ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ వెల్లడించింది. ఈసారి మహిళలకు, విద్యాధికులకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చారు. 2019తో పోల్చిచూస్తే మహిళలకు ఈ సారి ఐదు సీట్లు అధికంగా కేటాయించారు. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహిళకు మొత్తం 24 సీట్లు కేటాయించగా, వాటిలో 19 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు ఉన్నాయి.
జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ తదితర స్థానాల్లో ఉంటూ, పార్టీ కోసం పాటుపడినవారిని గుర్తించి, వారిలో 14 మందికి పార్టీ సీట్లు కేటాయించింది. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన మొత్తం 200 మందిలో 77 శాతం మంది అంటే 153 మంది (131 ఎంఎల్‌ఏ, 22 ఎంపీ)లు పట్టభద్రులు. వారిలో 58మంది పోస్టు గ్రాడ్యుయేట్, ఆరుగురు డాక్టరేట్ చేసినవారు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అభ్యర్థులలో 17 మంది వైద్యులు, 15మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక రక్షణ విభాగం ఉద్యోగి, ఒక జర్నలిస్టు ఉన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోని 50 శాతం సీట్లను బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ,మైనారిటీ వర్గాలకు కేటాయించారు. ఈ జాబితాలో 84 ఎంఎల్‌ఏ, 16 ఎంపీ అభ్యర్థులున్నారు. 2019 ఎన్నికల సీట్ల కేటాయింపుతో పోల్చి చూసుకుంటే ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటికీ అదనంగా 7 ఎమ్మెల్యే సీట్లను వైఎస్‌ఆర్‌సీసీ పార్టీ కేటాయించింది. ఇక మహిళా అభ్యర్థుల విషయానికొస్తే 2019తో పోల్చిచూస్తే ఈసారి అదనంగా 4 ఎమ్మెల్యే సీట్లను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment