
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని షేర్ చేస్తుంది. తాజాగా సమంత ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం నెమలి మాదిరిగా స్టన్నింగ్ ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'నా స్కిన్‌టోన్‌తో నేను కంఫర్టబుల్‌గా ఉండేందుకు నాకు కొంత సమయం అయితే పట్టింది..కానీ చాలా సినిమాలు చేసిన అనంతరం ఇప్పుడు ఏదైనా సెక్సీ సాంగ్ కానీ హార్డ్ కోర్ యాక్షన్ సహా ఢిపరెంట్ రోల్స్ చేయడానికి నాపై నాకు నమ్మకం వచ్చింది. ఇంతకుముందు నాలో ఈ ధైర్యం లేదు.
కానీ ఇప్పడు నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వచ్చింది. వయసుతో పాటు ఇచ్చిన మెచ్యురిటీ ఇది' అంటూ సమంత పేర్కొంది. ఇక సామ్ లేటెస్ట్ సమంత ఫోటోపై రియాక్ట్ అయిన హీరోయిన్ తమన్నా బ్యూటీ అంటూ కామెంట్ చేసింది. కాగా హరి, హరీష్ దర్శకత్వంలో సమంత నటించిన యశోద సినిమాకు విడుదలకు రెడీ అవుతుంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కతున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment