవీప్రాంతం నుంచి ఓ నెమలి ఆదివారం మండలంలోని కూనూరు గ్రామంలో జనవాసాల్లోకి వచ్చింది. దీంతో గ్రామస్తులు ఆ నెమలిని పట్టుకుని ఫారెస్ట్ అధికారికి సమాచారం అందజేశారు. వెంటనే గ్రామానికి చేరుకున్న అధికారి సీహెచ్.వెంకటయ్యకు నెమలిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్బగాని వెంకట్‌గౌడ్, పాశం శివానంద్, వెంకట్, అఫ్రిద్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆమెకు వందేళ్ళ జైలు శిక్ష!
వాషింగ్టన్ః కడుపులో బిడ్డ ప్రపంచాన్ని చూడక ముందే హత్యకు పాల్పడిన ఓ మహిళకు ఆమెరికా కోర్టు వందేళ్ళ జైలు శిక్ష విధించింది. ఏడు నెలల గర్భవతి అయిన మిచెల్ విల్సిన్స్ పై దాడి చేసి, ఆమె గర్భంలోని శిశువును చిదిమేసిన ఆమెను.. కోర్టు దోషిగా నిర్థారించింది. హత్యాయత్నంతోపాటు, అశాస్త్రీయ గర్భస్రావానికి పాల్పడినందుకు వ్యతిరేకంగా ఆమెకు వందేళ్ళ జైలు శిక్ష విధించింది. కడుపులోని బిడ్డను కర్కశంగా చంపేసిన వైనానికి దేశం దిగ్భ్రాంతి చెందింది. ఏడు నెలల గర్భవతి మిచెల్ విల్సిన్స్ గర్భంలోని బిడ్డను హతమార్చిన లేన్ కు ఆమెరికా కోర్టు వందేళ్ళ జైలు శిక్ష విధించింది. గత మార్చి నెలలో తన ఇంటికి వచ్చిన 27 ఏళ్ళ మిచెల్ ను నమ్మించిన 35 ఏళ్ళ విల్కిన్ ఆమె కడుపులోని బిడ్డను దొంగిలించడంలో భాగంగా ఆమెపై దాడి చేసింది. బలవంతంగా గర్భస్రావం చేసి బిడ్డను హత్య చేసింది. ఆశాస్త్రీయ గర్భస్రావంతో పాటు, బిడ్డను హత్య చేయడం, లేన్ అహంకార పూరిత, దుర్మార్గపు ప్రవర్తనకు నిదర్శనమని కోర్టు అభిప్రాయపడింది. జౌల్దర్ జిల్లా జడ్జి బెర్కెన్ కొట్టర్... లేన్ ప్రవర్థన క్రూరమైనదిగా అభివర్ణించారు. ఎవరైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతారా? అంటూ న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విల్కిన్ తండ్రి కూడ లేన్ ప్రవర్తన హింసాత్మకమన్నారు. అయితే దాడి అనంతరం తనకేం తెలియనట్లుగా చనిపోయిన పిండాన్ని ఆస్పత్రికి తెచ్చిన లేన్.. గర్భస్రావం జరిగినట్లు తమను నమ్మించేందుకు చూసిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమె కట్టుకథపై అనుమానించిన వైద్యాధికారులు పోలీసులకు రిపోర్టు చేయడంతో అనంతరం ఆమెను అరెస్టు చేశారు. -
జోరుగా యూనినార్ రిటైల్ స్టోర్ల విస్తరణ
న్యూఢిల్లీ: మొబైల్ సర్వీసులందజేసే యూనినార్ సంస్థ ఒక్క రోజులో 367 ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. దీంతో తమ రిటైల్ స్టోర్ల సంఖ్య 1,480కు పెరిగిందని యూనినార్ సీఈవో మోర్టెన్ కార్ల్సన్ సోర్బీ మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్... ఈ ఆరు సర్కిళ్లలో ఈ కంపెనీ మొబైల్ సర్వీసులందజేస్తోంది. ఈ ఆరు సర్కిళ్లలో అత్యధిక ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఉన్న రెండో అతి పెద్ద మొబైల్ సర్వీసుల కంపెనీ తమదేనని సోర్బీ పేర్కొన్నారు. ఈ స్టోర్స్‌ల్లో కొత్త కనెక్షన్లు ఇవ్వడంతో పాటు రీచార్జ్ చేస్తామని, వినియోగదారుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని, పోస్ట్, ప్రి పెయిడ్.. అన్ని తరహా వినియోగదారులందరికీ పూర్తి స్థాయిలో సర్వీసులందజేస్తామని వివరించారు. గతంలో నెట్‌వర్క్‌ను విస్తరించామని, ఇప్పుడు రిటైల్ స్టోర్లను విస్తరించామని, దీంతో వినియోగదారుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది తమ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపవగలదని పేర్కొన్నారు.